BigTV English

BRS Pink Book: పింక్ బుక్ రెడీ.! వడ్డీతో సహా చెల్లిస్తా!

BRS Pink Book: పింక్ బుక్ రెడీ.! వడ్డీతో సహా చెల్లిస్తా!

BRS Pink Book: ఆంధ్రా పాలిటిక్స్‌లోని రెడ్ బుక్‌ని స్ఫూర్తిగా తీసుకొని.. తెలంగాణలో బీఆర్ఎస్ పింక్ బుక్‌ని తెరమీదకు తెచ్చింది. కానీ.. ఖమ్మం జిల్లాలో మాత్రం ఆ డైరీలో పేర్లు రాసేందుకు వెనుకంజ వేస్తున్నారట. దాంతో.. పింక్ బుక్‌ని ప్రస్తుతానికి పక్కన పెట్టేశారా? లేక.. అందులో పేర్లు రాసే వాళ్లు లేక డీలా పడిందా? అనేది పార్టీ నేతలకే అర్థం కావడం లేదట. మొన్నటిదాకా గులాబీ శిబిరంలో ఉన్న వాళ్లు కూడా ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తుండటంతో.. గులాబీ పార్టీ గుంభనంగా మారిందా? రాష్ట్ర రాజకీయాలను శాసించే జిల్లాలో పార్టీకి ఆదరణ తగ్గుతుండటంతో.. అదిష్టానం ఎమ్మెల్సీ కవితని రంగంలోకి దించిందా? అసలేం జరుగుతోంది ఖమ్మంలో.?


రెడ్ బుక్ తరహాలో బీఆర్ఎస్ పింక్ బుక్ ప్రస్తావన

ఏపీలో ఎన్నికల ముందు రెడ్ బుక్ ఎపిసోడ్ బాగా హైలెట్ అయింది. అదే తరహాలో.. బీఆర్ఎస్ నేతలు రెడ్ బుక్ తరహాలో పింక్ బుక్ ప్రస్తావన తెస్తున్నారు. అధికార పార్టీ నేతల ఆగడాలను, అక్రమ కేసులు పెడుతున్న వారి పేర్లను.. ఖమ్మం జిల్లాలో పింక్ బుక్‌లో నమోదు చేస్తున్నామంటూ.. కార్యకర్తలకు భరోసా కల్పించబోయి.. మాజీ మంత్రి భంగపడ్డారనే వాదన బలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఏడాదిన్నర కాకముందే.. అప్పుడే ఎన్నికలు సమీపిస్తున్నట్లుగా నడుస్తోంది ఖమ్మం జిల్లా రాజకీయం. ఈ క్రమంలో.. బీఆర్ఎస్ క్యాడర్‌లో జోష్ తెచ్చేందుకు తెగ ప్రయత్నిస్తున్నారట ఆ పార్టీ నేతలు. కొన్ని నెలల క్రితమే.. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఓ కార్యక్రమంలో పాల్గొని.. పింక్ బుక్ ప్రస్తావన తెచ్చారు.


పింక్‌బుక్ వ్యవహారంపై ఆరా తీసిన ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ కార్యకర్తలపై పెట్టే ప్రతి అక్రమ కేసు గురించి పింక్ బుక్‌లో రాసుకుంటున్నామని చెప్పారు. అయితే.. ఈ పింక్ బుక్ వ్యవహారం ఎంత వరకొచ్చిందంటూ.. జిల్లా పర్యటనకు వచ్చిన ఎమ్మెల్సీ కవిత ఆరా తీశారట. దాంతో.. గులాబీ పార్టీ నేతలు ఏం సమాధానం చెప్పాలో తెలియక గమ్మున ఉండిపోయారట. ఎందుకని పింక్ బుక్ మెయింటైన్ చేయట్లేదని.. కవిత ఆగ్రహం కూడా వ్యక్తం చేశారట. గులాబీ శ్రేణులకు బాసటగా నిలిచే.. పింక్ బుక్‌ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు ఎందుకు కొనసాగటం లేదని కాస్త గట్టిగానే క్లాస్ తీసుకున్నారనే చర్చ సాగుతోంది.

దాడులు, అక్రమ అరెస్టులపై నారా లోకేశ్ ఆరోపణలు

ఏపీలో జగన్ ప్రభుత్వం.. అప్పటి ప్రతిపక్ష టీడీపీ నేతలపై ప్రభుత్వం దాడులు చేస్తోందని, అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని ఆరోపించారు నారా లోకేశ్. అలా.. వైసీపీ సర్కార్ అక్రమాలను రెడ్ బుక్‌లో నోట్ చేసుకుంటున్నామని.. అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని ప్రకటించడం.. అప్పట్లో ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇప్పుడు.. బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉండటంతో.. అదే ఫార్ములా ఫాలో అవ్వాలని చూస్తున్నారట. ప్రభుత్వాన్ని విమర్శిస్తే.. అక్రమ అరెస్టులతో వేధింపులకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

సోషల్ మీడియా పోస్టులపైనా కేసులు పెడుతున్నారనే ఆరోపణలు

పోలీసులు కూడా పింక్ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని.. సోషల్ మీడియా పోస్టులపైనా కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ నాయకత్వం కొన్నాళ్లుగా ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే.. పువ్వాడ అజయ్ కార్యకర్తలపై నమోదవుతున్న అక్రమ కేసులపై స్పందించారట. అన్నీ పింక్ బుక్‌లో నోట్ చేస్తున్నామని.. అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు తేలుస్తామని హెచ్చరించారు. అయితే.. అజయ్ దంచిన భారీ డైలాగులకు, గ్రౌండ్ రియాలిటీకి అస్సలు పొంతనే లేదంటున్నారు. పెన్నులో ఇంకు లేదా? లేక.. బుక్కులో పేర్లు రాసేవాళ్లే లేరా? అనే టాక్ వినిపిస్తోంది.

బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా పార్టీ శ్రేణులు

కొద్ది నెలల క్రితం.. బీఆర్ఎస్ నేతల చేతుల్లో ఎప్పుడూ పింక్ బుక్ ఉండాలని.. నిత్యం సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని పువ్వాడ అజయ్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. కానీ.. ఖమ్మంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో.. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలెవరూ.. పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనకపోవడమే చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు.. అజయ్‌తో కూడా అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారట. గతంలో పార్టీని అడ్డం పెట్టుకొని రెచ్చిపోయిన నేతలు కూడా తమ తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారట. అందుకోసమే.. పింక్ బుక్‌ని పక్కన పడేసి.. ఎవరి పనులు వారు చూసుకుంటున్నారట.

పింక్ బుక్ కథ ఎందాక వచ్చింది? అని కవిత ఆరా

ఇటీవలే.. కార్యకర్తల్ని ఉత్తేజపరిచేందుకు ఎమ్మెల్సీ కవిత ఖమ్మంలో పర్యటించారు. ఆ సమయంలోనే.. పింక్ బుక్ కథ ఎందాక వచ్చింది? ఎంతమంది పేర్లు నోట్ చేశారని అడగడటంతో.. ఈ వ్యవహారం మళ్లీ తెరమీదికొచ్చిందంటున్నారు. అయితే.. రియాలిటీ మాత్రం మరోలా ఉంది. పింక్ బుక్‌లో పేర్లు నమోదయ్యే పరిస్థితులు ఖమ్మం జిల్లాలో లేవని.. పైగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పథకాలకు ఆకర్షితులై.. గులాబీ శ్రేణులు పార్టీ వీడి హస్తం గూటికి చేరుతున్నాయని.. కొందరు ముఖ్య నేతలు కవితకు చెప్పారట. దాంతో.. ఆమె అసహనానికి గురైనట్లు సమాచారం.

Also Read: భారత్ పాక్ యుద్ధం! చైనా ఎవరి వైపు ?

వేధింపులకు గురిచేసిన వారిపై ప్రతిచర్యలు లేవనే టాక్

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎందరో కాంగ్రెస్ కార్యకర్తలను వేధింపులకు గురిచేశారని కాంగ్రెస్ నేతలు అంటుంటారు. అయితే.. ఖమ్మం జిల్లాలో ఆ సంస్కృతికి మంత్రుల బృందం స్వస్తి చెప్పిందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది. గతంలో కాంగ్రెస్ నేతల్ని వేధింపులకు గురిచేసిన వారిపై ప్రతిచర్యలు చేపట్టకుండానే.. వదిలేసిన ఘనత అధికార పార్టీకి ఉందని.. గులాబీ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారట ఖమ్మం జిల్లాలో. కాంగ్రెస్ నాయకులు ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదనే టాక్ బలంగా వినపడటంతోనే.. పింక్ బుక్‌ని మూసేశారనే చర్చ సాగుతోంది.

కార్యకర్తలను కాపాడుకోవాలని సూచించిన బీఆర్ఎస్

ఇకనైనా.. జిల్లాలో బీఆర్ఎస్ ముఖ్య నేతలుగా చెప్పుకునేవారు.. కార్యకర్తలకు భరోసా ఇచ్చి.. వారిని కాపాడుకోవాలని.. బీఆర్ఎస్ నాయకత్వం సూచించిందట. ప్రభుత్వం నుంచి ఏవైనా ఇబ్బందులు తలెత్తితే.. బహిరంగంగానే నిరసనలు తెలియజేయాలని.. ఎమ్మెల్సీ కవిత సుతిమెత్తగా హెచ్చరించారట. ఇకపై.. కార్యకర్తల విషయంలో ఖమ్మం బీఆర్ఎస్ నేతల వ్యవహారశైలి ఎలా ఉంటుందనేది.. ఆ పార్టీ వర్గాలే ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయ్.

Related News

AP Politics: గుంతకల్లు టీడీపీలో కుర్చీలాట..

TDP Politics: యనమలను పక్కన పెట్టేశారా? అసలేం జరిగింది..!

Putin, Trump Deals: యూరప్ చీలబోతుందా.? ట్రంప్ , పుతిన్ చర్చలో ఇది జరిగితే మనకి జరిగే లాభం ఇదే.!

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Big Stories

×