BigTV English

Srisailam Politics: బుడ్డా VS ఏరాసు.. శ్రీశైలం టీడీపీలో టికెట్ యుద్దం

Srisailam Politics: బుడ్డా VS ఏరాసు.. శ్రీశైలం టీడీపీలో టికెట్ యుద్దం

Srisailam Politics: ఉమ్మడి కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో వర్గపోరు తారాస్థాయి చేరింది. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి మధ్య విభేదాలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఏకంగా దాడులు చేసుకునేంత వరకూ విభేదాలు చేరాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అసలు శ్రీశైలం టీడీపీలో అంత అగ్గి రాజుకోవడానికి కారణమేంటి?
శ్రీశైలం టీడీపీలో టికెట్ యుద్దం


శ్రీశైలం టీడీపీలో తారాస్థాయికి చేరిన విభేదాలు

నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం టీడీపీలో వర్గవిభేదాలు తారాస్థాయి చేరాయి. శ్రీశైలం నియోజకవర్గం టీడీపీలో ఆధిపత్యం కోసం బుడ్డా రాజశేఖర్ రెడ్డి వర్సెస్ ఏరాసు ప్రతాప్ రెడ్డి మధ్య ఒక రకంగా యుద్దమే నడుస్తోంది. బుడ్డా రాజశేఖర్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో తన ప్రాబల్యాన్ని నిరూపించుకోవాలని చూస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రిగా ఏరాసు ప్రతాప్ రెడ్డి తన రాజకీయ ప్రభావాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఇరువురు మధ్య విభేదాలు తీవ్రమయ్యాయట.


ఎంపీ శబరి పర్యటనలో రెండు వర్గాల మధ్య పోరు

తాజాగా ఎంపీ బైరెడ్డి శబరి పర్యటనతో ఇరువురు వర్గాల మధ్య వర్గపోరు తీవ్రమైంది. ఆత్మకూరులోని తన నివాసానికి బ్రేక్ ఫాస్ట్‌ కోసం ఎంపీ బైరెడ్డి శబరిని ఏరాసు ఆహ్వానించారు. ఏరాసు ఆహ్వానంతో బైరెడ్డి ఆత్మకూరులోని ఏరాసు నివాసానికి వేళ్లారు. అది బుడ్డా వర్గీయులకు ఆగ్రహం కలిగించింది. ఎమ్మెల్యే బుడ్డాకు సమాచారం ఇవ్వకుండా ఏరాసు నివాసానికి వెళ్లడం ఏంటని బుడ్డా వర్గీయులు ఏరాసు నివాసానికి చేరుకుని దాడికి యత్నించారు. ఎంపీ బైరెడ్డి సమక్షంలోనే బుడ్డా వర్గీయులు దాడికి యత్నించారు. అయితే మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డిపై కూడ దాడి చేశారని ఏరాసు వర్గీయులు అంటున్నారు. ఇప్పటి వరకూ మాటలకే పరిమితమైన విభేదాలు దాడుల వరకూ రావడంతో టీడీపీలో చర్చినీయంశంగా మారింది.

బొడ్డా వర్గీయులపై చర్యలకు ఏరాసు వర్గం డిమాండ్

శ్రీశైలం నియోజకవర్గంలో టీడీపీలో ఈ స్థాయిలో వర్గపోరు బయట పడడం జిల్లా టీడీపీలో హాట్ టాపిక్‌ అయింది. పార్టీ ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. బుడ్డా రాజశేఖర్ రెడ్డి వర్గీయులు ఈ ఘటనను ఏరాసు చేసిన అవమానంగా భావిస్తోంటే, ఏరాసు వర్గం ఈ దాడిని ఖండిస్తూ బుడ్డా వర్గీయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ప్రజా సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టకుండా, టీడీపీ నాయకులు వర్గపోరులో మునిగిపోవడం విమర్శలకు తావిస్తోంది.

ఇద్దరు టీడీపీలో చేరడంతో ముదిరిన ఆధిపత్య పోరు

శ్రీశైలం నియోజకవర్గంలో బుడ్డా రాజశేఖర్ రెడ్డి మరియు ఏరాసు ప్రతాప్ రెడ్డి మధ్య విభేదాలు చాలా కాలం నుంచే ఉన్నాయి. ఈ ఇద్దరు నాయకుల మధ్య విభేదాలు 2009 ఎన్నికల సమయంలోనే మొదలయ్యాయి. 2009 ఎన్నికల్లో బుడ్డా రాజశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయగా…ఏరాసు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత ఏరాసు మంత్రి పదవిని కూడా పొందారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య రాజకీయ వైరం కొనసాగుతోంది. 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఏరాసు ప్రతాప్ రెడ్డి కూడా టీడీపీలో చేరారు. ఏరాసు టీడీపీలోకి వచ్చినప్పటి నుంచి ఆధిపత్యపోరు మరింత ముదిరింది.

వచ్చే ఎన్ని్కల్లో టీడీపీ టికెట్ దక్కించుకోవడానికి పాట్లు

ఒకరు ఎమ్మెల్యేగా, మరొకరు సీనియర్ నాయకుడిగా తమ తమ వర్గాలను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తుండటం వల్ల ఈ వైరం కొనసాగుతోంది. ఒకరి కార్యక్రమాలను మరొకరు నిలదీయడం, అడ్డుకోవడం వంటివి జరుగుతున్నాయి. శ్రీశైలం నియోజకవర్గంపై ఇరువురు నేతలు పట్టు సాధించాలని చూస్తున్నారు. గతంలో ఏరాసు ప్రతాపరెడ్డి ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు…ఆ తర్వాత బుడ్డా రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. రాబోయే ఎన్నికల్లో శ్రీశైలం టీడీపీ టికెట్ కోసమే వారి తాపత్రయమని పార్టీ శ్రేణులు అంటున్నాయి.

Also Read: జగన్‌కు పవన్ చెక్?

బొడ్డా వర్గీయుల దాడిపై అధిష్టానికి ఫిర్యాదు చేసిన ఎంపీ

టీడీపీ అధిష్టానం ఈ విషయంలో సీరియస్ అయిందనే టాక్ నడుస్తోంది. ఈ వైరం టీడీపీ అధిష్టానానికి ఒక పెద్ద తలనొప్పిగా మారిందట. ముఖ్యంగా, ఈ వర్గపోరు శ్రీశైలం నియోజకవర్గంలో టీడీపీకి తీవ్ర నష్టాన్ని కలిగించే అంశంగా మారింది. అదలా ఉంటే ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటిపై బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరులు దాడికి పాల్పడంపై టిడిపి ఎంపీ బైరెడ్డి శబరి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారంట. మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి కూడా జిల్లా ఇన్చార్జి మంత్రి నిమ్మల రామానాయుడుకి, పార్టీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు. టిడిపి సీనియర్ నాయకుడిగా తన ఇంటిపై , తనపై జరిగిన దాడిని బయటికి చెప్పుకోవడం ద్వారా ఎలాంటి ఉపయోగం లేదని అందుకే పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఏరాసు టిడిపి నాయకత్వం ద‌ృష్టికి తీసుకెళ్లారంట. పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటామని చెప్పిందని ఏరాసు ప్రతాపరెడ్డి చెప్పుకొచ్చారు..పార్టీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Related News

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

T Congress: కాంగ్రెస్‌లో టెన్షన్..? కార్యవర్గ పోస్టుల భర్తీ ఎప్పుడు..

Big Stories

×