Clay Pot Cooking: మారుతున్న కాలానుగుణంగా ప్రస్తుతం మనం ఎక్కువగా గ్యాస్, ఆధునిక వంట సామాగ్రితో వంటకాలను తయారు చేసుకుంటున్నాము. కానీ పూర్వం మట్టి కుండలో ఆహార పదార్థాలు తయారు చేసుకుని తినేవారు. మట్టి కుండలలో వంట చేయడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. మన అమ్మమ్మల కాలంలో మట్టికుండల్లో వండిన ఆహారం అద్భుతమైన రుచికి మాత్రమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా మేలు చేసేదని మీకు తెలుసా ? ముఖ్యంగా.. శ్రావణ మాసంలో చుట్టూ పచ్చదనం, స్వచ్ఛమైన వాతావరణం ఉన్నప్పుడు, మట్టి కుండలలో వండిన ఆహారం మరింత ప్రత్యేకంగా మారుతుంది. వంట చేసే ఈ సాంప్రదాయ పద్ధతి ఎందుకు ప్రత్యేకమైనదో ? ఇప్పుడు తెలుసుకుందాం.
మట్టి కుండలలో వంట చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:
భారతదేశంలో వేల సంవత్సరాలుగా మట్టి కుండలను ఉపయోగిస్తున్నారు. హరప్పా నాగరికత నుండి నేటి వరకు.. ఈ పాత్రలు మన వంటగదిలో ముఖ్యమైన పాత్ర పోషించాయి. నేటికీ, పాలు, పెరుగు అనేక ఇతర పదార్థాలను గ్రామాల్లో మట్టి కుండల్లోనే ఉంచుతారు. ఇప్పుడు నగరాల్లో కూడా, కొంత మంది ఆరోగ్య స్పృహతో మళ్ళీ వాటి వైపు మొగ్గు చూపుతున్నారు ఇవి కేవలం పాత్రలు మాత్రమే కాదు.. ఆరోగ్యం, రుచి యొక్క నిధి.
రుచి, ఆరోగ్యం:
మట్టి పాత్రల్లో వంట చేయడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఈ పాత్రలు వేడి, తేమను నెమ్మదిగా కుండ అంతటా వ్యాపింపజేస్తాయి. దీనివల్ల ఆహారం సమానంగా ఉడుకుతుంది. ఫలితంగా కూరగాయల పోషకాలు, వాసన పెరిగి ఆహారం యెక్క రుచి పెరుగుతుంది. మీరు ఎప్పుడైనా మట్టి పాత్రలో వండిన పప్పు లేదా కూరలు తింటే వాటి రుచి మీకు గుర్తుండే ఉంటుంది.
pH బ్యాలెన్స్:
బంకమట్టిలో ఆల్కలీన్ లక్షణాలు ఉంటాయి. మీరు వాటితో తయారు చేసిన పాత్రల్లో ఆహారాన్ని వండినప్పుడు, అది ఆహారంలో ఉండే ఆమ్లంతో చర్య జరిపి దాని pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. ఇది ఆహారాన్ని మరింత జీర్ణం చేస్తుంది. అంతే కాకుండా రుచికరంగా మారుస్తుంది. టమాటోల వంటి ఆమ్ల పదార్థాలు కూడా మట్టి కుండలలో వండినప్పుడు వాటి సహజ తీపిని నిలుపుకుంటాయి.
పోషకాల నిల్వ :
లోహపు పాత్రలలో ఎక్కువ మంట మీద ఆహారాన్ని వండటం వల్ల పోషకాలు పూర్తిగా పోతాయి. కానీ మట్టి కుండలలో తక్కువ మంట మీద వండటం వల్ల, ఆహారంలో ఉండే ఐరన్, సల్ఫర్, కాల్షియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు, పోషకాలు సురక్షితంగా ఉంటాయి.
తక్కువ నూనె, ఎక్కువ రుచి:
మట్టి కుండలలో ఆహారాన్ని వండడానికి చాలా తక్కువ నూనె, నీరు అవసరం. ఎందుకంటే ఈ పాత్రలు ఆహారం యొక్క తేమను బ్యాలెన్స్ చేస్తాయి. అంతే కాకుండా ఇవి తక్కువ నూనెతో రుచికరమైన ఆహారాన్ని వండడానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా సహజ నూనెలు కూడా నాశనం కావు. ఇది గుండె ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
Also Read: బ్రౌన్ రైస్ తింటే.. ఈ ఆరోగ్య సమస్యలన్నీ పరార్ !
గుండె ఆరోగ్యానికి వరం:
మట్టి పాత్రలలో తక్కువ నూనెతో ఆహారాన్ని వండుతారు. సహజ నూనెలు కూడా నశించవు కాబట్టి.. ఇది గుండెకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. గుండె జబ్బులతో బాధపడేవారు ముఖ్యంగా మట్టి పాత్రలలో వండిన ఆహారాన్ని తీసుకోవాలి.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు:
మట్టి కుండలలో వండిన ఆహారం మధుమేహం ఉన్నవారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. నెమ్మదిగా ఉడికించడం వల్ల, ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా శరీర రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది.