Allu Arjun: టాలీవుడ్ స్టార్ హీరోగా, పాన్ ఇండియా స్టార్ గా అల్లు అర్జున్(Allu Arjun ) ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఈయన నటించిన పుష్ప2(Pushpa 2) సినిమా ఎంతలా సక్సెస్ అయిందో మనకు తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో అల్లు అర్జున్ క్రేజ్ కూడా భారీగా పెరిగిపోయింది. అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులకు కమిట్ అవుతున్నారు. ఇకపోతే పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన “రప్పా..రప్పా ” డైలాగ్ (Rappaa..Rappaa Dailogue)ఎంతలా ఫేమస్ అయిందో మనకు తెలిసిందే. ఇటీవల కాలంలో ఈ డైలాగు రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో కూడా సంచలనంగా మారింది.
నార్త్ అమెరికా తెలుగు సొసైటీ..
అధికారంలో, ప్రతిపక్షంలో ఉన్న నాయకులకు నోటి వెంట కూడా ఈ డైలాగు రావడంతో ఇది కాస్త జాతీయ స్థాయి మీడియాలో కూడా మారుమోగిపోయింది. ఇకపోతే తాజాగా అల్లు అర్జున్ నోటి వెంట మరోసారి ఈ డైలాగ్ రావడంతో అందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ ప్రస్తుతం నార్త్ అమెరికా తెలుగు సొసైటీ(NATS) నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఎన్నో విషయాల గురించి మాట్లాడారు. అదే విధంగా అమెరికాలో తెలుగు వారికి ఎంతో స్వేచ్ఛ కల్పిస్తూ ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
మీ యాంకరింగ్ రప్పా.. రప్పా
ఇక ఈ కార్యక్రమంలో తన ప్రసంగాన్ని ముగించుకొని వెళ్తున్న సమయంలో ఈయన పుష్ప సినిమాకు సంబంధించి ఒక డైలాగ్ తెలియజేశారు. “తెలుగువాళ్లు అంటే ఫైర్ అనుకుంటివా.. వైల్డ్ ఫైర్” అంటూ డైలాగుతో అందరిని సందడి చేశారు. ఇక అల్లు అర్జున్ వెళ్తున్న సమయంలో శ్రీముఖి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. దీంతో అల్లు అర్జున్ మాట్లాడుతూ థాంక్యూ సో మచ్ శ్రీముఖి(Sreemukhi) మీ యాంకరింగ్ మాత్రం రప్పా..రప్పా అంటూ చెప్పడంతో శ్రీముఖి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇలా నార్త్ అమెరికా తెలుగు సొసైటీ వేదికపై శ్రీముఖి యాంకరింగ్ గురించి అల్లు అర్జున్ గొప్పగా చెప్పటం మామూలు విషయం కాదు.
యాంకర్లపై ప్రశంసలు..
ఇక అల్లు అర్జున్ ఇటీవల కాలంలో ఏ కార్యక్రమానికి వెళ్లిన యాంకర్లపై తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు. గత కొద్దిరోజుల క్రితం యాంకర్ స్రవంతి చొక్కారపును ఉద్దేశిస్తూ..మీ చీర బాగుంది అంటూ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. అలాగే ప్రతి వేదికపై కూడా ఈయన పుష్ప 2 డైలాగులు చెబుతూ అభిమానులను సందడి చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ(Atlee) డైరెక్షన్లో ఓ సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందు రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తిరిగి ప్రశాంత్ నీల్(Prashanth) డైరెక్షన్లో బిజీ కాబోతున్నారు. ఇదివరకే ఈ ప్రాజెక్టు గురించి కూడా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Also Read: Rashmika Mandanna:కమ్యూనిటీ వివాదం.. రష్మికకు సపోర్ట్ గా సీనియర్ హీరోయిన్