India Vs Pakistan War: చైనా దగ్గర ఏది ఉంటే అది పాకిస్థాన్ దగ్గర ఉన్నట్టే. ఇది మన రక్షణ రంగ నిపుణులు అంటోన్న మాట. మొన్నటి యుద్ధంలో చైనా పాకిస్థాన్ కి చేసిన సాయం.. పైకి అంతగా కనిపించలేదు కానీ.. లోలోన జరగాల్సిన సహకారమంతా నడిచిందా? భారత డిఫెన్స్ ఎక్స్ పర్ట్స్ ఇదే నిజమని అంచనా వేస్తున్నారా? చైనా.. భారత్ రేపు యుద్ధం వచ్చినా పాకిస్థాన్ తప్పక సపోర్ట్ చేస్తుందా? ఈ రెండు దేశాల మధ్య అంత అవినాభావ సంబంధమేంటి? మనకొచ్చే నష్టమేంటి?
చైనా స్పె షిప్.. డా యంగ్ హీ హో మొహరింపు
ఇదిగో భారత రక్షణ జలాల్లో పొంచి ఉన్న ఈ నిఘా ఓడను చూశారా? దీని పేరు డా యంగ్ హీ హో. ఇది చూడ్డానికి సముద్ర గర్భ పరిశీలన చేస్తున్నట్టే కనిపిస్తుంది. కానీ ఇది చేసే మెయిన్ డ్యూటీ భారత.. రక్షణ, క్షిపణి, నౌకా రంగ కదలికలు ఎప్పటికప్పుడు తమ దేశానికి ఉప్పందించడం. భారత్.. పాకిస్థాన్ ఉగ్రస్థావరాల నుంచి సైనిక స్థావరాల వరకూ అన్నింటా నిఘా పెట్టిందని తెలిసిన చైనా తమ ఆప్తమిత్రదేశం.. పాకిస్థాన్ కి సాయం చేయడానికి ఇదిగో ఈ నిఘా నౌకను మొహరింప చేసిందని అంటారు. చైనా- పాక్ మధ్య రహస్య బంధానికి ఇదే కాదు.. పహెల్గాం దాడి సమయంలోనూ.. కొన్ని సాక్ష్యాలు దొరికినట్టు అప్పట్లో వినిపించింది. ఉగ్రవాదులు మనం బ్యాన్ చేసిన చైనా యాప్స్ వాడారనీ, చైనా మేడ్ శాటిలైట్ ఫోన్ కూడా స్పాట్లో నిఘా వర్గాలకు దొరికిందనీ అన్నారు.
యుద్దంలోనూ చైనా రహస్య పాత్ర?
ఇక భారత్- పాక్ మధ్య జరిగిన యుద్ధంలో చైనా రహస్య పాత్ర పోషించినట్టు అంచనా వేస్తున్నారు.. మన రక్షణ రంగ నిపుణులు. చైనా పాకిస్థాన్ కు.. ఉపగ్రహ, వాయు రక్షణ సాయం చేసినట్టు తమ దగ్గర రుజువులున్నట్టు చెబుతున్నారు వీరు. ఇస్లామాబాద్- బీజింగ్ మధ్య సంబంధ బాంధవ్యాలు మరింత దృఢపడ్డాయని.. ఈ విషయంలో లభిస్తోన్న ఎవిడెన్సులు ఇదే చెబుతున్నాయని అంటున్నారు వీరు. ఇటీవల జరిగిన యుద్ధంలో పాకిస్థాన్ కి కీలకమైన ఉపగ్రహ సమాచారాన్ని చైనా సాయం చేసినట్టుగా అంచనా వేస్తోంది మన డిఫెన్స్ థింక్ ట్యాంక్. యుద్ధ సమయంలో భారత అంతరిక్షంపై ఉపగ్రహ నిఘాను తిరిగి అమర్చడంలో చైనా తన పనితనం చూపిందని అంటున్నారు. అంతే కాదు వాయు రక్షణ రాడర్ వ్యవస్థలను కూడా పాకిస్థాన్ కి అనుకూలంగా మొహరించడంలో చైనా తన వంతు సహకారం అందించినట్టుగా తెలుస్తోంది. ఈ విషయాలను సెంటర్ ఫర్ జాయింట్ వార్ ఫేర్ స్టడీస్ డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ అన్నారు.
మన వైమానిక కదలికలనూ పసిగట్టిన చైనా రాడార్
చైనా మొహరించిన రక్షణ రాడార్.. వారికిటు సాయ పడుతూనే.. మన వైపు నుంచి ఏదైనా వైమానిక కదలిక ఏర్పడ్డ వెంటనే పసిగట్టేసేదని.. అశోక్ కుమార్.. ఢిల్లీ డిఫెన్స్ థింక్ ట్యాంక్ హెడ్డాఫీసులో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. రెండు అణ్వాయుధ దేశాల మధ్య ఉద్రిక్తత రేకెత్తించిన ఉగ్రదాడి దగ్గర నుంచి చైనా.. పూర్తి సహాయ సహకారాలు అందించినట్టుగా తాము అంచనా వేస్తున్నట్టు చెప్పారు సెన్ జోస్ డీజీ- అశోక్. అయితే ఇటు భారత ప్రభుత్వం చైనా పాత్రను అధికారికంగా ప్రకటించలేదు. అటు పాకిస్థాన్ సైతం చైనా ఆయుధాలను తాము ఉపయోగించినట్టు ఒప్పుకోలేదు. కొన్ని డిజిటల్ ఆధారాలను బట్టీ చూస్తే.. బీజింగ్- ఇస్లామాబాద్మధ్య లాజిస్టికల్, ఇంటెలిజెన్స్ సహాయ సహకారాలు అందినట్టు తెలుస్తోంది. అశోక్ కుమార్ డైరెక్టర్ జనరల్ గా ఉన్న CENJOWS.. భారతదేశ సైనిక బలాన్ని ఆధునీకరించే లక్ష్యం గల థింక్ ట్యాంక్. దీని బోర్డులో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళాధిపతులుంటారు. CENJOWS నుంచి ఒక కామెంట్ వచ్చిందంటే అది ఎంతో అథెంటిక్ అయి ఉంటుంది. ఇందుకంటూ ఒక ఆధారం లేకుండా ఈ సంస్థ నుంచి ఏ వ్యాఖ్యానం కూడా బయటకు రాదు. గత యాభై ఏళ్లలో జరిగిన అత్యంత తీవ్రమైన ఘర్షణగా ఆపరేషన్ సిందూర్ ని పేర్కొంటారు. ఈ యుద్ధంలో డ్రోన్ దాడులు, ఫిరంగి దాడులు, క్షిపణి దాడులు, చిన్న తరహా ఆయుధాలతో కూడిన యుద్ధాలు జరిగాయి. తర్వాత అమెరికా జోక్యం. ఇరు దేశాల డీజీఎంఓలు మాట్లలాడుకోవడం. రెండు దేశాలూ కాల్పుల విరమణ ఒప్పందానికి రావడం జరిగాయి.
భారత్-పాక్ యుద్ధంలో చైనా మిలటరీ హార్ట్ వేర్ అట్టర్ ఫ్లాప్?
పహెల్గాం దాడి తమకు సంబంధం లేదంటూనే.. భారత్ పాక్, పీవోజేకేల్లో ఉగ్రవాద శిబిరాలపై చేసిన దాడులకు పాక్ సైన్యం.. ఓవర్ రియాక్ట్ అయ్యింది. దీంతో భారత్ మరింతగా తెగబడి ఎదురు దాడులు చేసింది. అయితే ఈ యుద్ధంలో చైనా మొహరించిన సైనిక వ్యవస్థలు నిజానికి ఘోరంగా ఫెయిల్ అయ్యాయని అంటున్నారు డీజీ అశోక్ కుమార్. అదే పాకిస్థాన్ భారత్ పైకి వదిలిన టర్కిష్ డ్రోన్లను మనం సమర్ధవంతంగా తిప్పికొట్టిందని అన్నారాయన. సరిగ్గా అదే సమయంలో శుక్రవారంనాడు పాకిస్థాన్ భారత్ కి సంబంధించి ఆరు యుద్ధ విమానాలను కూల్చివేసినట్టు ప్రకటించుకుంది. అయితే అలాంటి ఘటనలు జరిగిన ఆధారాలేవీ చూపించలేక పోయింది. భారత్ కూడా ఈ దిశగా తమకు నష్టం కలిగినట్టు చెప్పలేదు.
టెలిగ్రాఫ్ లో పీఎల్-15, రాఫెల్‌ని కూల్చిన కథనం
J-IOC కంబాట్ ఫైటర్, PL-15 ఎయిర్-టు-ఎయిర్ మిస్సైల్ వంటి చైనీస్ మిలటరీ హార్డ్ వేర్స్.. తొలిసారి ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొన్నట్టు కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. వీటి వినియోగంపై తైవాన్ లో ఒక అలజడి చెలరేగింది కూడా. అయితే వీటి పనితనం మీద ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటనలు వెలువడలేదు. వీటిపై అసలు డిస్కషనే లేకుండా పోయింది. అయితే ద టెలిగ్రాఫ్ అనే పత్రికలో పీఎల్ 15 మన రాఫెల్ ని కూల్చినట్టు కొన్ని కథనాలు వచ్చాయి. అయితే వీటిని నమ్మడానికి వీల్లేదని కొట్టి పడేశారు అప్పట్లోనే మన రక్షణ రంగ నిపుణులు. ఇక్కడ మరో ముఖ్యమైన అంశమేంటంటే.. భవిష్యత్తులో చైనా పాక్ రెండూ ఒకేసారి.. దురాక్రమణ చేసే అవకాశాలు కూడా లేక పోలేదంటారు సెన్ జోస్ డీజీ అశోక్ కుమార్. ఈరోజు చైనా దగ్గర ఉన్నది ఏదైనా సరే రేపు పాకిస్థాన్ తో ఉన్నట్టుగానే మనం భావించాల్సి ఉంటుందని అన్నారాయన. ఈ విషయంలో మనం అప్రమత్తంగా ఉండాలని అంటారు డీజీ అశోక్ కుమార్.
రెండు దేశాల మధ్య ఆర్థి్క కారిడరే అసలు రీజన్
చైనా- పాక్ మధ్య అంతటి అవినాభావ సంబంధం ఏర్పడ్డానికి గల కారణం.. ఈ రెండు దేశాల మధ్యగల ఆర్ధిక కారిడారే కీలకమని అంటారు నిపుణులు. బెల్డ్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా బీజింగ్ పాకిస్థాన్ లో భారీ పెట్టుబడులు పెట్టడంతో.. పాకిస్థాన్ పరిరక్షణ చైనా ఒక మోటోగా తీస్కున్నట్టు భావిస్తున్నారు. 2020లో చైనాతో జరిగిన సరిహద్దు ఘర్షణలో 20 మంది భారత సైనికులు మరణించారు. ఈ ఘటన తర్వాత భారత్ తన ఉత్తర సరిహద్దును మరింత బలోపేతం చేయడానికి సైనికులను మొహరిస్తోంది. గత కొన్ని నెలలుగా చైనాతో భారత్ సంబంధాలు మెరుగ్గా ఉన్నప్పటికీ.. ఈ వివాదం కారణంగా రెండు దేశాల మధ్య పాత గాయాలు తిరిగి చెలరేగే అవకాశం లేక పోలేదన్న అంచనాలు అందుతున్నాయ్.
హిందీ చీనీ భాయి భాయి.. అంటూనే వెన్ను పోటు. బిజినెస్ పెంచుకుంటాం అంటూనే పాక్ కి సపోర్ట్. యుద్ధ సమయంలోనూ పాక్ వైపే. యుద్ధం తర్వాత కూడా పాక్ వైపే. ఇలాంటి చైనాను మనమేం చేయాలి? అసలేంటీ చైనీ పాకీ సంబంధం? ఆ దేశానీకీ ఈ దేశానికీ ఇటు సాంస్కృతికంగా అటు విధాన పరంగా ఇంత వైవిధ్యముంటే.. ఎలాకలిసిందీ మైత్రీ బధం? ఇదిగో ఈ మ్యాప్ చూశారా.. పెద్ద బాతు వెనక పిల్లబాతు వెళ్తున్నట్టు లేదూ.. సేమ్ టు సేమ్, డిట్టో చైనా వెంట పాక్ కూడా అలా నడుస్తున్నట్టుగా ఉంది.. పరిస్థితి. ఈ రెండు దేశాలు జాన్ జబ్బా అంటున్నాయ్. మీకూ మాకూ శతృ దేశం భారత్ అయితే మనం అవుతాం మిత్రులం అంటూ చేయి చేయి కలుపుకుని వెళ్తున్నాయ్ ఈ రెండు దేశాలు.
అంతర్జాతీయ వేదికలపై పాక్ అంటే గిట్టనట్టు బిల్డప్
మళ్లీ ఎక్కడైనా అంతర్జాతీయ వేదికలపై చూస్తే.. పాక్ అంటేనే చైనాకు గిట్టదేమో అన్నంత బిల్డప్ ఇస్తుంది డ్రాగన్ కంట్రీ. మొన్నటికి మొన్న పహెల్గాం దాడుల విషయంలో.. ఐక్యరాజ్య సమితిలో పాకిస్థాన్ కి సపోర్టుగా ఒక్క మాట కాదు కదా.. కనీసం మీడియాతో కూడా ఏమీ చెప్పకుండానే వెళ్లిపోయారు చైనా ప్రతినిథి. అంతగా చైనా పైకి వ్యవహరిస్తుంది. అదే లోలోన మాత్రం పాకిస్థాన్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. భారత్ చైనా మధ్య ఉన్న వాణిజ్యం విలువ ఎలా ఉందో చూస్తే.. 2024లో ఈ రెండు దేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక వాణిజ్యం.. అక్షరాలా 118. 4 బిలియన్ డాలర్లు. దీన్ని మీరు గూగుల్ చేసుకుని చూస్తే.. ఎన్ని లక్షల కోట్లు వస్తుందో మీరే తెలుసుకోవచ్చు.
2023తో పోల్చుకుంటే 4 శాతం ఎక్కువ
ఇది 2023 ఫైనాన్షియల్ ఇయర్ తో పోలిస్తే.. నాలుగు శాతం ఎక్కువ. ఈ ఏడాది కూడా అంతకన్నా మించి పెరిగే అవకాశం లేక పోలేదు. ఇది వరుసగా మూడో ఏడాది వంద బిలియన్ డాలర్లకు పెరగటం. భారత్ మార్కెట్ కెసాసిటీ అలాంటిది. దీంతో చైనా ఎలాంటి దొంగ వేషాలు వేస్తుందంటే.. మనం బిజినెస్ మరింత పెంచుకుందాం అంటుంది. కానీ తన నక్క జిత్తులు ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తూనే ఉంటుంది. పాకిస్థాన్ కి చేయి అందించడంలో భాగంగా భారత్ కి వెన్నుపోటు పొడుస్తూనే ఉంటుంది. భారత్ తో చేసే వ్యాపార విలువను కూడా పక్కన పెట్టి.. చైనా పాకిస్థాన్ తో రహస్య చెలిమి చేస్తోంది. భారత్ కి వ్యతిరేకంగా.. పాకిస్థాన్ కి సంపూర్ణ సమాయ సహకారాలను అందిస్తోంది. అదేమంటే ఎకనామిక్ కారిడార్ అంటుంది. దీని ద్వారా చైనా తన ప్రపంచ వ్యాపారాన్ని మరింతగా పెంచుకోవచ్చని భావిస్తోంది. పైకి లేదు లేదంటూనే పాకిస్థాన్ కి వెనక చేరి వంత పాడుతూ వస్తుంది. మొన్న పాక్ విదేశాంగ మంత్రికి ఫోన్ చేసిన చైనా విదేశాంగ మంత్రి మీ సార్వభౌమత్వానికి మా సార్వభౌమత్వం అడ్డు అన్న కోణంలో ప్రకటనలు చేశారు.
రెండు దేశాల సంస్కృతీ సంప్రదాయాలు వేరు
భారత్ తో తమకున్న వర్గ పోరును అడ్డు పెట్టుకుని.. కాశ్మీర్ అంశాన్ని ఒక సాకుగా చూపించి.. లబ్ధి పొందాలని గట్టిగా ప్రయత్నిస్తోంది పాకిస్తాన్. గతంలో పాకిస్థాన్ తొలిసారి పర్యటించిన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తన సోదరుడి ఇంటికొచ్చినట్టుగా ఉందని అన్నారు. రెండు దేశాల సంస్కృతీ సంప్రదాయాలు వేరు. అయినా ఆ అనుబంధం ఏంటో అర్ధం కాదు. ఇది మత దేశం. అది మతమంటేనే విముఖత చూపించే దేశం అయినా సరే అదే ప్రేమ అభిమానం. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ప్రపంచానికి చేటు తెచ్చేదే. ఇది పైకి చైనా పలికే చిలకపలుకులు. పహెల్గాం దాడి విషయంలో నిష్పక్ష పాత దర్యాప్తు చేయించాలి.. ఇదీ పైకి చైనా చెప్పిన కబుర్లు. కట్ చేస్తే ఆ దాడి సమయంలో ఉగ్రవాదులు వాడింది చైనా ఫోన్లు, యాపులు. ఇక యుద్ధంలో అయితే తన శాటిలైట్ సహకారం మొత్తం వాడి భారత్ ని దెబ్బ తీయాలన్న విపరీతమైన ఆరాటం.
పాక్ ప్రస్తుతం ఆర్థికంగా ఆధార పడుతున్న ధేశం చైనాయే
చైనా పైకి ఒకటి లోపల ఒకటిగా ఎందుకీ దొంగనాటకం? అని చూస్తే పాకిస్థాన్ చైనా మధ్య కొన్ని దశకాలుగా దౌత్య సంబంధాలతో పాటు రక్షణ పరమైన సహకారం కూడా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్ ఆర్ధికంగా ఆధార పడుతున్న దేశం ఏదైనా ఉందా అంటే అది చైనాయే. ఆధునిక ఆయుధాల సరఫరా, వార్షిక ద్రవ్యలోటు పూడ్చుకునేలా రుణాలు, ఇలా సమస్య ఏదైనా సరే.. పాకిస్థాన్ కి సాయం అందించేందుకు చైనా ఇప్పటికి ఎన్నోసార్లు ముందుకొచ్చింది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్- CPEC కింద, సుమారు 70 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఇటీవల గ్వాదర్‌లో చైనా నిధులతో నిర్మించిన విమానాశ్రయాన్ని సైతం ప్రారంభించారు. చైనా, పాకిస్తాన్ సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఇటీవల పాక్ చేసిన ఫేక్ పబ్లిసిటీలో ఆనాటి ఫోటోలనే వాడింది.
పాక్ ఆయుధాల్లో 80 శాతం చైనావే
అంతే కాదు చైనా నుంచి పాకిస్థాన్ పెద్ద ఎత్తున ఆయుధాలు కొంటోంది. మొన్న యుద్ధానికి ముందు తమ చెంత చైనా మేడ్ అల్ట్రా మోడ్రన్ చైనా మేడ్ మిస్సైళ్లున్నాయని ఫోటో షేర్ చేసింది ఇందులో భాగంగానే. గత ఐదేళ్లలో పాకిస్థాన్ దిగుమతి చేసుకున్న ఆయుధాల్లో 80 శాతం పైగా చైనా ఆయుధాలేనంటుంది ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ రిపోర్ట్. పాకిస్థాన్ ని అడ్డు పెట్టుకుని చైనా ఆడాలనుకుంటున్న ఆటలు చాలానే ఉన్నాయ్. గల్ఫ్ దేశాలతో సాన్నిహిత్య పెంచుకోవాలని కూడా చూస్తోంది. ఇన్నేసి అంశాలు ముడి పడి ఉండటంతో చైనా.. తన తెలివితేటలన్నిటినీ వాడుతోంది. పాకిస్థాన్ కి పూర్తి సహకారం అందిస్తోంది. చైనా ఓవరాక్షన్ గుర్తించిన బలూచిస్తాన్ ప్రజలు వారిపై దాడులు చేస్తున్నారు. చైనా పన్నాగమేంటో వారికి బాగా తెలుసు. ఇక్కడున్న ఖనిజ లవణాలపై కన్నేసిన డ్రాగన్ దేశం.. తమపై ఇంత ప్రేమ ఒలకబోస్తోందని వారు గుర్తించారు. దీంతో చైనా వారిపై దాడులకు తెగబడుతున్నారు బలూచీలు. ఒక వేళ బలూచిస్తాన్ సొంత దేశంగా ఏర్పడితే పాకిస్థాన్ తో చైనా సంబంధ బాంధవ్యాలు ఇరుకున పడే అవకాశముంది. చైనా మనతో ఆడుతున్న ఈ దొంగాటలకు బదులు చెప్పడం ఎలా? అని చూస్తే.. బలూచిస్తాన్ కి మన వంతు సాయం చేయడం ఒక రూట్. రెండోది చైనాను నిలువరించడానికి భారత్ ఏం చేయాలి? అని చూస్తే గతంలో అమెరికా చేసిన పాలసీలను, అంతర్జాతీయ చట్టాలను అనుసరించి చైనాకి చెక్ పెట్టాలి. ఈ దేశం చేసే గ్రేజోన్ కార్యకలాపాలను అడ్డుకునేలా చేయాలి.
ఒక పక్క చైనా పాకిస్థాన్ సాయంతో నిరభ్యంతరంగా భారత్ కి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూనే ఉంది. ఈ రెండు దేశాల మధ్య నడుస్తోన్న ఉగ్రబంధాలు, యుద్ధ బంధాలు, ఆయుధ బంధాలను ప్రపంచ దేశాల ముందు ఎండగట్టాలి. ఇటీవల పాకిస్థాన్ గురించి ప్రపంచమంతా తిరిగి చెప్పడానికి.. ఒక బృందాన్ని ఎంపిక చేశారు. ఈ బృందం ద్వారా పాక్- చైనా రహస్య స్నేహాన్ని కూడా ఇతర దేశాలకు తెలిసేలా చేయాలి. మరీ ముఖ్యంగా చైనా ద్వారా దిగుమతులను భారీగా తగ్గించాలి. ఆ దేశ వాణిజ్యాన్ని సగానికి సగం తగ్గించి.. మన విలువ ఏమిటో చాటి చెప్పాలి. అదే జరగాలంటే భారతీయ ప్రజలు సైతం.. ఆలోచన చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోందని అంటారు నిపుణులు.