Mollywood : ఈమధ్య సినీ ఇండస్ట్రీలోని నటులు చాలామంది అత్యాచారం కేసులు అంటూ, స్కాం కేసులని ఇలా ఏదో ఒక దాంట్లో ఇరుక్కుంటున్నారు. మొన్నటి వరకు బాలీవుడ్ నటుడు ఆజాజ్ ఖాన్ ఓ అమ్మాయిని రేప్ చేశారంటూ వార్తలు వినిపించాయి. ఆయన ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే కాదు అటు డ్రగ్స్ కేసులో కూడా కొందరు ఇవ్వనట్లు ఇరుక్కుంటున్నారు. ఒకవైపు పోలీసులు సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్న సరే ఇలాంటివి మళ్లీ రిపీట్ అవుతున్నాడంతో సినీ ఇండస్ట్రీలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. నటులు ఇలా చేస్తున్న సరే ఇండస్ట్రీ మాత్రం మౌనంగా భరిస్తుంది అంటూ సామాన్య ప్రజలు ప్రశ్నలు కురిపిస్తున్నారు. అయినా గాని ఇలాంటి కేసులు మళ్లీ రిపీట్ అవుతూనే ఉన్నాయి. మరో మలయాళ నటుడు పై అత్యాచార కేసు నమోదు అయింది. ఇంతకీ ఆయన ఎవరో ఒకసారి తెలుసుకుందాం..
అవకాశాల పేరుతో అత్యాచారం..
సినిమాల్లో నటిస్తున్న కొందరు నటులు అమ్మాయిలకు దగ్గరవడం కోసం సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికి వారిని శారీరకంగా వాడుకొని, ఆ తర్వాత నీకు నాకు ఏ సంబంధం లేదు అంటూ వదిలేస్తున్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. యూట్యూబ్ స్టార్ నుంచి సినిమాల్లోని పెద్ద స్టార్స్ వరకు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వాటిలో తప్పు ఎవరిది అని చెప్పడం కష్టమే. చివరికి మాత్రం ఒకరు తప్పును మోయాల్సి వస్తుంది. మొన్న ఆ మద్య బాలీవుడ్ నటుడు ఆజాజ్ ఖాన్ సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటూ ఓ యువతని శారీరకంగా వాడుకున్నాడని అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు మరవక ముందే ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో మరో కేసు నమోదు అయింది. గతంలో మలయాళ యాక్టర్స్ పై ఇలాంటి కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. తాజాగా మరో నటుడు పై రేప్ కేసు నమోదు అవ్వడంతో మాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది..
యువతి పై అత్యాచారం కేసులో రోషన్ ఉల్లాస్ అరెస్ట్..
మలయాళ నటుడు రోషన్ ఉల్లాస్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తాజాగా ఈయనపై అత్యాచార కేసు నమోదయింది.. ఓ యువతిని సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానను.. త్వరలోనే పెళ్లి చేసుకుందామని నమ్మించి తనపై అనేకసార్లు అత్యాచారం చేశాడని త్రిస్సూర్ కు చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అతని అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో ప్రవేశపెట్టగా నేరం రుజువడంతో రిమాండ్కు తరలించారు.. ఈ కేసు గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..