BigTV English

HBD Jr NTR: కష్టాల నడుమే పెరిగాను.. అమ్మ బయటకు రాకపోవడానికి కారణం అదే.. ఎన్టీఆర్!

HBD Jr NTR: కష్టాల నడుమే పెరిగాను.. అమ్మ బయటకు రాకపోవడానికి కారణం అదే.. ఎన్టీఆర్!

HBD Jr NTR:జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ప్రస్తుతం గ్లోబల్ హీరోగా మారిపోయారు. ఈయన పాన్ ఇండియా హీరోగా సృష్టించిన రికార్డ్స్ అన్నీ ఇన్నీ కావు. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో భీమ్ పాత్రలో ఈయన చేసిన నటనకి ఎంతోమంది ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ముఖ్యంగా ‘కొమరం భీముడో’ అనే సాంగ్ లో ఎన్టీఆర్ నటన చూసి ఎంతమంది మెచ్చుకున్నారో చెప్పనక్కర్లేదు. అయితే అలాంటి ఎన్టీఆర్ ప్రస్తుతం ఎన్నో సినిమాలు చేస్తూ బిజీ లైఫ్ ని మెయింటైన్ చేస్తున్నారు. ఇంతటి బిజీ లైఫ్ లో కూడా తన ఫ్యామిలీని ఎక్కడా వదిలిపెట్టడు. సినిమా షూటింగ్స్ నుండీ ఏమాత్రం గ్యాప్ దొరికినా ఫ్యామిలీని తీసుకొని వెకేషన్ లకి వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే అలాంటి ఎన్టీఆర్ తన తల్లి శాలిని గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ కామెంట్స్ చేశారు.. ఎన్టీఆర్ ఎంతో పెద్ద హీరో కానీ ఆయన తల్లి శాలిని మాత్రం ఎక్కువగా బయట కనిపించరు.


తల్లి బయట కనిపించకపోవడంపై స్పందించిన ఎన్టీఆర్..

దానికి కారణం ఏంటో అని చాలామందిలో ఒక అనుమానం ఉంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన అమ్మ బయటికి ఎందుకు రారు అనే కారణాన్ని చెప్పారు ఎన్టీఆర్. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మా అమ్మ చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలను అనుభవిస్తూ వచ్చారు. ఆ కష్టాలు అన్నింటిని నాకు చెబుతూనే పెంచారు. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఎదిగితేనే మనిషిని గొప్పవారు అంటారు అని చెబుతూ ఉండేవారు. అలాగే నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను ఒంటరిగానే పంపించేవారు. ఒంటరిగా వెళ్తేనే బయట ఏం జరుగుతుంది అనే విషయాన్ని తొందరగా తెలుసుకుంటారని అమ్మ చెప్పేవారు. అంతేకాదు మా అమ్మ నాకు ఎప్పుడూ ఒకే విషయం చెప్పేవారు. నలుగురిలో గుర్తింపు రావాలంటే నీలో ఒక స్పెషాలిటీ ఉండాలి.నీలో ఉన్న ప్రత్యేకత వల్లే అందరికీ నువ్వు తెలుస్తావు. నీకంటూ ఒక మార్క్ క్రియేట్ అవుతుంది. అలాంటప్పుడే నలుగురిలో గుర్తింపు వస్తుంది అని మా అమ్మ ఎప్పుడు చెప్పేవారు.


నీ కష్టం ప్రతిఫలం నువ్వే అనుభవించు అనేవారు – ఎన్టీఆర్

ఆమె మాటల్ని ఇన్స్పైర్ గా తీసుకొని నేను ఏ విషయం అయినా స్వయంగా నేర్చుకోవడం మొదలుపెట్టా.. అలాగే అమ్మ చెప్పడం వల్ల కూచిపూడి డాన్స్ కూడా నేర్చుకున్నాను. ఇక నేను ఎంత పెద్ద పొజిషన్ లోకి వెళ్లినా మా అమ్మ బయటికి ఎక్కువగా కనిపించరు.దానికి ప్రధాన కారణం ఎవరైతే కష్టపడతారో వారే ప్రతిఫలం అనుభవించాలి అంటారు. హీరోగా నాకు ఎంత గుర్తింపు వచ్చినా కూడా అందుకే అమ్మ బయటికి రాదు. నువ్వు కష్టపడ్డావు కాబట్టి నువ్వే దాని ప్రతిఫలాన్ని కూడా అనుభవించు అని చెబుతారు.ఇక అమ్మ మాటల కారణంగానే నేను నలుగురితో మాట్లాడడం, అందరితో కలిసిపోవడం నేర్చుకున్నాను అంటూ తన తల్లి గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు జూనియర్ ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్ మాటలతో శాలిని గారు ఎందుకు బయట కనిపించరో అందరికీ ఒక క్లారిటీ వచ్చింది.

ALSO READ:HBD Manchu Manoj: మరోసారి శివయ్యా… బర్త్ డే రోజు కూడా మనోజ్ ర్యాగింగ్ ఆపడం లేదుగా..!

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×