E-Paper
Advertisement

Cluster Bomb Threat: క్లస్టర్ ముప్పు.. పిల్లలకే ఎఫెక్ట్!

Cluster Bomb Threat: క్లస్టర్ ముప్పు.. పిల్లలకే ఎఫెక్ట్!
Advertisement

Cluster Bomb Threat: యుద్ధం తప్పదు అనుకున్న దేశాలు, తమ భద్రతకు ముప్పు ఉంది అని భావించే దేశాలు కొన్ని ఒప్పందాలపై సంతకాలు చేయవు.. ఆ లిస్ట్‌లో అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్, రష్యా, చైనా టాప్‌లో ఉన్నాయి. ప్రపంచం అంతా క్లస్టర్ బాంబులు వాడొద్దు అని సంతకాలు పెడితే కొన్ని దేశాలు దూరంగా ఉన్నాయి. ఇప్పుడు యుద్ధంలోనూ క్లస్టర్ బాంబ్‌లను ఇరాన్ ప్రయోగిస్తుంది. ఇవి యమ డేంజర్.. యుద్ధం ముగిశాక కూడా భూమిపై పడ్డవి పేలుతూ ఉంటాయి. అదే సమస్యా? అయిన సరే తగ్గేదేలే అంటుంది ఇరాన్.. ఏంటి అసలు ఈ క్లస్టర్ బాంబ్స్ పవర్? ఎందుకు ప్రపంచం అంతా ఈ బాంబ్‌ను చూసి వణికిపోతుంది.

అయితే మార్చి 2న ఇరాన్ క్లస్టర్ బాంబులతో ఉన్న మిస్సైల్స్‌ను ప్రయోగించింది. దీని వల్ల టెల్ అవీవ్ లో 12 మంది గాయపడ్డారు. ఇరాన్ గతంలో కూడా 2025 జూన్ యుద్ధంలో ఇలాంటి ఆయుధాలను ప్రయోగించింది. ఆ దాడుల్లో 11 మంది చనిపోగా.., వెయ్యి మందికి పైగా గాయాలయ్యాయి. ఇరాన్ డెవలప్ చేసిన జోల్ఫాఘర్, ఖాదర్, ఖొర్రంషహర్ వంటి క్షిపణులు ఈ క్లస్టర్ బాంబులను మోసుకెళ్లగలవు. ఈ మిసైల్స్ గాలిలో ఉన్నప్పుడే విడిపోయి సుమారు 80 చిన్న బాంబులను 8 కిలోమీటర్ల పరిధిలో వెదజల్లుతాయి. క్లస్టర్ బాంబులతో అదే సమస్య. ఒక టార్గెట్ కాదు. ఇది మల్టీ టార్గెట్. 57 ఎకరాల దాకా ఇవి వెదజల్లినట్లు పడుతాయి. భారీ ప్రాణ, ఆస్తి నష్టానికి కారణమవుతాయి. పశువులు కూడా చనిపోతాయ్.

Advertisement

క్లస్టర్ బాంబుల్లో సుమారు 2 శాతం నుంచి 40 శాతం వరకు వెంటనే పేలవు. అవి నేల మీద పడి ల్యాండ్ మైన్స్ గా ఉండిపోయి యుద్ధం ముగిసిన తర్వాత కూడా ఏళ్ల తరబడి సామాన్య జనానికి, ముఖ్యంగా పిల్లలకు ముప్పుగా మారుతాయి. ఖొర్రమ్‌షహర్ క్షిపణి 2 వేల కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదించే పరిధి ఉంటుంది. అలాగే 1,800 కిలోల వరకు వార్‌హెడ్‌ను మోసుకెళ్తుంది. ఇది పెద్ద క్లస్టర్ వార్‌హెడ్‌ను ప్రయోగించడానికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా క్లస్టర్ బాంబుల ప్రయోగం వీటితో ఈజీ. ఒక్కసారి క్లస్టర్ బాంబ్ ప్రయోగిస్తే.. అందులో ప్రతి చిన్న బాంబు సొంత ప్రొపల్షన్ అంటూ లేకుండా ఎక్కడపడితే అక్కడ నేలపై పడిపోతుంది. దీంతో సాంప్రదాయ సింగిల్ వార్‌హెడ్‌తో పోలిస్తే పెద్ద ప్రాంతానికి ముప్పు కలిగిస్తుంది. క్లస్టర్ బాంబులతో బాలిస్టిక్ క్షిపణి వార్‌హెడ్ కంటే చాలా తక్కువ విధ్వంసమే ఉన్నప్పటికీ ప్రమాద తీవ్రత ఎక్కువుంటుంది. యుద్ధం అయిపోయిన తర్వాత సంవత్సరాలు, దశాబ్దాల పాటు ప్రమాదం కొనసాగుతుంది.

సాధారణ క్షిపణుల కంటే క్లస్టర్ బాంబులను అడ్డుకోవడం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లకు సవాల్ తో కూడుకున్న పని. మిసైల్ గాలిలో ఉండగానే వందలాది చిన్న బాంబులుగా విడిపోతుంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మెయిన్ క్షిపణిని పేల్చేసినా, ఆ చిన్న బాంబులు నేల మీద పడి ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఇజ్రాయెల్ కు చెందిన లేటెస్ట్ టెక్నాలజీ సిస్టమ్స్ కూడా ఇలాంటి మిడ్ ఫ్లైట్ ఫ్రాగ్మెంటేషన్ అంటే గాలిలోనే ముక్కలయ్యే బాంబులను పూర్తిగా నియంత్రించలేని పరిస్థితి ఉంది. ఈ క్లస్టర్ బాంబుల్ని బాలిస్టిక్ మిస్సైల్స్, ఆర్టిలరీ లేదా ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా ప్రయోగిస్తారు. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లాంటి ఐరన్ డోమ్ లేదా పాట్రియాట్ వంటివి మిస్సైల్‌ను ఇంటర్‌సెప్ట్ చేసి అడ్డుకుంటాయి. కానీ క్లస్టర్ వార్‌హెడ్ మధ్యలో పేలిపోయి ఈ చిన్న బాంబులను విసరడం మొదలు పెడితే వాటిని అడ్డుకోవడం కష్టం. ఎందుకంటే అవి చాలా చిన్నవి. ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ఇలా మధ్యలో చిన్న బాంబులుగా విడిపోయే వాటిని ఇంటర్ సెప్ట్ చేసేలా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను తయారు చేయలేకపోయారు. అందుకే క్లస్టర్ బాంబ్ ఎవరికీ వినదు. మిసైల్ చిన్న బాంబులను రిలీజ్ చేయకముందే ఇంటర్‌సెప్ట్ చేస్తే నష్టాన్ని తగ్గించవచ్చు. కానీ అది అసాధ్యం అంటున్నారు. అందుకే ప్రస్తుత ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో ఈ క్లస్టర్ బాంబుల సమస్య మరోసారి తెరపైకి వస్తోంది.

Advertisement

మన పురాణాల్లోని అస్త్రాల మాదిరిగానే క్లస్టర్ బాంబ్ మెకానిజం ఉంది.
ముఖ్యంగా మహాభారతంలో కొన్ని ఆయుధాల పనితీరు క్లస్టర్ బాంబులను పోలి ఉంది. నారాయణాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు అది ఆకాశం నుండి వేలాది బాణాలు, గదలు అగ్నిగోళాలను వర్షంలా కురిపిస్తుంది.
ఇది క్లస్టర్ బాంబు గాలిలో విడిపోయి వందలాది బాంబులను వెదజల్లడం లాంటిదే. పర్జన్యాస్త్రం కూడా ఇలాంటిదే. ఇది కూడా ఆకాశం నుండి చాలా ఆయుధాలను ఒకేసారి ప్రొడ్యూస్ చేసి శత్రువులపై దాడి చేస్తుంది. నాగాస్త్రం కూడా ఇలాంటిదే. ఒకే బాణం చాలా సర్పాలుగా విడిపోయి శత్రువును చుట్టుముట్టడం కూడా ఒక రకమైన క్లస్టర్ బాంబ్ మెకానిజమే.

క్లస్టర్ బాంబులతో మరణాలు భారీగానే ఉంటున్నాయ్. 2022లో వేర్వేరు సంఘర్షణల్లో క్లస్టర్ వాడగా 1,172 మంది చనిపోయాయంటున్నారు. ఇందులో 71 శాతం మంది పిల్లలు ఉన్నారంటున్నారు. ఇవి నిరాయుధులను దెబ్బతీస్తున్నాయి. అవయవాలు కోల్పోవడం, కళ్లు కోల్పోవడం, ఇంటర్నల్ ఆర్గాన్స్ కు డ్యామేజ్, మానసిక ఆరోగ్య సమస్యలు ఇలాంటివన్నీ చుట్టుముడుతున్నాయ్. ఈ తరహా బాంబులతో ఆర్థికంగా కూడా చాలా నష్టమే. ఎందుకంటే ఎక్కడ ఏ బాంబు ల్యాండ్ మైన్ లా ఉందో అర్థం కాదు. వెతకాలంటే టైం పడుతుంది. ముఖ్యంగా వ్యవసాయదారులు భూమిని సాగు చేసుకోలేరు. భూమి బంజరు అవుతుంది. ఆర్థికాభివృద్ధి దెబ్బతింటుంది. రైతులు పొలాలకు వెళ్లలేరు. ఆహార భద్రత ముప్పు, ఆదాయం తగ్గుతాయి. లావోస్ వంటి దేశాల్లో ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో క్లియరెన్స్ ఇవ్వలేదంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. లావోస్, కాంబోడియా వంటి ప్రాంతాల్లో ఇప్పటికీ పెద్ద సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అప్పుడొకటి, ఇప్పుడొకటి అన్నట్లుగా ఈ క్లస్టర్ బాంబ్స్ పేలుతుండడమే సమస్య.

క్లస్టర్ బాంబులను మొదట రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీ తయారు చేసింది. జర్మన్ ఎయిర్ ఫోర్స్ ఉపయోగించిన SD-2.., దీన్నే బటర్‌ఫ్లై బాంబ్ అని పిలుస్తారు. దీన్ని ఫస్ట్ యాక్టివ్ క్లస్టర్ బాంబుగా చెబుతుంటారు. అదే టైంలో అమెరికా, రష్యా, ఇటలీ దేశాలు కూడా ఈ టెక్నాలజీని స్వతంత్రంగా అభివృద్ధి చేసుకున్నాయ్.
అధికారిక లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కనీసం 23 వేల మంది క్లస్టర్ బాంబుల వల్ల చనిపోయారంటున్నారు. అయితే వాస్తవ మరణాల సంఖ్య 56 వేల నుండి లక్ష మంది దాకా ఉండవచ్చని అంచనా. ఈ బాంబుల వల్ల బాధితులయ్యే వారిలో దాదాపు 98 శాతం సామాన్య పౌరులే ఉంటున్నారు. అందులోనూ పిల్లల సంఖ్య అధికం. నిజానికి యుద్ధం జరిగినప్పుడు మిలటరీ సిబ్బంది టార్గెట్ చేసుకోవాలి. కానీ వీటితో కామన్ మ్యాన్ టార్గెట్ అవుతున్నారు.

1964-1973 మధ్య లావోస్‌పై అమెరికా సుమారు 26 కోట్ల క్లస్టర్ బాంబులను కురిపించింది. వీటి వల్ల అక్కడ ఇప్పటివరకు 11 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. నేటికీ అక్కడ 30 శాతం బాంబులు పేలకుండా భూమిలోనే ఉండిపోయి ప్రమాదకరంగా మారాయి. ముఖ్యంగా వ్యవసాయ భూముల్లో పేలని బాంబులు ఉండిపోవడం వల్ల సాగు నిలిచిపోయి తీవ్రమైన ఆర్థిక, సామాజిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దున్నితే పేలే ప్రమాదం ఉంటుంది. అందుకే క్లియరెన్స్ కూడా ఇవ్వట్లేదక్కడ.

1939-1945 మధ్య ఈ క్లస్టర్ బాంబులను జర్మనీ విస్తృతంగా వాడింది. అటు వియత్నాం యుద్ధంలో అమెరికా కూడా భారీగానే ఉపయోగించింది. ఇటీవలి కాలంలో ఉక్రెయిన్‌కు కూడా వీటిని సప్లై చేసింది అమెరికా. మరోవైపు రష్యా కూడా రెండో ప్రపంచ యుద్ధం నుంచి వీటిని ఉపయోగిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధంలోనూ వీటి పెద్ద ఎత్తున ప్రయోగించారు కూడా. ఈ క్లస్టర్ బాంబులతో విపరీతమైన నష్టం ఉంటోందని, సామాన్య జనం చనిపోతున్నారని ప్రపంచ దేశాలో ఒక ఆలోచన చేశాయి. వీటి వల్ల కలిగే విపరీతమైన నష్టాన్ని గుర్తించి 2008లో కన్వెన్షన్ ఆన్ క్లస్టర్ మ్యూనిషన్స్ -CCM ఒప్పందం ద్వారా 100కు పైగా దేశాలు వీటి వినియోగం, తయారీపై నిషేధం విధించుకున్నాయి. అయితే అమెరికా, రష్యా, చైనా, ఇజ్రాయెల్, ఇరాన్ సహా 12 దేశాలు ఇంకా ఈ ఒప్పందంపై సంతకం చేయలేదు. 112 దేశాలు క్లస్టర్ బాంబ్ వాడకూడదని సంతకాలు చేశాయి.

అయితే ఈ ఒప్పందంపై సంతకాలు చేసిన దేశాలు కూడా తప్పుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయ్. ఎందుకంటే మారుతున్న యుద్ధ పరిస్థితులు, థ్రెట్స్ పెరుగుతుండడంతో క్లస్టర్ బాంబులు అవసరమే అన్న నిర్ణయానికి వస్తున్నాయ్. 2025 మార్చి 6న లిథువేనియా ఈ ఒప్పందం నుండి వైదొలిగింది. రష్యా నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కోవడానికి, తమ సేఫ్టీని బలోపేతం చేసుకోవడానికి క్లస్టర్ బాంబులు అవసరమని చెబుతూ లిథువేనియా ఈ ఒప్పందం నుండి తప్పుకుంది. ఇలా తప్పుకున్న మొదటి దేశంగా లిథువేనియా నిలిచింది. ఇతర యూరోపియన్ దేశాలు ఎస్టోనియా, లాట్వియా, పోలాండ్ వంటివి గతంలో రష్యా దాడి నేపథ్యంలో ఈ ఒప్పందం నుంచి తప్పుకునే ఆలోచనతో ఉన్నాయి.

మనదేశం కూడా ఈ బాంబుల వల్ల కలిగే మానవీయ నష్టాన్ని అంగీకరించినప్పటికీ, ఈ ఒప్పందంపై సంతకం చేయలేదు. మనం ఏ బాంబ్ ను కూడా మొదటగా ప్రయోగించం. ఎవరైనా ప్రయోగిస్తే మాత్రం తగ్గేది ఉండదు. వ్యూహాత్మక రక్షణ కోసం భారత్ వీటి వాడకంపై సంతకం చేయలేదంటున్నారు. మనకు సుదీర్ఘమైన సరిహద్దులు ఉన్నాయి. పాక్, చైనా నుంచి ముప్పు పొంచే ఉంటుంది. దీంతో క్లస్టర్ బాంబులు రక్షణ వ్యవస్థలో కీలకమని భారత్ భావిస్తోంది. అయితే అంతర్జాతీయ మానవీయ చట్టాలకు లోబడి వీటిని బాధ్యతాయుతంగా వాడినప్పుడు ఇవి చట్టబద్ధమైన ఆయుధాలేనని భారత ప్రభుత్వం అంటోంది.

Also Read: రాజ్యసభలో కాంగ్రెస్ క్లియర్.. BRS ఎందుకు పోటీ చేయలేదు? అసలు కారణం ఇదే!

అమెరికా వంటి దేశాలు క్లస్టర్ బాంబులతో సైనిక ప్రయోజనం ఎక్కువగా ఉందని వాదిస్తున్నాయి. సాధారణ బాంబుల కంటే ఇవి శత్రువుల భారీ సైనిక కదలికలను అడ్డుకోవడానికి తక్కువ ఖర్చుతో కూడిన సమర్థవంతమైన మార్గంగా చాలా దేశాలు ఆలోచిస్తున్నాయి. క్లస్టర్ బాంబుల అతిపెద్ద ఉత్పత్తి దారు అమెరికానే. సైనిక శక్తి ఎక్కువున్న దేశాలు ఈ క్లస్టర్ బాంబులు తమకు అత్యవసరం అని చెప్పి నిషేధం విధించకుండా అడ్డుకుంటున్నాయ్.

Related News

QR కోడ్‌లో మూడు బాక్స్‌లు ఎందుకుంటాయో తెలుసా ?

బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము బొద్దింకల చేత‌జిక్కి…!

నిరుద్యోగ పెయిడ్ ఆర్టిస్ట్స్! యువ సంగ్రామ సదస్సు పై సెటైర్లు! ఎఫెక్ట్ ఎవరికి!?

చైన్ స్నాచర్లుగా మారండి! స్కూటీలు ఎత్తుకెళ్లండి..! జ‌నాల‌ను దోపిడీ చేయాలంటున్న బీజేపీ ఎమ్మెల్యే ..

ఒక్కో పార్టీకి రెండేసి సార్లు అధికారం.. ఇది ధీమానా, జోస్యమా? చరిత్ర ఇదేననే మైండ్ గేమా!?

సీసీటీవీ ఫుటేజ్ భయమేనా? ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆత్మహత్యాయత్నం వెనుక అసలు నిజాలు!

మితిమీరిన కేటీఆర్ భాష‌! చిచోర‌, బేకార్‌.. స‌న్నాసీ..! సీఎంపై ప‌రుష‌ ప‌ద‌జాల ప్ర‌యోగం..!

రేవంత్ రెడ్డి సీక్రెట్ స్కెచ్.. దారికి రాకుంటే టికెట్ కట్! హస్తం పార్టీలో మొదలైన బిగ్ యాక్షన్ ప్లాన్

Big Stories

Advertisement
×