Chandrababu – Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నెంబర్ టూగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ అయ్యారు. స్వయంగా హిదూ సమాజానికి క్షమాపణలు చెప్పిన ఆయన టీటీడీ బోర్డు సభ్యులందరూ భక్తులకు క్షమాపణలు చెప్పాలని కోరారు. పిఠాపురం సభలో తిరిగి దాన్ని రెట్టించడంతో టీటీడీ చైర్మన్ స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి క్షమాపణలు చెప్పక తప్పలేదు. ముందు పవన్ సూచనను తిరస్కరించిన బీఆర్ నాయుడు తర్వాత దిగి రావడంతో కూటమి ప్రభుత్వంలో పవన్ పవర్ స్పష్టం అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది
సిల్కర్ స్క్రీన్‌పై పవర్ స్టార్ అనిపించుకుంటున్న పవన్ కళ్యాణ్ … ఇప్పుడు పొలిటికల్ పవర్ స్టార్ అనిపించుకుంటున్నారు. 2024 ఎన్నికల ఫలితాలపై ఆయన ప్రభావం స్పష్టంగా కనిపించింది.. చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు వెళ్లి పరామర్శించి అదే జైలు ముందు టీడీపీతో పొత్తుపై ప్రకటన చేసిన పవన్… తర్వాత బీజేపీని కూటమిలోకి తీసుకురావడంలో కూడా కీ రోల్ పోషించారు. జగన్ పార్టీని అధ:పాతాళానికి తొక్కుతానని ఎన్నికల ప్రచారంలో సవాల్ చేసి.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కృషి చేసి … తన సవాల్ నిలబెట్టుకున్న ఆయన జనసేనను హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్‌తో గెలిపించుకుని నిజంగానే పొలిటికల్ పవర్ స్టార్ అనిపించుకుంటున్నారు.
2019లో పోటీ చేసిన రెండు సీట్లలో ఓటమి పాలు అయిన పవన్ 2024లో ఏకంగా చంద్రబాబు తరువాత ప్లేస్ అయిన ఉప ముఖ్యమంత్రి పదవిని అందుకున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఆయన ఇపుడు అత్యంత కీలకంగా ఉన్నారు. ఎంతలా అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆయన ప్రతిమాటను గౌరవిస్తూ ఆయనకు సముచిత గౌరవమిస్తున్నారు . ఆ క్రమంలో ఆయన ఒకసారి చెబితే చాలు అన్నట్లుగా ఉంది. పవన్ ప్రభుత్వం తరఫున తిరుపతి తొక్కిసలాట ఘటనకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. టీటీడీ బోర్డు కూడా క్షమాపణలు చెప్పాలని ఆదేశించారు
అయితే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కాని, పాలకమండలి సభ్యులు కాని దానిపై పెద్దగా రియాక్ట్ కాలేదు. పైపెచ్చు బీఆర్ నాయుడు క్షమాపణలు చెప్తే చనిపోయిన వారు తిరిగొస్తారా అని వ్యాఖ్యానించి జరిగిన ఘటనలోతన బాధ్యత ఏమీ లేదన్నట్లు మాట్లాడారు. అయితే తిరుమల తొక్కిసిలాట ఘటనన సీరియస్‌గా తీసుకున్న పవన్ కళ్యాణ్ టీటీడీ బోర్డు క్షమాపణలు చెప్పే విషయంలో పట్టుదల ప్రదర్శించారు. పిఠాపురం పర్యటనలో మరో సారి ఆ అంశాన్ని లేవనెత్తారు. తానే స్వయంగా క్షమాపణ చెప్పినప్పుడు టీటీడీ సభ్యులు ఎందుకు చెప్పరని.. చెప్పి తీరాల్సిందేనని స్పష్టం చేశారు
పిఠాపురం సభలో పవన్ అదే ఇష్యూని మళ్లీ రెట్టించడంతో టీటీడీ బోర్డు దిగిరాక తప్పలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున చైర్మన్ హోదాలో ఉన్న బీఅర్ నాయుడు తొక్కిసలాట ఘటనకు క్షమాపణలు చెప్పారు. తానే స్వయంగా వెళ్లి క్షతగాత్రులకు టీటీడీ తరపున నష్టపరిహారం అందజేశారు. నిజానికి ఎవరో క్షమాపణలు చెబితే జరిగిన దురదృష్టకర ఘటన సమసి పోదు. మృతులు, క్షతగాత్రులకు జరిగిన నష్టం నష్టపరిహారంతో మాసి పోదు. అయితే తప్పు జరిగినపుడు బాధ్యత తీసుకుని మరోసారి ఇలా జరగదు అని పెద్ద మనసులో చెప్పడం భక్తులకు భరోసా ఇస్తుందంటున్నారు. ఒక విధంగా బాధితులకు ఎంతో కొంత ఊరటను ఇస్తుందని భావించి పవర్ ఆ ప్రతిపాదన చేశారన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. చాలా చోట్ల ప్రభుత్వంలో తప్పులు జరిగినా ప్రజా ప్రతినిధులు కానీ కీలక స్థానాలలో ఉన్న వారు కానీ క్షమాపణలు చెప్పరు.
అయితే ఉప ముఖ్యమంత్రి మాత్రం ఇతర దేశాలలో కొన్ని చోట్ల ఈ విధానం అమలులో ఉందని పిఠాపురం సభలో చెప్పారు. దానిని ఏపీలో ఆయన అమలు చేయాలని భావించారు. తనతోనే ప్రారంభించారు. మొత్తానికి పవన్ చెప్పిన విధంగా ఏపీలో క్షమాపణ పర్వం సాగింది. ఈ ఇష్యూతో పవన్ చెప్పారంటే చేయాలంతే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. పవన్ కళ్యాణ్ అంత పట్టుదలకు పోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పూనుకున్నారని, అందుకే బీఆర్ నాయుడు మీడియా ముందుకొచ్చి క్షమాపణలు చెప్పారని అని అంటున్నారు.
Also Read: Basavannala Life Story: గంగిరెద్దులను ఆడించే బసవన్నల జీవితం ఎలా ఉంటుందో తెల్సా..?
ఏపీలో 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం 2029 ఎన్నికల్లోనూ పొత్తులతోనే ముందుకు సాగాలని చూస్తోంది. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ పదేపదే చెప్తున్నారు. ఆ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కి రాజకీయంగానే కాదు ప్రభుత్వ పరంగా ఎనలేని ప్రాధాన్యత దక్కుతోందని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే పవన్ కూడా కూటమి తరఫున ఏమైనా పొరపాట్లు జరిగితే వాటిని చెప్పడం ద్వారా ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు అలెర్ట్ చేస్తున్నారు. మొత్తానికి పవన్ హవా కూటమి ప్రభుత్వంలో గట్టిగానే సాగుతోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది