BigTV English

Intinti Ramayanam Today Episode : పార్వతి చెప్పిన నిజానికి అవని షాక్.. భాదలో అక్షయ్..

Intinti Ramayanam Today Episode : పార్వతి చెప్పిన నిజానికి అవని షాక్.. భాదలో అక్షయ్..

Intinti Ramayanam Today Episode January 13th : నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ ఆస్తి పంపకాల గురించి లాయర్ తో మాట్లాడతాలని అక్షయ్ వెళ్తాడు.. పల్లవి చిన్న పని ఉంది అత్తయ్య హాస్పిటల్ కి వెళ్దామని తీసుకెళ్తుంది. కమల్ అమ్మ ఎందుకు నేను వస్తా పద అంటాడు. లేడీస్ ప్రాబ్లమ్స్ లేడీస్కే తెలుస్తాయి బావ నేను అత్తయ్య ని తీసుకెళ్లి పోతాను అని అంటుంది. పల్లవి అనుకున్న ప్లాన్ ప్రకారం దయాకర్ ను అక్షయ్ కి ఎదురుగా రమ్మని చెప్తుంది. దయాకర్ అక్షయ్ మాట్లాడుకోవడం పార్వతి చూసి వీరిద్దరూ ఇంత చనువుగా మాట్లాడుకుంటున్నారు ఏంటి? వీరిద్దరికీ నిజం తెలుసా అని అనుకుంటుంది. అక్షయ్ కు దయాకర్ మేనమామ అనే విషయం తెలిసిపోతుందని పార్వతి టెన్షన్ పడుతుంది. అక్షయ్ కి తెలిసే నా దగ్గర దాచి పెట్టాడా అని అనుమాన పడుతుంది. పల్లవి ప్లాన్ వర్క్ అవుట్ అయిందని పల్లవి సంతోషపడుతుంది. ఏదో మెసేజ్ వచ్చినట్టు ఉంటే డాక్టర్ కి ఫోన్ చేసి ఈరోజు అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయింది రేపు రండి అని చెప్తుంది. పార్వతి పల్లవి ఇంటికి వెళ్లి పోతారు.. ఇక ఇంటికి వెళ్ళగానే పల్లవి సంతోషంలో మునిగి పోతుంది.. ఇక అక్షయ్ నిజం తెలుసుకొని రాజేంద్ర ప్రసాద్ ను అడగాలని అనుకుంటాడు. మాట్లాడడంతో ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. అసలు ఎందుకురా ఈ విషయం గురించి ఇప్పుడు ఆస్తి ఎందుకు అని రాజేంద్ర ప్రసాద్ అంటాడు.. కానీ అక్షయ్ మాత్రం అందరికి ఒక న్యాయం నాకు ఒక న్యాయం అని నిలదీస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. రాజేంద్రప్రసాద్ మాత్రం ఎవరికి సమాధానం చెప్పుకునే అవసరం నాకు లేదు అంటూ మొండిగా కూర్చుంటాడు. పార్వతి రాగానే పార్వతిని అక్షయ్ అడుగుతాడు. అసలు ఆస్తిని సగం నా పేరు మీద ఎందుకు రాస్తారు నీకు తెలుసు కదా అమ్మ నువ్వు నాకు చెప్పాల్సిందే అని అక్షయ్ అడుగుతాడు. నాకేం తెలీదురా నన్ను అడగద్దు అని పార్వతి అంటుంది. ఆస్తి గురించి నిజం నీకు తెలుసా అని నాకు అర్థం అయిపోయింది నువ్వు నా మీద ఒట్టేసి నిజం చెప్పాల్సిందే అని అంటాడు. దానికి పార్వతి నువ్వు నా కొడుకువి కాదు. మీ నాన్నగారి మొదటి భార్య కొడుకువి అనగానే ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు పల్లవి సంతోషంలో ఎగిరి గంతేస్తుంది. నేను నీ కొడుకు కాకపోవడమేంటమ్మా అని అక్షయ్ గుండెలు పగిలేలా ఏడుస్తాడు.. అవని అక్షయ దగ్గరకొచ్చి ఈ నిజాన్ని నేను జీర్ణించుకోలేక పోతున్నానండి ఇదంతా జరిగింది నా వల్లే నేను ఆస్తిని పంచడం వరకు తీసుకెళ్లడం వల్లనే ఇదంతా జరిగిందని అక్షయ్ తో అంటుంది.

అత్తయ్య అసలు మీ కొడుకు కాదని ఇన్ని రోజులు తన గుండెలో దాచుకొని ఆ నిజాన్ని మీకు చెప్పలేకపోయిందంటే ఆమె ప్రేమ అబద్ధం కాదు ఆమెకు మీరు ఎక్కడ దూరం అయిపోతారు అని చెప్పలేదండి అని ఫీల్ అవుతుంది. ఇక అక్షయ్ మాట్లాడుతూ.. అమ్మ ఎందుకిలా చేసిందో నాకు అర్థం కావట్లేదు ఇన్ని రోజులు నేను బాగానే ఉన్నాను కానీ నా అమ్మ కాదు అని తెలిసినప్పటినుంచి నాకు చాలా బాధగా ఉంది. అమ్మ నాన్న ఇద్దరూ నాకు ఎటువంటి అనుమానం రానివ్వకుండా నన్ను పెంచారు కానీ నిజాన్ని నేను ఇప్పుడు తట్టుకోలేకపోతున్నానని అక్షయ్ అంటాడు.. ఇన్ని రోజులు నా అమ్మానాన్న అని నేను చాలా సంతోషంగా ఉన్నాను నాకు ఎక్కడ అనుమానం కూడా రాకున్నా నన్ను వాళ్ళు పెంచారు కానీ ఇప్పుడు అద్దంలో చూసుకుంటే నాకు నేనే కొత్తగా అనిపిస్తున్నాను మా అమ్మకి నేను కొడుకును కాదంటే అసలు నా గుండెల్లో ఏదో తెలియని బాధ మొదలవుతుంది అని అక్షయ్ చాలా ఫీల్ అవుతాడు. ఇక అవని అక్షయ్ ని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది.


అటు రాజేంద్రప్రసాద్ పార్వతి అక్షయకి నిజం తెలుసుకోవడంతో బాధపడతారు. వాడి మొహాన్ని నేను ఇప్పుడు ఎలా చూడమంటారండి మీకు ఇది సంతోషంగా ఉందా అనేసి పార్వతి రాజేంద్రప్రసాద్ నిలదీస్తుంది. ఆరాధ్య పార్వతి దగ్గరికి వచ్చి మా నాన్న నీకు సొంత కొడుకు కాదు నానమ్మ అని అడుగుతుంది. పార్వతి షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Dhee Bhoomika : ఢీ కంటెస్టెంట్ కి భారీ యాక్సిడెంట్… కారు తుక్కు తుక్కు

Smriti Irani: ఒక్క ఎపిసోడ్ లక్షల్లో రెమ్యూనరేషన్.. ఏమాత్రం తగ్గని మాజీ మంత్రి క్రేజ్!

Bindas Brothers: పేరుకే సెలబ్రిటీలం… సంపాదన మాత్రం నిల్.. బిందాస్ బ్రదర్స్ కన్నీటి కష్టాలు!

Big TV Kissik talks: తట్టుకోలేక సూసైడ్ అటెంమ్ట్ చేశా.. కిస్సిక్ షోలో అమర్‌దీప్ ఎమోషనల్!

Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?

Nindu Noorella Saavasam Serial Today August 8th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్ర విషయంలో ఆరుతో బాధపడ్డ మిస్సమ్మ

Big Stories

×