Basavannala Life Story: సంక్రాంతికి సందడి చేసే డూడూ బసవన్నలను చూస్తాం. ఇంటి ముందుకు వచ్చి దీవిస్తే ఆశీసులు తీసుకుంటాం. గంగిరెడ్డుల ఆటా పాటలకు ఆనందిస్తాం. గంగిరెద్దు చేసే విన్యాసాలకు మురిసిపోతాం. కానీ… ఆ గంగిరెద్దులను ఎలా రెడీ చేస్తారో తెలుసా. బసవన్నలను ఆడించే గంగిరెద్దుల వారి జీవనం ఎలా ఉంటుందో తెలుసా. వారి.. ఇళ్లు, వాకిళ్లూ ఎలా ఉంటాయో ఎప్పుడైనా చూశారా. ప్రతి సంక్రాంతికి అందరిని దీవించే బసవన్న.. ఆడించే గంగిరెద్దులు… వాటిని ఆడించే జీవితాలు.. ఎలా ఉంటాయో చూపించే ప్రయత్నం చేద్దాం. చిరునవ్వులు చిందింప చేసే గంగిరెద్దులు ఆడించే వారి లైఫ్ స్టోరీ చూసేద్దాం.
కాలవ గట్లపై, రోడ్డు పక్కన కనిపిస్తున్న ఈ చిన్న డేరాలతో కనిపిస్తున్న ఇళ్లులే.. గంగిరెద్దులు ఆడించే వారి నివాసాలు. ప్రతి ఇంటికి వెళ్లి.. ధన ధాన్యాలతో, సిరి సంపదలతో ఉండాలంటూ దీవించే డూడూ బసవ్వన్నలను ఆడించే గంగిరెద్దుల వారి జీవితాలు మాత్రం.. నేటికీ దుర్భారంగానే ఉన్నాయి. ఒకప్పుడు సంక్రాంతి వస్తే… డూడూ బసవన్న ఇంటి ముందుకు వెళ్తే జోలె నిండిపోయేది. ఇప్పుడైతే రేపు రండి… పైకి వెళ్లి రండి.. అని చెప్పేవాళ్లే తప్ప… సాయం చేసేవాళ్ళే కనిపించడం లేదు. కానీ…. నెల రోజుల కోసం సంవత్సరం అంతా గంగిరెద్దులు పోషించే సాధారణ ఎద్దులు ఎలా ఉంటాయో చూద్దాం.
ఇక్కడ అందంగా ముస్తాబైన డూడూ బసవన్న పేరు భీముడు. పిలిస్తే చాలు.. వెంటనే పలుకుతాడు. చెప్పింది క్షణాల్లో చేస్తాడు. అదంతా పెంచుకున్న మమకారం అనుకుంటా…అలా పెంచుకున్న ఎద్దులను.. ఎంతో అందంగా అలంకరించుతారు… కానీ వీరి జీవితాల్లో మార్పు మాత్రం లేదు. చిన్న డేరాలు కట్టిన పూరిళ్లు.. అందులోనే కుటుంబమంతా జీవనం. తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాన్ని కొనసాగించడమే.. తమ పని అని.. గతంలో లాగా ఎవ్వరు ఇప్పుడు గంగిరెద్దుల వారిని పట్టించుకోవడం లేదని.. ఈ వృత్తి ద్వారా బతకడం కూడా చాలా కష్టంగా ఉండని వారు చెబుతున్నారు. ఏళ్ల తరబడి ఇదే జీవనం సాగుతున్న వారి పరిస్థితులు ఎలా ఉంటాయి. అసలు గంగిరెద్దులను ఎలా ముస్తాబు చేస్తారో చూద్దాం.
Also Read: Sankranti festival: గోదావరి జిల్లాల్లో కాలు దువ్వుతున్న పందెంరాయుళ్లు.. మాట వినేదే లే..!
చూశారుగా..తమతో పాటు కుటుంబాన్ని, పిల్లల్ని చూడటమే కాదు నమ్ముకున్న పశువుల కూడా జాగ్రత్తగా చూస్తూ అందరూ బావుండాలి అని కోరుకునే డూడూ బసవన్నల కుటుంబాలు దీనగాధ. ఇప్పటికైనా అంతరించిపోతున్న ఇలాంటి కళలను ప్రోత్సాహించాల్సిన భాధ్యత ప్రభుత్వంపై కూడా ఎంతైనా ఉంది.