BigTV English
Advertisement

CM Chandrababu: ఆ మంత్రులు పోస్ట్ ఊస్ట్.. సీఎం చేతిలో లిస్ట్..!!

CM Chandrababu: ఆ మంత్రులు పోస్ట్ ఊస్ట్.. సీఎం చేతిలో లిస్ట్..!!

ఏపీలో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి డిసెంబరు 12తో ఆరు నెలలు నిండుతున్నాయి. అంటే హానీమూన్ కంప్లీటెడ్ అన్న మాట. ఏ ప్రభుత్వం మీద కొత్తగా ఏర్పడినప్పుడు ప్రజల అంచనాలు, ఆశలు భారీగానే ఉంటాయి. తొలి ఆరు నెలలు ఆశావహ ధృక్పధంతో ఎదురుచూస్తారు. ప్రభుత్వ పనితీరును సానుకూల ధోరణిలోనే చూస్తూంటారు.

అయితే తర్వాత పాలన ఎలా సాగుతుంది అన్నది ప్రజలు కూడా రివ్యూస్ చేస్తారు. ప్రజల రివ్యూస్ ఎలా ఉన్నా ప్రభుత్వ పెద్దలు కూడా తమ వంతు సమీక్షలు ఎప్పటికపుడు చేసుకుంటూ ఉంటారు. ఆ విషయంలో రాజకీయంగా ఢక్కామెక్కీలు తిన్న చంద్రబాబుకు ఎవరూ చెప్పాల్సిన అవసరం అయితే లేనే లేదు అని అంటున్నారు. ఆయన ప్రజల నాడిని ఎప్పటికపుడు పట్టుకోవడానికే చూస్తూంటారన్న అభిప్రాయం ఉంది.


అదలా ఉంటే సీఎం చంద్రబాబు కేబినెట్ లో ఆయన కాకుండా 24 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో అరడజను మంది తప్ప అంతా కొత్త ముఖాలే ఉన్నారు. అందుకే బాబు మంత్రుల పనితీరు మీద ఎప్పటికపుడు అధ్యయనం చేస్తున్నారు. తనదైన పద్దతిలో రివ్యూస్ రెడీ చేయించుకుంటూ నివేదికలను తెప్పించుకుని వారికి తగిన సూచనలు చేస్తూ వస్తున్నారు.

Also Read: మాజీ ఉప ముఖ్యమంత్రికి బిగిస్తున్న ఉచ్చు..

ఇక తాజాగా నిర్వహించిన కేబినెట్ సమావేశంలోనూ మంత్రులకు సీఎం దిశా నిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది. ఆరు నెలల పాలన ముగుస్తున్న నేపథ్యంలో ప్రతీ మంత్రి తన శాఖ పరిధిలో పనితీరు మీద నివేదికలు ఇవ్వాలని చంద్రబాబు అడిగారంట. అలాగే ఆయా శాఖల పరిధిలో వ్యవహారాలు, మంత్రుల పనితీరుపై తనదైన పద్దతిలో సర్వేలు చేయిస్తూ నివేదికలు తెప్పించుకుంటున్నారంట. వాటినన్నిటినీ క్రోడీకరించి మంత్రులకు రానున్న రోజులలలో పనితీరుని మెరుగుపరచుకోవడానికి సూచనలు ఇస్తారని అంటున్నారు.

మొత్తం మంత్రులలో కొందరు మాత్రమే తమ శాఖలలో పట్టు సాధిస్తున్నారని అంటున్నారు. మరి కొందరు నెమ్మదిగా గాడిలో పడుతున్నారన్న అభిప్రాయం ఉంది. కొందరు మంత్రులు మాత్రం ఇంకా ఏ, బీ, సీ, డీలో దశలోనే ఉండి అవగాహన పెంచుకోవడానికి చూస్తున్నారంట. దీంతో ఆరు నెలల పాలన పూర్తి అవుతున్న నేపథ్యంలో చంద్రబాబు మంత్రుల విషయంలో కాస్త సీరియస్ గానే వ్యవహరిస్తారంటున్నారు.

ప్రభుత్వం పనితీరు అన్నది మంత్రులు ఎమ్మెల్యేల పనితీరు మీదనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అందుకే బాబు పదే పదే మంత్రులను తమ పనితీరుని మెరుగుపర్చుకోవాలని సూచిస్తున్నారు. ఏ మాత్రం తేడా వచ్చినా ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఆ క్రమంలో హఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్‌లో మంత్రుల ప్రోగస్ రిపోర్టులు ఎలా ఉంటాయో చూడాలి.

Related News

Donald Trump: ఎవరీ జొహ్రాన్‌ మమ్దానీ? న్యూయార్క్ మేయర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే

Suicide Incidents: బతకండ్రా బాబూ! అన్నింటికీ ఆత్మహత్యే పరిష్కారమా?

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Jubilee Hills Bypoll: నవంబర్ సెంటిమెంట్.. బైపోల్స్‌లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా!

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Kalvakuntla Kavitha: జూబ్లీహిల్స్ బైపోల్‌.. బీఆర్ఎస్‌కు కవిత గండం

Kalvakuntla Kavitha: కవిత టార్గెట్.. కారు పార్టీ.. టచ్‌లో ఆ నేతలు?

Vijayanagaram TDP: టీడీపీ జిల్లా.. రథసారథి ఎవరో?

Big Stories

×