BigTV English

CM chandrababu: ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో కీలక ఒప్పందం

CM chandrababu: ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో కీలక ఒప్పందం

CM chandrababu: ఏపీ రాజధాని విషయంలో మహోన్నత ఘట్టం.. అమరావతి కేంద్రంగా కీలక ప్రాజెక్టులు.. దేశవ్యాప్తంగా రాజధాని పేరు మోగేలా కీలక ఒప్పందాలు.. ఇలా ఏపీ అభివృద్ధికి సంబంధించి ఈ వారం చాలా ముఖ్యమైనదనే చెప్పాలి. అతిరథ మహులంతా ఏపీకి తరలిరావడంతో.. పండుగ వాతావరణం నెలకొందనే చెప్పాలి. అదే సమయంలో ఏపీకి సంబంధించి ఇప్పటి వరకు కన్న కలలన్ని సాకారం అయ్యే పరిస్థితులు ఉన్నాయనే నమ్మకం వచ్చింది. ఆ డిటెయిల్స్ ఏంటో చూద్దాం పదండి.


01-05-2025 ( గురువారం ) ( పెన్షన్ల పంపిణీ )
నెల్లూరు జిల్లా, ఆత్మకూరులో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ను లబ్ధిదారులకు అందించారు చంద్రబాబు. నెల్లూరు పాలెం గ్రామంలోని ఎస్టీ కాలనీలో చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తనను కలిసిన చలంచర్ల సుస్మితకు వితంతు పింఛన్ అందచేశారు.

01-05-2025 ( గురువారం ) ( భవన నిర్మాణ కార్మికులతో ముఖాముఖి )
కార్మికులు లేనిదే సమాజం లేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక, కర్షక సోదరులకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. నెల్లూరు పర్యటనలో ఉన్న ఆయన.. భవన నిర్మాణ కార్మికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారికి మే డే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులతో మాట్లాడి రాడ్ బెండింగ్, వైండింగ్ గురించి అడిగి తెలుసుకున్నారు. వారి పనితీరు, రోజువారీ లభించే కూలీ వివరాలను తెలుసుకున్నారు. కార్మికుల సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని భవన నిర్మాణ కార్మికులకు సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.


01-05-2025 ( గురువారం ) ( కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా.. )
కార్మిక శక్తి లేనిదే సమాజం ముందుకు వెళ్ళదన్నారు సీఎం చంద్రబాబు. కార్మిక, కర్షకులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ముందుకు వెళ్లడం ప్రస్తుతం అత్యంత అవసరమన్నారు. నాలా చట్టం రద్దు, ఉచిత ఇసుక విధానం, భవన నిర్మాణాలకు, లే అవుట్లకు అనుమతులు సరళతరం చేయడం వంటి నిర్ణయాలతో ఇప్పటికే నిర్మాణ రంగాన్ని తమ ప్రభుత్వం నిలబెట్టిందని.. లక్షల మంది జీవితాలకు భద్రత కల్పించామన్నారు.01-05-2025

( గురువారం ) ( సీఎం సన్మానాలు )
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థినులను, పీ4 కార్యక్రమంలో భాగంగా పేదలను ఆదుకునేందుకు ముందుకొచ్చిన మార్గదర్శులను సీఎం సన్మానించారు.

01-05-2025 ( గురువారం ) ( MSME పార్కుల ప్రారంభం )
ఇంటికో పారిశ్రామిక వేత్తను తయారుచేయడమే లక్ష్యంగా, 175 నియోజకవర్గాల్లో 175 MSME పార్కుల ఏర్పాటును టార్గెట్‌గా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా నారంపేటతో పాటు మరో 10 చోట్ల ఎంఎస్ఎంఈ పార్కులను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మరో 39 నియోజకవర్గాల్లో MSME పార్కులకు శంకుస్థాపన చేశారు.
ఈ పార్కులు వందలాదిమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వేదిక కానున్నాయి.

02-05-2025 శుక్రవారం ( అమరావతి పనుల పునఃప్రారంభం )
ఏపీలో మహోన్నత ఘట్టం ఆవిష్కృతమైంది. ఏపీ ప్రజల ఆశలు నెరవేరడానికి తొలి అడుగు పడుతుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమరావతి పనులకు శంకుస్థాపన పడింది. అమరావతి, ఏపీని సూచించేలా ఆంగ్ల అక్షరం A ఆకారంలో పైలాన్‌ను ఆవిష్కరించారు. 57 వేల 962 కోట్ల విలువైన 94 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మోడీ చేతుల మీదుగా జరిగాయి. మూడేళ్లలో రాజధాని పనులను పూర్తి చేసి మళ్లీ ప్రారంభోత్సవానికి మోడీని ఆహ్వానిస్తామన్నారు చంద్రబాబు.

02-05-2025 శుక్రవారం ( ఏపీ దశ, దిశ మార్పు పక్కా )
ఓ కొత్త అమరావతి, ఓ కొత్త ఏపీ తనకు కనిపిస్తోందన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ. అమరావతి కేవలం కాంక్రీట్ నిర్మాణం కాదని, భారత ఆశల సౌధం కూడా అని తెలిపారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు మోడీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

02-05-2025 శుక్రవారం ( క్వాంటమ్ కంప్యూటింగ్ )
నవ్యాంధ్రప్రదేశ్‌కు మరో మైలురాయి. క్వాంటం కంప్యూటింగ్‌లో ఏపీని దేశంలోనే ముందు వరుసలో నిలపాలని పట్టుదలగా ఉన్న సీఎం చంద్రబాబు… 2026, జనవరి 1న అమరావతి కేంద్రంగా క్వాంటం కంప్యూటింగ్ కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు IBM, TCS, L&T సంస్థలతో ఎంవోయూ కుదుర్చుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీంతో అమరావతిలో భారతదేశంలో మొట్టమొదటి, అత్యాధునిక క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ నిర్మాణం కానుంది. దేశంలోనే తొలిసారి IBM అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటర్ 156 క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్‌ కలిగిన క్వాంటం సిస్టం 2 ని అమరావతిలో నెలకొల్పనుంది.

02-05-2025 శుక్రవారం ( క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు అడుగులు )
IBM,TCS, ఎల్ అండ్ టీతో జరిగిన ఒప్పందం.. ఆంధ్రప్రదేశ్‌కే కాదు, భారతదేశానికి కూడా చారిత్రాత్మకమన్నారు సీఎం చంద్రబాబు. క్వాంటమ్ కంప్యూటింగ్ భవిష్యత్ పాలనకు, ఆవిష్కరణలకు పునాది అవుతుందన్నారు. సాంకేతిక రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కొత్త అవకాశాలు వస్తున్నాయని…. వాటిని అందిపుచ్చుకోవడం ముఖ్యమన్నారు సీఎం. భవిష్యత్ అవసరాలన్నీ క్వాంటం కంప్యూటింగ్‌‌పైనే ఆధారపడి ఉంటాయని అందుకే అమరావతిని క్వాంటం వ్యాలీ చేయాలనుకున్నట్టు తెలిపారు. సిలికాన్ వ్యాలీ తరహాలో క్వాంటం వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకుసాగుతున్నామన్నారు సీఎం చంద్రబాబు.

03-05-2025 శనివారం ( నేతలతో కాన్ఫరెన్స్ )
కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అమరావతి రాజధాని పనుల పున:ప్రారంభ కార్యక్రమం విజయవంతమవ్వడంపై హర్షం వ్యక్తం చేసిన సీఎం.. రాష్ట్ర ప్రగతికి మద్ధతుగా నిలుస్తామన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యలు మరింత నమ్మకాన్ని నింపాయన్నారు. ప్రజలందరి భాగస్వామ్యంతోనే సభ సక్సెస్ అయిందన్నారు చంద్రబాబు. అధికారులు, నేతలను ఆయన అభినందించారు. అమరావతి ఒక నగరం కాదు. ఒక శక్తిగా మారుతుందన్నారు చంద్రబాబు. ఇక అంతా మీ చేతుల్లోనే ఉందంటూ మంత్రి నారాయణకు లక్ష్యాన్ని నిర్ధేశించారు సీఎం చంద్రబాబు. మూడేళ్లలో నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభోత్సవాలు కూడా జరపాలన్నారు చంద్రబాబు.

03-05-2025 శనివారం ( రాజధాని నిర్మాణ పనులు వేగవంతం )
రాజధాని నిర్మాణ పనులు వేగవంతం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఐకానిక్ భవనాల డిజైన్లు ఖరారు చేసేందుకు చర్చలు ప్రారంభించింది. సీఆర్డీయే కార్యాలయంలో నార్మన్ పోస్టర్, హఫీజ్ కాంట్రాక్టర్స్, ఎల్ అండ్ టీ సంస్థల ప్రతినిధులతో డిజైన్లపై చర్చలు జరిపారు మంత్రి నారాయణ. ఐదు ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాల తుది డిజైన్లపై కసరత్తు మొదలైంది. సీఎం చంద్రబాబును కలిసి డిజైన్లపై చర్చలు జరిపారు అధికారులు.

03-05-2025 శనివారం (క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో ఒప్పందం )
ముంబైలో జరుగుతున్న ది వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌-2025లో ఏపీ ప్రభుత్వం, క్రియేటివ్‌ ల్యాండ్‌ ఆసియా మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా ఏపీకి వచ్చే సందర్శకుల కోసం థీమ్‌పార్క్‌లు, గేమింగ్‌ జోన్‌లు, గ్లోబల్‌ సినిమా కో-ప్రొడక్షన్‌ జోన్‌లు ఏర్పాటు చేయడంతో పాటు పర్యాటక రంగంలో 1.5 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశం ఉంది. ఈ ఒప్పందంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే తొలి ట్రాన్స్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ సిటీగా అమరావతి నిలుస్తుందన్నారు ఆయన.

04-05-2025 ఆదివారం ( భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలు ) భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది ఏపీ ప్రభుత్వం. ఈ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఈ సందర్భంగా సగర కులస్తులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. భగీరథ మహర్షి జయంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు.

28-05-2025 ( సోమవారం ) ( రైతులకు ఆహ్వానం )
అమరావతి పనుల పున:ప్రారంభ కార్యక్రమానికి రావాలంటూ రాజధాని రైతులను సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. మే 2వ తేదీ రాష్ట్ర చరిత్రలో కీలక మలుపుకాబోతుందని, మోడీ రాజధాని పునర్ నిర్మాణం పనులు ప్రారంభించబోతున్నారని తెలిపారు.

28-05-2025 ( సోమవారం ) ( విట్‌లో చంద్రబాబు )
అమరావతి విట్ యూనివర్సిటీలో నిర్వహించిన ‘వి లాంచ్‌పాడ్ 2025 – స్టార్టప్ ఎక్స్‌పో’ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యాంపస్‌లో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ చేశారు. అనంతరం పలు భవన సముదాయాలను ప్రారంభించారు. యూనివర్సిటీలో కొత్తగా నిర్మించిన మహాత్మాగాంధీ బ్లాక్ ,వి.వి.గిరి బ్లాక్, దుర్గాబాయి దేశ్‍ముఖ్ బ్లాక్ నూతన భవనాలను ప్రారంభించారు.

28-05-2025 ( సోమవారం ) ( స్వయం సహాయక బృందాలకు అండగా )
స్వయం సహాయక బృందాల సభ్యులకు ఆర్థిక సాయం చేసేలా ఏపీ ప్రభుత్వం రుణ ప్రణాళికను కొత్తగా రూపొందించింది. 2026 మార్చి వరకు 88 లక్షల 48 వేల 109 మంది సభ్యులకు 61 వేల 964 కోట్లను రుణంగా అందించనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 1.25 లక్షల మంది సభ్యులను ఎన్యుమరేటర్లుగా ఎంపిక చేసి శిక్షణ ఇవ్వనున్నారు.

28-05-2025 ( సోమవారం ) ( అనుమతుల పునరుద్ధరణ)
సొంతింటి నిర్మాణం కోసం కలలు కంటున్న వారి కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అప్పు చేసి కొన్న ఇంటి స్థలంలో సొంతింటి నిర్మాణానికి అనుమతులు రాక, బ్యాంకుల్లో రుణం దొరక్క ఇన్నాళ్లూ అవస్థలు పడుతున్న వారికి శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని 8509 ఎకరాల్లో వేసిన 870 లేఅవుట్లకు అనుమతులను పునరుద్ధరించనుంది. దీని వల్ల సుమారు 85 వేల కుటుంబాలకు మేలు జరగనుంది. అంతేకాదు డెవలప్‌మెంట్‌ ఛార్జీల మినహాయింపు కూడా ఇస్తోంది.

29-05-2025 (మంగళవారం ) ( బ్యాంకర్ల సమావేశం ) సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. 2025-26 వార్షిక రుణ ప్రణాళికను ఖరారు చేశారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి బ్యాంకులు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఈసందర్భంగా బ్యాంకర్లను కోరారు చంద్రబాబు. స్వర్ణాంధ్ర-2047 విజన్‌కు అనుగుణంగా పని చేస్తూనే.. 2029కల్లా పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్‌లు, లక్ష్యాలపై ప్రధానంగా దృష్టి పెట్టామని, వీటన్నింటికీ బ్యాంకులు సహకారం అందించాలన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 6 లక్షల 60వేల కోట్లతో రూపొందించిన వార్షిక రుణ ప్రణాళికను సీఎం ఆవిష్కరించారు. అలాగే 2024-25లో సాధించిన ఫలితాలపై బ్యాంకింగ్‌ అధికారులతో చర్చించారు చంద్రబాబు.

30-04-2025 ( బుధవారం ) ( సమస్యలు పరిష్కరించాలని వినతి )
ఆర్డీటీకి విదేశీ నిధుల వినియోగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిన ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్‌ పునరుద్ధరణకు చొరవ తీసుకోవాలని కోరుతూ… ఉమ్మడి అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబును కలిశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో విదేశీ విరాళాల ద్వారా ఆర్డిటీ నడుస్తోందని, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లోనూ ఈ ట్రస్ట్ వైద్య సేవలు అందిస్తోందని ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సాయం అందించాలని వారు కోరారు. దీనిపై సీఎం స్పందిస్తూ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారు.

30-04-2025 ( బుధవారం ) ( సింహాచలం ఘటనపై కమిషన్ ఏర్పాటు )
సింహాచలం ఆలయ పరిధిలో గోడ కూలి ఏడుగురు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణకు కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటైన కమిషన్ 72 గంటల్లో ప్రాథమిక నివేదిక, 30 రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. భక్తులు మరణించిన ఘటనపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు

30-04-2025 ( బుధవారం ) (యునిసెఫ్‌తో కీలక ఒప్పందం )
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతీ, యువకులకు నైపుణ్యాభివృద్ధితో పాటు సాధికారత కల్పించేందుకు యునిసెఫ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ. ఈ ఒప్పందం ప్రకారం యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ , యూత్ హబ్, పాస్‌పోర్ట్ టు ఎర్నింగ్ కార్యక్రమాల అమలుకు యునిసెఫ్ సహకారం అందిస్తుంది.

 

Related News

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

Big Stories

×