BigTV English

Egg is superfood of not: గుడ్డు సూపర్ ఫుడ్ అవునా, కాదా..? గుడ్డుతో అనర్థాలు కూడా ఉన్నాయా..?

Egg is superfood of not: గుడ్డు సూపర్ ఫుడ్ అవునా, కాదా..? గుడ్డుతో అనర్థాలు కూడా ఉన్నాయా..?

కోడి గుడ్డు తినడం వల్ల చాలా లాభాలున్నాయని అంటారు, ప్రతిరోజూ గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదని అంటుంటారు. అంతే కాదు, గుడ్డు శాకాహారం అని.. శాకాహారులు కూడా నిరభ్యంతరంగా గుడ్డు తినొచ్చని కొంతమంది చెబుతుంటారు. ఎవరు ఏం చెప్పినా, గుడ్డులో పోషకాలు మెండుగా ఉన్నాయని న్యూట్రిషనిస్ట్ లు కూడా చెబుతుంటారు. ముఖ్యంగా ప్రొటీన్ కి గుడ్డు సూపర్ ఫుడ్ అంటారు. అయితే గుడ్డు వల్ల అనర్థాలు కూడా ఉన్నాయా..? అతిగా గుడ్డు తింటే ఆరోగ్యం పాడవుతుందా..? ఆధునిక సర్వేలు ఏం చెబుతున్నాయి..?


సూపర్ ఫుడ్

గుడ్డు ఆరోగ్యానికి మంచిదని ప్రపంచంలో అత్యథికమంది న్యూట్రిషనిస్ట్ లు, వైద్యులు చెబుతుంటారు. అయితే కొంతమంది దీన్ని సూపర్ ఫుడ్ గా చెబుతారు. అంటే మిగతా ఆహార పదార్థాలు తీసుకున్నా తీసుకోకపోయినా గుడ్డు మాత్రం కచ్చితంగా తీసుకోవాలని అంటారు. గుడ్డు తీసుకుంటే, మిగతా ఆహార పదార్థాల కొరత వల్లే వచ్చే అనారోగ్యాలు కూడా దూరమవుతాయని అంటారు. అందుకే దీన్ని సూపర్ ఫుడ్ అంటారు. అయితే ఈ సూపర్ ఫుడ్ అనే పదం తప్పు అనేది కొందరి వాదన. గుడ్డు తిననంత మాత్రాన ఏమీ కాదని, అలాగని గుడ్డు తినడం వల్ల పూర్తిగా మేలు జరుగుతుంది అనుకోవడం కూడా తప్పు అని అంటున్నారు. గుడ్డు తినడం వల్ల కొన్ని అనర్థాలు కూడా ఉన్నాయంటున్నారు ఆధునిక న్యూట్రిషనిస్ట్ లు.


కొలెస్ట్రాల్ సమస్య

గుడ్డు ఎక్కువగా తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగిపోతుందనే వాదన కూడా ఉంది. ఎగ్ వైట్ వల్ల ప్రొటీన్లు సమృద్ధిగా లభించి శరీరానికి సత్తువ పెరుగుతుంది. దీనిలోని అమైనా యాసిడ్స్ కూడా ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఇక ఎగ్ ఎల్లో లో మాత్రం కొలెస్ట్రాల్ అధిక శాతంలో ఉంటుంది. ఒకవేళ ఎగ్ ఎల్లోని పక్కనపెట్టినా కూడా పూర్తి ఎగ్ వైట్ మరీ అంత మేలు చేసే సూపర్ ఫుడ్ ఏమీ కాదని అంటున్నారు ఫిటెలో క్లినికల్ డైటీషియన్ ఉమాంగ్ మల్హోత్రా. మన శరీరంలోని వ్యాధికారక క్రిములను పెంచి పోషించడంలో గుడ్లు ప్రధాన భూమిక పోషిస్తున్నాయని ఆయన చెబుతున్నారు.

?utm_source=ig_web_copy_link

వ్యాధికారక సూక్ష్మ క్రిములు మన శరీరంలోకి ప్రవేశిస్తే.. వాటితో రోగ నిరోధక వ్యవస్థ యుద్ధం చేస్తుంది. సూక్ష్మ క్రిములను చంపేస్తుంది. అయితే మనం తీసుకునే గుడ్లలో ఉండే ప్రొటీన్ సహా ఇతర పదార్థాలు ఈ వ్యాధికారక సూక్ష్మ క్రిములకు మేలు చేస్తాయి. వీటి వల్లే అవి తమ సంఖ్యను పెంచుకుంటాయి. అంటే ఒకరకంగా గుడ్లు మనకు మేలు చేయకపోగా ఎక్కువగా కీడు చేస్తున్నాయనేది ఆయన అభిప్రాయం.

ప్రొటీన్ ఫుడ్

ప్రస్తుతానికి గుడ్ల వల్ల కలిగే అనర్థాలు పూర్తిగా వ్యక్తిగత అభిప్రాయంగానే చెప్పవచ్చు. గుడ్ల వల్ల నష్టాలున్నాయని చెప్పే సైంటిఫిక్ స్డడీ ఏదీ జరగలేదు. ఇప్పటి వరకు గుడ్డుని ఆరోగ్యానికి మంచిది అని మాత్రమే చెబుతున్నారు. ఒకవేళ ఇది సూపర్ ఫుడ్ కాకపోయినా, మన శరీరానికి అత్యవసరమైన ప్రొటీన్ ని ఇది అందిస్తుంది. ఇకపోతే కొలెస్ట్రాల్ సమస్య కూడా గుడ్ల వల్ల మాత్రమే వస్తుందని చెప్పలేంద. శారీరక శ్రమ చేసేవారికి, రోజూ వ్యాయామం చేసే వారికి గుడ్లు మరింత మేలు చేకూరుస్తాయి.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×