Harihara Veeramallu :విడుదల వాయిదాలో కూడా సరికొత్త రికార్డు సృష్టించి, ఇంకా విడుదలకు నోచుకోని చిత్రాలలో ఏకైక చిత్రంగా నిలిచింది పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)హరిహర వీరమల్లు (Harihara Veeramallu). ఇప్పటికే దాదాపు 13 సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా మే 9వ తేదీన విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ ఆ తేదీ కూడా విడుదలయ్యే అవకాశాలు కనిపించలేదు. ఇక మే 30వ తేదీన సినిమాను విడుదల చేస్తారని చెబుతున్నారు. కానీ మేకర్స్ దీనిపై స్పందించలేదు. ఇక పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే సినిమా షూటింగ్ పూర్తవుతుందని, ఆ తర్వాతే మేకర్స్ డేట్ ప్రకటించే అవకాశం ఉందని, అందరూ అనుకుంటూ ఉండగా.. ఎట్టకేలకు ఇప్పుడు హరిహార వీరమల్లు మొదటి పార్ట్ షూటింగు ఈ రోజుతో పూర్తీ కాబోతోంది.
ఈరోజుతో హరిహర వీరమల్లు పార్ట్ వన్ షూటింగ్ పూర్తి..
హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి కీలకమైన బ్లాక్ షూటింగ్ ఒకటి పెండింగ్ లో ఉంది. ప్రస్తుతం ఆ బ్లాక్ కు సంబంధించి ప్రీ విజువలైజేషన్ పనులు కూడా నడుస్తూ ఉండగా.. వారం రోజులు వర్క్ చేస్తే, ఆ సినిమా పూర్తవుతుందని, సరిగ్గా కొన్ని నెలల క్రితం పవన్ కళ్యాణ్ ఈ మాట చెప్పారు. దీంతో పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు షూటింగ్ పూర్తీ చేస్తారని అభిమానులు ఎదురు చూడగా.. ఎట్టకేలకు హరిహర వీరమల్లు సినిమా సెట్ పైకి పవన్ కళ్యాణ్ వచ్చారు. కీలకమైన బ్లాక్ షూటింగ్ ఏడు రోజులు ఉండగా.. దానిని రెండు రోజులకే కుదించారు. సరిగ్గా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ నిన్న షూటింగ్ మొదలుపెట్టి ..ఈరోజు ప్యాకప్ చెప్పబోతున్నారు. అంతేకాదు రెండో రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని మేకర్స్ స్వయంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ చాలా అంటే చాలా పెండింగ్ ఉంది. మరో మూడు నెలలు షూట్ చేసినా పూర్తవుతుందన్న గ్యారెంటీ కూడా లేదు. అందుకే సినిమాను రెండు భాగాలుగా చేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు అప్పటివరకు పూర్తయిన షూటింగ్ భాగంతో మొదటి భాగాన్ని విడుదల చేయాలని అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన భాగం మాత్రం ఇంకా మిగిలే ఉంది. అది ఈరోజు పూర్తి కాబోతోందని సమాచారం.
ఈరోజు, రేపట్లో అనౌన్స్మెంట్..
ఇక ఎలాగో షూటింగ్ కూడా ఈరోజు పూర్తవుతుంది కాబట్టి ఈ విషయాన్ని ఈరోజు లేదా రేపు అనౌన్స్మెంట్ చేసి, విడుదల తేదీని కూడా ప్రకటించే అవకాశం ఉంది. అంతేకాదు పనిలో భాగంగా ట్రైలర్ రిలీజ్ డేట్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ మూవీ కోసం ఎంతగానో ఎదురు చూసిన అభిమానులకు ఈ విషయం మంచి ఊరట కలిగిస్తోంది అని చెప్పడంలో సందేహం లేదుఇక హరిహర వీరమల్లు సినిమా విషయానికొస్తే.. ప్రముఖ డైరెక్టర్ క్రిష్(Krish ) ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు తీసుకోగా.. ఆయన మధ్యలో తప్పుకున్నారు. దీంతో జ్యోతి కృష్ణ (Jyothi Krishna)రంగంలోకి దిగారు. ఏ.ఎమ్.రత్నం భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇక ఇందులో నిధి అగర్వాల్ (Nidhi Agarwal) హీరోయిన్గా నటిస్తోంది.
ALSO READ:Sai Rajesh: బాలీవుడ్ పై బాబిల్ ఖాన్ అసహనం.. టీం క్లారిటీపై డైరెక్టర్ ఆగ్రహం..!