BigTV English

Narayana on Pushpa: పుష్ప హీనాతిహీనమైన సినిమా , ఇలాంటి సినిమాను ప్రభుత్వం ఖండించాలి

Narayana on Pushpa: పుష్ప హీనాతిహీనమైన సినిమా , ఇలాంటి సినిమాను ప్రభుత్వం ఖండించాలి

Narayana on Pushpa : సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన సినిమా పుష్ప. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకి సీక్వెల్ గా పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న విడుదలైంది. ఈ సినిమా విడుదల కంటే ఒక రోజు ముందు ప్రీమియర్ షోస్ వేశారు. హైదరాబాదులో ఉన్న సంధ్య థియేటర్ లో అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో పాటు ఈ సినిమాకి వచ్చారు. అల్లు అర్జున్ రావడంతో కేవలం టికెట్ కొనుక్కున్న ప్రేక్షకులు మాత్రమే కాకుండా అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఒకేసారి వచ్చేసారు. దీనితో అక్కడ తోపులాట జరిగి రేవతి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రస్తుతం తన కుమారుడు శ్రీధర్ హాస్పిటల్ లో ఉన్నాడు. శ్రీతేజ్ పరిస్థితి కూడా విషమంగానే ఉంది.అల్లు అర్జున్ ఫాదర్ అల్లు అరవింద్ హాస్పిటల్ కి వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శించారు. వాళ్లకు కావాల్సిన వైద్యం ఖర్చు కూడా మేమే భరిస్తామని గతంలో అల్లు అర్జున్ కూడా స్వయంగా చెప్పుకొచ్చారు.


ఈ కేసు విషయంలో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు కూడా చేశారు. అయితే అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ లభించింది. అల్లు అర్జున్ చంచల్గూడా జైలు నుండి ఇంటికి రావడంతో, ఈ తరుణంలో చాలామంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కి సంబంధించిన ప్రముఖులు అల్లు అర్జున్ కలిశారు. దీన్నంతా లైవ్ టెలికాస్ట్ లో చూపించింది మీడియా. ఇక్కడ నుంచి అల్లు అర్జున్ పై విమర్శలు మరింతగా మొదలయ్యాయి. నిన్న తెలంగాణ అసెంబ్లీలో అల్లు అర్జున్ గురించి సీఎం రేవంత్ రెడ్డి మరియు అజారుద్దీన్ పలు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా వీటన్నిటిపై స్పందిస్తూ తనపైన చాలా ఆరోపణలు చేస్తున్నారు అంటూ అల్లు అర్జున్ కూడా ఒక ప్రెస్ మీట్ నిర్వహించి చెప్పాడు. ఇక తాజాగా సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ పుష్ప సినిమా వివాదం గురించి స్పందించారు.

Also Read : Tollywood Heros : టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాలు లేని స్టార్ హీరోలు వీరే..


పుష్ప సినిమా ఒక హీనాతి హీనమైన సినిమా, ఈ సినిమా చూసి అసలు సమాజం ఏం నేర్చుకోవాలి స్మగ్లింగ్ నేర్చుకోవాలా.? అంతేకాకుండా కూర్చుంటే ఓసారి నిలుచుంటే ఒకసారి అనే బూతు పాట కూడా ఈ సినిమాలో ఉంది. ఇటువంటి సినిమాలను ప్రభుత్వం ఖండించాలి. వాళ్లకి మంచి టిక్కెట్ రేట్లు ఇచ్చి ఈ సినిమాని ఎంకరేజ్ చేశారు అంటూ కామెంట్ చేశారు. రేవతి ప్రస్తావన తీసుకొస్తూ ఆమె అల్లు అర్జున్ చూడడానికి రాలేదు కేవలం సినిమా చూడటానికి వచ్చింది అంటూ మాట్లాడారు. ఇటువంటివి ముందు ముందు జరగకుండా ఉండేలా సినిమా నటులు, అలానే సినిమా ప్రేక్షకులు, ప్రభుత్వం కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ చెప్పుకొచ్చారు. ఇక అల్లు అర్జున్ మీడియా ప్రెస్ మీట్ పైన స్పందిస్తూ.. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు కూడా తెలుస్తుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×