E-Paper
Advertisement

YSRCP Manifesto : రేపే వైసీపీ మేనిఫెస్టో.. నవరత్నాలకు మించి ?

YSRCP Manifesto : రేపే వైసీపీ మేనిఫెస్టో.. నవరత్నాలకు మించి ?
Advertisement

YSRCP Manifesto for 2024 Elections(Political news in AP): రెండోసారి అధికారం చేజిక్కించుకోవాలని వైసీపీ.. అధికార పార్టీని గద్దె దించాలని కూటమి పార్టీలు పోటాపోటీగా ఎన్నికల ప్రచారాలు చేస్తున్నాయి. ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటూ.. ఓటర్లను తమవైపు తిప్పుకునే పనిలో పడ్డారు. నిన్నటితో నాలుగో విడత సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. నేటి నుంచి అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన జరగనుంది.

కాగా.. అధికార వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ కు ముహూర్తం ఫిక్సయింది. రేపు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మేనిఫస్టో విడుదల చేస్తారని వైసీపీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేనిఫెస్టోలో.. ఇప్పుడున్న సంక్షేమ పథకాలతో పాటు.. మరికొన్ని హామీలు, ప్రజాకర్షక పథకాలను పొందుపరుస్తారని సమాచారం. వైసీపీ రెండోసారి అధికారంలోకి వస్తే.. ఎలాంటి అంశాలకు ప్రాధాన్యమిస్తుందో కూడా ఈ మేనిఫెస్టోలోనే చెప్పనుంది అధిష్టానం. ముఖ్యంగా రైతులు, యువతకు పెద్దపీఠ వేసినట్లు సమాచారం. చివరి నిమిషంలో మేనిఫెస్టోలో మార్పులు, చేర్పులు జరిగినట్లు తెలుస్తోంది.

Advertisement

Also Read : బాణం ఎక్కుపెట్టిన షర్మిల, జగన్‌ పార్టీకి ఓటేస్తే.. మూడు రాజధానులెక్కడ?

అలాగే నవరత్నాలతో పాటు మరికొన్ని ఆకర్షితమైన పథకాలను మేనిఫెస్టోలో చేరుస్తారని సమాచారం. ఈ మేనిఫెస్టో నవరత్నాలకు మించి ఉంటుందని తెలుస్తోంది. ఏప్రిల్ 28 నుంచి సీఎం జగన్.. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయనున్నారు. ప్రతిరోజూ 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. సిద్ధం సభలు, మేమంతా సిద్ధం యాత్రలతో వైసీపీ నేతల్లో కొత్త జోష్ వచ్చింది.

Advertisement

28న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు, 29న.. చోడవరం, పి.గన్నవరం, పొన్నూరు, 30న కొండెపి, మైదుకూరు, పీలేరు, మే1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరు జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఒక ప్రకటనలో తెలిపారు.

Tags

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×