E-Paper
Advertisement

NTR in War 2: వార్ 2 సెట్స్‌లోకి దేవర.. 10 రోజులు అక్కడే..

NTR in War 2: వార్ 2 సెట్స్‌లోకి దేవర.. 10 రోజులు అక్కడే..
Advertisement

NTR in War 2 Sets: ఎన్టీఆర్ సినిమా కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అతడు ‘దేవర’తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్ గ్లింప్స్ సినిమాపై ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా గ్లింప్స్‌లో ఎన్టీఆర్ మాస్ లుక్, యాక్షన్ సీన్స్ సినీ ప్రియుల్ని ఉర్రూతలూగించాయి.

దీంతో దేవరపై మరింత బజ్ ఏర్పడింది. ఈ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా.. మొదటి పార్టు అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. అయితే ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ మరో మూవీ కూడా చేస్తున్నాడు. బాలీవుడ్ మూవీ ‘వార్ 2’లో కూడా నటిస్తున్నాడు. ఈ మూవీతోనే ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆర్ఆర్ఆర్‌తో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ అందుకున్న ఎన్టీఆర్‌ ఇప్పుడు బాలీవుడ్‌లో తన హవా కొనసాగించాలనుకుంటున్నాడు.

Advertisement

ఈ మూవీలో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తుండగా.. ఎన్టీఆర్ మరో హీరోగా ఉంటారా?.. లేక విలన్ పాత్ర చేస్తారా అనేది తెలియరాలేదు. అయితే తారక్ ఈ మూవీ షూటింగ్ సెట్స్‌లో పాల్గొంటాడంటూ ఎప్పట్నుంచో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇప్పుడు మరోవార్త వైర‌ల్‌‌గా మారింది. బాలీవుడ్‌లో వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ఈ శుక్రవారం అంటే రేపట్నుంచి ఎన్టీఆర్ ‘వార్2’ షూటింగ్‌లో పాల్గొంటారని టాక్ వినిపిస్తోంది.

Also Read: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’.. ఈ సారి భయపెట్టిందంటారా.. చూద్దాం రండి..!

Advertisement

ముంబైలోని యష్ రాజ్ ఫిలిమ్స్ స్టూడియోలో 10 రోజుల పాటు జరగనున్న షెడ్యూల్‌లో ఎన్టీఆర్ హాజరుకాబోతున్నారని సమాచారం. అయితే ఈ షెడ్యూల్‌లో హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ మధ్య కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

ఇకపోతే ఈ మూవీలో ఎన్టీఆర్ ‘రా’ ఏజెంట్‌గా నటిస్తున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది 2025లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత బాలీవుడ్‌లో ఎన్టీఆర్‌తో సింగిల్‌గా మరో సినిమా ఉండబోతుందని టాక్ నడుస్తోంది. ఇక ఏది ఏమైనా వార్ 2 షూటింగ్ అప్డేట్‌తో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×