Jagapathi Babu’s Surgery: జగపతి బాబు ….ఇప్పుడంటే విలన్ రోల్స్, సైడ్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు కాని ఒకప్పుడు ఫ్యామిలీ అండ్ లేడీస్ కి ఫేవరేట్ హీరో.ఇక తాజగా బుచ్చి బాబు దర్శకత్వంలో వచ్చిన పెద్ది సినిమాలో అప్పల సూరి అనే పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు కూడా.
ఇక ఇదిలా ఉంటే తాజాగా తన ఇంస్టా లో పెట్టిన ఒక వీడియో ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఈ వీడియోలో తన పెద్ద కూతురితో చాకొలేట్ చిప్ కుకీస్ తయారు చేస్తూ తెగ హడావిడి చేశాడు జగపతి .అయితే ఈ వీడియో లో మొదట్లో జగపతి మాట్లాడుతూ నా మొహం పగలగొట్టినట్టు ఉందా ..?ఎవరూ పగలగొట్టలేదు సర్జరీ చేయించుకున్నా అనడంతో ఒక్క సారిగా ఆరాలు తీయడం మొదలెట్టారు.
అసలేమై ఉంటుంది ?
అసలు జగపతి ఎందుకు మొహానికి సర్జరీ చేయించుకున్నాడు,అసలేమై ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో డిబేట్లు పెట్టేస్తున్నారు.అయితే కొందరు ఈ జగపతి కామెంట్స్ పై రియాక్ట్ అవుతూ పెద్ది సినిమా కోసం ప్రోస్థటిక్ మేకప్ వేయించుకున్నాడు కదా ,దాని వాళ్ళ వచ్చిన రియాక్షన్ వలన ఏమైనా సర్జరీ చేయించుకున్నాడెమో అంటూ డిబేట్లు పెడుతున్నారు.ఇక మరి కొంతమంది ఏమైనా జరగరానిది జరిగిందా ఏంటి అంటూ డిస్కషన్స్ మొదలెట్టారు.చూడాలి మరి జగ్గు భాయ్ అసలు సర్జరీ ఎందుకు చేయించుకున్నాడో ఏంటో స్వయంగా అతను రివీల్ చేస్తే కాని తెలిసేలా లేదు.
కెరీర్ విషయానికి వస్తే
ఇక జగపతి బాబు కెరీర్ విషయానికి వస్తే …1989లో సింహస్వప్నం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన జగ్గు ఆ తర్వాత పెద్దరికం,గాయం, శుభలగ్నం,పెళ్లి పందిరి,మావి చిగురు, మనోహారం,హనుమాన్ జంక్షన్ వంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు,అయితే క్రమక్రమంగా కొత్త హీరోలు రావడం, చేసిన సినిమాలన్నీ వరుసగా పోవడంతో విలన్ పాత్రలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు జగ్గు.
వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో 2014లో వచ్చిన లెజెండ్ సినిమాని. ఈ సినిమానే మళ్ళీ జగపతిని సినీ ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా చేసింది.ఇక ఆ తర్వాత ఆయన వెనక్కి చూసుకునే అవసరమే లేకుండా పోయింది.అలా శ్రీమంతుడు,నాన్నకి ప్రేమతో, రంగ స్థలం, అరవింద సమేత, మహర్షి, వంటి సినిమాలతో జగపతి 2.oని మరోసారి ఆడియన్స్ కి పరిచయం చేశాడు.
అలా సినిమాలు చేస్తూనే మరో వైపు పరంపర అనే వెబ్ సిరీస్ లు, ఇంకో వైపు జయమ్ము నిశ్చయమ్మురా వంటి ప్రోగ్రామ్స్ తో దూసుకుపోతున్నాడు జగ్గు భాయ్.
చూడాలి మరి ముందు ముందు అసలు సర్జరీ ఎందుకు అయింది , ఏంటి అనే విషయాలని అభిమానులతో పంచుకుంటాడో లేదో !