E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : సుమ్మూ డార్లింగ్ ఏంటి చిరాగ్గా? సంజనాకు సుమన్ శెట్టి మాస్ కౌంటర్

Bigg Boss 9 Telugu : సుమ్మూ డార్లింగ్ ఏంటి చిరాగ్గా? సంజనాకు సుమన్ శెట్టి మాస్ కౌంటర్
Advertisement

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టింది మొదలు ఈ వారం నామినేషన్ల వరకూ సంజన ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా రీతూపై నోరు పారేసుకుని దారుణంగా ట్రోలింగ్ కు గురవుతోంది. అయితే అంతకంటే ముందే సుమన్ శెట్టి ఆమెకు ఇచ్చిపడేశాడు, కానీ ఇన్ డైరెక్ట్ గా.

అసలు విషయం ఏమిటంటే.. 

బిగ్ బాస్ సీజన్ 9లో 12వ వారం నామనేషన్లలో మామూలుగా గొడవలు జరగలేదు. అందులో రీతూ – సంజన గొడవ ఒకటి. హౌస్ లో రాత్రి పూట డెమోన్ ను హత్తుకుని కూర్చుంటావు. చూడలేకపోతున్నాము అంటూ సంజన టంగ్ స్లిప్ అయ్యింది. దీంతో హౌస్ మేట్స్ మొత్తం ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆమె అలా అనడం తప్పని ఇమ్మాన్యుయేల్ తో సహ అందరూ ఖండించారు. అసలే వీకెండ్ లో శివగామి అనే ట్యాగ్ వచ్చింది కదా అనుకుందో ఏమోగానీ.. నా మాటే శాసనం అన్నట్టుగా ఒక్కరి మాటను కూడా వినలేదు సంజన. నోటికి పని చెప్పి అడ్డంగా బుక్కయ్యింది. అనవసరంగా పవర్ అస్త్రాను వాడి, అమ్మను సేవ్ చేశానా అని ఇమ్మూ కూడా ఫీల్ అయ్యే రేంజ్ లో స్టంట్ చేసింది సంజన.

Advertisement

ఇక అసలు విషయంలోకి వెళ్తే.. మొదటి వారం నుంచి హౌస్ లో సంజన వల్ల హార్మనీ దెబ్బతింటుంది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు డెమోన్ కెప్టెన్ అయితే… పెళ్ళికాని అమ్మాయిల చుట్టే తిరుగుతాడు. మేము ఆంటీలము కదా పట్టించుకోవట్లేదు అంటూ అనకూడని మాటలు అన్నది. కానీ ఆమె మాత్రం సుమ్మూ డార్లింగ్ అంటూ సరదాగా ఉండడానికి ట్రై చేస్తుంది. ఇదే విషయాన్ని ఈ వారం నామినేషన్లలో సుమన్ చెప్పాడు. సుమ్మూ డార్లింగ్ అని ఆమె పిలవడం నాకు ఇరిటేటింగ్ గా ఉంది. నాకే కాదు హౌస్ లో ఎవ్వరికీ నచ్చట్లేదు. అలాగే ఆమె వల్ల హౌస్ హార్మని దెబ్బ తింటుంది అని ప్రైవేట్ నామినేషన్లలో చెప్పాడు. అదే డైరెక్ట్ గా చెప్పి ఉంటే ఈరోజు ఎపిసోడ్ లో సుమన్ శెట్టి హీరో అయిపోయేవాడు.

ఇదే మొదటిసారి కాదు 

ఇప్పుడు నామినేషన్ లలో సుమన్ శెట్టి ఇన్ డైరెక్ట్ గా చెప్పి ఉండవచ్చు. కానీ రీసెంట్ ఎపిసోడ్ లలో కూడా సంజన సుమ్మూ డార్లింగ్ అంటే… “ఏంటి సంజన సిస్టర్” అంటూ తన మనసులోని మాటను బయట పెట్టకుండానే మాస్ కౌంటర్ ఇచ్చాడు సుమన్ శెట్టి. ఈ పరిణామాలన్నీ చూశాక సంజనకు గెట్ అవుట్ టికెట్ ఖాయమని అంటున్నారు బిగ్ బాస్ ప్రియులు.

Advertisement

Read also : భరణికి బుర్రపాడు షాక్ ఇచ్చిన తనూజ – దివ్య… డెమోన్ వర్సెస్ కళ్యాణ్… ఈ వారం నామినేషన్లు రప్పా రప్పా

 

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×