Big Stories

Social Media : సోషల్ మీడియాను మించిన ఆయుధం లేదు.. దానంత దరిద్రమూ లేదు

Praneeth Hanumanthu Video Chat in Social media : సరిగ్గా ఉపయోగిస్తే సోషల్ మీడియాను మించిన ఆయుధం లేదు. కానీ తప్పుగా ఉపయోగిస్తే దానంత దరిద్రమూ ఇంకొకటి లేదు. నిజానికి ప్రస్తుతం సోషల్ మీడియా ఎంత దారుణంగా ఉంటుందో రోజూ చూస్తూనే ఉన్నాం. నచ్చని వాళ్లపై ద్వేషాన్ని స్ప్రెడ్ చేయడం, నెగెటివిటీ పెంచడం. లేడీస్‌పై ఇష్టమొచ్చినట్లుగా పోస్టులు చేయడం, సెలబ్రెటీలను బూతులు తిట్టడం. ఇలా సోషల్ మీడియాలో జరిగే అకృత్యాలకి అడ్డు అదుపే లేకుండా పోయింది. కనీసం చిన్న పిల్లలు అనే ఇంగితం కూడా లేకుండా వారిపై కూడా సోషల్ మీడియాలో డబుల్ మీనింగ్ ట్రోల్స్, మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు కొంతమంది దరిద్రులు.

- Advertisement -

ఎవరు ఎటు పోతే ఏంటి.. అతనికి వ్యూస్ కావాలి. అతని పర్వర్షన్ హైలైట్ కావాలి. అందుకు ఏమైనా చేస్తారు.. ఎంతకైనా తెగిస్తారు. సభ్య సమాజంతో పని లేదు.. తమ మైండ్‌లో ఉన్న చెత్తనంతా సోషల్‌మీడియాలోకి డంప్ చేస్తారు. పగలబడి నవ్వుకుంటారు. అందుకు తండ్రీకూతుళ్ల పవిత్ర బంధాన్ని కూడా వాడుకుంటారు. సోషల్ మీడియా ఎంత వికృతంగా తయారైందో.. ఇన్‌ఫ్లూయెన్సర్ల ముసుగులో ఎలాంటి నరరూప రాక్షసులు ఉన్నారో మరోసారి తెరపైకి వచ్చింది.

- Advertisement -

Also Read : ‘రియల్’ రాబందులకు రైతుబంధు పైసల్

చూశారుగా ప్రణీత్ హనుమంతు వీడియో చాటింగ్. అందులో అతని తూతుంబర్ బ్యాచ్ చేసిన కామెంట్స్. వీళ్ల వల్గర్ కామెంట్స్ ఎంత దిగజారాయో. వాళ్ల సంభాషణ చూసినవాళ్ల మైండ్ ఎలా మారిపోతుంది. ఇప్పుడు సోషల్ మీడియా మైనర్ల చేతిలోకి కూడా వచ్చేసింది. వాళ్లపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ఈ వీడియోలో తండ్రీకూతుళ్ల గురించి అసభ్యంగా మాట్లాడిన ప్రణీత్ హనుమంతు బ్యాచ్.. తమ పిల్లల విషయంలోను అలాగే బిహేవ్ చేస్తారా? ఇలాగే.. వికృతానందం పొందుతారా ? టీమిండియాకు టి.20 వరల్డ్‌కప్ తీసుకొచ్చిన కెప్టెన్ రోహిత్‌శర్మ కూడా వీళ్లకు లోకువే. ఎంత దారుణమైన వీడియో చేశారో చూడండి.

చిన్నపిల్లలపై వీళ్ల పైశాచిక కామెంట్స్ పై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. యాక్టర్ సాయి ధరమ్ తేజ్ ట్వీట్ తో మొత్తం ఇండస్ట్రీ దీనిపై డిబేట్ చేసింది. దీంతో సీఎం రేవంత్ దీనిపై సీరియస్ అయ్యారు.. వెంటనే నిందితులపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. మరి అరెస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా..? కానే కాదు.. ఎందుకంటే దొరికింది ఒక్కరే. ఇలాంటి బ్యాచ్ కుప్పలు తెప్పలుగా ఉన్నారు. వీరు చేసే అరాచకాలకు అనేక మంది ఇన్ల్ఫూయెన్స్ అవుతున్నారు. ఈ పరాకాష్టకు తోడు చిన్న పిల్లలపై అఘాయిత్యాలు. చిన్న పిల్లల్ని బయటకు పంపించాలంటే వణికిపోతున్నారు పేరెంట్స్. అయినా చిన్న పిల్లలపై వర్గర్ లాంగ్వేజ్ ఏంటీ బుద్ధి లేకపోతే సరి.

చిన్న పిల్లలపైనే కాదు.. సోషల్ మీడియాలో ఏది పెట్టిన ఇప్పుడు వైరలే అవుతోంది. పెరుగుతున్న టెక్నాలజీతో ప్రపంచంలో ఎక్కడేం జరిగినా క్షణాల్లో తెలుస్తోంది. దీనికి తోడు టాపిక్‌ ఏదైనా.. మన ఓపినియన్‌ను ఎంచక్కా చెప్పుకునే ఫ్రీడమ్ ఉంది. ట్రెండ్‌కు తగ్గట్టు మారడం.. సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం పెద్ద తప్పేమీ కాదు. కానీ ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనో.. ఏం అన్నా తమనేం చేయలేరన్న ధీమా వచ్చేస్తుందో అప్పుడు అన్నీ అదుపు తప్పుతాయి. కామెంట్లు కంట్రోల్ తప్పుతాయి. లేటెస్ట్ గా జరిగింది కూడా అదే.

Also Read : పల్నాడులో పదవుల లొల్లి.. అసంతృప్తి నేతలకు లోకేష్ హామీ

ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు ఇంతలా దిగజారి మాట్లాడుతున్నారు? వాట్సాప్ , ట్విట్టర్ , ఫేస్బుక్ , యూట్యూబ్ ఇలా ప్లాట్‌ఫామ్‌ ఏదైనా సరే. అన్నింటినీ నెగిటివ్ కోణంలోనే చూస్తున్నారు. ఏదైనా పోస్టు పెడితే దానికి బాధ్యతాయుతంగా కామెంట్ చేసేవారు ఎంతమంది? అయితే బూతుపురాణం.. లేదంటే క్యారెక్టర్ అసోసియేషన్. అదీ కాకపోతే అంతకుమించిన అలిగేషన్స్ చేయడం. అంతేకాని ఆ పోస్టు దేని గురించి.. ? అది నిజమేనా? కాదా? అని ఫ్యాక్ట్ చేసుకునేది లేదు. చేతిలో ఫోన్ ఉంది కదా అని.. రెచ్చిపోవడం మాత్రమే జరుగుతోంది.

పచ్చి బూతులతో నిండిపోతున్న పోస్టులను చూస్తే అసలు వారు చదువుకున్న వారేనా అన్న డౌట్‌ రాక మానదు. ఎందుకంటే సోషల్ మీడియా ఉపయోగిస్తున్నారంటేనే కాస్తో కూస్తో చదువుకున్నవారై ఉంటారు. మరి వారికి ఆ చదువు నేర్పిన సంస్కారం ఇదేనా ? ఎదురుగా లేరు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నొచ్చుకునే మనసులు ఉంటాయి. మొన్నటికి మొన్న ఓ తల్లి పిల్లల పట్ల నిర్లక్ష్యం వహించిందని ట్రోల్ చేశారు. ఆ ట్రోల్స్ భరించలేక ఆ తల్లి చనిపోయింది. అంతకు ముందు గీతాంజలి అనే మహిళ. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది ట్రోల్స్ కి బలవుతున్న వారే. అసలు బూతులు తిట్టే హక్కు ఎవరిచ్చారు ? ఇలాంటి బూతు, రోత కామెంట్లు పెట్టే హక్కు ఎవరిచ్చారు ? ఒక్కసారి ఆలోచించండి. బాధ్యతగా మెలగండి. అన్నింటికంటే ముందు మనం మనుషులమని గుర్తించండి. ఎదుటి వారికి కనీస గౌరవం ఇవ్వాలన్న ఇంగిత జ్ఞానాన్ని మరవకండి. దయచేసి ఇకనైనా మారండి.. సోషల్‌మీడియాలో కాస్త సంస్కారం చూపించండి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News