Deputy CM Pawan Kalyan: పేరు వాడి పరువు తీస్తే తాట తీస్తా. ఇదీ అప్పట్లో పవన్ కళ్యాణ్ ఒక DFO విషయంలో చేసిన కామెంట్. మరి ఆమాటలు నిజం కాలేదు ఎందుకని? ఇంతకీ ఆ కామెంట్ డీటైల్స్ ఏంటి? ఎందుకలా అనాల్సి వచ్చింది. ప్రస్తుతం డీసీఎం ఆదేశాలు ఎక్కడి వరకూ వచ్చాయి? ఉపముఖ్యమంత్రి ఉగ్ర రూపం వెనక దాగిన ఆగ్రహం ఎలాంటిది?
2024, అక్టోబర్ 8న కాకినాడ DFOగా రవీంధ్రనాథ్ రెడ్డి
ఉప ముఖ్యమంత్రి ఒక అధికారి విషయంలో ఆగ్రహం. ఏదో ఫ్లోలో ఒక మాట అన్నారు. అంతేగా అని లైట్ తీస్కోడానికి లేదట. ఇంత పెద్ద సభలో.. ఒక అధికారి విషయంలో అలాంటి కామెంట్ చేయడం వెనక బ్యాగ్రౌండ్ చాలా పెద్దగానే ఉందట. కాకినాడ జిల్లా, అటవీ శాఖ అధికారిగా డీ. రవీంద్రనాథ్ రెడ్డి నియామకం.. 2024 అక్టోబర్ 8వ తేదీన జరిగింది. అటవీశాఖ అధికారిగా బాధ్యతలు తీస్కున్న రవీంద్రనాథ్ రెడ్డి.. రెండు రోజుల తర్వాత మైనింగ్ వ్యాపారులను బెదిరించారట. తనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీతో పరిచయాలున్నాయని అన్నారట.
డిప్యూటీ సీఎం పేషీతో పరిచయాలన్నాయంటూ లంచాల డిమాండ్లు
అక్కడితో ఆగక పెద్ద ఎత్తున లంచం డిమాండ్లు చేశారట. ఈ విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ ఆయనపై విచారణకు ఆదేశించడం మాత్రమే కాదు సభా ముఖంగానే తన అభిప్రాయమేంటో కుండ బద్దలు కొట్టారు. ఉప ముఖ్యమంత్రి స్థాయిలో పవన్ ఇంత పెద్ద ఎత్తున విచారణకు ఆదేశాలు జారీ చేసినా.. రవీంద్ర నాథ్ రెడ్డి DFOగా యధేచ్చగా కొనసాగుతున్నారట. అంతే కాదు.. ఈ విచారణ తాలూకూ నివేదికలు సైతం బయటకు రావడం లేదట.
దీన్నిబట్టీ DFOకి DCM పేషీతో లింకులున్నట్టేనా?
ఇక్కడ సమస్య ఏంటంటే.. విచారణ నివేదిక విడుదలయ్యి ఈ పాటికే సదరు అధికారి పోస్టింగ్ ఊస్ట్ కావ్వాల్సి ఉంది. కానీ, ఇక్కడెలాంటి చడీ చప్పుడు లేదట. దీన్నిబట్టీ.. ఈ ఆఫీసర్ కి DCM పేషీలో పరిచయాలున్నట్టేనా? అంటూ కొందరు సిబ్బంది మాట్లాడుకుంటున్నారట. ఒక వేళ.. అలాంటిదేమీ లేదంటే.. ఈ పాటికే రిపోర్టొచ్చి.. అధికారి పై చర్యలుండాలిగా? అవి ఏవీ? అంటూ లోగొంతుకతో ప్రశ్నిస్తున్నారట.
ఫిర్యాదు ఎవరికి వచ్చింది? ఆదేశాలు ఎవరికి జారీ చేశారు?
DFO వచ్చిన రెండు రోజులకే.. లంచాల పిర్యాదు వచ్చింది సరే. ఇలాంటి అధికారులు మన ప్రభుత్వంలో.. మరీ ముఖ్యంగా తన అటవీ శాఖలో ఉండొద్దని ఆ శాఖా మంత్రి కూడా అయిన పవన్ కళ్యాణ్ భీకర కామెంట్ చేశారు బాగానే ఉంది. మరి ఆ ఫిర్యాదు ఎవరికి వచ్చింది? ఈ అధికారిపై చర్యలు.. తీసుకోమని ఎవరిని ఆదేశించారు? ఒక వేళ అదే జరిగి ఉంటే, ఆ అధికారి ఇంకా విధుల్లో ఎలా కొనసాుతున్నారు? ఇదే ఇప్పుడు అటవీశాఖ వ్యాప్తంగా చర్చ సాగుతోందట.
పవన్ కామెంట్ వీడియోను అధికారి ఫోటోలతో ట్రోల్ చేస్తున్న కొందరు
డిప్యూటీ సీఎం హోదాలో పవన్ చేసిన ఆదేశాలకే అతీ గతీ లేకుంటే. ఇక మిగిలిన వారి పరిస్థితి ఏమిటి? నిజంగానే ఆ అధికారి లంచాల బెదిరింపులకు పాల్పడి ఉంటే.. అందుకు తగిన ఆధారాలేవీ? ఈ విషయంపై ఒక క్లారిటీ రావల్సి ఉందంటున్నారు అటవీ సిబ్బంది.
ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు బేఖాతర్ చేస్తున్నదెవరు?
అప్పట్లో పవన్ చేసిన కామెంట్లను రవీంద్రనాథ్ రెడ్డి ఫోటోలను లింక్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారట కొందరు. మనల్ని ఎవర్రా ఆపుతోందంటూ ట్రోల్ చేస్తున్నారట. గతంలో రాష్ట్ర స్థాయిలో ఎంతో కీలకంగా ఉన్న అధికారులను నిమిషాల్లో మార్చేసిన పవన్ కళ్యాణ్ తన శాఖ వరకూ వచ్చేసరికి .. ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్ధం కావడం లేదని ఆయన పని చేస్తున్న కార్యాలయంలోనే గుసగుసలు వినిపిస్తున్నాయట. పవన్ ఆదేశాలను బేఖాతర్ చేస్తున్నదెవరు? రవీంద్రనాథ్ రెడ్డి విషయంలో.. ఏం జరిగింది? అన్నది చర్చనీయాంశంగా మారిందట.
ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ లో, సెక్రటేరియట్ లో చక్రం తిప్పిన DFO?
కొందరు చెబుతున్నదాన్ని బట్టీ చూస్తే ఈ వ్యవహారంలో భారీ ఎత్తున నగదు చేతులు మారినట్టు భావిస్తున్నారు. అదీ కాకుంటే, ఇటు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ లో కానీ, అటు సెక్రటేరియట్ లో కానీ సీనియర్ అధికారుల ద్వారా రవీంద్రనాథ్ రెడ్డి చక్రం తిప్పి ఉండొచ్చనీ చెప్పుకుంటున్నారు.
ప్రజల్లోకి ఇదెలాంటి సంకేతాలను తీస్కెళ్తుంది?
అవినీతి మాటే వద్దంటున్న పవన్ కళ్యాణ్ నిర్వహించే శాఖలోనే ఇలాంటి అధికారులుంటే వారిని ఏరిపారేయడంలో ఇంత ఆలస్యమేంటి? ఒక శాఖా మంత్రి సభా ముఖంగా చెప్పిన మాటను సంబంధిత అధికారులు లెక్కలోకి తీసుకోవడం లేదు కారణమేంటి? ప్రజల్లోకి ఇదెలాంటి సంకేతాలను తీస్కెళ్తుంది? అన్నది చర్చనీయాంశంగా మారిందట.