John Cena: డబ్ల్యూ డబ్ల్యూ ఈ సూపర్ స్టార్ జాన్ సీనా ( WWE superstar John Cena ) గురించి తెలియని వారు ఉండరు. దాదాపు 20 సంవత్సరాలుగా డబ్ల్యు డబ్ల్యు ఈ టోర్నమెంటులో రాణిస్తున్నాడు జాన్ సీనా. చదువురాని వారు కూడా జాన్ సీనా ను గుర్తిస్తారు. అంతలా జాన్ సీనా ఫేమస్ అయ్యాడు. అలాంటి డబ్ల్యు డబ్ల్యు ఈ సూపర్ స్టార్ జాన్ సీనా అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. డబ్ల్యూ డబ్ల్యూ ఈ ( WWE) సూపర్ స్టార్ జాన్ సీనాకు .. క్యాన్సర్ సోకిందట. కొన్ని రోజుల పాటు క్యాన్సర్ బారిన పడి చాలా ఇబ్బందులు పడ్డాడట జాన్ సీనా. ఈ విషయాన్ని స్వయంగా… జాన్ సీనా వెల్లడించడం జరిగింది. గతంలో తాను స్కిన్ క్యాన్సర్ ( Skin Cancer)) బారిన పడినట్లు.. తాజాగా జాన్ సీనా పేర్కొనడం జరిగింది.
Also Read: IPL 2025: KKR కోట కూల్చిన ముంబై కుర్రాడు.. ఎవరీ అశ్వని కుమార్!
తాను ఒకానొక సమయంలో డెర్మటాలజిస్ట్ (Dermatologist ) వద్దకు వెళ్లానని… ఈ నేపథ్యంలోనే తనకు చర్మ క్యాన్సర్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించాలని జాన్ సీనా పేర్కొన్నారు. ఆ విషయం బయట పడడంతో ఒక్కసారిగా తన కుటుంబం కూడా ఆందోళనకు గురైందని వివరించాడు. అయితే ఆ విషయంలో తాను ఎక్కడ భయపడలేదని స్పష్టం చేశారు. అయితే వైద్యుల చికిత్స కారణంగా… తాను ఆ రోగం నుంచి బయటపడినట్లు కూడా తెలిపారు. వైద్యులు నా స్కిన్ కింది నుంచి క్యాన్సర్ కనతులను తొలగించినట్లు చెప్పుకొచ్చాడు.
డబ్ల్యూ డబ్ల్యూ ఈ మ్యాచ్ ల సందర్భంగా తన శరీరంపై… క్యాన్సర్ కు ( Cancer) సంబంధించిన గుర్తులను కూడా గమనించవచ్చని స్పష్టం చేశాడు జాన్ సీనా ( WWE superstar John Cena ). ఆ క్యాన్సర్ మహమ్మారిపై పోరాడే సందర్భంలో కఠిన సవాళ్లు కూడా ఎదుర్కొన్నట్లు… చాలా బాధలు అనుభవించాల్సి వచ్చిందని కూడా… చెప్పుకొచ్చాడు. క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన రోగాల నుంచి జనాలు బయటపడాలని… కోరాడు జాన్ సీనా ( WWE superstar John Cena ). ఈ వ్యాధిని ముందే గుర్తించాలని… లేకపోతే ప్రమాదం ఉంటుందని హెచ్చరించాడు. తాను ముందే గుర్తించడంతో… ప్రాణాలతో బయటపడినట్లు కూడా చెప్పుకొచ్చాడు.
ఇది ఇలా ఉండగా జాన్ సీనా ( WWE superstar John Cena )… అమెరికాకు చెందిన వాడన్న సంగతి తెలిసిందే. 1997 సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీన.. యునైటెడ్ స్టేట్లో జన్మించాడు. అతని ఏజ్ ప్రస్తుతం 47 సంవత్సరాలు ఉంటుంది. 114 కిలోలు బరువు అలాగే 1.85 మీటర్ల పొడవు ఉంటాడు. మిస్టర్ మనీ ఇన్ ద బ్యాంక్, ది చాంప్, ద చైన్ గ్యాంగ్ సోల్జర్, ఇలాంటి పేర్లు జాన్ సీనా కు ఉన్నాయి. అలాగే డబ్ల్యూ డబ్ల్యూ ఈ లో చాలాసార్లు ఛాంపియన్ గా నిలిచాడు జాన్ సీనా ( WWE superstar John Cena ).
Also Read: Rayudu on Rahul Dravid: వీల్ చైర్ పై ద్రావిడ్… అంబటి రాయుడు హాట్ కామెంట్స్ ?