E-Paper
Advertisement

క్యాంపస్ హబ్ AI ప్రొడక్ట్ లాంచ్‌లో కేటీఆర్.. గ్రామీణ యువతపై ప్రశంసల జల్లు

క్యాంపస్ హబ్ AI ప్రొడక్ట్ లాంచ్‌లో కేటీఆర్..  గ్రామీణ యువతపై ప్రశంసల జల్లు
Advertisement

KTR on AI: స్వేచ్ఛ బ్యూరో: మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని పుణికిపుచ్చుకుంటూ యువత ముందడుగు వేయాలని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. నానక్‌రామ్‌గూడలోని షెరటాన్ హోటల్‌లో సోమవారం జరిగిన ‘క్యాంపస్ హబ్ AI’ ప్రొడక్ట్ లాంచ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

యువత ముందడుగు వేయాలి

Advertisement

గ్రామీణ ప్రాంతాలకు చెందిన నలుగురు యువకులు కలిసి క్యాంపస్ హబ్ఏఐని ప్రారంభించడం ఎంతో అభినందనీయమని, నేటి సమాజానికి ఇలాంటి యువతే ఆదర్శమని పేర్కొన్నారు. యువత ఆలోచనలు గొప్పగా ఉండాలని, అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఎదగాలని ఆకాంక్షించారు. గతంలో తెలంగాణలో ఐటీ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని, ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తోందని తెలిపారు. ల్యాండ్‌లైన్ల నుంచి స్మార్ట్‌ఫోన్ల వరకు టెక్నాలజీ ఎంతో వేగంగా మారింది. రాబోయే కాలమంతా ఏఐదే కీలక పాత్ర అని, ఇప్పటికే డ్రైవర్‌లెస్ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయని చెప్పారు.

ఏఐభూతం కాదు… దూత

Advertisement

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవాళికి ఒక దూతం లాంటిదని, విద్యావ్యవస్థలోనూ టెక్నాలజీ ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు. గతంలోనే వ్యవసాయ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఫర్ అగ్రికల్చర్ ఇన్నోవేషన్ ‘ పేరిట సిరిసిల్లలోని ఒక గ్రామంలో AI ఆధారిత ప్రాజెక్టును చేపట్టి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశామని గుర్తుచేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఐటీ

ఐటీ కంపెనీల ఏర్పాటుకు హైదరాబాద్ ఒక్కటే కేంద్రంగా ఉండాల్సిన అవసరం లేదని, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు. పరకాలలో రాకేష్ అనే యువకుడు ఐటీ కంపెనీ నెలకొల్పడం గొప్ప విషయమన్నారు. ప్రభుత్వం కూడా ఏఐ సాంకేతికతను ప్రోత్సహించాలని, అదే సమయంలో దీనిని దుర్వినియోగం చేయకుండా అవసరమైన చోటే ఉపయోగించాలని కోరారు.అధికారంలోకి వచ్చాక ఏఐకి ప్రాధాన్యం:** రెండేళ్ల తర్వాత కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక అన్ని ప్రభుత్వ శాఖలకు ఏఐ ని అనుసంధానం చేస్తామని, ప్రతి రంగంలోనూ దీనికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఐటీ రంగాన్ని మరింత విస్తరిస్తామని స్పష్టం చేశారు.

Also Read: మురసు తుఫాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం.. 45 వేల మందితో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

Tags

Related News

ఎమ్మెల్యే మల్లారెడ్డికి హైడ్రా బిగ్ షాక్.. ఫామ్‌హౌస్‌ ప్రహరీ గోడ కూల్చివేసిత!

కన్‌స్ట్రక్షన్లకు మంచినీళ్లు వాడుతున్నారా.. జలమండలి మరో మాస్టర్ ప్లాన్!

కీసర, మేడ్చల్ లో పేదల భూములపై అక్రమార్కుల కన్ను..!

గద్వాల పట్టణంలో షాకింగ్ ఘటన.. ప్రభుత్వ బడి భవనం తీవ్ర శిథిలం!

జహీరాబాద్ కో-ఆప్షన్ ఎన్నికల వివాదం.. హైకోర్టుకు కౌన్సిలర్ నామ స్రవంతి?

ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై సీఈవోతో కవిత భేటీ.. గడువు పెంపునకు విజ్ఞప్తి!

జూపాక గ్రామంలో సివిల్ రైట్స్ డే రద్దు.. ప్రజావాణిలో ఫిర్యాదు!

Big Stories

Advertisement
×