E-Paper
Advertisement

ఆప్ ను అందలమెక్కించిన ఢిల్లీ విద్యా విప్లవం..! సర్కారీ విద్యకు అత్యధిక ప్రాధాన్యం..! భారీ సంస్కరణలతో మంచి ఫలితాలు.. పంజాబ్ లో గెలుపుకీ దోహదం!

ఆప్ ను అందలమెక్కించిన ఢిల్లీ విద్యా విప్లవం..! సర్కారీ విద్యకు అత్యధిక ప్రాధాన్యం..! భారీ సంస్కరణలతో మంచి ఫలితాలు.. పంజాబ్ లో గెలుపుకీ దోహదం!
Advertisement

సంక్షేమ పథకాలు.. అధికారాన్ని కట్టబెట్టడం మామూలే. ఉచితాలు ఓటర్లను ఆకర్షించి.. గెలుపు తీరాలకు చేర్చడాన్నీ చూశాము. కానీ సర్కారీ విద్య బలోపేతం చేస్తే.. అధికారం దక్కుతుందా? గవర్నమెంట్‌ చదువుల విధానంలో సంస్కరణలు ప్రవేశపెడితే సీఎం అవుతారా? ప్రభుత్వ విద్యకు అత్యధిక ప్రయార్టీ ఇచ్చి ఎక్కువ నిధులు కేటాయిస్తే… పవర్‌లోకి వస్తారా? అవును.. ఇది సాధ్యమే. దీన్ని నిజం చేసి చూపింది ఆప్‌ పార్టీ.

అర్వింద్‌ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేందుకు కంకణం కట్టుకున్నది. ప్రధానంగా విద్య, వైద్యంపైనే ఫోకస్ పెట్టింది. అందులోనూ సర్కారీ విద్యలో సమూల మార్పులు చేయడంతో పాటు సంస్కరణను చేపట్టింది. అత్యధిక నిధులు కేటాయించింది. మంచి ఫలితాలను రాబట్టింది. అంతే.. జనంలో ఓ విశ్వాసం.

Advertisement

అప్పటి దాకా ప్రైవేటు బడులకు లక్షలు లక్షలు ఫీజులు కట్టే తల్లిదండ్రుల చూపు సర్కార్‌ బడులపై పడింది. దాదాపు రెండున్నర లక్షల మంది విద్యార్థులు .. ప్రైవేటును వదిలి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారంటే .. ఈ సంస్కరణల పర్వం ఎంతలా ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. ఆప్‌ను ఢిల్లీలో మూడోసారి అధికారంలోకి తీసుకురాగలిగింది ఈ సంస్కరణల బాటే.

అంతే కాదు.. ఆప్‌ పార్టీ పంజాబ్‌లో తొలిసారి పోటీ చేసే క్రమంలో తమ ‘ఢిల్లీ విద్యా విప్లవం’ గురించి   పెద్ద ఎత్తున ప్రచారం చేయడం కలిసి వచ్చింది. అంతే అక్కడా విజయం సాధించింది. అంతలా ఎన్నికలకను కూడా ప్రభావితం చేసింది సర్కార్‌ విద్యలోని సంస్కరణల పర్వం. ఇప్పడిదంతా ఎందుకంటే.. తాజాగా మాజీ ఐఏఎస్‌ ఆకునూరి మురళి.. సీఎం రేవంత్‌రెడ్డి విద్యా వ్యవస్థ బలోపేతం కోసం విద్యానిధి ఏర్పాటు చేయాలనే సిఫార్సులు చేశారు. ఈ నేపథ్యంలో సర్కారీ విద్యపై మళ్లీ చర్చ జరుగుతోంది.

Advertisement

వాస్తవానికి ఢిల్లీలోని ఆప్‌ ప్రభుత్వం తప్ప దేశంలోని ఏరాష్ట్రంలో కూడా విద్యకు అత్యధిక నిధులను కేటాయించడం లేదు. ఇందులో తెలంగాణ కూడా వెనుకబడే ఉందని చెప్పాలి. ఢిల్లీ ప్రభుత్వం తమ మొత్తం బడ్జెట్‌లో విద్యకు 25% నిధులను కేటాయించింది. ఆ తరువాత బీహార్‌లో 21% కేటాయించినా ఇదింకా చదువులో వెనకబడే ఉంది. హిమాచల్‌ ప్రదేశ్‌ 18.9%, చత్తీస్‌ఘడ్‌ 17%, అస్సాం 16%, పశ్చిమబెంగాల్‌ 14%, గుజరాత్ 13%, ఏపీ 11%, కేరళ 12%, తమిళనాడు 12%, తెలంగాణ 7.6% నుంచి 8.6% దాకా కేటాయించింది. దీన్ని 15% పెంచుతామని రేవంత్‌ సర్కార్‌ చెబుతోంది. కర్ణాటక 9% కేటాయించగా.. కేసీఆర్‌ పదేండ్ల పాలనలో 6% నుంచి 8% వరకు కేటాయించింది. దేశంలోని ఇతర రాష్ట్రాల సగటుతో పోల్చితే ఇది చాలా తక్కువ.

కొత్త క్లాస్‌ రూములు, అత్యాధునిక సౌకర్యాలు, ఉపాధ్యాయులకు అంతర్జాతీయ శిక్షణ, కార్పొరేట్‌ తరహా మీటింగులు, ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించేది ఆప్‌ ప్రభుత్వం. ప్రైవేటు స్కూళ్ల ఫీ జులంపై కొరఢా, పాఠశాలలకు రాని విద్యార్థుల కోసం ఢిల్లీ మోడల్‌ వర్చువల్ స్కూల్ .. ఇవన్నీ అక్కడి విద్యా సంస్కరణల్లో కీలకంగా ఉన్నాయి. దేశంలో సర్కారీ విద్య గురించి మాట్లాడితే మొదటగా గుర్తొచ్చేది ఢిల్లీ సర్కారే. అంతలా విద్యా వ్యవస్థలో మార్పలు తీసుకురాగలిగింది కేజ్రీవాల్ సర్కార్‌.

ఓసారి సీఎం హోదాలో కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లినప్పుడు కేజ్రీతో కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న సంస్కరణలను పరిశీలించారు. ఇప్పుడు సీఎం రేవంత్‌ వద్దే విద్యా శాఖ ఉండటం, ఈ శాఖపై తనదైన ముద్ర వేసుకునేందుకు పలు సంస్కరణలకు నాంది పలకడంతో తెలంగాణలో కూడా సర్కార్‌ విద్య బలోపేతానికి అడుగులు పడుతున్నాయని చెప్పొచ్చు.

Tags

Related News

సర్కారీ విద్య బలోపేతానికి భారీ సిఫార్సులు! మియాపూర్ భూముల అమ్మకం సొమ్మును వినియోగించాలని సూచన..! తన మాటవింటే మళ్లీ గెలవటం పక్కా అంటున్న మురళి!

మూడు పార్టీలు.. మూడు స్కెచ్‌లు.. ఒక్కటే టార్గెట్!

ఎల్‌నినో దెబ్బకు చెక్.. అర్నబ్ తుపాన్‌తో నిండిన ఉత్తరాంధ్ర రిజర్వాయర్లు

సెల్ఫ్‌ డిక్లరేషన్‌ పత్రాలు అడుగుతున్నారని ప్రచారం! ఏకంగా ప్రెస్‌మీట్‌లోనే ఆ పత్రాన్ని చూపిన కేటీఆర్‌..! సర్కార్‌ ఖండించినా ఆగని దుష్ప్రచారం!

రాహుల్‌ను ప్రధానిని చేయలేదు..:! కేటీఆర్‌ను సీఎం చేస్తా..! కేసీఆర్‌కు కలిసిరాని కాలం! ఎంతెంత దూరం.. ఇంకెంత దూరం..?

గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదులో కనిపించని జోష్.. ఎందుకో తెలుసా..?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ తప్పుడు సంకేతాలా? ఆ మంత్రుల పరపతికి పరోక్షంగా దెబ్బకొట్టే యత్నమా? బీఆరెస్‌ వ్యూహంలో భాగంగానే సురేఖ సారీ పాచికా?

Big Stories

Advertisement
×