E-Paper
Advertisement

సర్కారీ విద్య బలోపేతానికి భారీ సిఫార్సులు! మియాపూర్ భూముల అమ్మకం సొమ్మును వినియోగించాలని సూచన..! తన మాటవింటే మళ్లీ గెలవటం పక్కా అంటున్న మురళి!

సర్కారీ విద్య బలోపేతానికి భారీ సిఫార్సులు! మియాపూర్ భూముల అమ్మకం సొమ్మును వినియోగించాలని సూచన..! తన మాటవింటే మళ్లీ గెలవటం పక్కా అంటున్న మురళి!
Advertisement

తెలంగాణ మాజీ విద్యా కమిషన్ చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి మరోసారి వార్తల్లోనిలిచారు. సర్కారీ విద్యలో సమూల సంస్కరణలకు తనవైన ఆలోచనలను సర్కార్ తో పంచుకుంటున్న మురళి.. తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి ఈ విషయంలో ఇచ్చిన ఓ భారీ సలహా ప్రస్తుతం పొలిటికల్ సర్కిళ్లలో తీవ్ర చర్చకు దారి తీసింది.

ఇలా చేస్తే మరోసారి కాంగ్రెస్ సర్కార్ గెలవటం పక్కా అని భరోసా ఇచ్చే విధంగా ఆయన చేసిన ట్వీట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అది ఆచరణ సాధ్యమా? కాదా? అనేది పక్కనపెడితే.. విద్యాశాఖలో ఇలాంటి సంస్కరణలు అనివార్యమనే విధంగా ఆయన సూచనలున్నాయి. ఇప్పటికే మురళి ఇచ్చిన సలహాలు, సూచనలను సర్కార్ పాటిస్తోంది.

Advertisement

అందులో భాగంగానే తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్మాణాలను చేపడుతోంది. ఆరుట్లలో ఈ మోడల్ స్కూల్ ను ప్రారంభించి నూతన శకానికి సర్కార్ నాంది పలికిన విషయం తెలిసిందే. మియాపూర్ భూములు ప్రభుత్వానివేనని సుప్రీం తీర్పు వెలువరించిన నేపథ్యంలో..సీఎం రేవంత్ దీనిపై మాట్లాడారు. దాదాపు 550 ఎకరాల ఈ భూములను అమ్మడం వల్ల రూ. 50వేల కోట్ల వరకు రావొచ్చని, ఈ నిధులను విద్య, వెల్ఫేర్ స్కీమ్స్ ను అమలు చేయడానికి వినియోగించుకుంటామని అని కూడా ఆయన ప్రకటించారు.

దీనిపై కొత్త చర్చ జరుగుతున్న తరుణంలో మురళి చేసిన ఓ ట్వీట్ అందరినీ ఆకట్టుకున్నది. ఈ మియాపూర్ భూములను నిజాయితీగా, పారదర్శకంగా అమ్ముదామన్న ఆయన.. ఆ వచ్చిన సొమ్మంతా విద్యానిధిలో జమ చేద్దామని సూచించారు. 1200 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను, 1200 తెలంగాణ ఫౌండేషన్ స్కూళ్లను ఆరుట్ల మోడల్ తరహాలో అభివ్రుద్ది చేద్దామన్నారాయన.

Advertisement

విద్యను యూరోపియన్ స్థాయికి తీసుకెళ్దామన్నారు. దీని కోసం తనకు ప్రత్యేక బాధ్యతలివ్వాలని కూడా కోరారు ఆకునూరి. జీతమొద్దు, కారొద్దన్నారు. ఒక్క రూపాయే జీతం తీసుకుంటానన్నారు. తను సూచించిన ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు కావాలని, ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సెక్రటరీని మార్చాలని కోరారు. ఓ సీనియర్ ఫైనాన్స్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేషన్ సాంక్షన్ పవర్స్ ఇవ్వాలన్నారు. పదిహేను రోజులకోసారి తనతో కలిసి రివ్యూ చేయాలన్న ఆకునూరి.. ఇవన్నీ చేస్తే విద్యా వ్యవస్థను మార్చి చూపిస్తానన్నారాయన. టీచర్ల జీతభత్యాలు కూడా పెంచాల్సిన అవసరం లేదన్నారు.

‘ఇది చేస్తే వచ్చే ఎన్నికల్లో మీరు గెలుస్తారు..తెలంగాణలో బ్రహ్మాండమైన విద్యా వ్యవస్థ ఇచ్చిన వాళ్లము అవుతాము.. చరిత్రలో మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది’ అని కామెంట్ చేయడం.. కొత్త చర్చకు తెర తీసింది. దీనిపై సర్కార్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. అయితే విద్యా కమిషన్ చైర్మన్ పదవి కాలం ఇంకా ముగియకముందే ఆయన గతంలో రాజీనామా చేయడం చర్చకు తావిచ్చింది. ఇప్పిడిలా మరోసారి సీఎంకు సూచన చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు.

Tags

Related News

మూడు పార్టీలు.. మూడు స్కెచ్‌లు.. ఒక్కటే టార్గెట్!

ఎల్‌నినో దెబ్బకు చెక్.. అర్నబ్ తుపాన్‌తో నిండిన ఉత్తరాంధ్ర రిజర్వాయర్లు

సెల్ఫ్‌ డిక్లరేషన్‌ పత్రాలు అడుగుతున్నారని ప్రచారం! ఏకంగా ప్రెస్‌మీట్‌లోనే ఆ పత్రాన్ని చూపిన కేటీఆర్‌..! సర్కార్‌ ఖండించినా ఆగని దుష్ప్రచారం!

రాహుల్‌ను ప్రధానిని చేయలేదు..:! కేటీఆర్‌ను సీఎం చేస్తా..! కేసీఆర్‌కు కలిసిరాని కాలం! ఎంతెంత దూరం.. ఇంకెంత దూరం..?

గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదులో కనిపించని జోష్.. ఎందుకో తెలుసా..?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ తప్పుడు సంకేతాలా? ఆ మంత్రుల పరపతికి పరోక్షంగా దెబ్బకొట్టే యత్నమా? బీఆరెస్‌ వ్యూహంలో భాగంగానే సురేఖ సారీ పాచికా?

కేంద్ర కరువు సాయం ప్యాకేజీపై పెదవి విరుపేనా? నాడు కేసీఆర్‌కు చేదు అనుభవం..! ఇప్పుడు 20వేల కరువు ప్యాకేజీలో ఎంతిస్తారో?

Big Stories

Advertisement
×