Telangana Politics: ఒకపక్క అధికార కాంగ్రెస్ పార్టీ సంధిస్తున్న ప్రశ్నలు.. మరోపక్క పుట్టింటి ఆడబిడ్డ చేస్తున్న బహిరంగ ఆరోపణలతో గులాబీపార్టీ సతమతమవుతోంది .. ఇలాంటి పరిస్థితుల్లో సొంత పార్టీలో జరుగుతున్న కుమ్ములాటలను సద్దుమణిగించేందుకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ రెండేళ్ల తర్వాత బయటకు వచ్చి మాట్లాడాల్సి వస్తోంది .. అయినా పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆయన కూతురు చేస్తున్న విమర్శలతో మూలిగే నక్కమీద తాటికాయ పడినట్లు అయిందంటున్నారు … అసెంబ్లీకి అలా వచ్చి ఇలా వెళ్లిపోయిన గులాబీబాస్.. నీళ్ల ఉద్యమం, అదీఇదీ అంటున్నారు కాని.. కవితపై మాత్రం ఎలాంటి కామెంట్స్ చేయడం లేదు.. మరి పార్టీకి తీవ్ర డ్యామేజ్‌గా మారుతున్న ఈ పరిస్థితుల్ని ఆలా ఎలా ఎదుర్కొనబోతున్నారు? అసలు బీఆర్ఎస్‌లో దీనిపై జరుగుతున్న చర్చేంటి?
చాలా రోజుల తర్వాత ఫామ్ హౌస్‌ని విడిచి పార్టీ కార్యాకలాపాల్లో బిజీ అయ్యారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయనకున్న అనుభవంతో బీఆర్ఎస్‌ని తిరిగి యాక్టివ్ చేసేలా కార్యచరణ మొదలుపెట్టారు.. అందులో భాగంగానే ఈ సారి నీళ్ల ఉద్యమంతో ప్రజల్లోకి వెళ్లేందుకు పక్కా ప్లాన్ కూడా చేశారు.. దీనికోసం స్వయంగా తానే రంగంలోకి దిగుతానని పార్టీ నేతలకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు.. ప్రజల్లోకి వెళ్లాలంటే బలమైన ఎజెండా ఉండాలనే ఆలోచనతోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ను ఒక అవకాశంగా మలుచుకుంటానన్నారు
అయితే ప్రాజెక్ట్ లను ముందు పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లాలనుకున్న కేసీఆర్ ఐడియా బెడిసి కొట్టేలా ఉందని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందట.. ఎందుకంటే బీఆర్ఎస్ చేపట్టిన ప్రాజెక్టుల ఉద్యమం కంటే ముందుగానే కవిత జిల్లాల పర్యటనల్లో భాగంగా…స్ధానికంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను సందర్శిస్తున్నారు. కవిత పర్యటనతో బీఆర్ఎస్ వ్యూహాం ఎందుకు దెబ్బతింటుందనే డౌట్ రావచ్చు. ప్రాజెక్టులను సందర్శిస్తున్న కవిత…బీఆర్ఎస్ హయంలో జరిగిన అంశాలను వివరిస్తూ … చేస్తున్న కామెంట్స్ బీఆర్ఎస్‌కు ఇబ్బందికరంగా మారాయన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్‌లో నడుస్తోందట. పదేళ్ల తమ ప్రభుత్వంలో అనేక సాగునీటి-తాగునీటి ప్రాజెక్ట్ లు నిర్మించామని లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని చెప్పుకుంటున్న బీఆర్ఎస్‌కు కవిత కౌంటర్ ఇస్తున్నారు. గత ప్రభుత్వ హయంలో రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్ట్ లను నిర్లక్ష్యం చేశారని ఇటీవల పర్యటనల్లో కవిత ఆరోపించడం బీఆర్ఎస్ నేతలకు మింగుడపడడంలేదట.
త్వరలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టాలని నిర్ణయించారు కేసీఆర్… ముందుగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా పోరు బాట్ట పట్టాలని బీఆర్ఎస్ భావిస్తుంది. ఈ ప్రాజెక్టు విషయంలోనే అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సాగునీటి ప్రాజెక్టులు, నీటి కేటాయింపుల విషయంలో ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ…ప్రజల్లోకి వెళ్లేందుకు కేసీఆర్ ప్లాన్ చేశారు. తమ హయాంలో పాలమూరు, నల్లగొండ జిల్లాలను అద్భుతంగా తీర్చిదిద్దామంటూనే…సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్, బీజేపీల తీరును తీవ్రంగా ఖండించారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుపై మండల, జిల్లాస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. కృష్ణా జలాల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీ పడిందని విమర్శించారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు,కృష్ణా జలాల విషయంలో పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమవుతున్న తరుణంలోనే సీన్‌లోకి కవిత రావడం తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ ఎక్కడ నుంచి అయితే పోరు బాట్టాలని అనుకుందో…అక్కడే పర్యటించిన కవిత…బీఆర్ఎస్ హయంలో జరిగిన అంశాలను వెల్లడించడం చర్చనీయంశంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల తరహాలోనే పనులు చేసుంటే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కూడా పూర్తయ్యేదని కవిత మండిపడ్డారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని సకాలంలో పూర్తిచేయని కారణంగానే కృష్ణా జలాల్లో 90 టీఎంసీల నీటి వాటాపై హక్కులను కోల్పోయినట్లు ఆరోపించారు. బీఆర్ఎస్ హయంలో చేసిన నిర్లక్ష్యం వల్లే కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందనే విధంగా కవిత మాట్లాడడం గులాబీ నేతలను గందరగోళంలోకి నెట్టిన పరిస్ధితి.
పదేళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పాలమూరు జిల్లాకు కృష్ణాజలాల్లో వినియోగంలో అన్యాయం జరిగిందని అటు అధికార పక్షంతో పాటు.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. వాటికి అజ్యం పోసే విధంగా కవిత మాట్లాడడంతో బీఆర్ఎస్ నేతలు తలలు పట్టుకుంటున్నారట. అయితే కవిత పర్యటనకు వెళ్లిన ప్రతిచోటా బీఆర్ఎస్ నే టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు.. కవిత చేస్తున్న ఆరోపణలతో బీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడాల్సివస్తోంది.. అయితే ఒకపక్క అధికార కాంగ్రెస్ పార్టీ.. మరోపక్క కవిత చేస్తున్న ఆరోపణల వల్ల బీఆర్ఎస్ మరింత డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల్లోనే జోరుగా చర్చ జరుగుతోంది.. పాలమూరు అస్త్రంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకడంలో పెడదామని అనుకున్న గులాబీ బాస్‌కు కవిత కామెంట్స్ రూపంలో షాక్ ఇవ్వడం చర్చకు దారితీస్తుంది. ఇలాంటి తరుణంలో బీఆర్ఎస్ ఎలాంటి యాక్షన్ ప్లాన్ చేయబోతుందనేది హాట్ టాపిక్‌గా మారింది.
బీఆర్ఎస్ చేసిన తప్పిదాల వల్లనే ఇప్పుడు రాష్ట్రానికి, రైతన్నలకు సరిపడా పంట నీరు అందడంలేదని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే కవిత కూడా అందుకు వంత పాడుతున్నారు.. ఇంతకీ బీఆర్ఎస్ మెయిన్ టాపిక్ గా తీసుకున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ అంశం ఇప్పుడు ఆ పార్టీకి కలిసొస్తుందా? లేదా కష్టాల్లో పడేస్తుందా? అనేది చూడాలి.
Story By Ajay, Big Tv