BigTV English

Nagarjuna Career : టాలీవుడ్ మన్మథుడు.. కింగ్ కెరీర్ ప్రస్థానం ఇదే..! బర్త్ డే స్పెషల్..

Nagarjuna Career : టాలీవుడ్ మన్మథుడు.. కింగ్ కెరీర్ ప్రస్థానం ఇదే..! బర్త్ డే స్పెషల్..
Nagarjuna birthday news telugu

Nagarjuna birthday news telugu(Latest news in tollywood) :

విక్రమ్ మూవీతో టాలీవుడ్ కు పరిచయమై.. శివగా మాస్ ఇమేజ్ తెచ్చుకున్న హీరో నాగార్జున. మజ్ను, గీతాంజలి సినిమాలతో అమ్మాయిల మనసు దోచుకున్నాడు ఈ మన్మథుడు. ప్రెసిడెంట్ గారి పెళ్లాం, హలో బ్రదర్, అల్లరి అల్లుడు, ఆవిడా మా ఆవిడే, సంతోషం, నువ్వువస్తావని లాంటి సినిమాలు నాగార్జునను కుటుంబ ప్రేక్షకులకు దగ్గర చేశాయి. ఆధ్యాత్మిక సినిమాల్లో నాగార్జున తనదైన ముద్రవేశారు. అన్నమయ్య, శ్రీరామదాసు, ఓం నమో వేంకటేశాయ, శిర్డిసాయి, జగద్గురు ఆది శంకర సినిమాలు నాగ్ లో విభిన్న నటుడిని ఆవిష్కరించాయి. ఇలా 37 ఏళ్లుగా విభిన్న పాత్రలు పోషిస్తూ అలరిస్తున్నాడు యువ సామ్రాట్.


ఆగస్టు 29న 64వ పుట్టినరోజు జరుపుకుంటున్న నాగార్జున ఇప్పటికీ ఎంతో ఫిట్ గా ఉన్నాడు. ప్రశాంతంగా ఉండటం, వ్యాయామం చేయడమే తన ఫిట్ నెస్ రహస్యమని ఆయన ఎప్పుడూ చెబుతూ ఉంటాడు. రోజూ ఐస్‌క్రీమ్‌ కానీ స్వీట్‌ కానీ తప్పనిసరిగా తింటాడట. ఈ అలవాటు తండ్రి అక్కినేని నాగేశ్వరరావు నుంచి వచ్చిందట.

ANR హీరోగా తెరకెక్కిన వెలుగు నీడలు సినిమాలో 8 నెలల పసిప్రాయంలో నాగ్ తెరపై మెరిశాడు. సుడిగుండాలు చిత్రంలో బాల నటుడిగా కనిపించాడు. 1986లో విక్రమ్ మూవీతో హీరోగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. నాగార్జున కెరీర్ లో ఎంతోమంది దర్శకులను పరిచయం చేశాడు. 40 మంది కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చాడు. శివ సినిమాతో రామ్‌గోపాల్‌ వర్మ , మాస్ మూవీతో లారెన్స్‌ ఇలాగే టాలీవుడ్ లోకి దర్శకులుగా ఎంట్రీ ఇచ్చారు. శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి, మన్మథుడు, ఉయ్యాలా జంపాల లాంటి హిట్‌ చిత్రాలకు నాగ్ నిర్మాతగా వ్యవహరించాడు.


మూడు తరాల వారు కలిసి నటించిన ఘనత అక్కినేని కుటుంబానికి దక్కింది. మనం మూవీలో ANR, నాగచైతన్య, అఖిల్‌ తో కలిసి నాగార్జున నటించారు. కలెక్టర్‌గారి అబ్బాయి, అగ్నిపుత్రుడు, ఇద్దరూ ఇద్దరే, శ్రీరామదాసులో తండ్రి ANRతో , బంగార్రాజులో కొడుకు నాగ చైతన్య తో స్నేహమంటే ఇదేరాలో మేనల్లుడు సుమంత్‌ తో కలిసి నాగ్ నటించాడు.

మల్టీస్టారర్ చిత్రాల్లో నాగార్జున మెప్పించాడు. కెప్టెన్‌ నాగార్జున, అరణ్య కాండ సినిమాల్లో రాజేంద్ర ప్రసాద్‌ తో కిరాయి దాదా, సిద్ధార్థలో కృష్ణంరాజు కాంబినేషన్ లో చేశారు. ప్రేమయుద్ధం, అధిపతిలో మోహన్‌బాబుతో వారసుడు, రాముడొచ్చాడులో కృష్ణతో, సీతారామరాజులో హరికృష్ణతో, రావోయి చందమామలో జగపతిబాబుతో, కృష్ణార్జునలో మంచు విష్ణుతో, ఊపిరిలో కార్తితో, దేవదాస్‌లో నానితో కలిసి నాగ్ నటించాడు. త్రిమూర్తులు, రావుగారి ఇల్లు, ఘటోత్కచుడు, నిన్నే ప్రేమిస్తా, స్టైల్‌, తకిట తకిట, దొంగాట, అఖిల్‌, సైజ్‌జీరో, ప్రేమమ్‌ సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరిశాడు. ‘ఒక్కడే దేవుడు..’, ‘డిక్క డిక్క డుం డుం..’, ‘కొత్త కొత్త భాష..’, ‘లడ్డుండా..’ పాటలతో సింగర్ గా తన ప్రతిభ చాటాడు.

గతేడాది బంగార్రాజు, ది ఘోస్ట్‌, బ్రహ్మాస్త్ర-1 సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు నాగార్జున. ఇప్పటి వరకు 98 సినిమాల్లో నటించాడు. 99వ చిత్రాన్ని కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్నీ దర్శకత్వంలో చేస్తున్నాడు. 100వ సినిమాకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

నటుడిగా, నిర్మాతగా నాగ్ 9 నంది అవార్డులు అందుకున్నాడు. నిన్నే పెళ్లాడతా బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరీలో, అన్నమయ్య స్పెషల్‌ మెన్షన్‌ కేటగిరీలో జాతీయ అవార్డులు పొందాయి. వెండితెరపై మాత్రమే కాదు బుల్లితెరపైనా నాగ్ మెరిశాడు. మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించి ఆకట్టుకున్నాడు. బిగ్‌బాస్‌ హోస్ట్‌గా తనదైన ముద్ర వేశాడు.‌ బిగ్ బాస్ 3,4,5,6 సీజన్లకు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఓటీటీ బిగ్‌బాస్‌లోనూ సందడి చేశాడు. త్వరలోనే బిగ్‌బాస్-‌ 7తో అలరించబోతున్నాడు. హ్యాపీ బర్త్ డే నాగార్జున..!

Related News

MLC Kavitha VS Harish Rao: సిద్దిపేట నుంచి కవిత పోటీ?

Local Body Elections: ముదురుతున్న స్థానిక ఎన్నికల రగడ.. ఎన్నికలు జరుగుతాయా? లేదా?

Kandi Srinivasa Reddy: కంది శ్రీనివాస్ రెడ్డికి.. కాంగ్రెస్ బిగ్ షాక్!

Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్ రచ్చ.. అసలేం జరిగిందంటే!

Musi River Floods: మూసీ ఉగ్రరూపం.. హైడ్రా ఆన్ యాక్షన్..

Kadapa TDP Internal Issue: కడపలో గ్రూపు రాజకీయాలు.. ఈ వ్యవహారం వెనుక ఉన్నదెవరు?

YCP Digital Book: ఒక్కొక్కరికి ఇక సినిమానే..! డిజిటల్ బుక్‌పై టీడీపీ రియాక్షన్ ఏంటి?

Telangana: ఆధిపత్య పోరుకు పుల్ స్టాప్.. మల్లు రవి యాక్షన్ వర్కౌట్ అవుతుందా?

Big Stories

×