Visakha Crime: టెక్నాలజీని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ఏకంగా ఏపీలో సైబర్ డెన్‌ని నిర్మించారు. ఐటీ కంపెనీ మాదిరిగా ఉద్యోగులను ఏర్పాటు చేశారు. గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న పుల్ స్టాప్ పెట్టేశారు. ఇందులో తీగలాగితే సైబర్ డెన్ గురించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
సైబర్ నేరాల గురించి ఆ మధ్య తెలుగులో ఓ సినిమా వచ్చింది. అదే సీన్ ఏపీలోని విశాఖలోని అచ్యుతాపురంలో రిపీట్ అయ్యింది. మూడో కంటిని తెలియకుండా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు. అజ్ఞాత వ్యక్తి నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా రంగంలోకి దిగేశారు పోలీసులు. అచ్యుతాపురంలోని మూడు కేంద్రాల్లో సోదాలు చేశారు. ఊహించని నిజాలు వెలుగు చూశాయి.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని మూడు కాల్ సెంటర్లలో మెరుపు దాడులు చేశారు పోలీసులు. కాల్ సెంటర్ పేరిట కార్యక్రమాలు మొదలుపెట్టారు. మూడు అపార్ట్‌మెంట్లలో 44 ఫ్లాట్స్ అద్దెకు తీసుకున్నారు. దాదాపు రెండేళ్ల నుంచి గుట్టుచప్పుడు కాకుండా సైబర్ కార్యకలాపాలను నిర్వహించింది ఓ ముఠా.
ప్రతీ నెలా వీరి రాబడి 15 నుంచి 20 కోట్లు. కాల్ సెంటర్‌లో ఉద్యోగాల పేరిట ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చే యువతకు చేర్చుకుంటారు. అమెరికన్ ఇంగ్లీష్‌లో ఎలా మాట్లాడాలో ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత రోజు వారీ ప్రణాళికలు రెడీ అవుతారు. ఈ కాల్‌సెంటర్లలో అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
ALSO READ: రాత్రి వేళ ఒత్తిడి తట్టుకోలేక భర్తను చంపేసిన భార్య
ఒక్కో షిప్ట్‌కు 200 నుంచి 250 మంది వరకు పని చేస్తారు. ఈ-కామర్స్ సంస్థ నుంచి ఫోన్ చేసినట్టు మాట్లాడతారు. ఆర్డర్ మీకు చేరిందా? అని మాటలు మొదలుపెడతారు. తాము ఎలాంటి ఆర్డర్ బుకింగ్ చేయలేదని చెప్పగానే వారి టాలెంట్ ఉపయోగిస్తారు. మీ బ్యాంకు అకౌంట్ నుంచి నగదు డ్రా అయిందని, వేరేవారు ఎవరైనా వాడుతున్నారేమో చెక్ చేసుకోండి అని చెబుతారు.
కొద్దిసేపటికే బ్యాంకర్ పేరుతో మాట్లాడి వివరాలు తీసుకుంటారు. ఆ తర్వాత మిగతా వారికి లైన్ కలుపుతారు. మీ బ్యాంకు అకౌంట్‌ను వేరేవారు వినియోగిస్తున్నారు.. జాగ్రత్త అని హెచ్చరిస్తారు. నగదుకు సెక్యూరిటీ పేరుతో కూపన్లు ఇస్తామని చెప్పి నమ్మిస్తారు ఆ తర్వాత వారి అకౌంట్ల నుంచి నగదు తస్కరిస్తారు.
ఇలా రోజుకు 100 నుంచి 200 మంది ఆయా విధులను నిర్వహిస్తుంటారు. ఈ కాల్ సెంటర్ నిర్వాహకులు అసోం, నాగాలాండ్, మేఘాలయ, గుజరాత్ వారిని ఉద్యోగులుగా నియమించుకుంటారు. వీరి ద్వారా డబ్బు కొట్టే మార్గాలను అవలంభిస్తారు. ఇందులో కీలకంగా వ్యవహించిన మహారాష్ట్రకు చెందిన పునీత్ గోస్వామి, రాజస్థాన్‌కు చెందిన అవిహాంత్ లను అదుపులోకి తీసుకున్నారు.
వీరి ద్వారా కీలకమైన వ్యక్తులను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. ప్రస్తుతం 33 మందిని అరెస్ట్ చేశారు. వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. సైబర్ డెన్‌లో ఉద్యోగాలు చేస్తున్నవారికి కేడర్ బట్టి సాలరీ ఉంటుంది. సాదారణ ఉద్యోగికి 20 వేల నుంచి మొదలవుతుంది. 20 వేల నుంచి లక్ష రూపాయల వరకు జీతం ఉన్నట్లు తేలింది. ఈ ముఠా వెనుక ఎవరున్నారు అనేదానిపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూపీ లాగడం మొదలుపెట్టారు పోలీసులు.