E-Paper
Advertisement

Gudur: గూడూరులో పొలిటికల్ రచ్చ..

Gudur: గూడూరులో పొలిటికల్ రచ్చ..
Advertisement

Gudur:  గూడూరు నియోజకవర్గం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారి, పొలిటికల్ టర్న్ తీసుకుంది. అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష నేతలు ఇద్దరు గూడూరు నియోజకవర్గ మంత్రాన్ని జపిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలోనే గూడూరు నియోజకవర్గాన్ని కొనసాగించాలని పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలో ఓ ఎమ్మెల్యే, మరో మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ టర్న్ తీసుకుని హాట్ హాట్ గా మారాయి. గూడూరు కొత్త జిల్లా మాట ఎటు ఉంచినా… పాత జిల్లాలో కలపాలని పెట్టుకున్న ఆశలు అడియాశలు అయ్యాయనే చర్చ నడుస్తుందట.

గూడూరును నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలన్న డిమాండ్

ఎందరో రాజకీయ ఉద్దండులకు జన్మనిచ్చిన నియోజకవర్గం గూడూరు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురమల్లి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి ఇలా ఎందరో గూడూరు నియోజకవర్గం నుంచి రాష్ట్ర కేంద్ర స్థాయిలో చక్రం తిప్పిన వారే. అలాంటి గూడూరు నియోజకవర్గంలో అంశం ఇప్పుడు రాష్ట్రస్థాయిలో చర్చ సాగుతోంది. దశాబ్దాలుగా నెల్లూరు జిల్లాలో కొనసాగిన గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలపడం నియోజకవర్గ ప్రజలు జీర్ణించుకోలేకున్నారు. దీంతో తిరిగి గూడూరును నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలన్న డిమాండ్ ఊపందుకుంది. వైకాపా ప్రభుత్వ హయాంలో ఇందుకుగాను చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అదే సమయంలో ఎన్నికలు రావడంతో కూటమి నేతలు నియోజకవర్గ అంశాన్ని క్యాష్ చేసుకునేందుకు హామీలు గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే గూడూరును తిరిగి నెల్లూరు జిల్లాలో కొనసాగిస్తామని హామీలు సైతం ఇచ్చారు.

నెల్లూరులో కలుపుతామని చంద్రబాబు, లోకేష్ హామీలు

Advertisement

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిపక్ష హోదాలో 2022 ఏప్రిల్ నెలలో గూడూరుకు వచ్చారు. ఆయన జన్మదినం రోజు ఏర్పాటు చేసిన మహిళా సభలో మాట్లాడారు. ప్రజల ఆకాంక్షను అప్పటి మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. దీనికి స్పందించిన చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే గూడూరు నియోజకవర్గాన్ని తిరిగి నెల్లూరులో కలిపే బాధ్యత తాము తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదే సమయంలో యువగళం పేరుతో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రతిపక్ష హోదాలో కూడా గూడూరు నియోజకవర్గాన్ని తిరిగి నెల్లూరు జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారు.

ఇటీవల కాలం వరకు ఆ హామీ నెరవేరుతుందని ప్రచారం సాగింది. స్థానిక ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ గూడూరు నియోజకవర్గాన్ని తిరిగి నెల్లూరులో కలిపినందుకు మీకు ధన్యవాదాలు అంటూ మీడియా సమావేశంలో చంద్రబాబుతో పాటు లోకేష్ కు కృతజ్ఞతలు కూడా చెప్పేశారు. ఇంతలో సీన్ రివర్స్ అయింది. కారణమేంటో తెలియదు కానీ గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలోనే కొనసాగించేలా నిర్ణయం తీసుకున్నారు.

ఆగ్రహంతో ఉన్న గూడూరు ప్రజానీకం

Advertisement

మూడేళ్ల పాటు గూడూరు నియోజకవర్గం తిరిగి నెల్లూరు జిల్లాలో కలుస్తుందని ఆకాంక్షించిన ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ కూడా ప్రజల పక్షానే ఉన్నట్లు స్పష్టం చేశారు. గూడూరును తిరిగి నెల్లూరులో కలపకపోతే రాజకీయాల్లో నుంచి విరమించకుంటా అని ఏకంగా కోటలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో తన మనోగతాన్ని వెల్లడించారు. ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటానని రాజకీయాలు శాశ్వతం కాదని చెప్పకొచ్చారు.

ఎమ్మెల్యే సునీల్ కుమార్‌కు పరోక్షంగా మద్దతు

దీంతో గూడూరు నియోజకవర్గ అంశం పొలిటికల్ టర్న్ తీసుకుంది. సిటింగ్ ఎమ్మెల్యే వ్యాఖ్యలతో అధికార పక్షం కూడా ఉలిక్కిపడింది. ఈ అంశంపై కూటమినేతలు కూడా స్థానిక ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు పరోక్షంగా మద్దతు తెలిపారు. అధికారంలో ఉన్నాము కనుక తాము నోరు విప్పలేమని, పోరాటానికి పరోక్షంగా సహకరిస్తామని ప్రతిపక్షానికి కూడా సమాచారం అందించారట. ఉద్యోగ, ఉపాధ్యాయ, రైతు సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఇలా అందరూ పోరుబాట పట్టాలని పిలుపునిస్తున్నారట.

గూడూరు నియోజకవర్గం పై స్పందించిన మాజీ మంత్రి

ఈ క్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ గూడూరు నియోజకవర్గ అంశంపై మాట్లాడిన మరుసటి రోజే మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా స్పందించారు. ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలని చెప్పుకొచ్చారు. పదవులు వస్తాయి, పోతాయి నియోజకవర్గం శాశ్వతం, అటువంటి నియోజకవర్గ ప్రజల ఆకాంక్షల కోసం పోరాడాలి అంటూ సూచించారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను విస్మరించడంపై విమర్శలు గుప్పించారు.

హాట్ టాపిక్‌గా గూడూరు నియోజకవర్గం

తన సామాజిక వర్గానికి చెందిన ఓ నేత స్వలాభం కోసం గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలోనే కొనసాగించేలా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఇటు అధికార పార్టీ ఎమ్మెల్యే, అటు ప్రతిపక్ష నేత మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలతో గూడూరు నియోజకవర్గ అంశం హాట్ టాపిక్ గా మారింది. మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఓ అడుగు ముందుకేసి ఏకంగా గూడూరులో ఆమరణ నిరాహారదీక్ష చేపడుతానని చెప్పడంతో అధికార పార్టీ ఇరుకునపడేలా కనిపిస్తుంది. గూడూరు నియోజకవర్గ అంశంపై పోరాడే రెండు పార్టీల్లో మైలేజీ ఏ పార్టీకి దక్కుతుందో వేచి చూడాల్సిందే.

Story By Apparao, Big Tv 

Related News

82 శాతానికి పెరిగిన ఏపీ అక్షరాస్యత, 100 శాతం దిశగా అడుగులు, కూటమి ప్రభుత్వం ప్లానేంటి?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×