Hatya Movie Controversy: ఒక సినిమా క్లిప్పింగ్ షేర్ చేసినా షేర్ చేస్తున్నారంటే.. అది ఎలాంటి సినిమానో ఊహించుకోవచ్చు. ప్రస్తుతం కడప జిల్లా రాజకీయాలను ఊపేస్తున్న ఆ మూవీ పేరు ఏంటి? దాని కథనం మరెలాంటిది? అది సృష్టిస్తున్న రాజకీయ ప్రకంపనలు ఎలాంటివి?
హత్య సినిమా చుట్టూ కడప జిల్లా రాజకీయాలు
హత్య తమకు వ్యతిరేకంగా తీసిని మూవీగా చెబుతోన్న అవినాష్ వర్గీయులుహత్య సినిమా చుట్టూ కడప జిల్లా రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ మూవీ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది.
ఏడేళ్లుగా విచారణ జరుగుతున్న వివేకా హత్య కేసు
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి ఏడేళ్లుగా విచారణ కొనసాగుతున్నా.. ఈ కేసుకు సంబంధించి ప్రతి అంశం రాజకీయ మలుపుల మీద మలుపులు తీసుకుంటోన్న పరిస్థితి. వివేకా హత్య కేసులో నిందితుల నుంచి రాజకీయ నాయకుల వరకూ చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిగ్గా మారుతున్నాయి.
2019, 24 ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా వివేకా హత్య
2019, 24 సార్వత్రిక ఎన్నికల్లో వైయస్ వివేకా హత్య కేసు ఎన్నికల ప్రచారాస్త్రం. ఎన్నికలు ముసిశాక కూడా వైయస్ వివేకా హత్య పై రాజకీయ రగడ నడుస్తూనే ఉంది. వివేకా హత్య కేసు నాటి నుంచి నేటి వరకూ ఏపీలో ఒక సంచలనాత్మక రాజకీయ ఘటన. ఈ హత్య చుట్టూ ఇప్పటికీ ఎన్నో వివాదాలు, ఊహాగానాలు నడుస్తూనే ఉన్నాయి. ఈ హత్య కేసు ఇటు రాజకీయంగానే కాదు అటు వెండితెరపై కూడా వివాదాస్పదమే.
2019 మార్చి 15న జరిగిన ఈ హత్య ఆధారంగా సినిమాలు
2019 మార్చి 15న జరిగిన ఈ హత్య ఆధారంగా ఇప్పటి వరకూ కొన్ని సినిమాలు రూపొందాయి. ఇప్పటికే వివేకం పేరిట రూపొందిన మూవీ అప్పట్లో వివాదాలకు కేంద్ర బిందువయ్యింది. తాజాగా హత్య పేరిట వచ్చిన ఈ సినిమా కూడా రాజకీయ చర్చనీయాంశంగా తయారైంది. వివిధ రాజకీయ పక్షాలు దీన్ని తమకు అనుకూలం లేదా వ్యతిరేకంగా వాడుకోడానికి ప్రయత్నిస్తున్నాయి. ఒక దశలో ఈ సినిమాలోని క్లిప్పింగులు షేర్ కొట్టినా కేసులు నమోదయ్యాయి.
హత్య సినిమాలో తమను కించపరిచే విధంగా చూపించారు- సునీల్ యాదవ్
ఒక వైపు నిందితులు మరో వైపు వైసీపీ సానుభూతిపరులు, మధ్య మధ్య బీజేపీ నేతలు కూడా ఈ సినిమా పై చేస్తున్న కామెంట్స్ కాక పుట్టిస్తున్నాయి. హత్య సినిమా చుట్టూ ఉన్న వివాదంలో వైయస్ వివేకా హత్య కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఈ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ నేరుగా వైసీపీ నేతలపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. హత్య మూవీలో తమను కించపరిచే విధంగా చూపించారని ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు సునీల్ యాదవ్.
వివేకా హత్య గురించి అవినాష్ కి అన్ని విషయాలు తెలుసు- బీజేపీ ఎమ్మెల్యే ఆది
తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తే వైసీపీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారో అర్ధం కావడం లేదన్నారాయన. సినిమాలో కీలక వ్యక్తుల పాత్రలు అస్సలు చూపించలేదని నిలదీస్తున్నారు సునీల్. మరీ ముఖ్యంగా అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, ఉదయ్ వంటి వారి పాత్రలు ఎందుకు ప్రస్తావించలేదో చెప్పాలని నిలదీస్తున్నారు సునీల్. వైసీపీ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉన్నట్టు కూడా ఆందోళన వ్యక్తం చేశారు సునీల్.
రాజకీయంగా తమను ఇబ్బంది పెట్టాలనే ఈ ఆరోపణలు- వైసీపీ
వివేకా హత్య గురించి ఎంపీ అవినాష్ రెడ్డికి అన్ని విషయాలు తెలుసని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తమపై రాజకీయంగా వస్తున్న ఈ ఆరోపణలను తిప్పటికొట్టే యత్నం చేస్తోంది YCP. రాజకీయంగా తమను ఇబ్బంది పెట్టాలనే కూటమి నేతలు ఈ ఆరోపణలు చేస్తున్నారని కవర్ చేసే యత్నం చేస్తున్నారట వైసీపీ నాయకులు.
హత్య వైసీపీకి అనుకూలంగా తీసుకున్న సినిమా- సునీల్ యాదవ్
హత్య సినిమాను వైసీపీ లీడర్లు తమకు అనువుగా తీయించారని ఆరోపిస్తున్నారు సునీల్ యాదవ్. కావాలనే కొందరి పాత్రలను దాచి పెట్టారని కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా తమకు వ్యతిరేకంగా తీసిని సినిమాగానే చెప్పుకొస్తున్నారు అవినాష్ రెడ్డి వర్గీయులు.
Also Read: వక్ఫ్ సవరణ బిల్లులో టీడీపీ నయా మార్క్.. వాటికి మద్దతిచ్చిన కేంద్రం!
హత్య తమకు వ్యతిరేకంగా తీసిని మూవీగా చెబుతోన్న అవినాష్ వర్గీయులు
మొత్తంగా ఒక హత్య సినిమా వంద రాజకీయ ప్రకంపనలకు కేంద్ర బిందువయినట్టు కనిపిస్తోంది. ఇది చూడ్డానికి సినిమాయే గానీ రాజకీయ అస్త్రంగానూ మారిందని టాక్. దీని విడుదల, ప్రచారం తో పాటు దీనిపై వస్తున్న స్పందనలు సైతం ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తూనే ఉన్నాయి.