Kalyan Shankar : టాలీవుడ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ పేరు ఇప్పుడు తెలియని వాళ్లు ఉండరు. ఈయన తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ మ్యాడ్ స్క్వేర్ మార్చి 28 న రిలీజ్ అయ్యింది. మొదటి రోజు నుంచి జనాల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంది. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. మరోవైపు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లు ప్రధాన పాత్రలు పోషించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీకర స్టూడియో, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. స్యూరదేవర నాగవంశీ సమర్పకులు. హారిక స్యూరదేవర, సాయి సౌజన్య నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో పాటలు, థమన్ నేపథ్య సంగీతం అందించారు. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్బంగా హీరో నవీన్ పోలిశెట్టి తో గొడవల పై క్లారిటీ ఇచ్చేశాడు. ఆయన ఏమన్నారో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
Also Read : వంటలక్కకు రెమ్యూనరేషన్ తో పాటు అవి కూడా కంపల్సరీ.. నిర్మాతలకు తడిసిపోవాల్సిందే..?
కళ్యాణ్ శంకర్ కు నవీన్ పోలిశెట్టికి మధ్య గొడవలా..?
మ్యాడ్ స్క్వేర్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా సక్సెస్ అవ్వడానికి కారణాల గురించి బయటపెట్టాడు. అంతేకాదు నవీన్ పోలిశెట్టి తో మీకు గొడవలు ఉన్నాయా అని అడిగారు. దానికి ఆయన ముందుగా గొడవలు ఏమి లేవని చెప్పారు. ఆ తర్వాత యాంకర్ నిజాలు మాట్లాడుకుందాం అని అడగ్గానే ఓపెన్ అయ్యాడు. అనగనగా ఒక రాజు మూవీ స్టోరీ చెప్పాను. మొదట బాగుందని చెప్పాడు. ఆ తర్వాత నేను డైరెక్టర్ ను సెలెక్ట్ చేసుకుంటాను అన్నాడు. నేను సమాధానం కోసం మూడేళ్లు వెయిట్ చేశాను. కానీ ఆయన నుంచి ఎటువంటి రిప్లై రాకపోవడంతో నేను మ్యాడ్ స్క్వేర్ పై ఫోకస్ పెట్టాను అంతే అని క్లారిటీ ఇచ్చాడు. ఇంకా గొడవలు ఏవైనా తెలుసుకోవాలంటే నవీన్ పోలిశెట్టి క్లారిటీ ఇచ్చేవరకు వెయిట్ చెయ్యాల్సిందే..
మ్యాడ్ స్క్వేర్ కలెక్షన్స్ విషయానికొస్తే..
ఈ మూవీ మొదటి రోజు నుంచి కలెక్షన్స్ కురిపిస్తుంది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా ఈచిత్రానికి రూ.17 కోట్ల గ్రాస్ వసూల్ అయ్యింది. ఇండియాలో రూ.8.5 కోట్ల నెట్ వసూల్ చేసింది.. అలాగే రెండో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద రూ.28.50 కోట్ల గ్రాస్ అందుకుంది. ఇక మూడో రోజు వరకు వరకు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.40 కోట్లకు పైగా గ్రాస్ అందుకుందని ప్రకటించారు. అలాగే వారం రంజాన్ సందర్భంగా ఈ మూవీకి బాగానే కలిసి వచ్చిందని తెలుస్తుంది. 10 కోట్లు వరకు వసూల్ చేసిందని తెలుస్తుంది. మొత్తానికి వంద కోట్ల క్లబ్ లోకి చేరేలా కనిపిస్తుంది. ఈ మూవీకి సీక్వెల్ మరో మూవీ రాబోతుందని టాక్.