Heat stroke: శరీరం వేడిని తట్టుకోలేకపోయి టెంపరేచర్‌ను కంట్రోల్ చేయలేనప్పుడు హీట్ స్ట్రోక్ వస్తుంది. దీన్ని వడదెబ్బ అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలు, అధిక ఆవి వల్ల ఈ సమస్య వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారిలో తలనొప్పి, మైకం, వికారం, విరేచనాలు, చర్మం పొడిబారి పోవడం, కళ్లు తిరగపడి పడిపోవడం వంటివి కనిపిస్తాయట. దీని వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు. అందుకే హీట్ స్ట్రోక్ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
ఎవరికి ప్రమాదకరం..?
వేసవి తాపం వల్ల హీట్ స్ట్రోక్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. దీని వల్ల వృద్ధులు, చిన్న పిల్లలపై చెడు ప్రభావం పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. అంతేకాకుండా ఎక్కువ సమయం గడిపే వారికి కూడా హీట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందట.
హీట్ స్ట్రోక్ లక్షణాలు:
హీట్ స్ట్రోక్ వల్ల అనేక రకాల సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. వడదెబ్బ తాకితే శరీరం విపరీతంగా వేడెక్కుతుందట. కొన్ని సార్లు శరీర ఉష్ణోగ్రత 40°C కన్నా ఎక్కువ కూడా ఉండే ఛాన్స్ ఉందని డాక్టర్లు చెబుతున్నారు. హీట్ స్ట్రోక్ కారణంగా త్వరగా అలసిపోయే అవకాశం ఉందట. దీంతో తలనొప్పి, కళ్లు తిరగడం, సొమ్మసిల్లి పడిపోవడం వంటివి కూడా జరిగే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. దీని వల్ల కీళ్ల నొప్పులు కూడా వస్తాయట.
ALSO READ: మల్బరీతో మెరిసే చర్మం
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
రోజురోజుకీ ఎండల ప్రభావం పెరుగుతున్న తరుణంలో హీట్ స్ట్రోక్ బారిన పడకుండా శరీరాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఇందుకు కొన్ని రకాల జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నారు.
సరిపడా నీళ్లు:
శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం వల్ల హీట్ స్ట్రోక్ వంటి ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే
రోజుకు 8–10 గ్లాసుల నీళ్లు తాగాలని అంటున్నారు. అలాగే మద్యం, కేఫీన్ వంటి వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
తేలికపాటి ఆహారం:
హీట్ స్ట్రోక్ రాకుండా ఉండాలంటే తీసుకునే ఆహారంలో కొన్ని రకాల మార్పులు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వేడి నుండి శరీరాన్ని కాపాడుకోవడానికి జంక్ ఫుడ్‌ను తీసుకోవడం తగ్గించాలని సూచిస్తున్నారు. అలాగే కారం, మసాలాలు అధికంగా ఉండే ఆహారాన్ని వీలైనంత వరకు దూరం పెట్టడమే ఉత్తమం. వీటికి బదులుగా పండ్లు, కూరగాయలు, పెరుగు వంటి ఆహార పదార్థాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.