India vs Pakistan: నిజంగానే పాకిస్థాన్ కి అంత శక్తి సామర్ధ్యాలున్నాయా? మా దగ్గర 150 అణుబాంబులున్నాయి. వాటితో మిమ్మల్ని భస్మీపటలం చేస్తానంటోన్న వారి మాటల్లో బలుపెంత వాపెంత? వాటీజ్ పాకిస్తాన్ అక్కడి స్థితిగతులపై యుద్దరంగ నిపుణల మాటేమిటి? ఆ వివరాలు ఎలా ఉన్నాయ్? వాటీజ్ రియల్ పిక్చర్ ఆఫ్ పాకిస్థాన్ వార్ కెపాసిటీస్ కమ్ వార్ స్ట్రాటజీస్?
పహెల్గాం దాడికి మూడ్రోజుల ముందు
ఇలాంటి మరిన్ని దాడులు కొని తెచ్చుకోవద్దని హెచ్చరికపహెల్గాం దాడి జరగటానికి మూడ్రోజుల ముందు ఆన్ రికార్డ్- పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ అసీం ఒక మాట అన్నాడు. మనం హిందూ భారత్‌కి వ్యతిరేకంగా ఒక పౌరయుద్ధం చేయాల్సి ఉందని కామెంట్ చేశాడు. మునీర్ ఆ మాటలన్న మూడు రోజుల తర్వాత పహెల్గాం దాడి జరిగింది. దీన్నిబట్టీ చూస్తే పాకిస్థాన్ హస్తం లేకుండా ఈ దాడి జరిగే ఛాన్సే లేదన్నది ఎక్స్ ఆర్మీ ఆఫీసర్స్ అంటోన్న మాట. పాక్ ఆర్మీ చీఫ్ అన్న మాటలకు తగిన విధంగా.. లష్కరే తోయిబాకు చెందిన కశ్మీర్ రెసిస్టెన్స్ ఫోర్స్- షాడో గ్రూప్ పహెల్గాం దాడులకు తెగబడింది. మరి ఇంత క్లియర్ గా ఆధారాలు కనిపిస్తుంటే పాకిస్థాన్ హస్తం లేదన్న మాట ఎలా అనగలం అని ప్రశ్నిస్తారు మాజీ సైనికులు.
ఇది హండ్రెడ్ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదమే
మునీర్ ఐఎస్ఐ చీఫ్ గా ఉండగా.. లష్కరే తోయిబా వంటి ఉగ్ర సంస్థలతో సబంధబాంధవ్యాలు నెరిపాడు కూడా. వీటన్నిటినీ బట్టీ చూస్తే ఇది హండ్రెడ్ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదమే. కన్ఫంగా చొప్పొచ్చంటారు.. భారత సైనికులు. పహెల్గాం దాడి తో ఒక్కసారిగా దేశమంతా ఉలిక్కి పడింది. మృతుల సంఖ్య 26, 28 ఏదైనా కావచ్చు. కానీ 150 కోట్ల భారతీయులకిది చెంప చెళ్లుమనిపించింది. మన శక్తి సామర్ధ్యాలను, ధైర్యసాహసాలను ముక్కుసూటిగా ప్రశ్నించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మనకు అత్యంత ఘోరమైన అవమాన భారం. దారుణమైన పరాభవం కూడా. మరి మనకు జరిగిన ఈ అవమానానికి తగిన శాస్తి చెప్పాలా వద్దా నిలదీస్తున్నారు మాజీ సైనికాధికారులు.
ఇచ్చోటనే లేత ఇళ్లాళ్ల పుస్తెల తాళ్లు తెగిన చప్పుళ్లు
ఎందుకంటే ఇది నేరుగా మన గుండెలకు గురి పెట్టిన గాయం. ఈ గాయానికి మందు పూయాలంటే అందుకు పాకిస్థాన్ కి గుణపాఠం చెప్పడమొక్కటే తరుణోపాయం అన్నది వీరి వాదన. సత్యహరిశ్చంద్ర పద్యాల్లో చెప్పినట్టు ఇచ్చోటనే లేత ఇళ్లాళ్ల పుస్తెల తాళ్లు తెగిన చప్పుళ్లు మన గుండెలనింకా వీడనే లేదు.
మన నవ వధువు, మన కంటి ముందే..
ఇది చాలా ఘోరమైన అవమాన భారం. ఇంత పెద్ద ఎత్తున సైనిక సంపత్తి ఉండి.. ఇంత భారీ మందీ మార్బలం ఉండి.. మన నవ వధువు, మన కంటి ముందే తన భర్తను కోల్పోయి గుండెలవిసేలా ఏడుస్తుంటే మనమంతా చూస్తూ ఊరకుంటే ఎలా? అన్న ప్రశ్న యుద్ధ విమానాలకన్నా భయంకరమైన శబ్ధం చేస్తున్న విధం చెవులను చిల్లులు పొడుస్తోంది.
నన్ను నా కొడుకును కూడా చంపేయండి- బాధిత మహిళ
ఇదే ఘటనలో మరొక బాధిత రాలు అంటున్న మాట కూడా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మరచిపోకూడదు. తన భర్తతో పాటు తననూ తన కొడుకును కూడా చంపమని ఆ ఉగ్రవాదిని ఆమె అడిగిన విధం.. మన నిస్సహయాతకు నిదర్శనం. సరిగ్గా ఇదే సమయంలో ఆ టెర్రరిస్ట్ ఈ మాట మీ మోడిని అడగమనడం చూస్తుంటే వారికి భారత్ అన్నా దాని సార్వభౌమాధికారం అన్నా ఎంతటి గౌరవ మర్యాదలున్నాయో ఊహించుకోవచ్చు. మరెంతటి భయ భక్తులున్నాయో అర్ధం చేసుకోవచ్చని అంటారు ఎక్స్ ఆర్మీ మేజర్స్.
ఇది వారి దమ్మూ ధైర్యం కాదు- మన చేతకాని తనం- మాజీ సైనికాధికారులు
ఇది వారి దమ్మూ ధైర్యం కాదు- మన చేతకాని తనం కింద లెక్క. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం చూస్తూ ఊరుకోకూడదు. ఇది పాక్ ప్రేరేపిత ఉగ్ర వాదపు పైశాచికత్వానికే పరాకాష్టగా వీరు అభివర్ణిస్తారు. మనమిలా వదిలేస్తూ పోతుంటే.. ఇలాంటి ఉగ్రదాడులు మరిన్ని జరిగే అవకాశముంది. దీన్ని మనం చేజేతులా కొని తెచ్చుకోవద్దనే హెచ్చరికలు జారీ అవుతున్నాయి.
పాకిస్థాన్ సైనిక సామర్ధ్యమెంత? దాని అణ్వాయుధ పటిమ ఏపాటిది?
పాకిస్థాన్ సైనిక సామర్ధ్యమెంత? దాని అణ్వాయుధ పటిమ ఏపాటిది? పాక్ ఆర్మీ జనరల్స్ కి అంత దమ్మూ ధైర్యముందా? విలాస వంతమైన జీవితాలను వదిలి వారంతటి సాహసానికి ఒడిగట్టగలరా? అసలు పాకిస్థాన్ ఆర్ధిక పరిస్థితి ఇందుకు సహకరించగలదా? ఇప్పటికే ఏ యుద్ధం చేయకుండానే గోధమ పిండికోసం అలమటిస్తున్న పాకీయులకు మన దేశపు గడ్డి పీకేంత అయినా కెపాసిటీ ఉందా? చూద్దాం.
ఉగ్రవాదుల స్కెచ్ లు వేసి చంకలు చరుచుకోవడం కాదు.
ఉగ్రవాదుల స్కెచ్ లు వేసి చంకలు చరుచుకోవడం కాదు..
మనం భయపడాల్సిన పనే లేదంటోన్న ఎక్స్ పర్ట్స్మనమంతా కలసి పహెల్గాం దాడికి గట్టిగా బదులు చెప్పాల్సిందే. తప్పదు. ఆ టెర్రరిస్టులు ముగ్గురా ఆరుగురా ఎనిమిది మందా అనవసరం. వారు ఇలా ఉంటారు అలా ఉంటారన్న మాటలు నిరుపయోగం. వారి స్కెచెస్ వేసి చంకలు చరుచుకోవడం వల్ల ప్రయోజనం శూన్యం. వారి మృతదేహాలను కళ్ల చూడాలి. మన గడ్డపైకొచ్చి ఇంత ధైర్యంగా తుపాకీ దూసి.. మన వారి ప్రాణాలు తీసిన వారినీ భూమ్మీద లేకుండా చేయాలి. ఇలాంటి దుర్ఘటనలు ఇకపై మన దేశంలో చూడకూడదు. ఈ దాడిని ఎంత మాత్రం ఉపేక్షించకూడదు. ఇదీ భారత మాజీ సైనికాధికారుల మాట.
పుల్వామా, ఉరీ, పహల్గామ్.. కాశ్మీర్ చరిత్రలోనే భయంకరం
పుల్వామా, ఉరీ, పహల్గామ్.. కాశ్మీర్ చరిత్రలోనే అత్యంత భయంకరమైన ఉగ్రదాడులు. వీటినెందుకు చేశారంటే కాశ్మీర్ ఆర్ధిక శక్తి సామర్ధ్యాలను నిర్వీర్యం చేయడానికే. ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. కాశ్మీరం ఎక్కడ స్వేచ్ఛ సంపాదిస్తుందో అన్న దురుద్దేశం కొద్దీ ఈ ప్రాంత ఆర్ధిక స్వేచ్ఛను ద్వంసం చేయడానికి వేసిన ఎత్తుగడ పహెల్గాం దాడి.
లైన్ ఆఫ్ కంట్రోల్ ని తప్పక చేధించాల్సిందే- మాజీ ఆర్మీ మేజర్
ఈ దాడికి భారత్ ఖచ్చితంగా స్పందించి తీరాల్సిందే. లైన్ ఆఫ్ కంట్రోల్ ని తప్పక చేధించాల్సిందే. అసిం మునీర్ మరో జీహాదీ ఉద్యమానికి తెరలేపక ముందే మనమీ కార్యాన్ని ముగించాలంటున్నారు మాజీ సైనికాధికారులు. ఈ మొత్తం దాడి వెనకున్న పాక్ ఆర్మీకి చీఫ్ కి, అతడి వెనకున్న ఐఎస్ఐకి.. వారి వెనకున్న జిహాదీ గ్రూపులకు ఎంటైర్ పాకిస్థాన్ ఎన్నటికీ మరచిపోని గుణపాఠం చెప్పి తీరాల్సిందే అన్నది వీరి వాదన.
ఇప్పటి వరకూ మనం రెండు సర్జికల్ స్ట్రైక్స్ చేశాం
ఇప్పటి వరకూ మనం రెండు సర్జికల్ స్ట్రైక్స్ చేశాం. అందులో ఒకటి సైనికులు చేయగా.. మరొకటి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బాలాకోట్ లో చేసినది. ఈ రెండు అటాక్స్ ద్వారా 200 పైగా టెర్రరిస్టులను మట్టుబెట్టిన మాట నిజం. వారి స్థావరాలను ధ్వంసం చేసినది వాస్తవం. ఈ దృశ్యాలు ఆనాడు దేశ ప్రజల మనసు చూరగొన్న విషయమూ తెలిసిందే. టీవీల్లో కనిపించిన ఈ దృశ్యాలు మన కళ్ల మంట చల్లార్చి ఉండొచ్చు. కానీ ఇది సరిపోదు. ఈసారికి జరిగే దాడి ప్రంచమంతా కలసి అచ్చెరువొందేలా ఉండాలి. ఉగ్రవాదానికి బుద్ధి చెప్పాలంటే భారత్ నుంచి చూసి నేర్చుకోవాలనే మాట వినిపించాలి. అలాంటి ల్యాండ్ మార్క్ లాంటి లెసన్ మనకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి చెప్పగలగాలని అంటారు వీరు.
మన ముందు మోకరిల్లి వారు కుళ్లి కుళ్లి ఏడ్వాలి
మన దగ్గర అందుకు తగిన అవకాశాలున్నాయా? అని చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్.. భారత్ పాక్ పై చేసే దాడులను అడిగేవారు లేరు. ఆ మాటకొస్తే ప్రస్తుతం ప్రపంచమంతా మన వైపే ఉంది. అలాగని ఈ బుద్ధి చెప్పే కార్యక్రమం తేలికగా తీసుకోకూడదు. అంచలంచెలుగా చేయాలి. ఒక పద్ధతి ప్రకారం జరపాలి. పాకిస్థాన్ ఇక జన్మలో కూడా ఇలాంటి ఉగ్రవాద ప్రేరేపిత కార్యకలాపాలకు పాల్పడరాదు. మన ముందు మోకరిల్లి వారు కుళ్లి కుళ్లి ఏడ్వాలి. అలా చేయాలంటే ఒక కార్యాచరణ అవసరమంటున్నారు మన మాజీ సైనికోద్యోగులు.
కాల్పుల విరమణ ఒప్పందం రద్దు చేయాలి- వార్ ఎక్స్ పర్ట్స్
స్టెప్ వన్ లో భాగంగా చూస్తే కాల్పుల విరమణ ఒప్పందం రద్దు చేయాలి. మూడు నాలుగేళ్ల క్రితం నాటి జనరల్ బజ్వా తన దేశ ఆర్ధిక పరిస్థితి కారణంగా తన సైనిక శక్తి సామర్ధ్యాలు సన్నగిల్లడంతో మనల్ని వేడుకుని సాధించుకున్నది. అలాంటి ఉదారవాద ఒప్పందాలను ఇకనైనా పక్కన పెట్టాలి.
బోఫోర్స్, మల్టీ బేరల్ రాకెట్ లాంచర్లను..
ఇక రెండోది ఏంటంటే మన మీడియం ఆర్టిలరీ ని రంగంలోకి దించాలి. బోఫోర్స్, మల్టీ బేరల్ రాకెట్ లాంచర్లను పీఓకేలోని టెర్రరిస్టు స్థావరాలపై ప్రయోగించాలి. మన ఆయుధ ప్రయోగాలకు అక్కడి టెర్రరిస్టుల కూచాలు కదలిపోవాలి. వీటితో పాటు మరికొన్ని పాకిస్తానీ స్థావరాలపై మనం గురి పెట్టాలి. ఉగ్రమూకలకు సహాయ సహకారాలందించే ప్రాంతాలను గుర్తించి మరీ వారిపై దాడులు నిర్వహించాలి. పరిస్థితిని మన అదుపులోకి తెచ్చుకోడానికి మరికొన్ని దాడులు, లక్ష్యాలు కూడా మనకు అవసరపడతాయని అంటారు యుద్ధ రంగ నిపుణులు.
లాహోర్, కరాచీ లో దాగిన ఉగ్రవాదులను అంతం చేయాలి
మూడో స్టెప్ ఎలాంటిదని చూస్తే బ్రహ్మోస్ వంటి మన క్షిపణుల ద్వారా లాహోర్, కరాచీ వంటి ప్రాంతాల్లో తలదాచుకున్న టెర్రరిస్టులను హతం చేయాలి. వారి స్థావరాలను లేకుండా చూడాలి. కాకులను, పావురాళ్లను చంపి అదే పెద్ద గొప్పగా చెప్పుకోవడం కాదు. మనము, ఉగ్రవాదులే కాదు పాకిస్థానీయులు, ఈ ప్రపంచమంతా కూడా భారత్ తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో కళ్లారా చూడాలి. అంతటి టెర్రర్ అటాక్ చేయగలగాలి. పహెల్గాం దాడుల సమయంలో కేకులు కట్ చేసుకున్న వారి గుండెలదరాలని వీరు కుండ బద్ధలు కొడుతున్నారు.
బాలాకోట్ తర్వాత మాత్రం వారు ఏం చేశారని?
భారత్ చేసే దాడులకు పాకిస్తాన్ ఏం చేస్తుంది? అని చూస్తే.. పాకిస్థాన్ ఇప్పటి వరకూ ఇలాంటి దాడుల తర్వాత ఏం చేసిందో తరచి చూస్తే ఇట్టే తెలిసి పోతుంది. వారిపై ఇప్పటి వరకూ ఆఫ్గనిస్థాన్, ఇరాన్ ఇలాంటి దాడులు చేసినపుడు చేసిందేమీ లేదు. బాలాకోట్ తర్వాత మాత్రం వారు ఏం చేశారని? వారికి దొంగ దెబ్బలు తీయడం తప్ప మరేమీ తెలీదు. అభినందన్ విషయంలో ఏం జరిగిందో మనం చూసే ఉంటాం. దీంతో సరిపోతుందా? మనకు ఇలాంటిది సరిపోదు. అలా సరిపోలేదు కాబట్టే.. ఇదిగో ఇలాంటి పహెల్గాం తరహా దాడులు జరుగుతూనే ఉన్నాయ్. దేశవాసులను చిన్నా చితకా దాడులతో తరచూ మభ్య పెట్టలేం. ఇందుకంటూ ఒక శాశ్వత పరిష్కార మార్గం కనుగొనాలి.
పాక్ ఎయిర్ ఫోర్స్ కి అపారమైన నష్టం కలిగించాలి
మనం ఏమనుకున్నామో అది చేసెయ్యాలి. అంతే కానీ ఆలోచిస్తూ కూర్చో కూడదు. మనతో పెట్టుకుంటే ఆ నష్టం ఎలా ఉంటుందో వారికి రుచి చూపించాల్సిందే. మొదట వారి ఎయిర్ ఫోర్స్ కి అపారమైన నష్టం కలిగించాలి. సుమారు ఐదారు రోజుల పాటు ఈ యుద్ధం జరగాలి. మన ఎయిర్ ఫోర్స్ సామర్ధ్యమేంటో వారికి రుచి చూపించాలి. ఆ దేశం మీద మన దేశానికున్న ఎయిర్ ఫోర్స్ సుపీరియారిటీని చాటాలి.
మన దేశపు ఎయిర్ ఫోర్స్ సుపీరియారిటీని చాటాలి
ఇక పోతే మనకున్న మరో ఆప్షన్ పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ని స్వాధీన పరుచుకోవడం. ఆ ప్రాంతాన్ని తిరిగి మన భారతదేశంలో కలుపుకోవాలి. ఇలా స్టెప్ బై స్టెప్ పాకిస్థాన్ ని ఆత్మరక్షణలో పడేయ్యాలి. ఇలాంటి చర్యలతో పాకిస్తాన్ ఎకానమీ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది.
ఇప్పటికే పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు గజగజ
ఇప్పటికే పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు గజగజలాడుతున్నాయ్. ఎక్కడ యుద్ధం వస్తుందో అన్న భయం కొద్దీ మార్కెట్లపై ఎగబడి పాకిస్తానీయులు రేషన్ సరుకు విచ్చలవిడిగా కొంటున్నారు. ఎందుకంటే ఒక్కసారి యుద్ధం గానీ మొదలైతే ఇక అక్కడి ఆహార నిల్వలు ఇతర నిత్యావసరాలు పాక్ ఆర్మీ కంట్రోల్ లోకి వెళ్లిపోతాయి. ఎలాంటి యుద్ధ వాతావరణం లేకుండానే అక్కడ గోధుమ పిండి నిల్వలు అడుగంటాయి. పట్టపగలు గ్రామాల్లో విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ఇక యుద్ధం మొదలైతే.. ఆయుధ కర్మాగారాలకు ఇతర యుద్ధ అవసరాలకు కరెంటు సరఫరా చేయడం కోసం నగరాల్లో కూడా విద్యుత్ ఆపేస్తారు. దానికి తోడు యుద్ధానికి వంద రూపాయలు ఖర్చు అవుతుందంటే యుద్ధ సన్నాహాలకు యాభై రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పాకిస్థాన్ ఈ యుద్ధాన్ని పూర్తి స్థాయిలో చేయడం కల్ల. ఈ పరిణామక్రమాలను ఎట్టి పరిస్థితుల్లో మనం మరవరాదు. ఈ వార్ టెర్రర్ డ్రామాతో వారిని కట్టిపడేయాలి.
కార్గిల్ వార్ లో ఎన్ని న్యూక్లియర్ వెపన్స్ వాడింది?
పాకిస్థాన్ న్యూక్లియర్ స్టేట్ అనేది మరో భ్రమ. రష్యాకన్నా పెద్ద గొప్పేమీ కాదు. ఉక్రేయిన్ తో మూడేళ్లుగా జరుగుతున్న యుద్ధంలో రష్యా ఎన్ని న్యూక్లియర్ మిస్సైళ్లను వాడింది? పాకిస్తాన్ ఇందుకు భిన్నం అనే వారికి మరో ప్రశ్న. ఆ మాటకొస్తే ఇదే పాకిస్తాన్ కార్గిల్ వార్ లో ఎన్ని న్యూక్లియర్ వెపన్స్ వాడింది? న్యూ డిల్లీలో ఎన్ని న్యూక్లియర్ బాంబులు వేసింది? మనకీ న్యూక్లియర్ కెపాసిటీ ఉంది. ఇక్కడ భారత్ వాటిని దీపావళి కోసం దాచి ఉంచలేదంటారు సైనికులు.
వచ్చే 700 ఏళ్లు పాక్ లో గింజ, బియ్యం గోదుమలు పండవు
మనంగానీ మనదగ్గరున్న న్యూక్లియర్ ఆయుధాలను వాడితే.. వచ్చే 700 ఏళ్ల పాటు.. గింజ బియ్యంగానీ, గోధుమ గానీ పాకిస్థాన్ లో పండవు గాక పండవు. పాకిస్థాన్ గుండెలు దీసిన బంటు. వాళ్లకు కనీస దయా జాలీ ఉండదు. వారు అత్యంత క్రూరులు, కఠినాత్ములు అనడానికి వీల్లేదు.
పాకిస్థాన్ సైన్యాధ్యక్షులు అత్యంత పిరికివారు
ఇవన్నీ ఇలాగుంటే.. పాకిస్థాన్ సైన్యాధ్యక్షులు అత్యంత పిరికివారు. వారికి తమ ప్రాణమంటే ఎంతో ముక్కువ ఎక్కువ. అందుకే వారు తాము నివసించే బంగళాలకు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసుకుంటారు. వారేంటో వారి భార్యల నగ నట్రల హంగు ఆర్బాటాలేంటో బెంజి కార్ల విలాసాలేంటో అన్నట్టుగా జీవిస్తుంటారు. ఇలాంటి సుఖ భోగాలను వదిలి వారు తమ ప్రాంతం మొత్తం నిర్వీర్యం అయిపోవాలని ఎట్టి పరిస్థితుల్లోనూ కోరుకోరు. తమ పదవుల ద్వారా పొందుతున్న ఇంతటి హుంగు ఆర్భాటాలను వదిలి వారు న్యూక్లియర్ పొగల వాసన ఆస్వాదించాలని కోరుకోరు. పాక్ ఆర్మీ దగ్గరున్న న్యూక్లియర్ వెపన్స్ భయ పెట్టడానికి తప్ప వాడ్డానికి కాదని అంటారు నిపుణులు.
వెనకుండి నడిపిస్తున్న వారి ఒంట్లో ఒణుకుపుట్టాలి
యుద్ధ రంగ నిపుణులు క్రిస్టల్ క్లియర్‌గా చెబుతున్నదేంటంటే.. మనం పాకిస్థాన్ కి ఒక గుణపాఠం చెప్పాలి. అది వారు ఎన్నటికీ మరచిపోలేనిదిగా ఉండాలి. వారికి అత్యంత కఠిన శిక్షలు విధించాలి. ఇక చాలు. ఇకపై మనం ఇలాంటి ఉగ్ర ప్రేరేపితాలకు స్వస్థి పలకాల్సిందే అనిపించగలగాలి. ఇదే పాకిస్థానీయులు.. రష్యా- ఉక్రేయిన్ పై, ఇజ్రాయేల్- గాజా మీద చేసేలాంటి దాడులను ఆశించే పనైతే దశబ్దాలకు తరబడి నరకం అనుభవించాల్సి ఉంటుంది. ఇది వారికి తెలియాలి. ఇద్దరు ముగ్గురు చోటా మోటా టెర్రరిస్టులను చంపగానే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి మనం బుద్ధి చెప్పినట్టు కాదు. ముందు ఈ దాడులకు పాల్పడాలన్న ఆలోచన రావడానికే హడలి చావాలి. దీంతో పాటు వీరి వెనకుండి నడిపిస్తున్న వారి ఒంట్లో ఒణుకుపుట్టాలి.
మనం భయపడాల్సిన పనే లేదంటోన్న ఎక్స్ పర్ట్స్
ఈ సారి మనం కొట్టే దెబ్బ పాకిస్థాన్ ఉగ్రవాదం మన భూభాగంలోకి చొరబడ్డానికి ఒకటి పది సార్లు ఆలోచించాలి. ఇలాంటి దాడులకు తెగబడ్డానికి జీవితాంతం కూర్చుని థింక్ చేయాలి. ఈ చిన్న దెబ్బ తగిలినా కుప్పకూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పాకిస్థాన్ ఆర్ధిక వ్యవస్థను చూసి మనమంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఇదీ భారత మాజీ సైనికాధికారులంటోన్న మాట. మరి మన కేంద్రం ఈ దిశగా ఎలాంటి ఏర్పాట్లు చేస్తుందో తేలాల్సి ఉంది.