Bollywood:సినీ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా వరుస విషాదాలు అభిమానులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. నిన్నటికి నిన్న మలయాళం డైరెక్టర్ షాజీ. ఎన్. కరుణ్ తుది శ్వాస విడవగా.. ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ నటుడు రోహిత్ బాస్పోర్ అనుమానాదాస్పద స్థితిలో కన్నుమూశారు. అస్సాంలోని ఒక జలపాతం వద్ద ఆయన మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులు దీనిని హత్యగా అనుమానిస్తున్నారు. అయితే దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. పలువురు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. సడన్గా ఆయన ఆత్మహత్య చేసుకోవడం ఏంటి..? ఆయన ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఆయనను ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఫ్యామిలీ మ్యాన్ 3తో భారీ గుర్తింపు..
ప్రస్తుతం ఈయన ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ సిరీస్ లో నటిస్తున్నారు. ఇకపోతే ఈయన నిన్న సాయంత్రం తన మిత్రులతో కలసి అస్సాంలోని గర్భంగా అడవిలోకి వెళ్లారు. అయితే ఏమైందో తెలియదు కానీ అనూహ్యంగా ఆయన మృదేహం గర్భంగా ఫాల్స్ వద్ద కనిపించడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇకపోతే ఈ సినిమాలో ఈయన నటన చూసి.. కచ్చితంగా ఈయనను గుర్తుపెట్టుకుంటారని మేకర్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఇలా ఊహించని స్థితిలో మరణించడం నిజంగా బాధాకరం అనే చెప్పాలి.
ది ఫ్యామిలీ మ్యాన్ 3..
ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ యొక్క మూడవ సీజన్ ది ఫ్యామిలీ మ్యాన్ 3.. 2025 నవంబర్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది.ముందుగా దీపావళికి విడుదల చేయాలని మేకర్స్ అనుకున్నప్పటికీ కొన్ని కారణాలవల్ల నవంబర్ కి వాయిదా వేశారు. ఈ సిరీస్లో మనోజ్ వాజ్పేయి, ప్రియమణి , షరీబ్ హష్మీ, ఆశ్లేష ఠాకూర్ , వేదాంత్ సిన్హా, దలీప్ తాహిల్ తో పాటూ రోహిత్ బాస్ఫోర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇకపోతే ఇదే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో గతంలో ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో నటించింది.