Illu Illalu Pillalu Today Episode April 29th: నిన్నటి ఎపిసోడ్ లో.. వేదవతి రామరాజు ఇద్దరూ కొడుకులకు శోభన జరుగుతున్న సందర్భంగా సంతోషంగా ఉంటారు. మనిద్దరి కొడుకులకి పిల్లలు పుడితే నేనొక్కదాన్నే కాదు చూసుకోవాల్సిన సుమీ మీరు కూడా చూసుకోవాలని వేదవతి సరదాగా అంటుంది. మీరు రైస్ మిల్లు పక్కన పెట్టేసి పిల్లల్ని మాత్రమే చూసుకోవాలి అని అంటుంది. నా మనమని తీసుకొని రైస్ మిల్లు కు వెళ్ళిపోతాను అని సరదాగా రామరాజు కూడా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే శ్రీవల్లి ఏడ్చుకుంటూ అక్కడికి వచ్చేస్తుంది. మావయ్య గారు అండి అత్తయ్య గారండి మీకు విషయం చెప్పాలి కానీ నా నోటితో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని కాస్త ఆలోచిస్తుంది. మా శోభనాన్ని ఆపేయండి మావయ్య గారు అత్తయ్య గారు అని అడుగుతుంది.. ఆ మాట వినగానే ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. వేదవతి ఏమైందమ్మా ఎందుకిలా అంటున్నావ్ ఎవరైనా ఏమైనా అన్నారా అని అడుగుతుంది. ఇద్దరికి శోభనం చేస్తే ప్రాణమే పోయే ప్రమాదం ఉందని పంతులుగారు చెప్పారు అని అంటుంది. తన ప్లాన్ ను వర్కౌట్ అయ్యేలా చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. లోపల గదిలో శోభనం జరుగుతుంటే, నర్మదా సాగర్ లు కూడా ముద్దు ముచ్చట తీర్చుకుంటుంటారు. బయట ప్రేమ ధీరజ్లు దెయ్యాల స్టోరీ తో సరదాగా ఉంటారు. ధీరజ్ కు దెయ్యాలు ఉన్నాయని ప్రేమ అడిగితే ఒక పెద్ద స్టోరీ నే చెప్పి ప్రేమను భయపెట్టాడు. ఇక అప్పుడే కరెంటు పోవడంతో ప్రేమ నిజంగానే దెయ్యాలు ఉన్నాయి ఏమో అని షాక్ అవుతుంది. అందరూ సరదాగా ఒక సాంగ్ ను వేసుకుంటారు. మొత్తానికి పెద్దోడి శోభనం పూర్తవుతుంది. ఉదయం రామరాజు బయటికి వెళ్తాడు. టీ కొట్టు దగ్గరికి వెళ్లి టీ అడగ్గాని అందరూ పెద్దోడికి పెళ్లి చేశారు చాలా సంతోషంగా ఉంది కదా అనేసి అడుగుతారు.
అప్పుడే సేనాపతి వచ్చి పెద్ద కోడలు ఇంటికి రాగానే చిన్న కోడలు బయటకు పంపించేశారు ఈయన ఒక పెద్ద మనిషి ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటాడు. నేను చెప్పింది అబద్ధం అయితే మీ ముందరే రామరాజు ఉన్నాడు కదా అడిగి తెలుసుకోండి అని అందరితో అంటాడు. అక్కడున్న పెద్ద మనుషులు ఏంటి రామరాజు గారు ఇది నిజమా అంటే రూమ్ ఒకటి కట్టేస్తున్నాము మేము మా రూమ్ లో ఉండమన్న కూడా చిన్నోడు చిన్న కోడలు హాల్లో ఉంటామని చెప్పారు. వద్దని చెప్పిన కూడా వాళ్ళు బయట ఉంటామని చెప్పారు అని రామరాజు ఎంత చెప్పినా కూడా సేనాపతి మాత్రం రామరాజు పై పెటైర్లు వేస్తాడు. కొత్త కోడలు రాగానే పాత కోడల్ని బయటకు పంపించారా రామరాజు గారు అని అందరూ అడగడంతో అవమానంగా ఫీల్ అయిపోతాడు.
అక్కడినుంచి కోపంగా ఇంటికి వచ్చినా రామరాజు వేదవతి పై అరుస్తాడు. మన రూమ్ ని వెంటనే ఖాళీ చెయ్యి చిన్నోడికి ప్రేమకి ఆ రూమ్ ఇచ్చేద్దాము అని అంటాడు. ఏమైంది నాన్న ఎందుకలా అంటున్నారు మీరు ఎక్కడ ఉంటారు మీరు ఇక్కడే ఉండండి మేమే బయట ఉంటాను కదా నేను చెప్పాను కదా మళ్ళీ ఏంటి ఇలా అనేసి అడుగుతాడు ధీరజ్.. మీరు హాల్లో పడుకోమని చెప్తే బయటకి ఎందుకు పడుకున్నారు అది చూసిన వాళ్ళు నన్ను వచ్చేసి కొత్త కోడలు రాగానే పాత కోడలు బయటికి పంపించారు అని దారుణంగా అన్నారని రామరాజు సీరియస్ అవుతాడు.
ఏంటి బుజ్జమ్మ నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావ్ నీకు చెప్తే అర్థం కాదా.. సామాన్లని బయటికి తీసుకురా ఆ గదిలో చిన్నోడు చిన్న కోడలు ఉంటారు అని రామరాజు అంటాడు. సాగర్ నర్మదా మా రూంలో ఉండండి మామయ్య అంటారు. ఎవరి మాట నేను వినను నేను చెప్పిందే ఫైనల్ అని అంటాడు రామరాజు. కానీ శ్రీవల్లి మాత్రం మేము వచ్చిన తర్వాత వాళ్ళకి రూమ్ లేకుండా పోయిందని అందరూ మమ్మల్ని అనుకుంటారు మావయ్య గారు మీరు అత్తయ్య మా గదిలోనే ఉండండి మేమే బయట ఉంటామని శ్రీవల్లి అంటుంది..
కొత్త కోడలు రాగానే అత్తమామలు బయటకు గెంటేస్తుందని ఆ మాట నాకు వస్తుంది అని శ్రీవల్లి అంటుంది. అయినా ధీరజ్ ప్రేమలని మేము రూమ్ అడగలేదు. ఇప్పుడు బయట ఎందుకు పడుకున్నారు మీ పరువు తీయాలనే పడుకున్నారా నాకు అలాగే అనిపిస్తుంది అని శ్రీవల్లి ఇంట్లో చిచ్చు పెడుతుంది. మేము బయట చదువుకోడానికి బాగుంటుంది కదా అనేసి అక్కడ పడుకున్నాను తప్ప వేరే ఉద్దేశం లేదు అక్క నువ్వు ఆలోచించుకొని మాట్లాడు అని ప్రేమ అంటుంది.. ప్రేమకు నర్మదా సపోర్ట్ చేస్తుంది.. శ్రీవల్లి మాత్రం స్టోర్ రూమ్ లో మేము ఉంటాము మీరు మా రూంలో ఉండండి అనేసి అంటుంది.. ధీరజ్ స్టోర్ రూమ్ లో మేము ఉంటాము అని చెప్తాడు. మొత్తానికి శ్రీవల్లి ప్లాను వర్కౌట్ అవుతుంది. ఒక కోడల్ని స్టోర్ రూమ్ కు పంపించాను. ఇక రెండో కోడలు సంగతి చూస్తే నేనే ఇంటికి మహారాణి అని శ్రీవల్లి అనుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి.