BigTV English

Humanoid Robots: ఏఐ చిట్టి.. రెడీ! 2025 – 2075 ఎలా ఉండబోతుందో తెలిస్తే..!

Humanoid Robots: ఏఐ చిట్టి.. రెడీ! 2025 – 2075 ఎలా ఉండబోతుందో తెలిస్తే..!

ఇంకొన్నాళ్లలో రోబో యుగం చూడబోతున్నామా?

ఇకపై.. ప్రతి పనిని రోబోలే చేసేస్తాయా?


ఇంటి నుంచి ఆఫీస్ దాకా రోబోలే ఉంటాయా?

ఇంటి పనులకు రోబోలు రాబోతున్నాయా?

ఎస్.. టెక్నాలజీలో వస్తున్న ఇన్నోవేషన్లతో.. కచ్చితంగా సూపర్ రెవల్యూషన్ రాబోతోంది. టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ.. ప్రపంచ కంపెనీలు హ్యూమనాయిడ్ రోబోల తయారీపై ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే.. ఈ విషయంలో ఎంతో ముందడుగు వేశాయి. ఈ రోబోలు గనక సక్సెస్ అయ్యాయంటే.. మనుషుల రోజువారీ జీవితమే మారిపోతుంది. ఒక్క హ్యూమనాయిడ్ రోబోని కొని తెచ్చుకుంటే.. ఇంట్లో ఇక పని మనిషి అవసరమే ఉండదు. పొద్దున లేవగానే కాఫీ తెచ్చివ్వడం దగ్గర్నుంచి.. ఇల్లు క్లీన్ చేయడం వరకు అన్నీ రోబోనే చేసేస్తుంది. అదీ, ఇదీ అనే తేడా ఏమీ లేదు.. ఏ పని చెప్పినా.. అరక్షణమైనా ఆలోచించకుండా పనిచేస్తాయి ఈ రోబోలు. ఈ రోబోలు ఉంటే.. మనుషులకు అలుపు అనేదే ఉండదు. శారీరక శ్రమ ఎంతో తగ్గిపోతుంది.

ఇస్త్రీ చేయడం, ఇంటి అద్దాల్ని తుడవడం లాంటి పనులు

ఈ హ్యూమనాయిడ్ రోబోలు ఇంట్లో సౌకర్యవంతంగా తిరుగుతాయి. ఇంటి సహాయకుడిగా అనేక పనులు చేస్తాయి. వాక్యూమ్ చేయడం, బట్టలు ఇస్త్రీ చేయడం, ఇంటి అద్దాల్ని తుడవడం లాంటి ఎన్నో పనుల్ని.. మనుషుల మాదిరిగానే ఈజీగా చేసేస్తాయి. ఇంట్లో ఉన్నవారికి సాయం చేయడంలో ఉపయోగపడతాయి. ఫుడ్ అందించడం, గోడమీద పెయింటింగ్ సరిచేయడం, యజమాని ఆదేశాలకు ప్రతిస్పందించడం లాంటివి చేస్తూ.. ఇప్పటికే అందరినీ ఆశ్చర్యపరిచాయి. పార్శిల్స్ డెలివరీ తీసుకోవడం, పని పూర్తయ్యాక.. మనిషిలాగే రెస్ట్ తీసుకోవడం లాంటివి కూడా చేసేస్తున్నాయి. ఈ రోబోలని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో తయారుచేయడం వల్ల.. మనుషుల భాషని, సైగల్ని కూడా అర్థం చేసుకోగలవు. పైగా.. ఈ రోబోలు చాలా నిశ్శబ్దంగా పనిచేస్తాయి. మల్టిపుల్ జాయింటెడ్ మెకానిజం ద్వారా రోబో పని సామర్థ్యం కూడా బాగుంటుంది.

రోబోల్ల ఏఐ ఆధారిత చాట్ జీపీటీ లాంటి సిస్టమ్

అంతేకాదు.. ఈ రోబోల్లో ఏఐ ఆధారిత చాట్‌బాట్ చాట్ జీపీటీ లాంటి సిస్టమ్ కూడా ఉంటాయి. రోబోలకు సహజ సంభాషణల్ని నేర్పేందుకు.. ప్రత్యేకంగా లార్జ్ లాంగ్వేజ్ మోడల్‌ని కూడా రూపొందించాయి టెక్ కంపెనీలు. రోబో కూడా మన మాటలకు రెస్పాండ్ అవుతుంది. టెక్నాలజీపరంగా చెప్పాలంటే.. ఇది అమెజాన్ అలెక్సా మాదిరిగా ఉంటుంది. ఇందులోని మైక్రో ఫోన్లు.. ఎంటర్టైన్‌మెంట్, కమ్యూనికేషన్, వాయిస్ ఇంటరాక్షన్ సౌకర్యాన్ని కూడా అందిస్తాయి.

ఏఐ వచ్చాక చాలా దేశాల్లో పెరుగుతున్న రోబోల వినియోగం

సహజంగా మనుషుల్లాగే నడవడంతో పాటు కుర్చీలో గానీ, సోఫాలో గానీ సులువుగా కూర్చుంటాయి. ఇంటి వాతావరణంలో పనిచేసే హ్యూమనాయిడ్ రోబోట్ల సామర్థ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు ప్రముఖ కంపెనీలన్నీ పనిచేస్తున్నాయి. ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక.. చాలా దేశాల్లో రోబోల వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే.. టెలి కాలింగ్ నుంచి మొదలుకొన్ని కొన్ని చోట్ల అగ్ని ప్రమాదాల్లోనూ ఈ రోబోలని వినియోగిస్తున్నారు.

రోబోట్ సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో ఫిగర్ ఏఐ

మరోవైపు.. ఫిగర్ ఏఐ కూడా తన హ్యుమనాయిడ్ రోబోట్ సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో నిమగ్నమై ఉంది. ఇంట్లో పనిచేయడానికి సంబంధించిన రోబోలను త్వరలోనే టెస్ట్ చేయనున్నట్లు.. కంపెనీ ప్రకటించింది. తమ ఏఐ హెలిక్స్.. ఎవరూ ఊహించని దానికంటే వేగంగా ముందుకొస్తుందని తెలిపారు. తమ హెలిక్స్ రోబో.. అచ్చం మనుషుల్లాగే ఆలోచించగలదని, ఇంట్లోని ప్రతి వస్తువును గుర్తించగలదని ఫిగర్ ఏఐ ఫౌండర్ బ్రెట్ ఆడ్‌కాక్ ప్రకటించారు. రోబో మన మాటల్ని అర్థం చేసుకుంటుందని.. మనం అడిగిన ఏ వస్తువునైనా తెచ్చి.. మన చేతికి ఇస్తుందన్నారు. తమ రోబోని నియంత్రించడం కూడా చాలు సులువు అని చెబుతోంది ఫిగర్ ఏఐ కంపెనీ. ఈ హెలిక్స్.. రోబోటిక్స్ రంగంలోనే సరికొత్త ఆవిష్కరణగా చెబుతున్నారు.

ఏ పనైనా చేసేందుకు అవసరమైన టెక్నాలజీతో రోబోలు

ఫిగర్ ఏఐ రోబోలు తమ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు, భాషని అర్థం చేసుకునేందుకు, ఇతరులతో మాట్లాడేందుకు.. ఏదైనా పనిని చేసేందుకు అవసరమైన టెక్నాలజీతో సిద్ధమవుతాయి. కేవలం.. ఇంట్లో పనిచేసే రోబోలు మాత్రమే కాదు.. ఫ్యాక్టరీల్లో పనిచేసేందుకు ఉపయోగపడే రోబోలని కూడా కంపెనీ తయారుచేస్తోంది. ఫ్యాక్టరీలో పనిచేసే రోబోల కదలికలు, అవి ఎలా పనిచేస్తాయని తెలిపేందుకు ఓ వీడియోని కూడా రిలీజ్ చేశారు. రోబోలు వాటికి కేటాయించిన ప్రాంతాల్లో వెళ్లి నిలబడటం, వస్తువుల్ని పక్కకి తీయడం లాంటివన్నీ సులువుగా చేసేస్తున్నాయి.

ప్లాంట్‌లో పనిచేస్తున్న సిబ్బంధికి టీ, కాఫీలు ఇస్తున్న రోబోలు

ఈ రకమైన రోబోలు.. లాజిస్టిక్ కంపెనీల్లో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే.. ఓ కార్ ప్లాంట్‌లో పనిచేసేందుకు ఫిగర్. ఏఐ సంస్థ ఈ హ్యుమనాయిడ్ రోబోలని తయారుచేస్తోంది. ఇవి.. ప్లాంట్‌లో పనిచేస్తున్న సిబ్బందికి టీ, కాఫీలు ఇస్తున్నాయి. కాఫీ చేసే క్రమంలో ఏదైనా పొరపాటు జరిగితే.. వాటికవే స్వయంగా ఆలోచిస్తూ సమస్యని పరిష్కరించుకుంటున్నాయి. ఇప్పటికే.. అమెజాన్ సంస్థ.. తమ వేర్‌హౌజ్‌ల్లో పనిచేసేందుకు ప్రయోగాత్మకంగా రోబోలను ప్రవేశపెట్టింది. మరో రెండేళ్లలోనే.. ఈ విధమైన హ్యుమనాయిడ్ రోబోలు మార్కెట్‌లోకి రానున్నాయని వాటి తయారీ కంపెనీలు పక్కాగా చెబుతున్నాయి.

రోబోటిక్స్.. టెక్ వరల్డ్‌లో రాబోయే తర్వాతి సెన్సేషన్!

ఇప్పటికే.. ఎన్నో రోబోలు వచ్చాయి. పారిశ్రామిక రంగంలో కీలకంగా పనిచేస్తున్నాయి. కానీ.. అవన్నీ హ్యుమనాయిడ్ రోబోలు కాదు. ఇక భవిష్యత్ అంతా వాటిదే అనే చర్చ ఇప్పుడు విస్తృతంగా సాగుతోంది. ఎన్‌విడియా వ్యవస్థాపకుడు జెన్సెన్ హువాంగ్ కూడా చాట్ జీపీటీ లాంటి ఏఐ రెవల్యూషన్.. రోబోటిక్స్ రంగంలోనూ దగ్గరలోనే ఉందని చెప్పడం.. టెక్ వరల్డ్‌లో హాట్ డిబేట్‌కు దారితీసింది. మరోవైపు.. రోబోటిక్స్ కంపెనీ.. ఫిగర్ ఏఐ సైతం.. మానవ వేగంతో లాజిస్టిక్స్ యూనిట్‌లో ప్యాకేజింగ్ చేస్తున్న రోబోలని ప్రదర్శించడం కూడా సెన్సేషన్‌గా మారింది.

నార్వే నుంచి నియో గామా హ్యూమనాయిడ్ రోబో

మరో రెండేళ్లలోనే.. ఫిగర్ ఏఐ కంపెనీ.. ఈ రోబోట్లు ఇళ్లకు వచ్చేస్తాయని చెబుతున్నారు. ఈ ఫిగర్ 02 రోబోలు ఇప్పుడు.. హెలిక్స్ ఏఐతో పనిచేస్తున్నాయి. వీటికి.. ట్యూనింగ్ అవసరం లేదు. నార్వేకు చెందిన 1 ఎక్స్ కూడా.. నియో గామా హ్యూమనాయిడ్ రోబోట్‌ని ఆవిష్కరించింది. ఇది.. ఇంటి పనుల చక్కబెట్టగలదు. తన యజమానులతో చక్కగా సంభాషించగలిగే స్కిల్ కూడా ఉంది.

జీ1 హ్యూమనాయిడ్ రోబోని లాంచ్ చేసిన చైనా యూనిట్రీ

చైనాకు చెందిన యూనిట్రీ సంస్థ కూడా జీ1 అనే హ్యూమనాయిడ్ రోబోని లాంచ్ చేసింది. ఇది.. సొంతంగా డ్యాన్స్ చేస్తుంది. మెట్లు ఎక్కుతుంది. బ్యాలెన్స్ చేసుకుంటూ నడుస్తుంది. ఏదైనా ఎదురుపడితే.. అందుకు తగ్గట్లుగా వ్యవహరిస్తుంది. ఈ జీ1 రోబో వీడియోలు ఇప్పటికే ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయ్. దీని రేటు కూడా 13 లక్షలకు పైనే ఉంటుందని చైనా కంపెనీ యూనిట్రీ ప్రకటించింది. ఫిగర్ ఏఐ, యూనిట్రీ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా టెస్లా, బోస్టన్ డైనమిక్స్, సాంక్చరీ ఏఐ లాంటి పాపులర్ కంపెనీలు కూడా హ్యూమనాయిడ్ రోబోలపై రీసెర్చ్ చేస్తున్నాయి.

టెస్లా ఆప్టిమస్ రోబో తయారీకి రూ.8 లక్షల పైనే ఖర్చు

ఇప్పటికే.. కొన్ని కంపెనీలు ప్రాథమికంగా రోబోలని ఆవిష్కరించాయ్. భవిష్యత్తులో.. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఒక రోబో ఉంటుందని.. టెస్లా తయారుచేస్తున్న ఆప్టిమస్ రోబోలకు ఫుల్ గిరాకీ ఏర్పడుతుందని గతంలోనే ఎలాన్ మస్క్ చెప్పారు. టెస్లా మేడ్ ఆప్టిమస్ రోబో ఒక్కో యూనిట్ తయారీకి 8 లక్షల పైనే ఖర్చవుతోందని అంచనా వేస్తున్నారు.

గ్లోబల్ మార్కెట్లో రోబోటిక్స్ కోసం 16 బిలియన్ డాలర్ల ఖర్చు

ఇప్పటికే.. గ్లోబల్ మార్కెట్‌లో రోబోటిక్స్ కోసం 16 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు పెడుతున్నారు. 2019 నుంచి చూసుకుంటే.. ఈ రోబోటిక్స్ ఇండస్ట్రీపై 90 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టారు. ఒక్క 2023లోనే.. 13 బిలియన్ డాలర్లు రోబోటిక్స్ రంగంపై ఇన్వెస్ట్ చేశారు. ఆ ఒక్క ఏడాదిలోనే.. ప్రొఫెషనల్ సర్వీసెస్ కోసం 2 లక్షల 5 వేల రోబో యూనిట్లని విక్రయించారు. గతంలో పోలిస్తే.. 30 శాతం సేల్స్ పెరిగాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 43 లక్షల రోబోలు.. ఫ్యాక్టరీల్లో ఆపరేషన్‌లో ఉన్నాయి. ఈ ఏడాది కార్మికుల కొరతను తగ్గించే కీలక ఫ్యాక్టర్స్‌లో.. ఫిజికల్ ఏఐ, హ్యుమనాయిడ్ రోబోస్ ప్రధానంగా కనిపిస్తున్నాయి.

ఫిగర్ ఏఐ కంపెనీ నుంచి ఫిగర్ 1, ఫిగర్ 2, రోబో మోడల్స్

ఈ రోబోటిక్స్ రంగంలో ప్రధానంగా ఐదు కంపెనీలు పనిచేస్తున్నాయి. వాటిలో.. అమెరికాకు చెందిన ఫిగర్ ఏఐ ఉంది. వీళ్లు.. ఫిగర్ 1, ఫిగర్ 2 మోడల్ రోబోట్స్‌ని తయారుచేశారు. ఇండస్ట్రియల్ ఆటోమేషన్ ప్లాంట్లలో పనిచేసే విధంగా వాటిని రూపొందించారు. హెలిక్స్ ఏఐతో పనిచేసే ఫిగర్ 1 రోబోని.. త్వరలోనే ఇంటి అవసరాల కోసం విడుదల చేయబోతున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ఇక.. ఎలాన్ మస్క్‌కి చెందిన టెస్లా కూడా ఆప్టిమస్ రోబోలని తయారుచేస్తోంది. ముందుగా.. ఓ వెయ్యి హ్యుమనాయిడ్ రోబోలని.. టెస్లాకు చెందిన వివిధ కంపెనీల్లో పనిచేసేందుకు తయారుచేస్తున్నారు. అమెరికాకు చెందిన మరో కంపెనీ.. బోస్టన్ డైనమిక్స్ కూడా 6 రకాల రోబోట్స్‌ని తయారు చేస్తోంది.

రోజూవారి పనులు, మనుషులు ఆదేశాన్ని పాటించేలా రోబోలు

వాటిలో.. బిగ్ డాగ్, స్పాట్, అట్లాస్, హ్యాండిల్, స్ట్రెచ్, పిక్ మోడల్స్ ఉన్నాయి. డాగ్ రోబోట్స్, హ్యుమనాయిడ్ రోబోట్స్.. రక్షణ రంగంలో పనిచేసే విధంగా డెవలప్ చేస్తున్నారు. కెనడాకు చెందిన శాంక్చరీ ఏఐ కంపెనీ.. ఫీనిక్స్ రోబోట్స్‌ని డెవలప్ చేస్తోంది. ఇది.. ఓ అసిస్టెంట్‌లా పనిచేయబోతోంది. రోజువారీ పనులతో పాటు మనుషుల ఆదేశాల్ని పాటించేలా.. దీనిని అభివృద్ధి చేస్తున్నారు. చైనాకు చెందిన యూనిట్రీ కూడా 4 రకాల రోబోట్స్‌ని తయారుచేస్తోంది. ఈ కంపెనీ విడుదల చేసిన తొలి రోబో.. డ్యాన్స్‌తో పాటు కుంగ్ ఫూ కూడా చేస్తుంది.

రానున్న ఇంకొన్నేళ్లలో మనుషుల రోజువారీ జీవితంలో ఈ హ్యుమనాయిడ్ రోబోల పాత్ర కీలకంగా మారనుంది. ఇంటి పనులు, పారిశ్రామిక అవసరాలతో పాటు ఇతర పనులకు.. ఈ రోబోలని ఎక్కువగా వాడతారని టెక్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు.

Tags

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×