Intinti Ramayanam Today Episode March 5th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రణతి పెళ్లికి ఒప్పుకోవడంతో ఇంట్లోని వాళ్లంతా గుడికి వెళ్తారు. అక్షయ్ కూడా అక్కడికి వస్తాడు. అవినీతో మాట్లాడుతుంటే అవని మాట్లాడడానికి ఇష్టపడదు. చూశారు కదండీ నేనెంత పరాయిదాన్ని అయిపోయాను. అక్కడ ప్రణతి పెళ్లి అన్న విషయం కూడా నాకు చెప్పడానికి అత్తయ్య ఇష్టపడడం లేదు ప్రణతి కూడా నా మొహం చూడడానికి ఇష్టపడటం లేదు నేను అక్కడి నుండి ఏం చేయాలి అని అవని వెళ్ళిపోతూ ఉంటుంది. బయట పల్లవి అవనీని ఆపుతుంది. నిన్ను ప్రణతి పెళ్లికి రాకుండా చేస్తానని శపధం చేస్తుంది. నేను అసలు ఇంట్లోకి రానివ్వనని పల్లవి అవనితో అంటుంది దానికి అవని కింద ఉన్న మట్టిని తీసుకొని చేతులు దులుపుకొని పల్లవి చంప మీద ఒకటిస్తుంది. నువ్వు నన్ను ఎప్పటికీ ఆపలేవు నీ నిజస్వరూపం ఏంటో అందరికీ తెలిసే రోజు వచ్చేసింది నువ్వు వెయిట్ చెయ్ ఆ తర్వాత ఏం జరుగుతుందో ఇంతకీ ఇంట్లో నువ్వు ఉంటావో నేనుంటాను చూడాలి అని వార్నింగ్ ఇస్తుంది.. రాజేంద్రప్రసాద్ ఇంటికి రాగానే వాళ్ళకి పట్టింపులు ఎక్కువ కాబట్టి అవనిని పిలుద్దామని అనుకుంటున్నానని అన్నా కూడా పార్వతి అందరి చేత ఓట్లు వేయించుకుంటుంది అవని ఇంటికి రావడానికి వీల్లేదు అని కండిషన్ పెడుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికోస్తే.. రాజేంద్రప్రసాద్ ఇంటికి పెళ్లి వాళ్ళు వచ్చేస్తారు. అందరూ పలకరింపులు తర్వాత ఇంట్లోకి రావడానికి నీళ్లు ఇస్తే కాళ్ళు కడుక్కుంటామని అంటారు. పద్ధతులు పట్టింపులు రాజేంద్రప్రసాద్ కుటుంబం వాళ్లకి పద్ధతులు పట్టింపులు ఎక్కువమని చెప్పాను కదా ఈ మాత్రం ఉంటాయనేసి అనుకుంటారు. ఇంట్లో ఏర్పాటు చేస్తారు. ఇక ఇంటికి వచ్చిన వాళ్ళందరూ పరిచయాలు పెంచుకోవడానికి అందరితో మాట్లాడతారు. ఇక అక్షయ్ భార్య అవని గురించి అడుగుతారు అందరూ నీళ్లు నములుతారు.. ఇంట్లో అందర్నీ పరిచయం చేస్తారు కానీ అవనిని పరిచయం చేయరు అయితే మీ పెద్ద కోడలు ఎక్కడ అని అడిగితే అప్పుడే అవని ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంది. అవనిని చూసి అందరూ షాక్ అవుతారు.. ఈమె ఎవరు మీ పెద్ద కోడలా అని పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు అడుగుతారు. కానీ ఆరాధ్య వచ్చి మా ట్యూషన్ టీచర్ అని అబద్దం చెప్తుంది.
ఇంట్లో ఇలాంటి కార్యక్రమం ఉన్నా కూడా ట్యూషన్ టీచర్ ని పిలిచి చదువు అని ఇలా చెప్పిస్తున్నారంటే రాజేంద్రప్రసాద్ గారు ఎంత పద్ధతి కలవారు అర్థమవుతుంది తన పిల్లల్ని ఎంత పద్ధతిగా పెంచారు ఈ దృశ్యాన్ని చూస్తే తెలుస్తుందని వాళ్ళు సంతోషపడతారు. కమల్ కూడా మా నాన్న మమ్మల్ని అంత పద్ధతిగా పెంచారండి అందుకే మేము ఇలా ఉన్నాం మా చెల్లి కూడా అంతేను చాలా మంచిది అని అంటాడు. ఆరాధ్య రండి టీచర్ మనం పైకి వెళ్దామని అవని పైకి తీసుకెళ్తుంది.
అక్కడకు వెళ్లగానే ఆరాధ్య నన్ను క్షమించమ్మా ప్రణతి అత్త నువ్వు వస్తావని చెప్పింది ఇలా చెప్పి పైకి తీసుకు రమ్మని చెప్పింది అనగానే సరే అమ్మ నాకు అర్థమైంది ముందు ప్రణతి తో మాట్లాడాలి ప్రణతి దగ్గరికి వెళ్దాం పద అని అవని ఆరాధ్య ప్రణతి దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత ప్రణతి నన్ను క్షమించు వదిన ఇంట్లో జరిగిన పరిస్థితులను బట్టి నేను అలా మాట్లాడాను నేను కావాలని నిన్ను అలా అనలేదు అని బాధపడుతుంది. నువ్వే కాదు ఇంట్లో ఎవరైనా సరే ఇలానే రియాక్ట్ అవుతారు. మరి ఏం పర్లేదు ప్రణతి అని అంటుంది సరే ఇప్పుడు నువ్వు నాతో ఏదో మాట్లాడాలని అన్నావు కదా అదేంటో చెప్పు అనేసి అడుగుతుంది.
పల్లవి వచ్చి అవని నువ్వు ఇంట్లోకెందుకు వచ్చావు నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదా ఇంట్లోకి రావద్దు నీకు ఇంటికి సంబంధం లేదని అన్న కూడా నువ్వు ఇంట్లోకి వచ్చావు అంటే దాని అర్థం ఏంటి అని అనగానే అవని కోపంగా నువ్వు చెప్తే వెళ్లలేదు నువ్వు చెప్తే రావడానికి నా కూతుర్ని చూడ్డానికి నేను వచ్చాను అని గొడవేసుకుంటుంది.. అటు శ్రియా కూడా పల్లవి వెనకాలే వస్తుంది. బాగున్నావా శ్రీయా అంటే బాగానే ఉన్నా నాకు ఏ క్యాన్సరు ఏ రోగాలు రాలేదు అని సమాధానం చెబుతుంది..
నువ్వంటే ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు అని అర్థమైందా? శ్రేయ మాటలు బట్టి నీకు అర్థం అయితది నువ్వంటే ఎంత అసహ్యం వేసుకుంటుందో అని పల్లవి అంటుంది. శ్రేయ మాటలు బట్టి అర్థమైంది నువ్వు తనని ఎలా మాటలతో మాయ చేసావు అని మరేం పర్లేదు అసలు నిజాలు తెలిసినప్పుడు ఆ తర్వాత తనే రియలైజ్ అవుతుందిలే అనేసి అవని అంటుంది. ఇంట్లోకి రావాల్సిన అవసరం లేదు నువ్వు ముందు బయటికి వెళ్ళు అని పల్లవి అవనితో గొడవ పడుతుంది. ఇంట్లోంచి బయటకు గేంటెయ్యాలని పల్లవి చూస్తుంది.
కానీ అవని మాత్రం పల్లవికి ఎంత చెప్పినా వినదు దాంతో పల్లవి చెంప పగలగొడుతుంది. చెప్పినట్టు నేను వినలా నేను చెప్పినట్టు నువ్వు వినాలా అది ఆలోచించు నువ్వు ముందు నువ్వెవరు నాకు చెప్పడానికి నా కూతురు దగ్గరికి ఎక్కడికైనా వస్తా ఎంత దూరమైనా వెళ్తా నీకు సంబంధం లేదు నువ్వు ఈ విషయం గురించి మర్చిపో అనేసి అనగానే శ్రేయ అక్క నేను వెళ్తున్నాను కింద పిలుస్తున్నారని మెల్లగా జారుకుంటుంది. కమ్మలు శ్రీకర్ కూడా ఒకరి తర్వాత ఒకరు వచ్చి అవినీతో మాట్లాడతారు. ప్రణతి మాత్రం అవనీకేదో చెప్పాలని చెప్పలేక పోతుంది కోమలి ప్రణతిని రెడీ చేసి కిందకు తీసుకెళ్తారు. ప్రణతి పెళ్లిచూపులు వాళ్లకి ఎన్ని అడిగినా కూడా సమాధానం చెప్పదు ఏదో పోగొట్టుకుని దానిలాగా ఉంటుంది అయితే అవని మాత్రం ప్రణతి ఏదో చెప్పాలనుకున్నది చెప్పలేకపోయింది. అదేదో తెలుసుకోవాలని అనుకుంటుంది.
మొత్తానికి ఇంట్లో వాళ్ళ బలవంతం మీద ప్రణతి ఎంగేజ్మెంట్ పూర్తవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో పార్వతి అవనిపై అరుస్తుంది. నువ్వు ఇంటికి రా వద్దని అన్న కూడా నువ్వు ఇంటికి వచ్చావు నన్ను చంపాలి అనుకున్నావు ఈరోజు నా కూతురు జీవితాన్ని పాడు చేయాలని వచ్చావని అరుస్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి…