E-Paper
Advertisement

స్టేట్‌లో సిద్దాంతపర విమర్శల దాడి! సెంట్రల్‌లో కేంద్ర సాయం కోరి..! భారత్‌ సమ్మిట్‌తో విమర్శలు గుప్పించినా.. ప్రధానితో సమస్యలు విన్నవించినా..!

స్టేట్‌లో సిద్దాంతపర విమర్శల దాడి! సెంట్రల్‌లో కేంద్ర సాయం కోరి..! భారత్‌ సమ్మిట్‌తో విమర్శలు గుప్పించినా.. ప్రధానితో సమస్యలు విన్నవించినా..!
Advertisement

కేంద్రంతో ఎలాంటి సాయం తీసుకోవాలి.. ? ఎలాంటి విజ్ఞప్తులు చేసి.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టుకోవాలనే విషయంలో రేవంత్‌ రెడ్డి సీఎంగా సెంట్‌ పర్సెంట్‌ ఎఫెర్ట్స్‌ పెడుతున్నారు. తాజాగా ఆయన ఢిల్లీలో మోడీని కలిసి నవ్వుతూ ముచ్చటించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. హార్డ్‌ కోర్‌ బీజేపీ శ్రేణులు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

‘ఓట్ చోర్.. గద్దీ ఛోడ్‌’ అని హైదరాబాద్‌ వేదికగా విదేశీయులతో రేవంత్‌ తిట్టించారనే ఆగ్రహం వారిలో ఉంది. దీనిపై అమిత్‌ షా కూడా గుర్రుగా ఉన్నారని, తెలంగాణ నేతలు ఎందుకు కేసు పెట్టలేదని ఆగ్రహించారనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి తగ్గట్టే.. బీజేపీ స్టేట్‌ ప్రెసిడెంట్ రాంచంద్రరావు ఈ విషయంలో డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ వివాదం సద్దుమణగకముందే.. ఢిల్లీ వెళ్లిన రేవంత్‌ పీఎం మోడీని కలిసి రాష్ట్ర పరిస్థితులపై సుధీర్ఘంగా మాట్లాడి.. కావాల్సిన నిధులపై ఏకరువు పెట్టే అంశం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తెర తీసింది.

Advertisement

కరువు ప్యాకేజీ రూ. 30వేల కోట్లు కావాలన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించేందుకు 152 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర సర్కార్‌ను ఒప్పించాలని కూడా కోరారు. అంతే కాదు.. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల కోసం మరో పదివేల కోట్లు అవసరం అని.. వీటిని కూడా ఇవ్వాలని కోరారు. కాళేశ్వరంపై కూడా పీఎం ఆరా తీసినట్టుగా వార్తలొచ్చాయి. ఇంతలా రాష్ట్రం గురించిన చర్చ జరగడం.. అదీ హైదరాబాద్‌లో నిర్వహించిన భారత్‌ సమ్మిట్‌ వివాదం నేపథ్యంలో.. అనేదే అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆకట్టుకున్నది. కొత్త చర్చకు తెర తీసింది.

భారత్‌ సమ్మిట్‌కు రానీయకుండా దాదాపు వంద మందికి పైగా విదేశీయులను అడ్డుకున్నారని, చివరి నిమిషంలో వారి వీసాలను రద్దు చేశారని తెలంగాణ కాంగ్రెస్‌ మండిపడింది. ‘మోడీ భయపడుతున్నారా? ఇది దేశ ద్రోహ శక్తుల కూటమిగా బీజేపీ ఎందుకు అభివర్ణిస్తోంది? అయితే మరి మిగితా విదేశీయులకు ఎందుకు వీసాలు ఇచ్చింది?’ అని కేంద్రాన్ని సెల్ఫ్‌ డిఫెన్స్‌లో పడేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్‌. ఈ భారత్‌ సమ్మిట్ రెండు జాతీయ పార్టీల మధ్య రాజకీయ వివాదాన్ని రచ్చకెక్కేలా చేసిన మరునాడే సీఎం ఢిల్లీలో మోడీతో భేటి కావడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.

Advertisement

మోడీ సైతం అసలేం జరగనట్టు నవ్వుతూ, తుళ్లుతూ రేవంత్‌ తో మాట్లాడటం, కలసి ఫోటోలు దిగడం, తనకు బహుకరించిన వాటిని ఆసక్తిగా తిలకించి, చర్చించడం రాష్ట్ర రాజకీయాలను నివ్వెరపోయేలా చేసింది. రాజకీయం రాజకీయమే.. రాష్ట్రం.. రాష్ట్రమే.. అన్నట్టుగా రేవంత్‌ తనదైన స్టైల్‌లో ముందుకు సాగుతున్నారడానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. మరోవైపు మోడీ సైతం పరిణతి చెందిన పీఎంలాగే వ్యవహరించారు. పార్టీ లైన్‌ మేరకు కాంగ్రెస్‌ను కట్టడి చేసేందుకు వెనుకాడని వైనం ఓ కోణమైతే.. మరో కోణంలో ప్రధానిగా ఓ రాష్ట్ర సీఎంకు ఇవ్వాల్సిన గుర్తింపునిస్తున్నానని సంకేతం పంపారాయన.

నిధుల విడుదల పట్ల ఫలితం ఎలా ఉండబోతుంది? తరువాత పరిణామాలపై రాజకీయాలు ఎలా సాగనున్నాయనే అంశం వదిలేస్తే.. ఎవరి కర్తవ్య బాధ్యతలు వారు వంద శాతం పర్‌ ఫెక్ట్‌గా నిర్వహించారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మోడీకి కొంత రాజకీయ చమత్కారం కూడా ఎక్కువే. గతంలో హైదరాబాద్‌కు పీఎం వచ్చిన సమయంలో.. నిధులపై రేవంత్‌ మాట్లాడిన సందర్భంగా.. తనదైన శైలిలో రాజకీయ చలోక్తులు వదిలారు మోడీ. ‘హమ్‌ సే జోడో.. సబ్‌ మిలేగా’ అని ఆయన కామెంట్ చేశారు.

‘మాతో కలిసి రండి.. మీరు అనుకున్నవన్నీ జరుగుతాయ’ని ఓ రాజకీయ బహిరంగ వేదిక మీద ప్రధాని .. ఇతర పార్టీ సీఎంకు ఆఫర్‌ చేయడంలో వ్యూహం తెలియనిది కాదు. ఇక్కడ కాంగ్రెస్‌ను బలహీన పరచాలనే బీజేపీ వ్యూహాన్ని ఆ వేదికగా ఆయన ప్రదర్శించారని తెలిసిపోతున్నది. అంటే.. మోడీతో రేవంత్‌కు మంచి మాటే ఉంది.. అని కాంగ్రెస్‌ శ్రేణులు అనుకోవాలనేది మోడీ వ్యూహం. కానీ రేవంత్‌కు, రాహుల్‌కు మధ్య ఉన్న అనుబంధం.. ఇలాంటి వ్యూహాలకు చిక్కి శల్యమయ్యేది కాదని కూడా ఆయనకు తెలుసు.

అయినా జనంలో ఓ ఫీలర్‌ వదలడం ద్వారా బీజేపీకి లబ్ది చేకూరే పదప్రయోగాన్ని చేసే రాజకీయ చతురతను ప్రదర్శించడం కూడా మోడీకి తెలుసుననే విషయం స్పష్టమయ్యింది. గతంలో కేసీఆర్‌తో మంచి అనుబంధాన్ని మెయింటేన్‌ చేసిన మోడీ.. అది చెడిపోగానే బహిరంగ వేదికగానే.. తనను కేసీఆర్‌ కలిసి కొడుకు కేటీఆర్‌ను సీఎం చేయాలనుకుంటున్నానని, సహకరించాలని కోరిన విషయాన్ని బహిర్గత పరిచారు. తాను ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్‌ సీఎం అయ్యేందుకు ఒప్పుకోనని తెగేసి చెప్పిన విషయాన్ని కూడా ఆ వేదికగానే వెల్లడించి .. కేసీఆర్‌కు షాక్‌ ఇచ్చారు మోడీ.

అప్పట్నుంచి కేసీఆర్‌ .. మోడీతో పూర్తి దూరాన్నే పాటిస్తూ వచ్చారు. దీని వల్ల రాష్ట్రానికి హక్కుభుక్తంగా రావాల్సిన నిధులు కూడా రాలేదు. కేసీఆర్‌ చర్యలతో ఆ విధంగా స్టేట్ నష్టపోయిందనే చెప్పాలి. ఇప్పుడు రేవంత్‌ దీనికి భిన్నంగా పోతున్నారని అనిపిస్తోంది.

Tags

Related News

అసదుద్దీన్ మోదీకి శత్రువా? మిత్రుడా? యూపీలో ఏం జరుగుతోంది?

ఐదు లక్షల మందికి పైగా ఉపాధి కూలీ పనులకు హాజరు! గత ఏడాదితో పోలిస్తే 15 రెట్లు ఎక్కువ..! నల్లగొండలో అత్యధికంగా ఉపాధి కూలీలకు!

3 వారాల్లో 3 తుఫానులు.. బంగాళాఖాతంలో అసలేం జరుగుతోంది?

సన్నరకాల బ్లాక్‌ మార్కెట్‌కు ఇదే సరైన గుణపాఠం..! సర్కార్‌ వార్నింగ్‌ ఇచ్చినా బహిరంగ మార్కెట్లో తగ్గని ధరలు..! మరో ఏడాది ఇదే తీరు..?

హాస్టళ్లలో మెనూ అమలు కావడం లేదు..! కరువు సాకుతో మూడు నెలలుగా సరకుల సరఫరా లేదు? అరకొర భోజనం.. అర్థాకలితో విద్యార్థులు!

ముందు కవిత.. వెనుక రేవంత్! హరీశ్ ను వెంటాడుతున్న ‘సిద్దిపేట’..! అవినీతిపై పోరాడుతానంటున్న కవిత.. సిద్దిపేట సభ వేళ సీఎంకు హరీశ్‌ లేఖ..!

రాజకీయాలకు కేసీఆర్‌ దూరం.. మీడియాతో కేటీఆర్‌ దూరం దూరం! ఇదేం వ్యూహం..? నష్టమా .. లాభమా??

Big Stories

Advertisement
×