E-Paper
Advertisement

సన్నరకాల బ్లాక్‌ మార్కెట్‌కు ఇదే సరైన గుణపాఠం..! సర్కార్‌ వార్నింగ్‌ ఇచ్చినా బహిరంగ మార్కెట్లో తగ్గని ధరలు..! మరో ఏడాది ఇదే తీరు..?

సన్నరకాల బ్లాక్‌ మార్కెట్‌కు ఇదే సరైన గుణపాఠం..! సర్కార్‌ వార్నింగ్‌ ఇచ్చినా బహిరంగ మార్కెట్లో తగ్గని ధరలు..! మరో ఏడాది ఇదే తీరు..?
Advertisement

కరువు పేరు చెప్పి.. సన్న రకాల బియ్యం ధరలు బ్లాక్‌ మార్కెట్‌లో అమాంతం పెరిగిపోయాయి. సన్న బియ్యం దొరకడం లేదని, కరువు కారణంగా ఇకపై వరి సాగే ఉండదు కాబట్టి.. ఉన్న బియ్యం ధరలు పెరిగాయని కారణాలు చెబుతూ కిలో వందకు తగ్గకుండా పెంచేశారు. సన్నబియ్యం నిలువలన్నీ ఒక్కసారిగా బ్లాక్‌ చేసేశారు. దీంతో వారు చెప్పిందే రేటు. సన్న రకాల వడ్లకు రైతుల వద్ద కొంత ఎక్కువిచ్చి కొనుగోలు చేసి.. పదివేలకు క్వింటాలు అమ్ముకుంటున్నారు.

సర్కార్‌ దీనిపై జోక్యం చేసుకున్నా.. సీరియస్‌గా వార్నింగ్‌ ఇచ్చినా బయట మార్కెట్లో పెద్దగా ప్రభావం కనిపించలేదు. దీంతో సన్న రకాల ధరలను ఇప్పట్లో తగ్గించేలా లేరు. కరువు తీవ్రత పెరిగినా కొద్దీ.. వీటి రేట్లను ఇంకా పెంచుతూ పోతారే తప్ప.. తగ్గించేలా కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో అందరి చర్చ రేషన్‌ బియ్యంపై జరుగుతోంది. ఏడాది పాటు సన్న రకాల నిల్వలు సర్కార్‌ వద్ద సమృద్దిగా ఉన్నాయి. దీంతో ఇప్పటి వరకు చాలా మంది రేషన్‌ బియాన్ని తినకుండా అమ్మేసుకున్నారు.

Advertisement

నాణ్యమైన, పోషక విలువులన్న ప్రభుత్వం సరఫరా చేసే బియ్యం తినకుండా, బయట పాలిష్‌ చేసిన బియ్యాన్ని కిలోకు రూ. 50. నుంచి రూ. 70 వరకు కొనుగోలు చేసి కొని మరీ తిన్నారు. రేషన్‌ బియ్యాన్ని కిలోకు రూ. 15 వరకు అమ్ముకున్నారు. కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల కారణంగా బయటకు ఒక 26 కిలోల బస్తా కొనాలన్నా.. రెండు వేలకు పైగా చెల్లించే పరిస్థితి ఉంది. రేషన్‌ బియ్యాన్ని కొని దాన్నిమళ్లీ రీ సైక్లింగ్‌ చేసి అమ్ముకునే దళారీ బ్యాచ్‌ ఈ బియ్యం రేటును కూడా పెంచేసింది. కిలోకు రూ. 22 నుంచి రూ. 25 వరకు పెట్టి కొంటున్నారు. కొందరు ఇంకా వీటిని అమ్మేసుకుంటున్నారు.

వారికి బయట దొరికే పాలిష్డ్ బియ్యాన్నే తినే అలవాటు ఉండటంతో ఇలా చేస్తున్నారు. ఇంతలా రేట్లు పెంచిన దళారులకు.. రేటు దించేలా, దిమ్మదిరిగే షాక్ ఇవ్వాలంటే.. అంతా రేషన్‌ బియ్యాన్నే తినాలనే చర్చ సాగుతోంది. ఉచితంగా సర్కార్‌ ఇస్తున్న సన్నబియ్యాన్ని తినడం వల్ల అందులో ఉండే పోషకాలు, ఐరన్‌ అదనంగా దొరుకుతాయి. తక్కువ పాలిష్‌ చేస్తారు కాబట్టి.. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందనే చర్చ జరుగుతోంది. పేద, మధ్య తరగతి ఫ్యామిలీ బడ్జెట్‌లో ఈ సన్న బియ్యానికే ఎక్కు వ మొత్తం చెల్లించాల్సి వస్తున్న పరిస్థితులు ఉన్నాయి.

Advertisement

మరి రేషన్‌ బియ్యం తినడం అలవాటు చేసుకుంటే.. ఫ్యామిలీ బడ్జెట్‌కు భారం తగ్గడమే కాదు.. ఉచిన నాణ్యమైన అన్నాన్ని తినొచ్చు కదా! అనే పాయింట్‌ ఇప్పుడు చర్చకు వస్తోంది. అయితే రేషన్‌ బియ్యంలో నూకలు బాగా ఉంటాయని,మెరిగలు కూడా ఉండటం వల్ల అన్నం వండుకోవడానికి అవి రెడీగా ఉండవనే సాకులు వెతుక్కుంటున్నారు.

నూకలు తీసేసి, మెరిగలు ఏరేసుకొని తినడం వల్ల బయట సన్నబియ్యం కొనే దుస్థితి నుంచి తప్పించుకోవచ్చు. గతంలో ఇంటిలో ఉన్న అమ్మలక్కలు ఇలా బియ్యాన్ని మెరిగెలు ఏరేసుకుని వాటినే తినేవారు. ఇప్పుడు ఇలా చేయడానికీ బద్దకిస్తున్న నేటి తరం కుటుంబీకులు.. బయట రెడీగా ఉన్న పాలిష్డ్ బియ్యాన్నే ఎంతైనా సరే వెచ్చించి కొనేందుకు సిద్దపడటంతో..బ్లాక్‌ మార్కెట్‌లో ధరలు పెంచిన దళారుల పంట పండుతోంది.

అందుకే సర్కార్‌ ఎంత గగ్గోలు పెట్టినా.. ధరలు ఇంకా ఇంకా పెంచే ఉద్దేశ్యమే తప్ప.. మరో ఏడాది పాటు రూపాయి కూడా తగ్గించేలా లేరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  ఈ తరుణంలో సర్కార్ ఇచ్చే సన్నబియ్యం తినడమే రెండు రకాల శ్రేయస్కరం అని చెబుతున్నారు.

Tags

Related News

హాస్టళ్లలో మెనూ అమలు కావడం లేదు..! కరువు సాకుతో మూడు నెలలుగా సరకుల సరఫరా లేదు? అరకొర భోజనం.. అర్థాకలితో విద్యార్థులు!

ముందు కవిత.. వెనుక రేవంత్! హరీశ్ ను వెంటాడుతున్న ‘సిద్దిపేట’..! అవినీతిపై పోరాడుతానంటున్న కవిత.. సిద్దిపేట సభ వేళ సీఎంకు హరీశ్‌ లేఖ..!

రాజకీయాలకు కేసీఆర్‌ దూరం.. మీడియాతో కేటీఆర్‌ దూరం దూరం! ఇదేం వ్యూహం..? నష్టమా .. లాభమా??

మరీ ఇంత దారుణమా.. ఇరిగేషన్‌ శాఖలో రిటైర్డ్‌ అధికారులకే మళ్లీ కీలక పోస్టులు!

ఈ సారీ చేపలు కరువే.. 9 లక్షల మంది ఉపాధికి గండం?

టీజీఎంఎస్ఐడీసీలో.. స్పెషల్ ఆఫీసర్ గ్యాంగ్ బ్లాక్‌మెయిల్ దందా!

సొంత నిధులతోనే రైతులకు తక్షణ సాయం..! రూ. 1250 కోట్లు విడుదల..! తక్షణ సాయంగా రూ. 2500..!

Big Stories

Advertisement
×