Police Promotions: తెలంగాణ పోలీస్ శాఖలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల సమస్య పరిష్కారానికి డీజీపీ సీవీ ఆనంద్ చొరవ చూపారు. సీనియారిటీ వివాదాలు, కోర్టు కేసుల పరిష్కారానికి అధికారులతో డీజీపీ కీలక సమావేశం నిర్వహించారు. 1991, 1995, 1996 బ్యాచ్‌ల ఎస్‌ఐలతో డీజీపీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి వారి ప్రమోషన్లకు సంబంధించి అధికారుల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు వెల్లడించారు.
అయితే ప్రస్తుతం 54 అదనపు ఎస్పీ పోస్టులు అందుబాటులో ఉన్నట్లు ప్రకటన చేసారు. దీంతో వెంటనే తొలి విడతలో 54 అదనపు ఎస్పీ పోస్టుల భర్తీకి అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక రెండో విడతలో ప్యానెల్ ఇయర్ ముగిసే ఆగస్టు 2027 నాటికి మరో 34 పోస్టులు అందుబాటులోకి వస్తారని, 1991, 1995, 1996 బ్యాచ్‌లకు సంబంధించి ప్రమోషన్ ప్యానెల్స్ సిద్ధం చేయనున్నారు. వెంటనే 12 మంది డీఎస్పీలకు నాన్ క్యాడర్ ఎస్పీలుగా ప్రమోషన్లకు అవకాశం కల్పించనున్నారు. ప్యానెల్ ఇయర్‌లో మరో 10 ఎస్పీ (నాన్ క్యాడర్) పోస్టుల కేటాయింపు చేయనున్నారు.
సీనియారిటీ, రోస్టర్ పాయింట్లు, అర్హతల ఆధారంగా ప్రమోషన్ల ప్రక్రియ జరుపనున్నారు. పోలీసుల కంఠారావు కమిటీ నివేదిక, ప్రభుత్వ ఉత్తర్వులు, నిబంధనలపై సమావేశంలో చర్చించారు. ప్రమోషన్ల జాబితాపై అధికారుల అభిప్రాయాల సేకరణచేసి ప్రతిపాదిత జాబితాలకు అధికారులు అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఈ సమావేశంలో కుదిరిన ఏకాభిప్రాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లనున్న డీజీపీ క్లారిటీ ఇచ్చారు. త్వరితగతిన ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తామని, పదవీ విరమణకు దగ్గరగా ఉన్న అధికారులకు న్యాయం చేయడమే లక్ష్యంగా డీజీపీ చొరవ చూపనున్నట్టు తెలిపారు.
Also read: ఖానాపూర్ పోలీస్ స్టేషన్‌లో దారుణం.. దొంగతనం జరిగినా కేసు నమోదు చేయని ఎస్సై!