E-Paper
Advertisement

పల్లెటూరి మట్టి వాసనతో స్వచ్ఛమైన ప్రేమకథ… ఓటీటీలోకి రూ.150 కోట్ల కన్నడ బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ చూడొచ్చు

పల్లెటూరి మట్టి వాసనతో స్వచ్ఛమైన ప్రేమకథ… ఓటీటీలోకి రూ.150 కోట్ల కన్నడ బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ చూడొచ్చు
Advertisement

Premada Oorali OTT: భారీ బడ్జెట్, స్టార్ హీరోలు ఉంటేనే సినిమా హిట్ అవుతుందని అనుకుంటాం. కానీ ఒక్కోసారి చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ఊహించని విజయాలను అందుకుంటాయి. అలాంటి కోవలోకే వస్తుంది కన్నడ చిత్రం ‘ప్రేమద ఊరలి’ (Premada Oorali). సుమారు రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి వచ్చిన మంచి స్పందనతో భారీ వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీనే ఆశ్చర్యపరిచిన కన్నడ బ్లాక్‌బస్టర్ మూవీగా నిలిచింది. 50 రోజులకు పైగా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమైన ఈ గ్రామీణ ప్రేమకథ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. విశేషమేమిటంటే ఈ సినిమా తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మరి దీని కథ ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కర్ణాటకలోని ఓ అందమైన పల్లెటూరి నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. నాగన్న (రంగాయణ రఘు) భార్యను కోల్పోయి తన కొడుకు సంతు (శ్రీరామ్)తో కలిసి జీవిస్తుంటాడు. తమ కుటుంబంలో తరతరాలుగా కొనసాగుతున్న నిరక్షరాస్యతకు ముగింపు పలకాలని, తన కొడుకుకు బాగా చదువుకున్న అమ్మాయితో పెళ్లి చేయాలని నాగన్న ఆశపడుతుంటాడు. కానీ సంతు మాత్రం తండ్రి ఆశలకు తగ్గట్టుగా కాకుండా సరదాగా తిరుగుతూ తనదైన ప్రపంచంలో ఉంటాడు.

Advertisement

ఇలాంటి సమయంలో విదేశాల నుంచి తిరిగి వచ్చిన రుక్మిణి (తపస్విని పూనాచ)తో సంతుకు పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. అయితే, రుక్మిణికి గతంలో ఎదురైన అనుభవాల కారణంగా ప్రేమ, పెళ్లి వంటి విషయాలపై అంతగా నమ్మకం ఉండదు. మరోవైపు సంతు చిన్ననాటి స్నేహితురాలు వసంత (రామిక శివు) కూడా అతడిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది. దీంతో సంతు జీవితంలో ప్రేమకు సంబంధించిన కొత్త చిక్కులు మొదలవుతాయి.

ఒకవైపు కొడుకు పెళ్లిపై నాగన్న పెట్టుకున్న ఆశలు, మరోవైపు రుక్మిణి మనసులోని భయాలు, ఇంకోవైపు వసంత ప్రేమ.. ఈ పరిస్థితుల మధ్య సంతు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? తండ్రి ఆశలకు, కొడుకు ఇష్టానికి మధ్య సంఘర్షణ ఎలా మొదలైంది? చివరకు ఈ కుటుంబంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? అనేదే మిగతా కథ. ప్రేమ, కుటుంబ బంధాలు, తరాల మధ్య ఆలోచనల తేడాలను వినోదం, భావోద్వేగాలతో ఈ సినిమాలో చూపించారు.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే ?

Advertisement

మనోజ్ కుమార్ రచించి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రంగాయణ రఘు, శ్రీరామ్, తపస్విని పూనాచ, రామిక శివు ప్రధాన పాత్రల్లో నటించారు. 2026 సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా నవంబర్ 17 నుంచి Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ ఆడియోల్లోనూ అందుబాటులో ఉంది.

Read Also: మూడేళ్లు కాపురం చేసిన ప్రియుడికి షాక్.. సడన్‌గా తిరిగొచ్చిన భర్త.. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ లో ట్విస్టులే ట్విస్టులు

Related News

క్రైమ్ నవల రాయమని పిలిస్తే… ఎడిటర్‌నే కిల్లర్‌గా మార్చే రచయిత్రి… ఈ థ్రిల్లర్‌లో ట్విస్టులు మామూలుగా ఉండవు భయ్యా

బయటకు మగధీరులే… లోపల మాత్రం ఎంత భయమో ? మగాళ్లు చూడాల్సిన డాక్యుమెంటరీ

చుట్టూ శత్రువులు.. తప్పించుకునే దారే లేదు… ఉగ్రవాదులకు ఒంటరిగానే చుక్కలు చూపించిన ప్రెసిడెంట్…

కళ్ళముందు జరిగేదంతా నిజమా? లేక మెదడు ఆడుతున్న మైండ్ గేమా?… చూస్తే బుర్రపాడయ్యే సైకలాజికల్ థ్రిల్లర్

ఓటీటీలోకి క్రిస్టోఫర్ నోలన్ విజువల్ వండర్ ‘ది ఒడిస్సీ’… తెలుగులోనే స్ట్రీమింగ్

ఓటీటీలోకి రాబోతున్న ఆదర్శ కుటుంబం.. ఎప్పుడంటే?

ఓటీటీ లవర్స్ కు పూనకాలు.. ఆ రెండు మస్ట్ వాచ్…

Big Stories

Advertisement
×