BigTV English

Israel Vs Iran War: ఇజ్రాయెల్ బంకర్ బస్టర్ వాడితే.. ఇరాన్ టెహ్రాన్ ఖాళీ చేయాల్సిందేనా?

Israel Vs Iran War: ఇజ్రాయెల్ బంకర్ బస్టర్ వాడితే.. ఇరాన్ టెహ్రాన్ ఖాళీ చేయాల్సిందేనా?

Israel Vs Iran War: ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మొదలైందే.. ఈ బంకర్ బస్టర్ బాంబర్లతోనా? ఇంతకీ ఏంటీ బాంబుల ప్రత్యేకత. వీటిని ఎవరు ఎప్పుడు ఎందుకు తయారు చేశారు? వీటి ప్రధానోద్దేశమేంటి? వీటిని ప్రస్తుతం ఇరాన్ వార్ లో ఎందుకంత కీలకంగా భావిస్తున్నారు? వీటి తాలూకూ పర్యావసానాలు ఎలా ఉండబోతున్నాయ్? ఈ బాంబు ఒక్కటి బ్లాస్ట్ అయితే ఇరాన్ మొత్తం షేక్ షేక్ పోతుందా? రాజధాని టెహ్రాన్ టోటల్ గా ఖాళీ చేయాల్సిందేనా? ఆ వివరాలేంటి?
ఫోర్దో అణు కేంద్రం


2023లోనే 83 శాతం యురేనియం శుద్ధి

యుద్ధం వీటి తరలింపుతో ఎప్పుడో మొదలైంది- నిపుణులుఅది ఫోర్దో అణుకేంద్రం. టెహ్రాన్ కి సరిగ్గా 95 కి. మీ దూరం. ఎలాగైనా సరే ఈ అణుకేంద్రాన్ని బ్లాస్ట్ చేయాలి. ఇక్కడ భూమి లోతుల్లో.. సుమారు 260 అడుగుల కింద ఉంటుందీ కేంద్రం. అత్యంత భద్రంగా.. సురక్షితంగా.. నిర్మితమైందీ ప్రాంతం. ఇదే ఇజ్రాయెల్ ప్రెజంట్ టార్గెట్. కారణం.. ఇక్కడ 2023లోనే 83 శాతం పైగా యురేనియం శుద్ధి చేసి ఉంచింది ఇరాన్. ఇది అణుబాంబుకు అవసరమయ్యే 90 శాతానికి చాలా చాలా దగ్గర. ఒక వేళ ఇక్కడి యురేనియం ద్వారా గానీ అణుబాంబు తయారీ జరిగిపోతే.. ఇరాన్ చేతిలో ఒక అణ్వస్త్రం ఉన్నట్టే. ఇదే నిజమైతే, తమకు వ్యతిరేకంగా పని చేస్తున్న హమాస్, హిజ్బుల్లా మరింత రెచ్చిపోతాయ్. దీన్ని టార్గెట్ చేసిన ఇజ్రాయెల్ కి ఎంతకీ శక్తి సరిపోవడం లేదు. తామెంతటి మోడ్రన్ వెపన్ మేకర్స్ అయినా.. ఇంత లోతుల్లోకి వెళ్లి మరీ అక్కడి అణు నిల్వలను ధ్వంసం చేయడం వీలు కాని పని. మరి కాగల కార్యం నెరవేర్చే గంధర్వుడెవ్వరు? అని చూస్తే ఇదిగో ఇదే.. GBU-57A/B మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్.


బోయింగ్ అభివృద్ధి చేసిన ప్రెసిషన్-గైడెడ్ బాంబు

GBU-57A/B అనేది US వైమానిక దళం కోసం బోయింగ్ అభివృద్ధి చేసిన ప్రెసిషన్-గైడెడ్ బాంబు. ఈ ప్రాసెస్ నే షార్ట్ కట్ లో MOP అంటారు. అలాగంటే ఇది కేవలం బాంబు కాదు. ఇది ప్రస్తుతం ఈ భూమ్మీద ఉన్న మోస్ట్ పవర్ఫుల్ బంకర్ బద్ధలు కొట్టగలిగే ఏకైక ఆయుధం. ఇది గాల్లోకి లేచిందంటే.. ఇక అటు వైపు ఎంత సురక్షితంగా ఉన్న బంకర్ అయినా సరే ఇట్టే బద్ధలై పోవల్సిందే. ఇరవై అడుగుల పొడవు. 13వేల 600 కిలోల బరువు. బాంబుల్లోనే బాహుబలి. దీన్ని మోసుకెళ్లడానికి కూడా సరిగ్గా అంతే సామర్ధ్యం గల బాంబర్ కావాలి. దాని పేరే B2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్. భూఉపరితలం మీదున్న వాటిని ఎవరైనా బద్ధలు కొట్టేస్తారు. కానీ భూ గృహాల్లో.. అది కూడా భారీ లోతైన ప్రదేశాల్లో ఉన్న లక్ష్యాలను టార్గెట్ చేయడానికి ప్రపంచంలో ఒక్క అమెరికా దగ్గర మాత్రమే ఉన్న ఏకైక బాంబు ఇదే. దీన్ని ప్రయోగించగలిగిన సత్తా గలిగిన బాంబర్ కూడా కేవలం అమెరికా దగ్గర మాత్రమే ఉంది.

తొలి రోజు నటాంజ్ అణు కేంద్రంపై దాడి

బేసిగ్గా ఇజ్రాయెల్ యుద్ధాన్ని మొదలు పెట్టిందే.. ఇరాన్ అణ్వాయుధ సామర్ధ్యాన్ని ధ్వంసం చేయడం కోసం. ఎందుకంటే గత ఇరవై ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఇరాన్ అణ్వాయుధ నిబంధనలను ఉల్లంఘించినట్టు అంతర్జాతీయ అణు శక్తి సంస్థ.. అధికారిక ప్రకటన చేసింది. ఇదే అదనుగా భావించిన ఇజ్రాయెల్ ఈ యుద్ధం మొదలు పెట్టింది. అందులో భాగంగా తొలి రోజు టెహ్రాన్ కి 225 కి. మీ దూరంలోని నటాంజ్ అణు కేంద్రంపై దాడి చేసింది. ఈ అణుకేంద్రానికి పైపై దెబ్బలు తగిలాయి తప్ప.. దాని అణు నిల్వలకొచ్చిIsrael Vs Iran War: ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మొదలైందే.. ఈ బంకర్ బస్టర్ బాంబర్లతోనా? ఇంతకీ ఏంటీ బాంబుల ప్రత్యేకత. వీటిని ఎవరు ఎప్పుడు ఎందుకు తయారు చేశారు? వీటి ప్రధానోద్దేశమేంటి? వీటిని ప్రస్తుతం ఇరాన్ వార్ లో ఎందుకంత కీలకంగా భావిస్తున్నారు? వీటి తాలూకూ పర్యావసానాలు ఎలా ఉండబోతున్నాయ్? ఈ బాంబు ఒక్కటి బ్లాస్ట్ అయితే ఇరాన్ మొత్తం షేక్ షేక్ పోతుందా? రాజధాని టెహ్రాన్ టోటల్ గా ఖాళీ చేయాల్సిందేనా? ఆ వివరాలేంటి?
ఫోర్దో అణు కేంద్రం

2023లోనే 83 శాతం యురేనియం శుద్ధి

యుద్ధం వీటి తరలింపుతో ఎప్పుడో మొదలైంది- నిపుణులుఅది ఫోర్దో అణుకేంద్రం. టెహ్రాన్ కి సరిగ్గా 95 కి. మీ దూరం. ఎలాగైనా సరే ఈ అణుకేంద్రాన్ని బ్లాస్ట్ చేయాలి. ఇక్కడ భూమి లోతుల్లో.. సుమారు 260 అడుగుల కింద ఉంటుందీ కేంద్రం. అత్యంత భద్రంగా.. సురక్షితంగా.. నిర్మితమైందీ ప్రాంతం. ఇదే ఇజ్రాయెల్ ప్రెజంట్ టార్గెట్. కారణం.. ఇక్కడ 2023లోనే 83 శాతం పైగా యురేనియం శుద్ధి చేసి ఉంచింది ఇరాన్. ఇది అణుబాంబుకు అవసరమయ్యే 90 శాతానికి చాలా చాలా దగ్గర. ఒక వేళ ఇక్కడి యురేనియం ద్వారా గానీ అణుబాంబు తయారీ జరిగిపోతే.. ఇరాన్ చేతిలో ఒక అణ్వస్త్రం ఉన్నట్టే. ఇదే నిజమైతే, తమకు వ్యతిరేకంగా పని చేస్తున్న హమాస్, హిజ్బుల్లా మరింత రెచ్చిపోతాయ్. దీన్ని టార్గెట్ చేసిన ఇజ్రాయెల్ కి ఎంతకీ శక్తి సరిపోవడం లేదు. తామెంతటి మోడ్రన్ వెపన్ మేకర్స్ అయినా.. ఇంత లోతుల్లోకి వెళ్లి మరీ అక్కడి అణు నిల్వలను ధ్వంసం చేయడం వీలు కాని పని. మరి కాగల కార్యం నెరవేర్చే గంధర్వుడెవ్వరు? అని చూస్తే ఇదిగో ఇదే.. GBU-57A/B మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్.

బోయింగ్ అభివృద్ధి చేసిన ప్రెసిషన్-గైడెడ్ బాంబు
న ప్రమాదమేదీ లేదని IAEA చెప్పడంతో.. ఇజ్రాయెల్ కి ఏం చేయాలో పాలు పోలేదు. కేవలం ఇక్కడొక్క చోటే కాదు.. టెహ్రాన్ కి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఫోర్దో అణు కేంద్రం ఉంది. ఇది అసలైన సమస్యగా గుర్తించింది ఇజ్రాయెల్. 2006లో ప్రారంభమైన ఈ అణు కేంద్రం.. 2023లో ఇక్కడ భారీ ఎత్తున యురేనియం శుద్ధి చేసినట్టు తెలుస్తోంది. ఇది గానీ రెడీ అయిపోతే ఏకంగా 9 అణుబాంబులను తయారు చేయగలిగే సామర్ధ్యం ఇరాన్ సొంతం అవుతుంది. ఇక్కడున్న 2700 సెంట్రిఫ్యూజులు అణుబాంబు తయారీ సామర్ధ్యానికి చాలా చాలా దగ్గరగా ఉన్నాయి. దీన్ని నామరూపాల్లేకుండా చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ తీవ్రంగా తాపత్రయపడుతోంది.

విద్యుత్ ఉత్పత్తి ప్రసారాల ధ్వంసం

ప్రస్తుతం ఇజ్రాయెల్ ఏం చేస్తోందంటే.. ఫోర్దో చుట్టూ ఉన్న విద్యుతుత్పత్తి, ప్రసార వ్యవస్థలను ధ్వంసం చేస్తోంది. దీంతో ఈ అణు కేంద్రంలోని కార్యకలాపాలను తాత్కాలికంగా అడ్డుకునే ఏర్పాటు చేస్తోంది. ఈ కేంద్రంలోని ప్రవేశ ద్వారాలపై దాడులు చేస్తే సిబ్బంది లోపలికి వెళ్లకుండా అడ్డుకోవచ్చు. అందులోని పరికరానలు నిరుపయోగంగా మార్చవచ్చు. తమ కమాండోలను అక్కడికి పంపి.. బాంబులు అమర్చడం ద్వారా.. ఈ మొత్తం కేంద్రం ధ్వంసమై పోయేలా చేయొచ్చు. కానీ ఇది చాలా చాలా పెద్ద ప్రాసెస్. ఆపరేషన్ ఖచ్చితంగా సాగాలి. అది ఇరాన్ లో మరెక్కడో మారు మూల లేదు. ఇరాన్ చాలా చాలా తెలివిగా తమ రాజధానికి అత్యంత దగ్గర్లో.. ఎంతో సురక్షితంగా, భూమి లోలోతుల్లో దాచి ఉంచింది. ఇక్కడికి తమ కమాండోలను పంపడం అంటే మాటలు కాదు. దానికి తోడు ఇరాన్ కూడా అనుమానాస్పందంగా కనిపించిన మొస్సాద్ ఏజెంట్లను అరెస్ట్ చేయడం మాత్రమే కాదు కొందరికి మరణ శిక్ష కూడా విధిస్తోంది. అంత భీకరంగా కనిపిస్తోందిక్కడి వాతావరణం. ఈ క్రమంలో ఇరాన్ సర్ ఫేస్ లో తమ సైనికులను దింపడం ఏమంత శ్రేయస్కరం కాదు.

ఇప్పటికే ట్రంప్ ఈ దిశగా పలు కామెంట్లు

అయితే ఇక్కడే అమెరికా సపోర్టు అత్యవసరం అవుతోంది. యూఎస్ దగ్గర మాత్రమే.. ఈ బంకర్ బస్టర్ బాంబులున్నాయి. వీటిని వాడితే గానీ ఈ యుద్ధ ఉద్దేశం పరిసమాప్తి కాదు. ఇదే ఇజ్రాయెల్ టార్గెట్ కాగా.. అమెరికా ఇందుకు సానుకూలంగా స్పందిస్తోంది. ఇది వరకే ట్రంప్ కొన్ని కీలకమైన ప్రకటనలు చేశారు. అందులో భాగంగా చూస్తే ఇది కాల్పుల విరమణ ఒప్పందంకన్నా మించినది అని ఒక కామెంట్ కాగా.. రెండు ఇరాన్ కి ఎట్టి పరిస్థితుల్లోనూ అణు బాంబు దక్కకూడదని అన్నారాయన. అంతే కాదు.. మూడో ముఖ్యమైన విషయమేంటంటే టెహ్రాన్ వాసులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. కారణం తాము జారవిడిచే ఈ బాంబులకే బాహుబలిలాంటి బంకర్ బస్టర్ ఒక్కసారి భూమిని తాకిందంటే వందల అడుగుల లోతుల్లో ఉండే.. అణు నిల్వలు మొత్తం ధ్వంసమవుతాయి. వాటి తాలూకూ రేడియేషన్ భూమిపైకి ఎగసిపడుతుంది. తద్వారా ఆ ప్రాంతం మొత్తం.. నివాసయోగ్యతకు దూరమై పోతుంది.

ఖమేనీ ఎక్కడున్నాడో మాకు తెలుసంటోన్న యూఎస్

ప్రస్తుతం ఎంత భీకరమైన యుద్ధ కాలం నడుస్తోందంటే ఇరాన్ చీఫ్‌ ఖమేనీ ఎక్కడున్నాడో తమకు తెలుసంటోంది యూఎస్. ఖమేనీ సైతం యుద్ధం మొదలైందని రీకామెంట్ చేశారు. ఇక ఇజ్రాయెల్ సైతం.. ఖమేనీని ఖతం చేయడంతోనే ఈ యుద్ధం ముగుస్తుందని చెబుతోంది. అంటే రెండు టార్గెట్లన్నమాట. మొదటి టార్గెట్ అణు నిల్వల ధ్వంసం. రెండో టార్గెట్ ఖమేనీ ఖేల్ ఖతం చేయడం. ఈ రెండు టార్గెట్లలోకీ కీలకంగా బంకర్ బస్టర్. ప్రస్తుతం ప్రపంచ మంతా బంకర్ బస్టర్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ బాంబు ఎంత పవర్ఫుల్లో తెలుసుకుని అదిరిపడుతున్నారు. ఇప్పటికే దీన్ని పశ్చిమాసియాకు తరలించింది యూఎస్. ఆ మాటకొస్తే అసలు యుద్ధం వీటి తరలింపుతో ఎప్పుడో మొదలు పెట్టేసింది అమెరికా. దాన్ని ఇజ్రాయెల్ లాంఛనంగా స్టార్ట్ చేసిందని అంటారు యుద్ధ వ్యవహారాల నిపుణులు. ఇంతకీ ఈ బంకర్ బస్టర్ కనుగొనాలని అమెరికన్ ఆర్మీ ఎందుకనుకుంది? ఆ వివరాలేంటి? ఇప్పుడు చూద్దాం.. టెహ్రాన్ వాసులారా! నగరం వీడండి.. ట్రంప్ అంటోంది ఇందుకేశతృదుర్బేధ్యమైన కోటగోడలు.. ఆఫ్గనిస్తాన్ లోని గుహలు, పర్వతాల్లో దాక్కున్న ఉగ్రవాదులు లేదా ఆయుధాగారాలు.. ఇరాక్ లో ఇసుక లోతుల్లో నిర్మించిన కాంక్రీట్ బంకర్లు.. ఇరాన్ లో భూమి లోతుల్లో నిర్మించిన ఇదిగో ఇలాంటి అణు కేంద్రాలను ధ్వంసం చేయడం కోసం.. ఈ బంకర్ బస్టర్లను తయారు చేశారు.

రీన్ ఫోర్స్ కాంక్రీట్ ద్వారా కూడా చొచ్చుకుపోగలవు

ఈ బంకర్ బస్టర్ల ప్రధాన లక్షణం ఏంటంటే ఇవి లక్ష్యాలకు చేరి పేలే ముందు.. భూమి లోతులకు దూసుకెళ్లి అక్కడి భూగర్భంలో పేలుతాయి. వీటి గొప్పదనం ఏంటంటే రీన్ ఫోర్స్డ్ కాంక్రీట్ ద్వారా కూడా ఇవి చొచ్చుకుపోతాయి. ఆ భూగర్భంలో దాచిన ఆయుధ శాలలకు వెళ్లడం ఎవరి తరమూ కాదన్న మాటను కాలరాస్తాయీ బంకర్ బస్టర్లు. ఈ బంకర్ బస్టర్లలో రకరకాలుంటాయి. వీటిలో సంప్రదాయ బంకర్ బస్టర్లు మొదటి రకం. ఇవి 1991 గల్ఫ్ యుద్ధ సమయంలో అవసరం అనిపించాయి. ఇరాక్ మొత్తం బంకర్ల మయంగా తెలుసుకున్నాయి మిత్రపక్షాలకు చెందిన దళాలు. వాటిని చేరుకోవడం తమ వల్ల కాదన్న నిర్దారణకు వచ్చాయి. దీంతో బంకర్ బస్టర్ బాంబుల అవసరం గుర్తించింది యూఎస్ ఆర్మీ. ఎప్పుడైతే భూగర్భ లక్ష్యాలకు చేరుకోవడం ముఖ్యమని గుర్తించిందో.. ఆ వెంటనే తీవ్ర పరిశోధనకు దిగింది పెంటగాన్. కొన్ని వారాల్లోనే ఒక నమూనా తయారైంది. 16 అడుగు పొడవు కలిగిన ఈ బాంబును పేల్చినపుడు ఎన్నో అడ్డంకులను తట్టుకునేలా.. గట్టి ఉక్కుతో తయారు చేశారు. ఈ స్టీల్ కేసింగ్ లోపల.. 295 కిలోల ట్రైటోనల్ పేలుడు పదార్ధం దాగి ఉంటుంది. దీని ముందు భాగం లేజర్ గైడెన్స్ ఏర్పాటు చేశారు. చేరుకోవల్సిన లక్ష్యాన్ని లేజర్ తో స్పాట్ చేస్తుందీ బస్టర్. దీంతో బాంబు ఆ దిశగా దూసుకెళ్తుంది. భూగర్భంలోకి వెళ్లి అక్కడ భారీ పేలుడు జరిగేలా చేస్తుంది.ఆ ప్రాంతం కొన్ని అడుగుల లోతుల నుంచి పేలిపోతుంది.

Also Read: చెవిరెడ్డిని సిట్ ఎలా ట్రాక్ చేసింది? వైసీపీలో నెక్ట్స్ అరెస్ట్ ఎవరు?

GBU- 28 లేదా BLU- 113 పేరిట తొలి బస్టర్

అలా GBU- 28 లేదా BLU- 113 పేరిట ఒక బాంబును తయారు చేశారు. అప్పటికది సుమారు రెండు వేల కిలోల బరువు మాత్రమే ఉండేది. వీటినలా డెవలప్ చేస్తూ వచ్చారు. GBU 27, 24 ఇలా వీటిలో రకరకాలు కనుగొన్నారు. వివిధ రకాలుగా ఇంప్రూవ్ చేస్తూ వచ్చారు. బరువులను బట్టీ వీటిని ఒక శ్రేణిగా తయారు చేశారు. అయితే మరింత లోతులకు కూడా వెళ్లి బ్లాస్ట్ చేయగల బాంబుల తయారీ కోసం అన్వేషణ మొదలైంది. ఒక ఆయుధాన్ని ఎంత పవర్ఫుల్ గా తయారు చేస్తే దాని బరువు కూడా అంతే ఎక్కువగా తయారు కావడం మొదలైంది. బంకర్ బస్టర్ల విషయంలో ఈ బరువు చాలా చాలా కీలకం. ఎందుకంటే ఇవి వేగంగా కిందకు జారినపుడు ఆ బరువుకు మరింత లోతులకు వెళ్లిపోవాలి. అదెలా ఉండాలంటే బలమైన కాంక్రీట్ కట్టడాలను సైతం ఢీ కొట్టి దూసుకుపోగలగాలి. ఇందుకు వేగం కోసం రాకెట్ ఇంజిన్ కూడా జత చేశారు. బరువు కోసం మరింత గట్టి ఉక్కును జోడించారు. సీసం బరువైనది కానీ అది పెనట్రేటర్ కి పనికిరాదని గుర్తించారు. సీసం టార్గెట్ రీచైనపుడు విచ్ఛిన్నమై పోతుంది. అలా జరక్కూడదని భావించారు. అందుకే ఉక్కు సరైందని ఫిక్సయ్యారు. ఇందుకు క్షీణించిన యురేనియం కలిపితే ఆ బరువు మరింత ఎక్కువ అవుతుందని తమ పరిశోధనలో తేల్చారు. సాంధ్రత- కాఠిన్యత- దహన లక్షణాలను కలిగిన క్షీణించిన యురేనియం- బాంబు విధ్వంసక శక్తిలో మరొక భాగంగా వాడారు. ఈ మూడు లక్షణాలతో బంకర్ బస్టింగ్ బాంబు తయారు చేశారు. యురేనియం ద్వారా అపారమైన చొచ్చుకుపోయే శక్తితో పాటు బాంబును మరింత బరువుగా తీర్చిదిద్దారు.

చిన్నసైజు అణుబాంబుతో సమానమైన బస్టర్

ఇక్కడ ఈ బస్టర్ తో మరో ప్రమాదం ఏంటంటే దీని వినియోగం ద్వారా రేడియోధార్మికత విడుదలవుతుంది. దీన్ని పీల్చడం ద్వారా.. శరీరానికి భారీ నష్టం కలగ చేస్తుంది. ఒక రకంగా చెబితే ఇది కూడా ఒక చిన్న సైజు అణుబాంబు లాంటిదే. 1997 నుంచి ఈ తరహా ఆయుధాలను అందుబాటులోకి తెచ్చింది యూఎస్ ఆర్మీ. ఆనాటి నుంచే కాదు ఇప్పటికీ అణు బంకర్ బస్టర్లలో మోడ్రెన్ టెక్నాలజీ ఇదే.
ఉదాహరణకు చూస్తే హిరోషిమా పై ప్రయోగించిన అణుబాంబు కేవలం 15 కిలోల పేలుడు సామాగ్రిని మాత్రమే విడుదల చేసింది. దీని ద్వారా.. వచ్చిన షాక్ వేవ్.. భారీ నష్టాన్ని కలగ చేసింది అప్పట్లో. అలాంటిది.. వెయ్యి టన్నుల మేర టీఎన్టీ వాడితే.. అది ఎంత పెద్ద ప్రమాదాన్ని సృష్టిస్తుందో ఊహించుకోవచ్చు. అయితే వీటి వాడకం ద్వారా పర్యావరణ సమస్యలు తలెత్తుతాయి. ఇవి పేలినపుడు భారీ ఎత్తున రేడియో ధార్మికతను గాల్లోకి వదుతాయి. ఇది ఒకరకంగా చెబితే అంతర్జాతీయ అణు శక్తి సంస్థ నిబంధనలకు పూర్తి విరుద్ధం.

ఆల్రేడి ఉన్న యురేనియం ఇందుకు అదనం

ప్రెజంట్ రన్నింగ్ లో ఉన్న బంకర్ బస్టర్ నెంబర్ ఏదంటే జీబీయూ 57ఏ. తొలినాటికీ ఇప్పటికీ ఇది రెట్టింపు పవర్ఫుల్ గా మారింది. అంటే దీని విస్ఫోటనం ఎంత పెద్ద ఎత్తున రేడియో ధార్మితను విడుదల చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. దానికి తోడు ఆయా అణుకేంద్రాల్లోని యురేనిం నిల్వలు ఇందుకు అదనం. దీంతో ఆ రేడియేషన్ మాములు మనుషులు తట్టుకోవడం చాలా చాలా కష్టం. అందుకే ట్రంప్ అంటోంది.. టెహ్రాన్ వాసులు ఈ ప్రాంతాన్ని వదిలి సురక్షిత ప్రదేశానికి వెళ్లాలని.

Story by Adhinarayana, Bigtv Live

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×