BigTV English

Samantha – Raj: నమ్మకం విలువైనది.. సమంత-రాజ్‌లకు శ్యామలి స్ట్రాంగ్ వార్నింగ్

Samantha – Raj: నమ్మకం విలువైనది.. సమంత-రాజ్‌లకు శ్యామలి స్ట్రాంగ్ వార్నింగ్

SaMammootty: అస్వస్థతకు గురైన మమ్ముట్టి.. అసలు విషయంపై ఎంపీ క్లారిటీ!
mantha -Raj: గత కొన్ని రోజులు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha), ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు(Raj nidimoru)ప్రేమలో ఉన్నారు అని గత కొంతకాలంగా వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి బంధం గురించి రాజ్ నిడిమోరు భార్య శ్యామలి (Shyamali) ఎప్పటికప్పుడు ఇన్ డైరెక్ట్ గా కౌంటర్లు వేస్తూనే వచ్చింది. అయితే ఈసారి ఏకంగా కౌంటర్ కాదు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. శ్యామలి తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా.. “నమ్మకం అన్నిటికంటే అత్యంత విలువైనది. ఒకసారి దాన్ని పోగొట్టుకుంటే ఏం చేసినా తిరిగి పొందలేం” అంటూ తన పోస్టులో శ్యామలి పేర్కొంది. అయితే ఈసారి ఏకంగా తన భర్తకు హెచ్చరికగా ఈ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చినట్లు కొంతమంది కామెంట్లు చేస్తున్నారు


శ్యామలి వరుస పోస్టులు వైరల్..

నిజానికి ఈ మధ్యకాలంలో శ్యామలి ఇలాంటి పోస్ట్లు ఎన్నో పెడుతోందని చెప్పాలి. ముఖ్యంగా సమంత – రాజ్ లపై వార్తలు వస్తున్నప్పటి నుంచి ఆమె పోస్టులపై కూడా నెటిజన్లు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కర్మ సిద్ధాంతం గురించి కూడా ఈమె ఒక కొటేషన్ పంచుకుంది. అందులో..”కాలం అన్నింటినీ బయటపెడుతుంది. కర్మ కచ్చితంగా సమాధానం చెబుతుంది. ఈ విశ్వం దీనిని నిశితంగా చూస్తుంటుంది” అంటూ కూడా రాసుకుంది. అంతేకాదు చివరిసారిగా 2023లో మాత్రమే తన భర్త రాజ్ తో కలిసి ఉన్న ఫోటోని ఆమె షేర్ చేశారు. ఇక ఇప్పుడు గత కొన్ని రోజులుగా వీరిద్దరూ విడిపోతున్నారు అంటూ వార్తలు జోరుగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విడాకుల రూమర్స్ పై మాత్రం శ్యామలి ఎక్కడ స్పందించలేదు. కానీ ఇలాంటి పోస్ట్లు మాత్రం నిజంగా సమంత – రాజ్ మధ్య బంధాన్ని ఉద్దేశించి పెడుతోందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


రాజ్ – సమంత మధ్య ప్రేమ రూమర్స్ కి ఆజ్యం అక్కడేనా?

వాస్తవానికి సమంత తన తొలి వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మెన్ 2’ లో నటించింది..దీనికి డైరెక్టర్ రాజ్ నిడిమోరు కావడం గమనార్హం. దీనికి తోడు సమంత మయోసైటిస్ వ్యాధి నుండి కోలుకున్న తర్వాత నటించిన మరో వెబ్ సిరీస్ ‘ సిటాడెల్ – హనీ బన్నీ’. దీనికి కూడా రాజ్ దర్శకత్వం వహించారు. అంతేకాదు ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో ‘ రక్త బ్రహ్మాండ్’ వెబ్ సిరీస్ కూడా వస్తోంది. ది ఫ్యామిలీ మెన్ 2 నుంచి వీరిద్దరి మధ్య పరిచయం ఉన్నప్పటికీ.. సిటాడెల్ సినిమా ప్రమోషన్స్ నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ ఉందనే రూమర్స్ సృష్టించబడ్డాయి.

also read: Mammootty: అస్వస్థతకు గురైన మమ్ముట్టి.. అసలు విషయంపై ఎంపీ క్లారిటీ!

సమంత కెరియర్..

సమంత విషయానికి వస్తే ఈమధ్య అన్నిటికీ దూరంగా, ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ ను స్థాపించి శుభం సినిమాను నిర్మించి సక్సెస్ అయ్యింది. ఇప్పుడు ‘ మా ఇంటి బంగారం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Related News

Coolie: ట్రెండ్ సెట్ చేసిన మోనికా సాంగ్.. ఎవరీ మోనికా బెలూచీ?

War 2: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బ్రేక్!

Allu Arjun: అల్లుఅర్జున్‌కు అధికారుల షాక్.. నేనొక ఫేమస్ నటుడ్ని, అయినా వినలేదు

Film industry: కాల్పుల్లో ప్రముఖ రాపర్ సింగర్ మృతి!

Coolie Vs War 2: రాజకీయ చిచ్చు లేపిన లోకేష్.. ఎన్టీఆర్ ను దెబ్బతీయడానికేనా?

War 2: ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సర్వం సిద్ధం.. కానీ ఆంక్షలు తప్పనిసరి!

Big Stories

×