AP Liquor Scam: వైసీపీ నేతల్లో గుబులు మొదలైంది? ఎప్పుడు ఎవరు ఎలా ఏ కేసులో అరెస్ట్ అవుతారో చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు మాత్రం లిక్కర్ స్కాం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంతు వచ్చిందంతే. ఇంతకీ చెవిరెడ్డిని సిట్ ఎలా ట్రాక్ చేసి అరెస్ట్ చేసింది? చెవిరెడ్డికి వ్యతిరేకంగా సిట్ సేకరించిన ఆధారాలేంటి? నెక్ట్స్ అరెస్ట్ కాబోతున్న వైసీపీ లీడర్లు ఎవరు?
ఒక్క ఫోన్ కాల్ చెవిరెడ్డి అరెస్ట్‌కు ఎలా దారి తీసింది?
ఏపీ లిక్కర్ కేసుతో సంబంధమే లేదన్నట్లుగా ఇన్నాళ్లు రిలాక్స్ డ్ గా కనిపించిన వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫైనల్ గా ఎలాంటి ట్విస్టుల మధ్య అరెస్ట్ అయ్యారు? ఒకే ఒక్క ఫోన్ కాల్ చెవిరెడ్డి అరెస్ట్ కు ఎలా దారి తీసింది? చెవిరెడ్డి లిక్కర్ కమీషన్ డబ్బులు తీసుకున్నట్లు సిట్ దగ్గర ఉన్న కీలకమైన ప్రూఫ్స్ ఏంటి? నెక్ట్స్ అరెస్ట్ కాబోతున్న వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు ఎవరు? నెక్ట్స్ లిస్టులో ఎవరి పేరు ఉంది? తెరవెనుక జరిగిన కథలేంటి.. తెరపైకి వచ్చిన మ్యాటర్స్ ఏంటి.. ఒక్కొక్కటి ఎక్స్ క్లూజివ్ గా డీకోడ్ చేద్దాం.
లిక్కర్ కేసులో సంబంధమే లేదంటున్న చెవిరెడ్డి
లిక్కర్ కేసుతో సంబంధమే లేదు.. కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు.. తన పేరు చెప్పాలని బలవంతంగా స్టేట్ మెంట్లు తీసుకుంటున్నారు.. ఇదీ గత కొన్ని రోజురలుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెర్షన్. సీన్ కట్ చేస్తే లిక్కర్ స్కాం కేసు FIRలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి A38, ఆయన కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి A 39 అని సిట్ డిసైడ్ చేసేసింది. ఎక్కడి లిక్కర్ కేసు.. ఎక్కడిదాకా వచ్చింది? ఎవరి ఆడిన డ్రామాలో ఎవరు ఇరుక్కున్నారు? ఇప్పుడిదే కీ పాయింట్. రైట్.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లిక్కర్ కేసులో తనకు సంబంధమే లేదని పదే పదే వాదిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడేమైంది.. లిక్కర్ పై కమీషన్లుగా వచ్చిన డబ్బుల్ని తీసుకుని గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు పంచడం ఇందుకు సంబంధించిన ఆధారాలు సేకరించామని సిట్ చెబుతుండడం టర్నింగ్ పాయింట్. ఇప్పటి వరకు ఈ కేసులో చెవిరెడ్డి రోల్ ఇలా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. పైగా చెవిరెడ్డి గన్ మెన్ మదన్ రెడ్డి ప్రభుత్వానికి రాసిన లేఖతో సిట్ కు చెక్ పడుతుందనుకున్నారు. చెవిరెడ్డికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని సిట్ ఒత్తిడి చేసిందన్నది గన్ మెన్ మదన్ చెబుతున్న మ్యాటర్. సత్యమేవ జయతే అంటూ సిట్ కూడా కౌంటర్ ఎటాక్ కు దిగడం, అక్కడితో ఆగకుండా చెవిరెడ్డిని అరెస్ట్ చేయడం చకచకా జరిగిపోయాయి. ఈ కేసులో ఇంకా ఆలస్యం చేస్తే మొదటికే నష్టం అనుకున్నారో ఏమోగానీ… చెక్ పెట్టేశారు.
బెంగళూరు ఎయిర్ పోర్టుకు వెళ్లగానే అదుపులోకి
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ పూర్తిగా డ్రమాటిక్ గా సాగింది. లిక్కర్ కేసులో గతంలోనే ఆయనపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. సో బెంగళూరు ఎయిర్ పోర్ట్ వెళ్లారు. అక్కడి నుంచి కొలంబో వెళ్లాలన్నది ప్లాన్ అని డౌట్లు వచ్చాయి. అలర్ట్ అయిన ఇమిగ్రేషన్ ఆఫీసర్లు .. సిట్ టీమ్ కు ఫోన్ చేయడంతో కథ అంతా ఓపెనప్ అయింది. వెంటనే సిట్ బృందం బెంగళూరు ఎయిర్ పోర్ట్ కు వెళ్లడం చెవిరెడ్డిని దేశం దాటి వెళ్లకుండా అడ్డుకోవడం, అరెస్ట్ చేయడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. గతంలో వేరే కేసులో మాజీ మంత్రి కాకాణి కూడా చాలా రోజులు పోలీసులకు దొరకలేదు. శ్రీలంక వెళ్లారన్న టాక్ నడుస్తోంది. వైసీపీ నేతలంతా శ్రీలంక డెస్టినేషన్ సీక్రెట్ ప్లాన్స్ ఏంటన్నది కూడా రాజకీయ వర్గాల్లో ఒక కొత్త డౌట్ తీసుకొస్తోంది. రైట్ సో చెవిరెడ్డి ఒక్క ఫోన్ కాల్ తో అరెస్ట్ అయ్యారు. లిక్కర్ స్కాం కేసులో ఎందుకు అరెస్ట్ అయ్యారు.. సిట్ సేకరించిన ఆ కీలక ఆధారాలు ఏంటన్నది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా మారాయి. చెవిరెడ్డిని సిట్ ఎలా ఫిక్స్ చేసిందన్నదే కీ పాయింట్. సరైన ఆధారాలు లేకుండా పోలీసులు ఎవరినీ అరెస్ట్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే కోర్టుల్లో సరైన ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయకపోతే దర్యాప్తు బృందాలకే ఇబ్బంది. అందుకే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. చెవిరెడ్డి విషయంలో కూడా బలమైన ఆధారాన్ని సిట్ కలెక్ట్ చేసిందంటున్నారు.
బలవంతంగా స్టేట్మెంట్లు తీసుకుంటున్నారన్న చెవిరెడ్డి
అయితే చెవిరెడ్డి అరెస్ట్ చుట్టూ చాలా బజ్ నడుస్తోంది. తనను అక్రమంగా అరెస్ట్ చేస్తారని చాన్నాళ్లుగా చెబుతున్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదన్నారు. బలవంతంగా స్టేట్మెంట్లు తీసుకుంటున్నారన్నారు. చివరికి లుక్ అవుట్ సర్కులర్ ఉన్నా బెంగళూరు నుంచి శ్రీలంక వెళ్లేందుకు ఎలా ప్రయత్నించారన్నది కీలకంగా మారింది. ఉన్నఫళంగా ఆయనే అరెస్ట్ కావాలని అనుకున్నారా.. అందుకే ఇమిగ్రేషన్ ఆఫీసర్లు ఆపుతారని తెలిసి బెంగళూరు ఎయిర్ పోర్ట్ కు వెళ్లారా అన్నది చర్చ జరుగుతోంది. ఇదొక వెర్షన్. మరో వెర్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. లిక్కర్ స్కాం కేసులో జూన్ 17 సాయంత్రం వరకు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన ఫ్రెండ్ వెంకటేశ్ నాయుడులను సిట్ నిందితులుగా చేర్చనేలేదంటున్నారు. వారిపై గుట్టుచప్పుడు కాకుండా లుక్ అవుట్ నోటీసు జారీ చేశారంటున్నారు. నిందితులుగా చేర్చక పోయినా లుక్ అవుట్ నోటీసు జారీ చేయడం ఏంటన్న ప్రశ్నల్ని సంధిస్తున్నారు. బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో ఇద్దరినీ అదుపులోకి తీసుకునే వరకు వారు లిక్కర్ కేసులో అసలు నిందితులుగానే లేరన్న పాయింట్ ను తెరపైకి తెస్తున్నారు. అయినా సరే లుక్ అవుట్ నోటీసు జారీ చేసి అడ్డుకోవడం వెనుక పెద్ద గేమ్ ఉందంటున్నారు.
చెవిరెడ్డి అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు
చెవిరెడ్డి అరెస్ట్ తర్వాత తిరుపతిలో వైసీపీ కార్యకర్తలు నిరనసలు చేశారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు. ఏపీని రక్షించాలని, అక్రమ అరెస్టుల నుంచి నాయకులను కాపాడాలని, సేవ్ డెమొక్రసీ అంటూ అంబేద్కర్ విగ్రహం ముందు వినతిపత్రం సమర్పించారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. టైమ్ వచ్చినప్పుడు తామేంటో కూడా చూపిస్తామంటున్నారు చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి. బలవంతంగా వాంగ్మూలాలు సేకరించి అక్రమ అరెస్టులు చేస్తున్నారంటున్నారు. సో సిట్ మాత్రం తన స్టైల్ లో ఎంక్వైరీ స్పీడప్ చేస్తోంది. గత ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకోవడానికి వైసీపీ లిక్కర్ ముడుపులను వాడినట్టు సిట్ ఐడెంటిఫై చేసింది. సార్వత్రిక ఎన్నికల టైంలో 8 కోట్ల రూపాయల్ని ప్రకాశం జిల్లాలోని ఒక అసెంబ్లీ అభ్యర్థికి ఇచ్చేందుకు తీసుకెళ్తుండగా ఈసీ పట్టుకుంది. అప్పట్లో ఆ డబ్బులను సీజ్ చేసిన తహశీల్దారు మొదలుకొని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాహన డ్రైవర్, గన్‌మెన్, పీఏ వరకు అందరినీ పిలిపించి సిట్ అధికారులు ప్రశ్నించారు. ఆ 8 కోట్లు తనవంటూ అప్పట్లో చెవిరెడ్డి ఫ్రెండ్ వెంకటేశ్ నాయుడు ఆధారాలు చూపించి వెనక్కు తీసేసుకున్నారని గుర్తించారు. అవి లిక్కర్ ముడుపులేనని సిట్ అనుమానిస్తోంది. రాజ్ కేసిరెడ్డి దగ్గర్నుంచి ఈ మనీ మ్యాటర్ అంతా రకరకాల వ్యక్తుల చేతిల్లోకి వెళ్లిందని సిట్ అంటోంది. లిక్కర్ కేసులో ఇది ముగింపు కాదు.. ఆరంభం మాత్రమే. మరి నెక్ట్స్ ఎవరు?
ఏపీ రాజకీయం వేడెక్కుతోంది. వైసీపీ నేతల వరుస అరెస్టులు ఆ పార్టీలో అలజడికి కారణమవుతున్నాయ్. ఇప్పటికే చెవిరెడ్డి అరెస్ట్ అయ్యారు. చాలా మంది జైల్లోనే ఉన్నారు. ఇక నెక్ట్స్ ఎవరన్నది కూడా ఉత్కంఠగా మారింది. ఇప్పటికే పేర్ని నాని, కొడాలి నాని వంతు వచ్చినట్లే అని పొలిటికల్ సర్కిల్స్ లో మ్యాటర్ చక్కర్లు కొడుతోంది. తోపుదుర్తి అజ్ఞాతంలో ఉండడం మరిన్ని ఊహాగానాలకు కారణమవుతోంది. వైసీపీ నేతల్లో అరెస్టుల భయం పెరుగుతోందా అంటే అవునన్న సమాధానమే వస్తోంది. చెవిరెడ్డి వంతు అయింది.. మిగితా కేసుల్లో నెక్ట్స్ జైలుకెళ్లేది ఎవరు అన్న చర్చ జరుగుతోంది. పేర్ని నాని, కొడాలి నాని, తోపుదుర్తి.. ఇలా లిస్టు పెద్దదే ఉందన్న సమాధానాలు వస్తున్నాయ్. అయితే వీరిని ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు? ఇన్ సైడ్ మ్యాటర్ ఏంటి? తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఎక్కడ ఉన్నారు
జగన్ సన్నిహితులంతా వరుసగా జైలుపాలు
2019 నుంచి 2024 మధ్య నాటి వైసీపీ సర్కార్ ఏయే టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టిందో.. ఇప్పుడు వారందరి ఆటకట్టించేందుకు కూటమి ప్రభుత్వం వరుసగా మ్యాటర్ నడిపిస్తోంది. వైసీసీ సీనియర్లు, కీలక నేతలు, జగన్‌కు సన్నిహితులైన అధికారులుఒక్కొక్కరూ జైలు దారి పడుతున్నారు. వల్లభనేని వంశీ, మాజీ మంత్రి కాకాణి, కొమ్మినేని, రాజ్ కేశిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, గోవిందప్ప.. ఇలా జగన్ కు సన్నిహితులంతా ఒకరి తరువాత ఒకరుగా జైలు పాలవుతున్నారు. ఈ అరెస్టులన్నీ కక్ష సాధింపులో భాగమేనని వైసీపీ ఎంతగా ప్రచారం చేసుకుంటున్నా ఫలితం కనిపించడం లేదు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపిస్తున్న వైసీపీ.. కావాలనే తమ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారంటున్నారు. రైట్ ఇప్పుడు ఇప్పుడు మాజీమంత్రి పేర్ని నాని మ్యాటర్ చూద్దాం. పేర్నిపై ఉన్న కేసులను వైసీపీ రాజకీయ కక్షసాధింపు చర్యగా ఆరోపిస్తోంది. పేర్ని నాని భార్య జయసుధ పేరిట నమోదైన గోడౌన్‌లో 185 టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై బందరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ కేసులో పేర్ని నానిని A6గా చేర్చారు. ఈ కేసులో కోర్టుల నుంచి రిలీఫ్ అయ్యాకే పేర్ని నాని కుటుంబం అజ్ఞాతం వీడిందంటున్నారు.
10వేల నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసు
అటు 2024 ఎన్నికల ముందు మచిలీపట్నంలో ఓట్ల కోసం సుమారు 10 వేల నకిలీ పట్టాలను పంపిణీ చేసినట్లు పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టుపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో పేర్ని నాని కీలక సూత్రధారిగా ఉన్నారని ఆరోపిస్తూ, అరెస్ట్‌కు రంగం సిద్ధమైందన్న ప్రచారం జరిగింది. ప్రస్తుతానికి ఈ కేసులో పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారంటున్నారు. ఈ కేసులో పేర్ని పీకల్లోతు కూరుకుపోయినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పేర్ని నాని, పేర్ని కిట్టు ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. అటు 2019లో టీడీపీ కార్యకర్తలు చందు, శ్రీహర్షలపై నమోదైన ఒక కేసులో పేర్ని నాని సాక్షిగా ఉన్నారు. అయితే కోర్టుకు హాజరు కాకపోవడంతో తాజాగా నోటీసులు జారీ చేసింది కోర్టు. సో కథ తవ్వుతూ వెళ్తే చాలా పెద్దదిగానే ఉంటోంది. సీన్ కట్ చేస్తే కేసులకు, అరెస్టులకు భయపడేదే లేదంటున్నారు వైసీపీ లీడర్లు. కానీ లోలోపల మాత్రం భయాలు ఉన్నాయంటున్నారు.
ఇటీవలే ముంబైలో కొడాలికి బైపాస్ సర్జరీ
ఈ పరిణామాలు ఇలా ఉంటే.. తాజాగా కొడాలి నానిని కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు అడ్డుకున్నారన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొలంబో వెళ్తుండగా అడ్డుకున్నారన్న ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై దృష్టి పెట్టిన ఏపీ పోలీసులు కొడాలి నాని హైదరాబాద్ లోనే ఉన్నట్లు నిర్ధారించారు. ఉద్రిక్తతలు పెంచేందుకే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు. అయితే కొడాలి నానిపైనా చాలా కేసులే ఉన్నాయి. రేపో మాపో అరెస్ట్ తప్పదంటున్నారు. ఇటీవలే ముంబైలో కొడాలికి బైపాస్ సర్జరీ జరిగింది. రెస్ట్ తీసుకుని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఆ మధ్య అమెరికా వెళ్లిపోయి అక్కడే చాలా కాలం రెస్టు తీసుకుంటారన్న చర్చ కూడా జరిగింది. అయితే అమెరికా వెళ్లలేదు. 2024 ఎన్నికల సమయంలో కొడాలి నాని వార్డు వాలంటీర్లతో బలవంతంగా రాజీనామాలు చేయించారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ హయాంలో కొడాలి నాని ప్రెస్ మీట్లు, అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు, లోకేశ్‌లపై అసభ్యకర పదజాలంతో దుర్భాషలాడారన్న విషయంపై విశాఖపట్నం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో 2024 నవంబర్‌లో కేసు నమోదైంది.
అజ్ఞాతంలో రాప్తాడె మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి
ఇక 2022 డిసెంబర్‌లో గుడివాగడ టీడీపీ కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు కత్తులు, పెట్రోల్ ప్యాకెట్లతో దాడి చేశారన్న అభియోగాలు కొడాలిపై ఉన్నాయి. కొడాలి నాని ఆదేశాలతో ఆయన అనుచరులు పాల్గొన్నారన్న అభియోగాలపై కేసు నమోదైంది. ఈ కేసులో కొడాలి నాని ప్రధాన అనుచరుడు కాళీని మేలో అస్సాంలో అరెస్ట్ చేశారు. 13 మంది నిందితులు నెల్లూరు జైల్లో ఉన్నారు. ఈ కేసులో చివరగా కొడాలి నాని అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలోనే మేలో కృష్ణా జిల్లా ఎస్‌పీ కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆయన పాస్‌పోర్ట్ సీజ్ చేయాలని డీజీపీకి టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. పలు కేసుల్లో గరిష్ఠంగా ఏడేళ్ల శిక్ష పడే సెక్షన్లు ఉండడంతో ఎప్పుడైనా కొడాలి అరెస్ట్ అవ్వొచ్చన్న చర్చ జరుగుతోంది. అటు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అజ్ఞాతంలో ఉన్నారు. శ్రీసత్యసాయి జిల్లా కుంటిమద్ది హెలిప్యాడ్ ఘటనకు సంబంధించిన కేసులో వారంలో రోజుల్లో తమ ఎదుట హాజరు కావాలని రామగిరి సర్కిల్ పోలీసులు లేటెస్ట్ గా నోటీసులు జారీ చేశారు.
Also Read: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రైల్వేల మాదిరిగా ఆ సదుపాయం!
ఏప్రిల్ 8న జగన్ హెలిప్యాడ్ వద్ద వైసీపీ శ్రేణులు హల్ చల్
ఏప్రిల్ 8న మాజీ సీఎం జగన్ వచ్చిన టైంలో హెలిప్యాడ్ వద్ద వైసీపీ శ్రేణులు హల్‌చల్ చేశాయి. జగన్‌కు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని వైసీపీ నేతలు ఆరోపించడంతో పోలీసులు ఈ ఘటన వెనుక కుట్రకోణం ఉందన్న అనుమానంతో విచారణ చేపట్టారు. తోపుదుర్తి సహా పలువురిపై కేసు నమోదుచేశారు. దాంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇదే సమయంలో రామగిరి మండలంలోని ఓ గ్రామంలో బాలికపై అఘాయిత్యానికి సంబంధించి పరామర్శించేందుకు చలో పేరూరు పేరుతో ఈ నెల 12న తోపుదుర్తి ర్యాలీ తీశారు. ఉద్దేశపూర్వకంగానే పేరూరుకు వెళ్లడానికి ప్రయత్నించారని తోపుదుర్తితోపాటు మరికొందరు వైసీపీ నేతలపై రామగిరి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు రావాలని ఈ నెల 13న పోలీసులు 41ఏ నోటీసు ఇచ్చారు. అయితే ఆయన ముంబై వెళ్లిపోయారు. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న తోపుదుర్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రెండు కేసుల్లో ఉచ్చు బిగుసుకుంటుండడంతో ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. సో ఇలా చాలా మంది వైసీపీ నేతలకు అరెస్ట్ భయాలు పెరుగుతున్నాయి.
story by vidya, Bigtv Live