BigTV English

Ind Pak War: మీ కాళ్లు మొక్కుతా అప్పులివ్వండి ప్లీజ్.. కాళ్లబేరానికి పాకిస్తాన్.!

Ind Pak War: మీ కాళ్లు మొక్కుతా అప్పులివ్వండి ప్లీజ్.. కాళ్లబేరానికి పాకిస్తాన్.!

IMF ఎండీతో మాట్లాడిన నిర్మలా సీతారామన్

భారత ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అయితే, ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జినాతో మాట్లాడారు. పాకిస్థాన్ కి ఎలాంటి సాయం అందించవద్దని చెప్పారు. భారత్ ఇతర దేశాలకు నిధులివ్వడాన్ని వ్యతిరేకం కాదు కానీ పాకిస్థాన్ కి ఇవ్వడం మాత్రం సరైన చర్య కాదని.. జార్జినాకు చెప్పారు నిర్మలా సీతారామన్. గత గణాంకాలను బట్టీ చూస్తే ఐఎంఎఫ్ నుంచి పొందిన నిధుల తర్వాత పాకిస్థాన్ ఆయుధ సేకరణలో భారీ పెరుగుదల కనిపిస్తోంది. ఈ విషయం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ దృష్టికి తీస్కెళ్లింది భారత్.


పాక్ కి రుణం మంజూరు చేసిన IMF

ఒక పక్కపాక్ భారత్ పైకి పాక్ డ్రోన్లు విడుదల చేస్తూ.. తీవ్ర సంక్షోభానికి తెరలేపాలని ప్రయత్నిస్తున్న వేళ. సరిగ్గా అదే సమయంలో.. ఐఎంఎఫ్, పాకిస్థాన్ కి నిధుల విడుదల చేయాలన్న నిర్ణయం. దీనిపై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఉగ్రదాడులను ఖండించే వివిధ దేశాలు

పహెల్గాం తరహా దాడులను ఎన్నో దేశాలు ఖండించాయి. ఖండిస్థాయి. ఖండిస్తూనే ఉంటాయి. ఇప్పుడేకాదు ఎప్పటి నుంచో ఉగ్రవాదానికి తాము వ్యతిరేకం అంటాయి. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే.. ఉగ్రవాద పుట్టినిల్లైన పాకిస్థాన్ కి నిధులు ఇవ్వొచ్చా.. లేదా అన్న ఓటింగ్ జరిగింది. అప్పుడీ దేశాలు నిరభ్యంతరంగా ఓటు వేయడం ఒక విచిత్రం. భారత్ ఈ ఓటింగ్ కి దూరంగా ఉన్నా సరే నిధుల విడుదల జరగటం గమనార్హం.

IMF, WB లను హెచ్చరించిన రాజ్ నాథ్ సింగ్

భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ ఐఎంఎఫ్‌ , ఇతర అంతర్జాతీయ నిధుల సంస్థలను తీవ్రంగా హెచ్చరించారు. పాక్ ఇప్పటికే ఈ నిధులను భారత్ ధ్వంసం చేసిన ఉగ్ర శిబిరాలను పునరుద్దరించే దిశగా ఖర్చు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ విషయం గుర్తించి మరీ నిధులు ఇవ్వాలని హెచ్చరించారు రాజ్ నాథ్. మీరిచ్చే డబ్బును పాక్ సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకోసం వెచ్చించకుండా.. మసూద్ అజర్ వంటి ఉగ్రనాయకులకు వెచ్చిస్తోంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరికలు జారీ చేశారు భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్.

ఉగ్ర సంస్థ పెడుతున్నాం సాయం చేయమంటే చేసే పాక్

పాకిస్థాన్ ప్రభుత్వం ఎంత దారుణమంటే.. ఇతర దేశాల్లో ఏదైనా పరిశ్రమ పెట్టుకుంటాం.. మాకు రుణం ఇవ్వండీ అంటే ఎలా ఇస్తారో.. పాకిస్థాన్ లో ఉగ్ర సంస్థ స్థాపించే వారికిలాగే ఆర్ధిక సహాయం చేస్తారు. అందుకు లష్కరే, జైషే వంటి సంస్థలే ఉదాహరణ. లష్కరే చీఫ్‌ కి కట్టు దిట్టమన భద్రతా ఏర్పాట్లు చేస్తుంది పాక్. జైషే అధినేతకు ఏకంగా కోట్లాదిరూపాయల ఆర్ధిక సాయం అందిస్తోంది. హఫీజ్ సయీద్ వంటి టాప్ మోస్ట్ ఉగ్రవాద నాయకులపై దాడి జరక్కుండా వారిని బంకర్లలో భద్రంగా దాచిన ఘనత పాకిస్థాన్ ది.

సైనికాధికారుల ద్వారా ఉగ్రవాదులకు మిలటరీ ట్రైనింగ్

మాములుగా ఇతర దేశాలు.. తమ దేశ వాసులు చెల్లించే పన్నులను దేశాభివృద్ధికి, సంక్షేమానికి ఖర్చు చేస్తుంటాయి. అదే పాకిస్థాన్ మాత్రం ఇతర దేశాల నుంచి అరువు తెచ్చుకుని మరీ ఇక్కడి ఉగ్రవాదులను, వారి స్తావరాలను పెంచి పోషిస్తుంది.

లష్కరేకి ఏకంగా ఉగ్రవాద విశ్వవిద్యాలయం

ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే, తమ సైనికాధికారుల ద్వారా వారికి మిలిటరీ ట్రైనింగ్ సైతం ఇప్పిస్తుంది. ఇక లష్కరే అయితే ఒక చిన్నపాటి సైన్యాన్ని తయారు చేయించడం మాత్రమే కాదు.. వారికంటూ అత్యాధునిక ఆయుధాలతో ట్రైనింగ్ ఇప్పిస్తుంది. లష్కరేకి ఏకంగా ఉగ్రవాద విశ్వవిద్యాలయం ఉందంటే అతిశయోక్తి కాదు. మొన్న గాయపడి ఆస్పత్రిలో చేరిన అమీర్ హంజా.. లష్కరే టెర్రర్ వర్సిటీ అధికారి కూడా.

2016 ఉరి, 2019 పుల్వామా దాడుల సూత్రధారి మసూద్

లష్కరే ని UN నిషేధిత ఉగ్ర సంస్థగాప్రకటించగా.. US అయితే లష్కరే చీఫ్‌ హఫీజ్ సయీద్ తలకు 85 కోట్ల రివార్డు ప్రకటించింది. ఇక మసూద్ అజర్ ని ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర వేసింది. 2016 ఉరి, 2019లో పుల్వామా ఉగ్రదాడుల వెనకున్న ఉగ్రనాయకుడు మసూద్ అజర్. ఇతడికి పాకిస్థాన్ నిధులు ప్రకటిస్తుంటే.. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకులు లోన్లు ఇవ్వడమేంటన్నది భారత్ సూటిగా సంధిస్తోన్న ప్రశ్న. పాకిస్థాన్ కి ఐఎంఎఫ్ సాయం చేయడం అంటే అది పరోక్షంగా ఉగ్రవాదానికి సాయమందించడమే అన్నారు రక్షణ మంత్రి రాజ్ నాథ్. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ తమ నిర్ణయాలను పునః పరిశీలించుకోవల్సిందిగా కోరారాయన.

2018లో పాక్ ని గ్రే లిస్ట్ లో చేర్చిన FATF

పాక్ ఉగ్రవాదం, మనీలాండరింగ్ కి పాల్పడుతోందని గుర్తించిన FATF ఈ దేశాన్ని 2018లో గ్రే లిస్ట్ లో చేర్చింది. 2022లో ఈ జాబితా నుంచి ఎలాగోలా బయటపడింది పాకిస్థాన్. ఒక వేళ పాక్ ఈ జాబితాలో అలాగే ఉండి ఉంటే.. దానికంటూ ఎలాంటి నిధులు రావు. కానీ ఇక్కడే పాక్ మేజిక్ చేసింది. ఛాన్స్ కొట్టేసింది.

FATF లో 40 సభ్య దేశాలు, ఇందులో భారత్ ఒకటి

బేసిగ్గా ప్రపంచ ఉగ్ర నిధుల వ్యతిరేక సంస్థలో.. 40 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. వీటిలో భారత్ కూడా ఒకటి. అప్పట్లో FATF తీసుకున్ననిర్ణయాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. కానీ కొన్ని కొన్ని సాంకేతిక అంశాల సాయంతో పాక్ ఈ దుస్థితి నుంచి తప్పించుకోగలిగింది.

ఐఎంఎఫ్ నుంచి 5 బి. డా. అడుగుతోన్న పాక్

గ్రేలిస్ట్ నుంచి బయట పడ్డంతో ప్రస్తుతం పాక్ ఇటు ఐఎంఎఫ్ ను సుమారు ఐదు బిలియన్ డాలర్ల సాయం కోరుతోంది. సరిగ్గా అదే సమయంలో వరల్డ్ బ్యాంకుతో జనవరిలో చేసుకున్న ఒప్పందంలో భాగంగా 20 బిలియన్ డాలర్లను ఇవ్వమని తొందర పెడుతోంది. అదే పాక్ ని గ్రే లిస్ట్ లో ఉంచగలిగితే పరిస్థితి మరో విధంగా ఉండేది కాబట్టి.. ఈ అంతర్జాతీయద్రవ్య నిధుల సంస్థలను ఆలోచించాల్సిందిగా కోరుతోంది భారత్.

ఉగ్రవాదులకు సాయం చేసే పాక్ కి ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ సంస్థలు

వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, యూఎన్, ఐసీజే.. ఇవన్నీ ఒకేతరహాకు చెందినవి. అంతర్జాతీయంగా.. సామాజిక- రాజకీయ- ఆర్ధిక- న్యాయపరమైన సమస్యలు తలెత్తినపుడు ఈ అంతర్జాతీయ సంస్థలు స్పందిస్తాయి. అయితే ఇక్కడే వీటికంటూ ఒక సారూప్యత లేకుండా పోతోంది. ఐక్య రాజ్య సమితి పాక్ ఒక ఉగ్రదేశంగా, అక్కడి కొందర్ని ప్రపంచ స్థాయి ఉగ్రవాదులుగా ప్రకటిస్తుంది. అలాంటి ఉగ్రవాదులకు సాయం చేసే పాక్ కి ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ వంటి సంస్థలు నిధులిస్తాయి. దీన్నెలా అర్ధం చేసుకోవాలి? సరిగ్గా ఇదే అంశంపై భారత్ తన వ్యతిరేక వాణి వినిపిస్తోంది. అదెలా? ఇప్పడు చూద్దాం.

ఆ దేశ టెర్రరిస్టులపై రివార్డులున్నాయ్

యూన్ హిట్ లిస్ట్ లో ఉన్న టెర్రరిస్టులంతా పాక్ లోనేపాకిస్థాన్ ఒక టెర్రరిస్ట్ ఫ్యాక్టరీ. పాక్ ఉగ్రవాదులపై యూఎన్ టెర్రరిస్ట్ ముద్ర వేసింది. పాక్ ఉగ్రవాదుల తలపై కోట్లాది రూపాయల రివార్డులున్నాయ్. ఐనా సరే ఐఎంఎఫ్ నిధులిస్తుంది. ఇప్పటి వరకూ ఐఎంఎఫ్‌.. పాకిస్తాన్ కి 25 సార్లు నిధులిచ్చినట్టు చెబుతున్నాయి రికార్డులు. ఇక వరల్డ్ బ్యాంక్ సంగతి సరే సరి.. ఇప్పటి వరకూ ప్రపంచ బ్యాంకు ఎన్నిసార్లు పాకిస్థాన్ కి రుణాలిచ్చిందో.. లెక్కలేదు.

OP సిందూర్ జరుగుతుండగానే

మొన్న ఒక పక్క ఆపరేషన్ సిందూర్ జరుగుతుంటే.. మరో పక్క పాక్ ఐఎంఎఫ్ కి 5 బిలియన్ డాలర్ల రుణం కావాలంటూ అప్లికేషన్ పెట్టుంది. ఇందుకు ఐఎంఎఫ్.. 2 బిలియన్లకు పైగా నిధులిచ్చేలా నిర్ణయించింది.

జనవరిలో WB 20 బిలియన్లిచ్చేలా ఒప్పందం

ఇక వరల్డ్ బ్యాంక్ పాకిస్థాన్ కి 20 బిలియన్ డాలర్లు ఇచ్చేలా జనవరిలో ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందాన్ని మరింత వేగవంతం చేయాలని కోరుతోంది ఇస్లామాబాద్. పాక్ మీడియాలో వస్తున్న వార్తలే ఇందుకు సాక్ష్యం.

ఇదే అభ్యంతరం అంటోన్న భారత్

ఇదే తమకు అభ్యంతరకరం అంటోంది భారత్. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్.. పాకిస్థాన్ ఉగ్రవాదులకు సమకూర్చే నిధులకు సంబంధిచి కొన్ని వివరాలను వెల్లడి చేసింది. జూన్ లో ప్రపంచ బ్యాంకుతో జరిగే సమావేశంలో ఈ విషయంలో తన అభ్యంతరాలను తెలిపేలా ప్లాన్ చేస్తోంది భారత్. అంతే కాదు ప్రపంచ ఉగ్రవాద నిధుల వ్యతిరేక సంస్థ- ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రేలిస్ట్ లో పాకిస్తాన్ ని తిరిగి చేర్చాలన్న డిమాండ్ చేస్తోంది భారత్.

ప్రైవేటు రంగ అభివృద్ధి కోసం WBని అప్పడిగిన పాక్

ఇంతకీ పాక్.. వరల్డ్ బ్యాంకు నుంచి అంత మొత్తం ఎందుకు అడిగిందంటే.. ప్రైవేటు రంగ అభివృద్ధి, వాతావరణ సమతుల్యత కోసమట. ఇక్కడ ప్రైవేటు రంగ అభివృద్ధి అంటే మరేదో కాదు.. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడమే. ఈ విషయం ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతంలో నివసించే.. చిన్న పిల్లాడ్ని అడిగినా చెప్పేస్తాడు.

హఫీజ్ సయీద్ లాంటి టెర్రరిస్టులకు భారీ భద్రత

పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఒక పరిశ్రమగా తయారు చేశారని చెప్పడానికి ఎన్నో నిదర్శనాలు. టెర్రరిస్టుల మృతదేహాలకు తమ జాతీయ జెండా కప్పడం.. హఫీజ్ సయీద్ కి అత్యున్నత స్థాయి భద్రత కల్పించడం.. ఒక ఉగ్రవాదికి ఇంతటి కట్టుదిట్టమైన భద్రత ప్రభుత్వం కల్పించడమేంటి? ఇలాంటి దేశానికి అంతర్జాతీయ సంస్థలు నిధులు సమకూర్చడమేంటి? ఇదీ భారత్ ప్రశ్న.

మసూద్ అజర్ కి రూ. 14 కోట్ల ఆర్ధిక సాయం..

తాజాగా మసూద్ అజర్ ఈ ఆపరేషన్లో తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవడంతో.. అతడికి 14 కోట్ల రూపాయల మేర నిధులను సమకూర్చేలా తెలుస్తోంది. ఈ నిధులతో అజర్.. ఇటీవల భారత దాడుల కారణంగా కూలిన భవనా నిర్మాణం చేసుకుంటారని సమాచారం. అంతే కాదు తమ ఉగ్ర సంస్థ.. కోల్పోయిన ఉగ్రవాదుల స్థానే కొత్త ఉగ్రవాదులను తయారు చేయడానికి వాడే అవకాశముంది. ఇందుకోసం ఒక ప్రభుత్వం నిధులివ్వడమేంటి? ఇదే భారత్ నిలదీస్తోన్న విధం.

2. 3 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించిన IMF

తాజాగా అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ 2. 3 బిలియన్ డాలర్ల ప్యాకేజీని పాకిస్థాన్ కి ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ దిశగా పాకిస్థాన్ అన్ని టార్గెట్లను ఫినిష్ చేసినట్టుచెబుతోంది ఐఎంఎఫ్‌. ఈ ప్యాకేజీ ఎందుకు? అంటే ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్ కి జరిగిన నష్టం పూడ్చడానికట. ఆపరేషన్ సిందూర్ ని భారత్ ఎందుకు నిర్వహించింది? పాక్, POJKలోని 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసేందుకు? అలాంటి ఉగ్రవాదానికి నష్టం జరిగితే.. దానికంటూ బెయిల్ ఔట్ ప్యాకేజీ ఇవ్వడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?

OP సిందూర్ నష్టం పూడ్చుకోడానికట

ఐఎంఎఫ్, యూఎన్ వంటి సంస్థలు సమానమైన హోదా కలిగినవి. అలాంటి సంస్థల్లో ఒకటైన ఐక్యరాజ్య సమితి.. నిషేధించిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులంతా పాకిస్థాన్ లోనే ఉంటారు. అలాంటి దేశానికి ఐఎంఎఫ్ ఇంత భారీ ఎత్తున లోన్లు ఇవ్వడంలో అర్ధమేంటి? ప్రపంచ ద్రవ్యనిధి సంస్థలను ప్రశ్నిస్తోంది భారత్.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×