YSRCP VS TDP: వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాయలసీమలో తాను చెప్పిందే వేదం అన్నట్లు వ్యవహరించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కూటమి ప్రభుత్వం ముప్పేట దాడి మొదలు పెట్టినట్లు కనిపిస్తోంది. భవిష్యత్తులో కూడా పెద్దిరెడ్డి ఫ్యామిలీ పెత్తనం కొనసాగకుండా అయనకు చెక్ పెట్టడానికి అన్ని దారులను మూసివేస్తోంది. జిల్లాల విభజన తర్వాత మూడు జిల్లాల్లో పెద్దిరెడ్డి షాడో సీఎంలా వ్యవహరించారని వైసీపీ వర్గాలే అంటుంటాయి. ఆయన్ని కేవలం ఓ జిల్లాకు పరిమితం చేయడానికి ఫిక్స్ అయిన కూటమి ప్రభుత్వం…అందులో భాగంగానే అయన నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లాలో కలిపేసిందంట. దీంతో పాటు అయన అస్తుల పై విజిలెన్స్ నివేదిక అధారంగా ఎక్కడి కక్కడ చర్యలు తీసుకుంటూ ముందుకు పోతుంది. పెద్దిరెడ్డి అలా అష్టదిగ్బంధనంలో చిక్కుకుంటుండటంతో టీడీపీతో పాటు వైసీపీ నేతలు కూడా హ్యాపీ అయిపోతున్నారంట..
సింగిల్ జిల్లాకు పరిమితం కానున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
రాయలసీమ జిల్లాలలో తిరుగులేని హవా చెలాయించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సింగిల్ జిల్లాకు పరిమితం కానున్నారు. అయనకు రాజకీయంగా చెక్ పెట్టడానికి అన్ని దారులను కూటమి ప్రభుత్వం మూసివేస్తుంది. జిల్లాల విభజన తర్వాత మూడు జిల్లాల్లో చక్రం తిప్పిన అయన్ని కేవలం ఓ జిల్లాకు పరిమితం చేయడానికి సిద్దమైంది. అందులో భాగంగానే అయన నియోజకవర్గం పుంగనూరును అన్నమయ్య జిల్లాలో కలిపిందంటున్నారు. దాంతో పాటు అయన అస్తులపై విజిలెన్స్ నివేదిక అధారంగా ఎక్కడి కక్కడ చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం దూకుడు పెంచింది. పెద్దిరెడ్డిని ఒక్క జిల్లాకు పరిమితం చేయడంతో టీడీపీ నేతల కంటే వైసీపీ సీనియర్లు తెగ హ్యాపీగా పీలవుతున్నారంట.
ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చక్రం తిప్పిన పెద్దిరెడ్డి
వైసీసీ ప్రభుత్వంలో జిల్లాలో విభజన జరిగినప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా తన కుటుంబ ప్రాబల్యం ఉండేట్లు పెద్దిరెడ్డి చక్రం తిప్పారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గం రాజంపేట పార్లమెంట్‌లో ఉన్నప్పటికి తెలివిగా తన నియోజకవర్గాన్ని మాత్రం విభజిత చిత్తూరు జిల్లాలో కలిపించుకున్నారు. ఆయన కూమారుడు మిథున్‌రెడ్డి రాజంపేట ఎంపి కావడంతో పాటు సోదరుడు ద్వారకానాథ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తంబల్లపల్లి నియోజకవర్గం కూడా అన్నమయ్య జిల్లాలో ఉంది. దీనికితోడు అయనకు రాజంపేట నియోజకవర్గంలో దగ్గర బంధువులు ఉన్నారు.
పులిచెర్లను తిరుపతి జిల్లాలో కలపాలని ప్రతిపాదనలు
మరో వైపు పెద్దిరెడ్డి నివాసం తిరుపతిలో ఉండటంతో అక్కడ కూడా తనకు ప్రోటోకాల్ కోసం తన నియోజకవర్గంలోని పులిచెర్లను తిరుపతి జిల్లాలో కలపాలని ప్రతిపాదనలు పంపారు. అయితే అప్పటికి ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆ ప్రక్రియ అగిపోయింది. అయన వ్యాపారాలు అస్తులు తిరుపతిలో ఉండటంతో పాటు అయన అనుంగు శిష్యులు అంతా తిరుపతి జిల్లాలో ఉండటంతో అధికారంలో ఉన్నప్పుడు అక్కడ కూడా అయన ప్రభ వెలిగిపోయింది . పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయన వర్గం 2019-24 మద్య కాలంలో తమ అధికారాన్ని అన్ని విధాలుగా 3 జిల్లాలలో చూపించారు. ముఖ్యంగా పెద్ద ఎత్తున భూముల అక్రమణలు జరిగాయని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో తేల్చి చెప్పింది.
మంగళంపేట అటవీ భూముల వ్యవహారంపై కేసు
ఈ నేపథ్యంలో ఇప్పటికే పులిచెర్ల మండలంలోని మంగళంపేట అటవీ భూముల్లో సరిహద్దు రాళ్లు పాతిన పెద్దిరెడ్డిపై అటవీ చట్టాల ప్రకారం కేసు నమోదు అయింది. పాకాల కోర్టులో దానికి సంబంధించి ప్రొసీడింగ్స్ మొదలు అయ్యాయి. మదనపల్లి బండమీదామ్మపల్లెలో అయన ఆక్రమించిన ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతో పాటు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం కేసులో సీఐడీ కోర్టులో ప్రోసీడింగ్స్ మొదలయ్యాయి.. ఇక తిరుపతిలోని పెద్దిరెడ్డి నివాసం, పార్టీ కార్యాలయం, గోశాల అన్నీ బుగ్గ మఠానికి సంబంధించిన దేవాదాయ భూముల్లో ఉన్నాయన్న సర్వే డిపార్ట్‌మెంటు నివేదిక అధారంగా అయనను విచారణకు హాజరు కమ్మని నోటీసులు ఇచ్చారు.
అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి చెప్పిందే శాసనం
ఇక ఏపీ లిక్కర్ స్కాంలో పెద్దిరెడ్డి కొడుకు ఎంపీ మిధున్‌రెడ్డి నాలుగో నిందితుడు. అలా పెద్దిరెడ్డిపై ముప్పేట దాడి మొదలవ్వడంతో కూటమి శ్రేణులతో పాటు వైసీపీ నేతలు కూడా ఖుషీ అవుతున్నారంట. అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి చెప్పిందే శాసనం అన్నట్లు నడిచింది. అప్పట్లో అయన్ని కేవలం అన్నమయ్య జిల్లాకే పరిమితం చేయాలని వైసీపీలోని మిగతా జిల్లా మంత్రులు , సీనియర్లు ప్రయత్నించినప్పటికి ఫలించలేదు. వైసీపీ హయాంలో డిప్యూటీ సీఎంగా ఉన్న నారాయణ స్వామి కంటే మాములు మంత్రి అయన పెద్దిరెడ్డికి అధికారిక కార్యక్రమాలలో అధికారులు పెద్దపీట వేసేవారు. చివరకు సీఎం హాజరైన అధికారిక కార్యక్రమంలో డిప్యూటీ నిలబడి ఉంటే పెద్దిరెడ్డి కూర్చున్న పోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో పెద్దఎత్తున హల్ చల్ చేసాయి. ఇక చెవరి రెండేళ్లు మంత్రి పదవి దక్కించుకున్న రోజా సైతం పెద్దిరెడ్డి వైభోగం ముందు జిల్లాలో తేలిపోయారు.
పులిచెర్ల మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడానికి చర్యలు
ఇలాంటి తరుణంలో అయన నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలో ఉండటంతో పుంగనూరుని చిత్తూరులో కలవవద్దని వైసీపీ నేతలు పార్టీ పెద్దలను కోరారంట. కాని అప్పుడు పెద్దిరెడ్డి హావా ముందు వారి మాటలు సాగలేదంట. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో కూడా పెద్దిరెడ్డి ఫ్యామిలీతో ఇబ్బంది రాకుండా ఆయన్ని తిరుపతి, చిత్తూరు జిల్లా నుంచి దూరం చేయడానికి పుంగనూరును అన్నమయ్య జిల్లాలో కలిపేసిందంటున్నారు. దాంతో పాటు పుంగనూరు సెగ్మెంట్లోని పులిచెర్ల మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడానికి చర్యలు తీసుకుందంట.
Also Read: ఇంకా మారని పాక్ బుద్ధి.. ఇంకా అవే డొల్ల మాటలు
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అప్రకటిత సీఎంలా వ్యవహరించిన పెద్దిరెడ్డి
పులిచెర్ల మండలం గతంలో చంద్రగిరి నియోజకవర్గంలో ఉండేది. పులిచెర్లలో టీడీపీ బలంగా ఉండటంతో ఆ మండలాన్ని తిరుపతి జిల్లాలో కలిపి సొంత నియోజకవర్గంలో కూడా పెద్దిరెడ్డికి చెక్ పెట్టడానికి స్కెచ్ గీసిందంటున్నారు. కూటమి ప్రభుత్వ నిర్ణయంపై చాలామంది వైసీపీ ముఖ్య నేతలు హ్యాపీగా ఫీలవుతున్నారంట. చిత్తూరు, తిరుపతి జిల్లాల వైసీపీ నేతలు ఇకపై పెద్దిరెడ్డి పెత్తనం ఉండదని సంబరపడిపోతున్నారంట. మొత్తానికి జగన్ సర్కారులో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అప్రకటిత సీఎంలా వ్యవహరించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇప్పుడు సీన్ రివర్స్ అయి అష్టదిగ్బంధనంలో ఇరుక్కుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది.