Sreemukhi Net Worth : శ్రీముఖి (Sreemukhi).. బుల్లితెర రాములమ్మగా పేరు సొంతం చేసుకున్న శ్రీముఖి.. 1993 మే 10న నిజామాబాద్ జిల్లా తెలంగాణలో జన్మించింది. గ్రాడ్యుయేషన్ సమయంలో దంత వైద్యం అభ్యసించిన ఈమె.. మొదట ‘అదుర్స్’ అనే టీవీ షోకి హోస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. “సూపర్ సింగర్ 9” అనే పాటల కార్యక్రమానికి కూడా హోస్ట్ గా చేసిన ఈమెకు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas), అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా వచ్చిన ‘జులాయి’ సినిమాలో హీరోకి సోదరిగా అవకాశాన్ని కల్పించారు.. ఇక తర్వాత ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘నేను శైలజ’, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’, ‘ధనలక్ష్మి తలుపు తడితే’, ‘సావిత్రి’ వంటి చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరోయిన్ గా రెండు మూడు సినిమాలు చేసింది. కానీ సక్సెస్ కాలేకపోయింది. బుల్లితెరపై అడుగులు వేసిన ఈమె.. ఇక్కడే పలు షోలు చేస్తూ సెటిలైపోయింది. అలా బుల్లితెర రాములమ్మగా పేరు తెచ్చుకోవడమే కాకుండా ఒక్కో షో కి రూ.2 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటూ .. సుమా కనకాలకి గట్టి పోటీ ఇస్తోందని చెప్పవచ్చు. ఇకపోతే ఈ రోజు శ్రీ ముఖి పుట్టినరోజు కావడంతో ఈ నిజామాబాద్ జిల్లా పిల్ల ఇప్పటివరకు ఎంత సంపాదించింది అని తెలుసుకోవడానికి అభిమానుల సైతం ఆసక్తి చూపిస్తున్నారు.
శ్రీముఖి ఆదాయ మార్గాలు..
1. ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలకు యాంకర్ గా వ్యవహరిస్తున్న శ్రీముఖి.. రెగ్యులర్ షోలకు ₹1 లక్ష నుండి ₹1.25 లక్షల వరకూ తీసుకుంటుంది. అదే సమయంలో స్పెషల్ ఈవెంట్స్‌కు అయితే ₹1.5 లక్షల నుండి ₹2 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.
2. బుల్లితెర షోల ద్వారా వచ్చిన క్రేజ్ తో బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది. అక్కడ తన పర్ఫామెన్స్ ఆడియన్స్ ను మెప్పించి, బిగ్ బాస్ 3 రన్నర్ అప్ గా నిలిచింది. ఈ సీజన్ మొత్తం కలపి దాదాపు రూ.1 కోటి వరకు వచ్చినట్టు సమాచారం.
3.ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఆదాయం.. ఇంస్టాగ్రామ్ లో నిత్యం యాక్టివ్ వుండే ఈమె 3.6M ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా శ్రీముఖి వంటి హై-ప్రొఫైల్ తెలుగు సెలబ్రిటీలు, ముఖ్యంగా 3.6M ఫాలోవర్స్‌తో, ఒక్కో స్టాటిక్ పోస్ట్ కి ₹1 లక్ష నుండి ₹3 లక్షల వరకు ఛార్జ్ చేసే అవకాశం ఉంది. రీల్స్ లేదా స్టోరీస్‌కి ₹50,000 నుండి ₹2 లక్షల వరకు ఉండొచ్చు. ఇక అలా బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ, తన గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ భారీగానే సంపాదిస్తోంది.
4. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ ద్వారా కూడా భారీగా సంపాదిస్తోంది శ్రీముఖి. ఒక్కో జ్యువెలరీ షాప్ లేదా బట్టల దుకాణాల ఓపెనింగ్ కి లేదా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి వెళ్తే సుమారుగా రూ.3 నుండి రూ.5 లక్షల వరకు ఛార్జ్ చేస్తుందని సమాచారం.
5. బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్.. సినిమాలు, షోలు, సోషల్ మీడియా ద్వారా భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ నుంచి రూ. 1.5 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు వచ్చే ఛాన్స్ ఉంది.
ఇలా వివిధ ఆదాయ మార్గాల ద్వారా భారీగా సంపాదిస్తున్న శ్రీముఖి.. ఇప్పటివరకు సుమారుగా రూ. 20 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించినట్లు సమాచారం.
ALSO READ:Basheer Master : సింగర్ ప్రవస్తి విషయంలో కీరవాణిదే తప్పు.. ఆయనకు నోటిదూల ఎక్కువ..!