BigTV English

India-China Relations: చైనా టూరిస్టులకు గుడ్ న్యూస్.. భారత్ కీలక నిర్ణం

India-China Relations: చైనా టూరిస్టులకు గుడ్ న్యూస్.. భారత్ కీలక నిర్ణం

India-China Relations: ఈ ప్రపంచంలో ప్రతిదీ ఒక ప్రశ్నతో మొదలవుతుంది. అలాంటి వాటిలో ప్రధాన మైన ప్రశ్నలు చాలానే ఉంటాయి. అందులో ఒకటి భారత్ చైనా మద్య సంబంధాల పునరుద్దరణ. మొన్నటి వరకూ పాక్ చాటున చేరి చేసిన చైనా కవ్వింపు చర్యలు తెలిసిందే. ఆ మాటకొస్తే 2020 నాటి సంఘర్షణ సైతం ఇరు దేశాల మధ్య ఎన్నో దౌత్య సంబంధాలు దెబ్బ తినేలా చేశాయి. తాజాగా భారత్ చైనా పర్యాటకులను స్వాగతించడంలో అర్ధమేంటి? యూఎస్ కి చెక్ పెట్టడానికి ఈ రెండు అగ్ర దేశాలు.. టై అప్ అవుతున్నాయా? ఇదిలా ఉంటే భారత్ చైనా మధ్య ఇప్పటి వరకూ ఉన్న సంబంధాలేంటి? ఇకపై మెరుగుపడనున్న పర్యాటక అనుబంధ బాంధవ్యాలేంటి? హ్యావే లుక్.


బీజింగ్ లోని భారత రాయబార కార్యాలయం

చైనా యాప్ లతో పాటు, మాంజా, బాణాసంచా సైతం బ్యాన్బీజింగ్ లోని భారత రాయబార కార్యాలయం ఐదేళ్ల తర్వాత పర్యాటక వీసాలను తిరిగి ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. 2020లో భారత్ చైనా మధ్య పర్యాటకం నిషేధానికి గురైంది. ఇందుకు కరోనా మహమ్మారి తొలి కారణం కాగా.. రెండోది సరిహద్దు వివాదం. ఈ రెండు ఘర్షణలను దాటి భారత్- చైనా మధ్య పర్యాటకం తిరిగి మొదలు కానున్నట్టు తెలుస్తోంది.


పహెల్గాం దాడి నుంచి OP సిందూర్ వరకూ

భారత్- చైనా ఆసియాలోనే రెండు పెద్ద దేశాలు. జనాభా పరంగా భారత్ తొలి స్థానంలో ఉండగా చైనా రెండో స్థానంలో ఉంది. సగం ప్రపంచం ఈ రెండు దేశాల్లోనే ఉంటుంది. అయితే ఈ రెండు దిగ్గజ దేశాలకు చెందిన ప్రజలు గత ఐదేళ్ల నాటి నుంచి.. ఎవరి దేశాల్లో వారు సెలవులను గడుపుతున్నారు. ఒక దశలో చైనాతో సంబంధాలు ఇప్పట్లో కోలుకోవడం కష్టం అన్న మాట వినిపించింది. పహెల్గాం దాడి నుంచి ఆపరేషన్ సిందూర్ సంఘర్షణ వరకూ పాక్ కి చైనా ఇచ్చిన సాంకేతిక ఆయుధ సాయం అలాంటిది. అయితే ఈ యుద్ధంలో భారత్ చాలా తెలివిగా.. పాక్ వెనకున్న చైనాను చిత్తు చేసింది. ఒక దెబ్బకు రెండు పిట్టలన్నట్టు.. రేపు డైరెక్ట్ ఫైట్ చేస్తే మీ పరిస్థితి ఇంతే అన్న హింట్ ఇచ్చింది భారత్. మీకు ఎంతటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా.. ఈ రాజకీయ చదరంగంలో భారత్ ను ఢీ కొట్టడం అంత తేలికైన పనికాదన్న సంకేతాలను జారీ చేసింది.

చైనా, భారత్ కు ఉమ్మడి శతృవుగా మారుతోన్న US

ఇదంతా ఇలా ఉంటే అమెరికా.. భారత్- చైనా రెండు దేశాలకూ ఉమ్మడి శతృవుగా మారడం మొదలైంది. ఒక పక్క మార్కెట్ పరంగా భారత్, మరో పక్క ప్రొడక్షన్ పరంగా చైనాలను ఎలాగైనా కట్టడి చేయాలని చూస్తోన్న యూఎస్ ఎక్కడి వరకూ వెళ్లిపోయిందంటే.. రష్యా- ఉక్రెయిన్ వార్ ని ఆపడం కోసం.. భారత్, చైనా మీద భారీ సుంకాల మోత మోగించడానికి సిద్ధపడిపోయింది. గత కొంత కాలంగా అమెరికా ఉద్దేశాన్ని పసిగట్టిన ఈ రెండు ఏషియన్ కంట్రీస్.. ఒక ఒడంబడికకు వచ్చాయా? అన్న ఆలోచన కలుగుతోంది.

2020 జూన్ గల్వాన్ లోయలో భారత్ చైనా మధ్య సంఘర్షణ

భారత్ ఐదేళ్ల తర్వాత తొలిసారిగా.. చైనా పౌరులకు పర్యాటక వీసా జారీ చేయనుంది. ఇకపై ఇండో- చైనా సంబంధాలు మెరుగు పడనున్నట్టు సమాచారం. ఇన్నాళ్ల పాటు కేవలం చైనా వస్తువులతో మాత్రమే సంబంధాలు నెరుపుతోన్న భారత్.. ఇకపై ఆ దేశ వాసులను కూడా తన దేశంలో పర్యటించేందుకు వీలు కల్పిస్తోంది.

20 మంది భారతీయ సైనికులు, 4గురు చైనీయుల మరణం

2020 జూన్‌లో గల్వాన్ లోయలో భారత, చైనా సైన్యం మధ్య జరిగిన ఘర్షణాత్మక వాతావరణం చోటు చేసుకుంది. ఈ సంఘర్షణలో కనీసం 20 మంది భారతీయులు, నలుగురు చైనీ సైనికులు మరణించారు. ఆనాటి నుంచి ఈ రెండు దేశాల మధ్య ఉప్పు- నిప్పుగా మారిన పరిస్థితి. అంతే కాదు.. పాక్ తో మరింత చెలిమి చేసిన చైనా.. మన దేశానికి వ్యతిరేకంగా ఆ దేశంతో విస్తృతమైన సంబంధ బాంధవ్యాలు నెరిపింది. ఇది ఆపరేషన్ సిందూర్ లో పీక్ స్టేజీకి చేరింది. పహెల్గాం దాడి తర్వాత బాధిత దేశమైన భారత్ ని పరమార్శించాల్సిన చైనా.. పాక్ కి మద్దతు తెలుపుతూ తన వక్రబుద్ధిని చాటుకుంది. పాక్ దాని ప్రేరేపిత ఉగ్రవాదం కన్నా, చైనా మీదే ఎక్కువ ఆగ్రహించింది భారత జాతి యావత్తూ. ఈ కండీషన్లో భారత్ చైనాతో తిరిగి సత్సంబంధాలు కోరుకోవడం కీలక పరిణామంగా అంచనా వేస్తున్నారు.

జూలై 24 నుంచి చైనీయులకు వీసా దరఖాస్తు అవకాశం

ప్రస్తుతం ఉన్న అప్ డేట్ ని బట్టీ చెబితే.. జూలై 24 నుంచి చైనీయులు భారత్ పర్యాటకానికి వీలుగా వీసా దరఖాస్తు చేసుకోవచ్చని బీజింగ్ లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. ఇది సానుకూలమైన వార్త, ఇరు దేశాల మధ్య సాధారణ పరిస్థితులు నెలకొల్పడానికి తగిన వాతావరణం ఏర్పరుస్తుందని అన్నారు చైనా విదేశాంగ ప్రతినిథి గువో జియాకున్. అంతే కాదు ఇరు దేశాల మధ్య సిబ్బంది మార్పిడి, సౌకర్యాల స్థాయి మెరుగుదల, ఇతర సంప్రదింపులను పునరుద్దరించడానికి చైనా సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ.

భారత్- చైనా మధ్య 3, 379 కిలోమీటర్ల సరిహద్దు

భారత్ చైనా మధ్య సుమారు 3, 379 కిలోమీటర్ల మేర సరిహద్దు ఉంది. దీన్ని వాస్తవ నియంత్రణ రేఖ అని పిలుస్తారు. 1962 కాలం నుంచి ఇరు దేశాల మధ్య రక్తపాతంతో కూడిన యుద్ధం కొనసాగుతూ వచ్చింది. భారత్, చైనా మధ్య అక్సాయ్ చిన్ వివాదాస్పదం కారణంగా జరిగిన 2020 నాటి ఘర్షణ గత నలభై ఏళ్లలో అదే అతి పెద్ద సంఘర్షణ. తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రతరమయ్యాయే తప్ప తగ్గినట్టు కనిపించలేదు. భారత్ ఈ ఘర్షణ తర్వాత చైనీ యాప్ లను నిషేధించింది కూడా. అంతే కాదు చైనా పెట్టుబడులను సునిశిత పరిశీలన చేసింది. రెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులు కూడా రద్దయిన పరిస్థితులు. కోవిడ్ 19 కారణంగా రెండు దేశాల తమ తమ దేశాల పర్యటనకు దారులు మూసి వేశాయి. కరోనా తర్వాతి కాలంలో తిరిగి విమానయానం మొదలైనా.. వీసా పరిమితులైతే కొనసాగాయి.

భారత టూరిస్టులపై.. చైనా వీసా పరిమితులు ఎత్తివేత

కొన్ని మీడియా కథనాలను అనుసరించి చెబితే.. బీజింగ్- న్యూ ఢిల్లీ మధ్య ప్రత్యక్ష విమాన ప్రయాణాన్ని పునః ప్రారంభిస్తామని మార్చిలో ప్రకటించాక.. చైనా భారతీయ పర్యాటకులపై ఉన్న పర్యాటక వీసా పరిమితులను ఎత్తివేసింది. ఇప్పుడు భారత్ కూడా సరిగ్గా ఇలాంటి రియాక్షన్ ఇచ్చాక.. దీన్ని స్వాగతిస్తున్నారు ఇరు దేశాలకు సంబంధించిన పౌరులు. వీసా నిషేధానికి ముందు చైనా పర్యాటకులు భారత రాజధాని ఢిల్లీలో అడుగడుగునా కనిపించారని.. అంటారు పలువురు ట్రావెల్ ఏజెంట్లు. ఒక సమయంలో భారత్ లో ఉన్న చైనా బజార్లు కాస్తా భారత్ బజార్లుగా రూపాంతరం చెందిన దృశ్యం కనిపించింది. చైనీ యాప్ లు మాత్రమే కాక వస్తువులను మన వాళ్లు బ్యాన్ చేశారు. అంతే కాదు చైనా మాంజా, చైనా బాణసంచా సైతం బాయ్ కాట్ చేయాల్సిందిగా ఉద్యమాలు కొనసాగాయి.. అంతటి ఘర్షణాత్మక వాతావరణం నుంచి ఈ పరిస్థితికి రావడం శుభ పరిణామం అంటారు కొందరు టూరిస్టు ఆపరేటర్లు.

చైనా విషయంలో భారత్ లో ఇంతటి మార్పు రావడానికి గల కారణమేంటి?

చైనా విషయంలో భారత్ లో ఇంతటి మార్పు రావడానికి గల కారణమేంటి? ఇన్నాళ్లూ ఒకరంటే ఒకరు పడని పరిస్థితుల నడుమ భారత్ చైనా పట్ల ఇంతటి సానుకూల స్పందనకు గల రీజన్లేంటి? ఇరు దేశాల సంప్రదింపులు, అధికారుల ఒప్పందాల మార్పు.. భారత చైనీయుల మధ్య గల అంతరాలను చెరపగలవా? ఇరు దేశాల ప్రజల్లో ఇప్పటి వరకూ నెలకొన్న ద్వేషాభిమానాలను ఇవి సరి చేయగలవా? భారత్ చైనా టూరిస్టులకు వెల్కం చెప్పడంపై భారతీయుల స్పందన ఎలాంటిది? ఆ మాటకొస్తే చైనాను నమ్మొచ్చా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఆ డీటైల్స్

చైనా పర్యాటకుల భారత రాకడపై హ్యాపీ ఫీల్

భారత్ కి చైనా పర్యాటకుల రాక పట్ల పలువురు హ్యాపీ ఫీలవుతున్నారు. హోటల్ యజమానులు, గైడ్లు, టూరిస్టు ఆపరేటర్లు మాత్రమే కాదు.. ఇరు దేశాలకు చెందిన సాధారణ ప్రజలు సైతం సానుకూలంగా స్పందిస్తున్నారు. హాంకాంగ్ కి చెందిన ఒక చైనీ హాస్యనటుడు ఏప్రిల్ లో తన సోదరి వివాహం కోసం భారత్ సందర్శించడానికి వీసా బుక్ చేసుకున్నపుడు.. అది వీలు కాలేదు. దీంతో ఆయన తీవ్రంగా కలత చెందారు. ఆ టైంలో తాను తీవ్రంగా నష్టపోయానని అంటారీ చైనీ కమెడియన్. ఒక సమయంలో వీసా కోసం తాము వివాహం చేసుకోవానుకున్నాం. ఇప్పుడు వీసా ఫ్రీ కాబట్టి వివాహాలు చేస్కోవాల్సిన పనే లేదన్న జోకులు సోషల్ మీడియా వేదికపై పేలుతున్నాయి.

తన చైనీ ప్రియురాలు ఇండియా వచ్చే మార్గం సుగమం

ఇదిలా ఉంటే భారతదేశానికి చెందిన ఒక యువకుడు తన చైనీ గాళ్ ఫ్రెండ్ కేట్ హు ఎట్టకేలకు తన కుటుంబాన్ని కలుసుకోడానికి మార్గం సుగమం కావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇతడు ప్రస్తుతం తన తల్లి అనారోగ్య పరిస్థితుల కారణంగా భారత్ లో ఉన్నారు. ఇతడ్ని కలుసుకోడానికి ఆమె ఎంత ప్రయత్నించినా టూరిస్టు వీసా వచ్చేది కాదు. ఇప్పుడామె ఆనందానికి అడ్డే లేకుండా పోతోంది.

పాండాలను చూడ్డానికి చైనా వెళ్లే సమయం ఆసన్నమైంది- ఓ టూరిస్టు

భారత్- చైనా టూరిస్టులకు గేట్లు ఎత్తేయడంతో.. చాలా మంది ఇదొక మంచి విషయంగా అభివర్ణిస్తున్నారు. అంతే కాదు భారత్- చైనా ప్రజలు ఎంత సేపూ.. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకోవడమేనా? ఇప్పుడు తీరుబడిగా మాట్లాడుకోవచ్చు. చేసిన తప్పులేంటో తెలుసుకోవచ్చన్న మాట వినిపిస్తోంది. అంతే కాదు పాండాలను చూడ్డానికి చైనా వెళ్లేందుకు తమకు ఇంత కాలానికి అవకాశం లభించిందని అంటున్న వాళ్లు లేక పోలేదు.

కాగితాలపై జరిగి దౌత్య పరమైన చర్య..

ఇక్కడ కాగితాలపై జరిగి దౌత్య పరమైన చర్య, ఇరువురి మనస్సులను దగ్గర చేస్తుందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. అందుకు కారణమంటూ లేక పోలేదు. ఎందుకంటే గత ఐదేళ్లుగా భారత్- చైనా మధ్య తలెత్తిన ఘర్షణల కారణంగా.. ఇరు దేశాల ప్రజలు ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో మండి పడుతూ వస్తున్నారు. చైనీయులంటే భారతీయులకు ఎంత కోపమో ఇటీవలి కాలంలో వెలుగు చూసిన ఘటనలు, వాటి ద్వారా వెలువడిన నినాదాలు చెప్పక చెబుతూనే ఉన్నాయి. పాక్ కి అనుకూలంగా చైనా వేసిన ప్రతి అడుగూ భారతీయుల గుండెల్లో గాయం చేస్తూనే వచ్చింది. దీంతో కొందరు ఈ విషయంలో తమకింకా అనుమానాలున్నాయనే అంటారు.

గత బ్రిక్స్ సమావేశాల్లో జిన్ పింగ్ తో మోడీ భేటీ

గత అక్టోబర్లో రష్యాలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా చైనా అధినేత జిన్ పింగ్ భారత ప్రధాని మోడీతో సమావేశమైన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాల పునరుద్దరణ.. అంశం తాజాది. జనవరిలో భారత్- చైనా మధ్య వాణిజ్య విమానాలను పునః ప్రారంభించడానికి అంగీకారం కుదిరింది. గత ఐదేళ్ల కాలంలో తొలిసారి పశ్చిమ టిబెట్ లోని కైలాష్ పర్వతం, మానస సరోవర్ కి భారత యాత్రికులను పంపడానికి ఒప్పుకుంది చైనా. ఈ నెల ప్రారంభంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ బీజింగ్ లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యిని కలిశారు. ఈ ఇద్దరూ ఇరు దేశ ప్రజల సంబంధాలు మెరుగు పడ్డానికి.. ప్రయత్నించారు. చైనా సానుకూలంగా స్పందిస్తోందంటూ విదేశాంగ శాఖ తన ప్రటనలో తెలియ చెప్పింది.

భారత చైనా సంబంధాలు సాధారణ స్థితికి- అబ్జర్వర్

భారత- చైనా సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాయంటూ న్యూఢిల్లీకి చెందిన అబ్జర్వ హర్ష పంత్ అన్నారు. రెండు వైపుల నుంచి సరైన స్పందన లభిస్తోంది. అయితే చైనాను హ్యాండిల్ చేయడంలో భారత్ సైతం ఎన్నో సవాళ్లను ఎదుర్కుందని.. ఎట్టకేలకు మెరుగైన ఫలితాలను సాధిస్తోందని అన్నారాయన. ఇరు దేశాల మధ్య ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులున్నా.. భారత్ చైనాతో ఆర్ధిక భాగస్వామ్యాన్ని పునరుద్దరించాలని చూస్తున్నట్టు చెప్పారు పంత్.

భారత్- చైనాలను తిరిగి దగ్గర చేస్తోన్న యూఎస్?

భారత్- చైనా మధ్య గతంలో ఎన్ని యుద్ధాలు జరిగినా దెబ్బ తిన్న సంబంధాలను మెరుగుపరచడం పెద్ద పని కాదని అన్నారు ఢిల్లీకి చెందిన ఉపాధ్యాయురాలు సౌరభీ సింగ్. భారతీయులకూ చైనీయులకూ కొన్ని సారూప్యతలున్నాయనీ.. ఇరు దేశాలకు చెందిన ప్రజలకు ఆహార సంబంధముందని, ఇక టీ ఎలక్ట్రానిక్ అనుబంధాలను వేరు చేయడం కూడా ఎవరి తరమూ కాదని అన్నారామె.

చైనా చేయి వదిలి యూఎస్ తో పాక్ చెట్టాపట్టాల్

భారత్- చైనాలను తిరిగి దగ్గర చేస్తోన్నది మాత్రం అమెరికాయేనని అంటున్న వారు లేక పోలేదు. ఈ మధ్య కాలంలో యూఎస్ ప్రతిదానికీ ఈ రెండు దేశాలతో పేచీ పడుతూనే ఉంది. భారత్, చైనాలతో అమెరికాకు ఎన్నో అవసరాలున్నాయి. కానీ ఇవేవీ లెక్క చేయకుండా.. యూఎస్ పదే పదే భారత, చైనా వ్యతిరేక చర్యలకు పాల్పడుతోంది. ట్రంప్ రెండు దేశాలనూ శతృవుగానే చూస్తున్నారు. ఈ రెండు దేశాలను ఎలాగైనా సరే దెబ్బ కొట్టాలని భావిస్తున్నారు. దానికి తోడు చైనా కూడా పాకిస్థాన్ తో ఉన్న ఆర్ధిక కారిడార్ వంటి వాటిని కాసేపు పక్కన పెట్టి.. భారత్ తో చెలిమి చేస్తే ఎలా ఉంటుందో పరిశీలించే పనిలో పడింది.

భారత్ వంటి దేశంతో చెలిమి మేలని భావిస్తోన్న చైనా?

ఇదిలా ఉంటే పాక్ సైతం చైనా చేయి వదిలి ట్రంప్ ఆయన పాలనలోని సర్కార్ కు వంత పాడ్డం మొదలు పెట్టింది. మొన్నటి ఇరాన్- ఇజ్రాయెల్ వార్ విషయంలో సాటి ఇస్లామిక్ కంట్రీకి పాక్ హ్యాండ్ ఇచ్చింది. దీంతో పాక్ స్వార్ధ బుద్ధి గమనించిన చైనా.. ఈ దేశంతో దూరం జరగటమే మేలని భావించినట్టు కనిపిస్తోంది. పాముకు ఎంత పాలు పోసినా అది కాటు వేయక మానదన్నట్టు.. పాక్ కూడా అంతేనని చైనా గ్రహించినట్టు తెలుస్తోంది. దీంతో చైనా.. భారత్ లాంటి మర్యాదపూర్వక దేశంతో చెలిమి చేయడమే సరైన చర్యగా భావిస్తున్నట్టుంది. పాక్ తో కలసి అమెరికా ఆటకట్టించడం జరిగే పని కాదని గుర్తించి.. భారత్ తో చేయి కలపడానికి సిద్ధపడుతున్నట్టు కనిపిస్తోంది. ఈ విషయం గుర్తించిన భారత్ చైనీ టూరిస్టులను ఎప్పటిలాగానే స్వాగతిస్తున్నట్టు అంచనా వేస్తున్నారు దౌత్య వ్యవహారాల నిపుణులు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×