BigTV English
Advertisement

OTT Movie : హనీమూన్ కోసమని తీసుకెళ్లి అరాచకం… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

OTT Movie : హనీమూన్ కోసమని తీసుకెళ్లి అరాచకం… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

OTT Movie : హవాయి ద్వీపంలో జరిగే ఒక సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా, షాకింగ్ ట్విస్ట్‌లు, సస్పెన్స్ తో ఆకట్టుకుంటోంది. ఈ స్టోరీ హనీమూన్ కపుల్‌ చుట్టూ తిరుగుతుంది. ఆ ప్రాంతంలో సీరియల్ కిల్లర్స్ ఎవరో సస్పెన్స్ గా ఉంటుంది. చివరివరకు ఈ స్టోరీ ఉత్కంఠంగా నడుస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళితే …


రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

ఈ అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘A Perfect Getaway’. దీనికి డేవిడ్ టూ దర్శకత్వం వహించారు. ఇందులో స్టీవ్ జాన్ (క్లిఫ్), మిల్లా జోవోవిచ్ (సిడ్నీ), టిమోతీ ఒలిఫెంట్ (నిక్), కీలీ శాంచెజ్ (జీనా), క్రిస్ హేమ్స్‌వర్త్ (కేల్), మార్లీ షెల్టన్ (క్లియో) నటించారు. ఈ సినిమా హవాయిలోని ఒక ద్వీపంలో హనీమూన్ కపుల్‌ చుట్టూ తిరిగే థ్రిల్లింగ్, ట్విస్ట్‌లతో నిండిన కథ. ఇది IMDbలో 6.5/10, Rotten Tomatoesలో 62% రేటింగ్ ను కలిగిఉంది. 2009 ఆగస్టు 7 నుంచి అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ లలో అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళితే

క్లిఫ్, సిడ్నీ అనే కొత్తగా పెళ్లయిన జంట, హనీమూన్ కోసం హవాయిలోని కౌయై ద్వీపంలోని వెళ్తారు. వీళ్లు స్క్రీన్‌రైటర్, ఫోటోగ్రాఫర్‌గా కొత్త జీవితం స్టార్ట్ చేసే పనిలో కూడా ఉంటారు. ఈ ద్వీపంలో వీళ్లకి మరో ఇద్దరు కపుల్స్ కనిపిస్తారు. నిక్, జీనా అనే జంట. ఇంకో జంట కేల్, క్లియో కొంచెం రఫ్, సస్పీషియస్‌గా అనిపిస్తారు. అదే సమయంలో, హవాయిలో ఒక కపుల్ హత్యలు జరిగినట్లు వార్తలు వస్తాయి. పోలీసులు ఒక జంట కిల్లర్స్ కోసం వెతుకుతున్నారని తెలుస్తుంది. క్లిఫ్, సిడ్నీ ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తారు. వీళ్ళు నిక్, జీనాతో కలిసి ట్రావెల్ చేస్తారు. కానీ కేల్, క్లియో గురించి సందేహాలు మొదలవుతాయి. వాళ్లు కిల్లర్స్ అయి ఉంటారేమో అని అనుమానిస్తారు. నిక్ కూడా తన గురించి స్ట్రేంజ్ స్టోరీలు చెబుతాడు. అతను ఒక ఆర్మీ వెటరన్, బుల్లెట్‌ప్రూఫ్ స్కల్ ఉందని, ఇరాక్‌లో జరిగిన యుద్ధ కథలు చెబుతాడు. ఇవి నిజమా కాదా అని క్లిఫ్‌ కన్ఫ్యూజన్ అవుతాడు. జీనా కూడా ఫ్రీ-స్పిరిటెడ్, సర్వైవల్ స్కిల్స్ ఉన్న అమ్మాయిగా కనిపిస్తుంది. ఇక ఈ దీవిలో టెన్షన్ పెరుగుతుంది. ఎవరు నిజమైన కిల్లర్స్ అనే సందేహం అందరిలోనూ మొదలవుతుంది.

సినిమా మధ్యలో షాకింగ్ రివీల్ ఉంటుంది. అసలు కిల్లర్స్ కేల్, క్లియో కాదు, క్లిఫ్, సిడ్నీనే! వీళ్లు నిజంగా స్క్రీన్‌రైటర్, ఫోటోగ్రాఫర్ కాదు. వీళ్ళు ఒక సీరియల్ కిల్లర్స్. ఇతర కపుల్స్‌ని చంపి వాళ్ల ఐడెంటిటీలు స్టీల్ చేస్తూ, “పర్ఫెక్ట్ గెట్‌అవే” ప్లాన్ చేస్తారు. వీళ్లు ఇప్పుడు నిక్, జీనాని టార్గెట్ చేస్తారు. కానీ నిక్, జీనా అంత సులభంగా చిక్కరు. నిక్ రియల్ ఆర్మీ స్కిల్స్, జీనా సర్వైవల్ టెక్నిక్స్‌తో ఫైట్ బ్యాక్ చేస్తారు. క్లిఫ్‌ని నిక్ ఓవర్‌పవర్ చేస్తాడు. సిడ్నీని జీనా టేక్‌డౌన్ చేస్తుంది. క్లైమాక్స్‌లో స్టోరీ మలుపు తీసుకుంటుంది. నిక్, జీనా ప్రాణాలతో బయటపడతారా ? క్లిఫ్, సిడ్నీ ఎందుకు హనీమూన్ జంటలను టార్గెట్ చేస్తున్నారు ? క్లైమాక్స్‌ ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చుడండి.

Read Also : ఏం సిరీస్ రా బాబూ… డెడ్లీ సీక్రెట్స్ దాచే భార్యల గ్యాంగ్… ఒక్కో ట్విస్ట్ కు బుర్రపాడు

Related News

OTT Movie : స్నేహితుడిని ఇంటికి ఆహ్వానిస్తే… ఒక్కొక్కరిని మట్టుబెడుతూ పని కానిచ్చే సైకో… గూస్ బంప్స్ తెప్పించే థ్రిల్లర్

Avihitham: పితృస్వామ్య రాజ్యంలో బాధితులుగా కూతుర్లు.. ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం..!

K Ramp OTT : ఓటీటీ డేట్ ను లాక్ చేసుకున్న ‘కే ర్యాంప్’.. స్ట్రీమింగ్ అప్పటినుంచే..?

OTT Movie : ఒంటిపై నూలు పోగు లేకుండా భగభగ మండే మంటల్లోకి పరుగు… ఇదెక్కడి దిక్కుమాలిన పని సామీ

OTT Movie : మిస్టీరియస్ మనిషితో ముసలావిడ రొమాన్స్… ఇలాంటి సినిమాను ఎక్కడా చూసుండరు భయ్యా

OTT Movie : భర్తకు బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిపోయే భార్య… ఐఎండీబీలో రేటింగ్ 8… క్రైమ్ మూవీ లవర్స్ కు పండగే

OTT Movie : IMDb లో 9.7 రేటింగ్… స్కూల్ పుస్తకాల్లో స్కామ్… ఈ తండ్రి గట్స్ కు దండం పెట్టాల్సిందే భయ్యా

OTT Movie : బ్రోతల్ హౌస్ నుంచి తప్పించుకుని 17 ఏళ్ల అమ్మాయితో ఆ పాడు పనులు… ఈ మూవీ స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

Big Stories

×